చీకటి వెలుగుల రంగేళి ......


నేనూ...... కృష్ణుడినే.......


ఇందాక భక్తిసామ్రాజ్యం బ్లాగ్ లో ..........

తను వేసుకున్న కాలి గజ్జెలు విని శ్రీ కృష్ణుడు తనే భయపద్దడనే .....పోస్ట్ చదివా.... అది చదవంగానే నవ్వొచింది....


ఎందుకంటే చిన్నపుడు నాకు అలాంటి అనుభవమే వుంది......


నా చిన్నప్పుడు నా చిన్ని .కాళ్ళకి బూట్లు వేసరంటా....... ........


నడిచేటప్పుడు కుయ్...కుయ్... అని సౌండ్ వస్తాయే అవి ......

నేను ఒక అడుగు వేసి ఆ శబ్దానికి నేను భయపడి......... ఏడుస్తూ ....... అక్కడే నుంచుని పోయానంటా....


అమ్మ ఎం పర్లేదు నడవ మన్న....... వినకుండా ఎడ్చేసి....... చివరికి ........


అవి తీసేసే దాక ఊరుకోలేదంట..........


ఒక సారెప్పుడో నేను ....... మా అమ్మ దగ్గర ధైర్యం గురించి ......... లెక్చర్ ఇస్తున్నప్పుడు ........... అమ్మ ఈ విషయం

చెప్పింది .............

అది విని మా తమ్ముడు ఒకటే నవ్వు..........

ఇంకా మళ్ళి మాట్లాడకుండా...... కూర్చున్న..............

ఈసారి మా అమ్మని అననీయండి...... చెప్తా........ గర్వంగా ..........కృష్ణుడు కూడా అంతే లే అని.....


:) :) :) :)

MJ..... సినిమా .......

చిమ్ముతూ, నింగికెగిరితే నిబిదాస్చర్యం లో నేనే..............
నెత్తురు కక్కుతూ, నేల రాలితే నేర్దాక్షిన్యం గా నేనే.............
ఈ కాళ్ళకి ఆ మాటలు సరిగ్గా ... సరిపోతాయనుకుంటా ..

ఈ రోజు బంద్ వల్ల ......... బయటికి వెళ్ళలేదు......... జీవితం లో ఒక రోజు ఖాళి గా రూం లోనే గడిచిపోయింది అనుకున్న..............

కాని , నిన్న పెట్టిన This Is It డౌన్లోడ్ అయిపోతే ....... అది చూస్తూ వున్నా సాయంత్రం...........

బావుంది...... Michel ఎలా ప్రాక్టీసు చేసాడు......... అన్ని చూపించాడు..........

పొపులర్ సాంగ్స్ కొన్ని చూపించారు.......


Beat it, Billie jean, Dangerous, Black or White, Smooth criminal, Earth song, They don't care

about us..... ఇంకా చాల వున్నాయి...


ఎలా అతను స్టేజి షో కి ఇలా రెడీ అవుతాడు..... అతని గ్రూప్ లో వాళ్ళని ఎలా రెడీ చేస్తాడు......... ఇవన్నీ బాగాచూపించారు.........

అతని డాన్స్ కాని, సాంగ్ కంపోసింగ్ కాని బావుంటాయి ...అందుకే ..... నేను అతని అభిమానిని........

అతని మీద ఎన్ని కేసులు , ఆరోపణలు వచినా... అతనిని అబిమానిస్తూనే వున్నాను...... వుంటాను

కూడా...........

నా దృష్టిలో ............. ప్రతీ మనిషిలో మంచి , చెడు రెండూ వుంటాయి...........

కాని మనం అవతలి వాళ్ళలో చూసేటప్పుడు......... మంచిని మాత్రమే తీసుకోవాలి.............

అంటే హంస ఎలా అయితే పాలు మాత్రమే తాగి....... నీళ్ళు వదిలిపెడుతుందో అలా.........

అందుకే నేను ఎప్పటికి MJ అభిమానినే......May your soul rest in peace MJ....................

శుభోదయం ........

ఈ రోజు పొద్దున్నే...... 6:00 కే మెలుకువ వచ్చింది ......... ఇంకా ఎం చెయ్యాల అని ఆలోచిస్తూ..........


నెట్ లో అన్ని పేపర్లు తిరగేశాను..............


తర్వాత బయట బందు ఎలా వుందో అని చిన్న సమీక్ష చేద్దామని........ అల బయటికి వెళ్లి .......... టీ తాగి వచాను......


ఏ పేపర్ లో చుసిన........ ఇంకా ఇదే ఉంటోంది రోజు...........


చివరికి ఈ పేపర్స్ , టీవీ లు అంటే జనాలకి విరక్తి వచ్చే రోజు దగ్గరలోనే వున్నటుంది..............


బయట వాతావరణం చాలా చల్లగా వుంది............


పక్క ఇంట్లో నుంచి అనుకుంటా సుప్రభాతం వినబడుతోంది..........


మంచి కాఫీ లాంటి మార్నింగ్ కదా..........

ఆకలి రాజ్యానికి.... మనవంతు సాయం గా...

.

The No.1 cause of death in India and the World :HUNGER


1/3rd of the world’s hungry live in India 5 Indians die every minute from hunger. 25 lakh Indians die every year from hungerఇంతకీ ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏమిటంటే ..........


Bhookh.com అని ఒక website వుంది......... అదే ఏమిటంటే ఒక సారి మనం ఆ సైట్ లో Give Free Food...


అన్న చోట క్లిక్ చేస్తే......... మనం చేసిన ఆ క్లిక్ ఆకలి గా వున్నా ఒక కడుపు నిమ్పుతుందంటే నమ్ముతారా??


మనం చేసిన ఆ క్లిక్ వల్ల అక్కడ advertisement ఇచిన వాళ్ళనుంచి డబ్బులు వస్తాయి..........


ఆ డబ్బులు ఆకలి గా వున్నా వాళ్ళ ఆకలి తీర్చడానికి వుపయోగాపదోచు.......


ఒక click వల్ల మనకి పోయేది ఎం లేదు గా ......... నేను అందుకే చాల రోజుల క్రితమే దీన్ని నా home page చేసుకున్న......


పైన ఫోటో లో వున్నాయే కదా కొన్ని NIIT ఆని, Forex ఆని అలా ......... వాళ్ళే డబ్బులు ఇచేది.....ఎందుకో ఇవాళ ఓపెన్ చేస్తుంటే బ్లాగ్ లో రాయాలని ఐడియా వచ్చింది........ఎలాంటివి ట్రాష్ అని కొట్టి పదేసేవాళ్ళు వుందోచు......... కాని నమ్మకాన్ని మించింది లేదు గా......... అందుకే అంత మంచే


జరుగుతుందని ఆశిద్దాం..........

4 th Idiot....... నేనే...


నిన్న నైట్ నేను, సంతు గాడు...... ఇంకా వాడి రూం మేట్స్.... అందరు కలిసి 3 Idiots సినిమా కి వెళ్ళాం.......

Over-all గా సినిమా బావుంది........ aamir సినిమా లానే వుంది....

Engg student life మీద తీసారు........ చదువంటే పుస్తకాల్లోది ....... బట్టి పట్టడం కాదు........

అన్ని సొంతం గా తెలుసు కోవడం అని.........

సినిమా starting లో ఒక scean వుంటుంది...........

కాలేజీ ప్రిన్సిపాల్ కాలేజీ స్టూడెంట్స్ కి ఫస్ట్ రోజు చెప్తూ ఉంటాడు..............

ఒక పెన్ చూపించి............
"
ఇది చాల విలువైనా పెన్........ దీని విలువ లక్షల్లో వుంటుంది అని.........

ఎందుకంటే ఇది అంతరిక్షం లో రాయటానికి వాడే పెన్...........

మామూలు పెన్ లు అక్కడ పని చెయ్యవు........... ఎందుకంటే భూమి ఆకర్షణ శక్తి వుండదు కాబట్టి..............

నాకు మా టీచర్ గిఫ్ట్ గా ఇచ్చారు ఇది......... మీలో ఎవరైనా నాకు మంచి తెలివి గలవాళ్ళు అని పిస్తే ఇస్తానూ అంటాడు.....
"
అందరు సరే మేము అనిపించుకుంటాం అని... అంటారు...........

అప్పుడే మన aamir :

సర్, ఇన్ని లక్షల్లు పెట్టి పెన్ తాయారు చేసేకంటే........ ఒక పెన్సిల్ వాడొచు గా.... అంటాడు........


************************************************************************************అద్ది!! మేటర్ ..................... సింపుల్ గా చెప్పాలంటే............

సినిమా చాల బావుంది...

నేను ఇచ్చే rating 3.5/5..............


కాని కొన్ని దృశ్యాలు ... కొంచం ఇబ్బంది కరం గా వుందోచు........... ఇంకా కామెడీ వచేసి చాల వరకు మనకు తెలిసిందే అనిపించింది........ కాని మూవీ థీమ్ మాత్రం బావుంది........


***********************************************************************************

ఇంతకీ aamir చెప్పింది ............ తప్పా ?? కరెక్టే నా??

నేను నా next పోస్ట్ లో చెప్తాను......... ఎవరు చెప్పక పోతే.......... (cinema చూసినవాళ్ళు చెప్పకండి...)

నిజంగా క్రిస్మస్ గిఫ్ట్ .........నేను మా, అమ్మ, నాన్న హాస్పిటల్ లో వున్నాం............


ఎందుకంటే ఇంకా నుంచి నేను ఆడుకోవటానికి బయటకి వీల్లనవసరం లేదంట .......


మా ఇంట్లోనే ఆడుకోవచంతా........


ఎందుకంటే నాకు బుల్లి తమ్ముడు పుట్టాడు....


చిన్న చిన్న కాళ్ళు...........


బుల్లి బుల్లి చేతులు............


బుజ్జి బుజ్జి కళ్ళు..............


ఎప్పుడు నిద్రే ...........


లేగిస్తే ఇంకా ఏడుపే ..........


హాస్పిటల్ అంత గోల .... గోల............


ఉన్న ప్రదేశం American hospital, Vijayawada...............


కాని నన్ను, వాడిని ముట్టుకోనివ్వడం లేదు ....... అమ్మ చెప్పింది నీ గోళ్ళు వాడికి తగిల్తే నొప్పి పుడుతుంది వాడికి...


లేత చర్మం కదా అని............. సరే అని నేను ఒక ముద్దు పెట్టి ఊరుకున్న..........


క్రిస్మస్ ముందు రోజు అంటే 24 th నైట్ పన్నెండు తర్వాత santa claus (క్రిస్మస్ తాత ) వచాడు......... నాకు అతనిని

చూడగానే భయం వేసింది....

రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని.............. తెల్ల టోపీ పెట్టుకుని........... చేతిలో చాక్లెట్స్.. ఇంకా బలూన్స్........ చాల బిస్కట్స్ ....

అసలే నేను స్వతహా గానే భయస్తుడిని............ ఇంకా అతని దగ్గరకి వెళ్ళాలంటే భయం వేసింది... కాని చాల మంది

అతని చుట్ట తిరుగు తున్నారు.............ఏవేవో పాటలు పాడుతున్నారు........... గొడవ గొడవ చేస్తున్నారు...........

అతను నాదగ్గరకే వస్తున్నాడు........ అమ్మ మంచం మీద వుంది........ నేను భయం తో అమ్మ దగ్గరకి వెళ్లి పోయా........

కాని ఇవేమీ మా తమ్ముడికి తెలియవుగా........ వాడేమో చిన్నపిల్లోడు.......... ఈ గొడవకి లేచి అందరివంకా... చిత్ర


విచిత్రం గా చూస్తున్నాడు......... ఏడుస్తూ !!!!!!!!


ఇంకేముంది అతను నా దగ్గరికి రానే వచాడు................... నా ముందు చెయ్యి చాపాడు......... మా అమ్మ నా చెయ్యి

తెసుకుని అతని చేతిలో పెట్టింది..............

భయం భయం గా వెనక్కి లాగేసుకున్న................. కాని అతను ఒక shake-hand ఇచి ........ హ్యాపీ క్రిస్మస్ అని


చెప్పి..... ఒక ముద్దు పెట్టి......... నాకు ఒక బిస్సుట్ ప్యాకెట్ ఇచి వెళ్లి పోయాడు...........


అప్పుడు భయం తగ్గింది.............


ఇది నా క్రిస్మస్ అనుభవం.......


ఇంతకీ ఇది జరిగింది ఎప్పుడో తెలుసా!!........... december 25th 1992............... అంటే అప్పుడు నా వయసు... 5


ఏళ్ళు .... మా తమ్ముడి వయసు 8 రోజులు..........


కాని ఇప్పటికి ఆ జ్ఞాపకాలు అలానే వున్నాయి............

ఇప్పుడు వాడు నా అంత అయ్యాడు......... చక చకా........ చదివేసి.......... Engg దాక వచేసాడు..........

ఇప్పుడు ఎందుకో అవి గుర్తు వచాయి......... ఈ క్రిస్మస్ రోజు నా..........

విజయానికి నాలుగు బస్సు అద్దాలు.....

{నేను ఈ పోస్ట్ రాస్తున్నది... ఎవరి మనో భావలనో దెబ్బ తీయదానికో.... లేకపోతే ఒకళ్ళని తక్కువ చెయ్యాలనో మాత్రం కాదు....}

రోజు టీవీ చూసి .......... చూసి....... ఇక నా బాధ ఎవరికీ చెప్పాలో అర్ధం కాక రాస్తున్నాను...

చాల రోజుల నుంచి మన రాష్ట్రం లో ......... ఈ సమ్మె లు......... దీక్షలు.... ఇలాంటివి జరుగుతున్నాయి....

ఇందులో...... ఎంత మందికి ఎంత లాభం జగిగిందో నాకు తేలేదు.. కాని ఎన్ని బస్సుల అద్దాలు అగిలాయో.. ఎంత
మంది.. చనిపోయారో.. ఎంత మంది లాటి ఛార్జ్ లో గాయపద్దారో ........ మనం రోజు చూస్తూ నే వున్నాం...

ఇవన్నీ చూసాక నాకు ఒకటి అనిపించింది..
మా ఊళ్ళో నీళ్ళు రావట్లేదు మొర్రో !!!!! అంటే పట్టించుకున్న ఒక్క నాధుడు లేడు....
రోడ్లు లేవని గింజుకుంటే కనికరించిన నాయకుడు లేడు...
స్కూల్ కావాలని అడుగుతుంటే .... ఆరా తీసిన మనిషే లేడు....
కూరగాయల ధరలు పట్టించుకునే... నాయకురాళ్ళు లేరు....
కాని అప్పుడు దీక్షలు ఇంత బాగా ఎందుకు జరగలేదు...??
అప్పుడు బస్సుల అద్దాలు పగలకొడితే బాగుడేదేమో ...??
ఎప్పుడయినా ఓ కాలనీలో రోడ్ వెయ్యాలని ఆ ప్రాంత M.L.A. అక్కడ ఆమరణ దీక్షలు చేసిన దాఖలాలు నాకు తెలిసి లేవు..
అప్పుడే సమస్య మీద ఏదో ఒకటి చేసుంటే ఇప్పుడు పరిస్థితి ఇంత కాదా వచ్చేదా??


మన నాయకులు అంతే.. వాళ్ళ వెనుక తిరిగే మనము అంతే....


ఇప్పుడు అందరు చేస్తున్న పనులు, మన చిన్న సమస్యలు పరిష్కరించుకోవడానికి వాడితే బాగుండేదేమో......

ఇప్పుడు ఆ చిన్న సమస్యలే కలిసి మనకు పెద్ద సమస్యగా కనబడుతోన్దనుకుంటా ...........


ఒక సారి మన ఆస్తులని ద్వంసం చేసేముందు కొంచ ఆలోచిస్తే బావుంటుందేమో...

ఈ బ్లాగా ముఖం గా నేను చెప్పదలుచు కుంది అదే...........

చివరిగా ఒక మాట... ఏదో సినిమా లో అన్నట్టు ..... ఇప్పుడు బాపు బ్రతికి వుంటే ఒకటే అనేవాళ్ళు...

"
దేశం అయతే మనది అయింది, కాని........ప్రజలే పరాయి వాళ్ళు అయిపోయారు ....." అని...

అవతార్ డే...


రోజు సన్ డే అలానే గడిచింది.... రాత్రి అవతార్ సినిమా కి వెళ్లి వచాను.... అది అనుకోకుండా... అప్పటికప్పుడు ఫిక్స్ అయింది.. సినిమా రాత్రి 9:00 కి సంతు గాడు కాల్ చేసి టికెట్స్ తెసుకున్నాను రూం కి వస్తున్నాను అన్నాడు...
ఇంకా గబగబా రెడీ అయ్యి బయల్దేరాను... తిండి కూడా తినలేదు... నాకు పెద్దగా ఇంగ్లీష్ సినిమాలు నచవు.... అందులో డబ్బింగ్ సినిమాలు మరీను... ఇంకా అందరు వెళ్తున్నారు అనేసరికి నేను బయల్దేరాను...
సినిమా పర్లేదు ... బానే వుంది.. నేను దేనికి 3.5/5 ఇస్తాను rating......
సినిమా అయ్పోయేసరికి 12:15 అయింది.. అప్పుడు ఇక్కడ దగ్గరలో ధాబ వుంటే అక్కడికి వెళ్లి తిని రూం కి వచ్చి పడుకునే సరికి... 2:30 అయింది...
సినిమా లో కొంచం మెసేజ్ వుంది.. పర్యావరణం ఎంత అందం గా వుంటుంది.. దాన్ని మన ప్రయోజనాల కోసం ఎలా పాడు చేస్తున్నాం ......... అనేది చూపించాడు... గ్రాఫిక్స్ బావున్నాయి....
ఇంకా రోజు ఎం చెయ్ లేదు.. కాళి నే...

బావ........ బావా ....... cartoon తో..


శివ గారి comment చూసాక ........ అప్పుడు నాకు గుర్తు వచ్చింది ........ ఈ పాట ... చివరికి దొరికింది వెతికితే.....
ఇంతకి... దీనికి ఫోటో ఎం పెట్టాలో అర్ధం కాలేదు.. చివరికి ఇది పెడుతున్న... ఎవరి దగ్గరో కాపీ కొట్టి..
ఇది ఎవర్ని నొప్పించటానికి కాదు... సరదాగా... అంతే... ఇంతకి ఆ cortoon ఎవరి గురించి కనిపెట్టండి.. చూద్దాం...

"బావా! బావా! పన్నీరు బావను పట్టుకు తన్నేరు

మూడు గుద్దులు గుద్దేరు

మూలన మంచం వేసేరు

ముంతెడు గంజి యిచ్చేరు

బావా! బావా! పన్నీరు బావను పట్టుకు తన్నేరు

వీధి వీధి తిప్పేరు వీశెడు గంధం పూసేరు

చావిడి గుంజకు కట్టేరు చప్పిడి గుద్దులు గుద్దేరు."

పల్లేరు తెప్పించి పక్క వేయండీ

నల్లేరు తెప్పించి నలిచి విడువండీ

నల్లేరు చేతాను నయము కాకుండీ

దూలగొండి తెచ్చి దులుపి పంపండి."

చిన్నప్పటి అరటి...


ఇందాక ఏదో సైట్ వెతుకుతుంటే అందు లో చిన్నప్పటి అరటి పాట కనబడింది... మీరు చదవండి ఒక సారి వీలుంటే ....

ఆదివారము నాడు అరటి మొలిచింది

సోమవారము నాడు సుడి వేసి పెరిగింది

మంగళవారము నాడు మారాకు తొడిగింది

బుధవారము నాడు పొట్టి గెల వేసింది

గురువారమునాడు గుబురులో దాగింది

శుక్రవారము నాడు చక చకా గెల కోసి

అందరికి పంచితిమి అరటి అత్తములు

అబ్బాయి, అమ్మాయి అరటి పండ్లివిగో..............

పాత రోజుల ..... రోజు.. :)


ఈ రోజు మామూలే గానే గడిచింది........ పెద్ద గా చెప్పు కోవడానికి ఎం లేవు........


మద్యానం మధు కి కాల్ చేసాను... కాసేపు మాట్లాడాను.. ముక్కు కుట్టిన్చికుందట ..... ఇంకే మరే black frame కళ్ళజోడు పెట్టు అచ్చం సానియాల వుంటావ్ అన్నాను....


సైట్ కి వెళ్లి సాయంత్రం 7:00 కి రూం కి వచ్చాను .... పొద్దున్న నుంచి ఎం తినలేదోమో బాగా ఆకలిగా వుంది..


ఇంకా రెండు egg puff తిని....... బ్లాగ్ రాస్తూ కోర్చున్నాను........

10:00 కి తింటూ మ్యాచ్ చూసాను........ చివర్లో ఓడిపోయారు........ కాని బావుంది మ్యాచ్...


తర్వాత రాజీవ్ సైట్ దగ్గరనుంచు చెరుకులు తెచాడు......... తినమని ఇచ్చాడు.. అవి కాసేపు టైం పాస్ చేసాను..


ఆ చెరుకులు తింటుంటే........ చిన్నప్పటి రోజులు గుర్తు వచాయి..........


చిన్నప్పుడు మా అమ్మమ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు బలే తినేవ్వాళ్ళం.. నేను చందు, రాజ, క్రిష్న అక్క, ఫణి అక్క , సింధు ఎలా మా గ్యాంగ్ అంత...


అప్పుడప్పుడు ఊళ్ళో వున్నా రావి చెట్టు వెనక నిలబడి ఎద్దుల బండి ఆ చెట్టు దాటి వెళ్ళాక... బండి వాడు
చూడకుండా... కొన్ని చెరుకులు లాగేవాళ్ళం.... వాడు చూసాడా !!! ఇక పోరుగో ........పరుగు....


కొన్ని సార్లు మా మావయ్య పొలం నుంచి తెచేవాడు..... ఇవి ఇంకా తాటి కాయలు వాటితో చేసే బళ్ళు....... బావుండేవి...


ఇంకా చెరుకు చెత్త తో రాత్రి పూట తెగలు ...,కాల్చేవాళ్ళు... బలే ఉండేవి అవి కూడా...
ఇంకా అప్పట్లో అమ్మమ్మ వాళ్ళకి కేబుల్ టీవీ లేదు... జేజి వాళ్ళ ఇంటికి వెళ్లి రాత్రి సినిమాలు..
చూసేవాళ్ళం...
ఇప్పుడు ఈ అమ్మమ్మ , జేజి , చెరుకులు, తాటి కాయలు ఇవి టైపు చేస్తుంటేనే .... ఏదో మనసులో గొప్ప అనుభూతి...


నిజం గా భలే ఉండేవి ....... ఆ రోజులు...


ఇప్పుడు ఆ రోజులు లేవు.... ఆ అమ్మమ్మ లేదు ... జ్ఞాపకాలే మిగిలాయి....


మా సంతు గాడి కథలు...
నిన్న పోస్ట్ లో నార్త్ వాళ్ళతో మాట్లాడండి ....... అని రాసాను కదా........ అది ఎలా గుర్తువచిందో చెప్పాలంటే దానికో చిన్న కథ వుంది... అది వినాల్సిందే.. sorry చదవాల్సిందే..


మా రూం లో సంతు , నేను, ఇంకో నార్త్ ఇండియన్ ఉంటున్నాం.......... సంతు గాడికి హిందీ...కొద్ది కొద్ది గా వచ్చు ......


ఒక రోజు భోజనం తింటుంటే ముగ్గురం... బయట పెద్దగా ఉరుములు.. మెరుపులు వస్తున్నాయి... వున్నటుంది మా రూం పక్కన పెద్ద సౌండ్ తో పిడుగు పడింది...


కాసేపు అటు ఇటు కంగారు పడి తిరిగాక... మల్లి తినటానికి కూర్చున్నాం...


అప్పుడు మా సంతు గాడికి అనుమానం వచ్చింది.... నాతో " అరేయ్!! ఇప్పుడు బయట పిడుగు పడింది కదా .... దాన్ని హిందీ లో ఏమంటారు రా???" అని అడిగాడు నన్ను...


నాకు నిజం గా తెలియదు... అదే మాట వాడితో చెప్పాను ....


ఇంకా వాడు అక్కడ వున్నా మా నార్త్ ఫ్రెండ్ ని " అభి బాహర్ ఆయాన వో డబుక్ .... దుబెక్... ఇస్కో హిందీ మే క్యా బోల్తా హై..!!!" అన్నాడు..


ఇంకా అంతే... పావుగంట సేపు నవ్వలేక చచ్చి పోయా............ పాపం వాడి బాధ ఆ నార్త్ అతను అర్ధం చేసుకుని చివరికి ఏదో చెప్పాడు ఏమంటారో ...... నాకు గుర్తులేదు...


అది గుర్తు వచినప్పుడల్లా ఇప్పటికి నవ్వు వస్తూనే వుంటుంది...
ఇప్పుడు వాడు పక్క ముగ్గురు నార్త్ ఇండియాన్స్ తో ఉంటున్నాడు...
ఇప్పుడు అదే పరిస్థితి... కాకపోతే..
వాళ్ళ దగ్గర రెండు, మూడు హిందీ తిట్లు నేర్చుకున్నాడు.. వాళ్లకి నాలుగు తెలుగు తిట్లు నేర్పాడు...
అలా నడిపిస్తున్నాడు లైఫ్ ని...

మా తమ్ముడి పుట్టిన రోజు...ఈ రోజు అంత మామూలు గానే గడిచింది.. పెద్ద గా చెప్పుకునేందుకు ఎం లేవు.....


సాయత్రం 7:00 కి రూం కి వచ్చా... వచ్హాక బ్లాగ్ రాస్తూ.. కూర్చున్న....


ఇంకా కాసేపు ఆఫీసు con-call....


రేపు 19th న DJ party వుంది.. ఒక్కడ దగ్గరలో ఒక international hotel లో .... దానికి ticket తీసుకున్నాడు santosh గాడు............ వెళ్ళాలి దానికి........ ఇప్పుడు దాక ఇప్పుడు వెళ్ళలేదు...


దానితో పాటు 330ml beer, ఇంకా dinner అంట....


చూడాలి ఎలా వుంటుందో ......... ఇక్కడికి వచ్హాక చాల తెలుసు కుంటున్న.........


నేను త్వరలో రూం మారిపోడం అనుకుంటున్నా.........


ఎందుకంటే ఈ వాతావరణం నుంచి కొంచం change కావాలనిపిస్తోంది...


ఇంకా ఇప్పుడు తినాలి.......ఆనందం... నా భాష లో... (సుత్తి లేకుండా ... సూటిగా..)
చాల మంది ఆనందం గా లేమని అనుకుంటారు... అందరు ఏవేవో అనుభవిస్తున్నారు నాకు enjoy చెయ్యడానికి లేదు అనుకుంటారు......... అలంటి వాళ్ళ కోసమే ఇది..


నేను ఇంతకూ ముందు ఇలానే అనుకునే వాడిని ... కాని జీవితం అనే schoool లో నేర్చుకున్నది ఒకటే..


ఆనందం అనేది ఒక్కసారే రాదు.. చిన్న చిన్న ఆనందాలు అన్ని కలిపితేనే... మనకి ఆనందం గా వున్నట్టు అనిపిస్తది..


చిన్న చిన్న ఆనందాలు కొన్ని చుడండి ... వీటిలో కొన్ని నాకు అని పించినవి .. కొన్ని నేను enjoy చేసేవి..


  • మీరు బస్సు లో నైట్ journy చేస్తున్నపుడు ... చిన్న గా విండో గ్లాస్ తీసి మీ చేతి వేళ్ళు బయటపెట్టండి... ఆ చల్లని గాలిని కాసేపు మీ అందమైన వేళ్ళని తాకే భాగ్యం కలిగించండి.. (ఒక ప్రక్క వెనక వాడిని కనిపెట్టుకు వుండండి... వాడు గ్లాస్ వేసేడా.... ఇంకా చూస్కో దానికి కూడా ఉండవ్.. :))  • మీ బాస్ మిమ్మల్ని తిడదామని ఫోన్ లో మొదలుపెడుతున్నప్పుడు ..... వున్నటుంది... ఫోన్ hello .... hello... అని కట్ చేసేయండి ఫోన్... తర్వాత ఒక 5 నిముషాలు ఫోన్ switch off చేసేయండి... తర్వాత కాల్ చేస్తే ... సిగ్నల్ ప్రాబ్లం అని చెప్పండి... ఈ లోపు మీ బాస్ కోపము తగ్గుతుంది.. మీకు సరదాగా వుంటుంది..  • రాత్రి ఒంటి గంటకి బయటకు బయల్దేరండి.. చలికాలం అయతే మరీను... దమ్ము కొట్టే అలవాటు వుంటే అలా రైల్వే స్టేషన్ దాక వెళ్లి ఒక దమ్ము కొట్టి... ఒక టీ తాగి రండి....  • మీ ఫ్రెండ్ ఓ , లేకపోతే మీ ఆఫీసు లో ఫ్రెండ్ కో ఒక కొత్త నెంబర్ నుంచి కాల్ చేసి.. కాసేపు ఆటపట్టించండి... మీ ఆఫీసు లో ఫ్రెండ్ అయతే ఆ details... ఈ details అని అడిగి కాసేపు భయపెట్టండి...  • ఇంకా orkut లో మంచి , దిమ్మ తిరిగి పోయే status message ఒకటి పెట్టండి... అది చుసినోల్లు అదో జరిగింది అనుకుని ఫోన్ చెయ్యాలి...  • చాల రోజులనుంచి మాట్లాడని పాత స్నేహితులని అందర్నీ ఒకసారి conference call లో తీసుకుని మాట్లాడండి... మల్లి ఒక సారి పాత రోజులు గుర్తు తెచుకోండి...  • మీ దగ్గర north indians వుంటే .... వాళ్ళ దగ్గర కూర్చొని ... హిందీ లో బాగా కష్టమైనా మాటల్ని ... తెలుగు లో ... ఏమంటారో నేర్చుకోండి... ఆప్యాయత, అనురాగం, పుర్జన్మా.... ఉరుములు... ఎలా .......... ఇవి ముందు వాళ్లకి చెప్పడానికి పడే కష్టం వుందటి... అబ్బ భలే నవ్వు వస్తది...నాకు తెలిసి ఇలాంటివి చెప్తూ పోతే ... ఇంకా రాస్తూనే పోవాలి....

చివరిగా చెప్పేది ఏంటంటే... చేసి ప్రతి పని లోను కొంచం సంతోషం వెతకండి... అంతే...
నా పైత్యం...

నిన్న నువ్ నడిచిన దారిని వెతికా........

నీ కాలి జాడల కోసం..

చిత్రం గా అక్కడ భూమే లేదు..

బహుశా... దొంగలు దొంగిలించారేమో..

11/12/2009 - ఇంటి ప్రయాణం...ఈ రోజు బస్సు లు ఉంటాయా ?????? ఉండవా ??????? అన్న సంసయంతో దాదాపు ఇంటికి వెళ్ళడం విరమించుకున్నాను.......


ఎందుకో సరదాగా నెట్ లో keseneni సైట్ చుస్తే అందులో బస్సు లు వున్నాయి....... ఇంకా సరే వుంటాయేమో చూడడం అని లకడి కాపూల్ బయలుదేరాను..............


అప్పుడు టైం 6:30 అయ్యింది సాయంత్రం .......... ప్రొదూన నుంచి ఎం చేయలేదు........... కాలి గా రూం లోనే వున్నాను.........


అప్పుడు టికెట్ తెసుకుని........... అమీరపేట్ బిగ్ బజార్ కి బయలుదేరాం ....... నేను ఇంకా చందు....


కాసేపు షాపింగ్ చేసాం .... నాకు మా తమ్ముడుకి బట్టలు తీసుకున్నాను........ ఈ నెలలో వాడి పుట్టిన రోజు వుంది.......


మానాన్నకి రెండు shirts తీసుకున్నాను.......... ఇక్కడ దాక బానే వుంది.........


తర్వాత మా అమ్మకి ఎం తీసుకోవాలో అర్ధం కాలేదు........... చీరలు వీటిగురించి నాకేం తేలేదు........... ఇంకా ఎం తీసుకోవాలో తెలేకా బయటకి వచేసాను.......... బయటకి వచేటప్పుడు protinex అని షుగర్ వాళ్లకి వాడేది.........


మా అమ్మకి డాక్టర్ చెప్పలేదు వాడమని.......... కాని తీసుకుందాం అనిపించింది........... చందు వద్దు అన్నాడు........ ఇంకా ఆగి పూయా......... రాత్రి 11:00 కి బస్సు..........
రాత్రి చందు వచాడు ........ బస్సు స్టాప్ లో దించడానికి............. రాత్రంతా enrique సాంగ్స్ విన్తూ... ప్రయాణం చేసాను.. రాత్రి ప్రయాణం లో Enrique greatest hits వినండి కుదిర్తే.. బావుంటే...
bilomas గాని , love to see u cry గాని , addicted గాని , somebody's me గాని, hero గాని, taking back my love గాని, rhythm divine గాని, ..... ఒకటని కాదులే అన్ని బావుంతాయే..


ఇంతకీ ఇంట్లో అమ్మకి ఏమైనా తేసుకు వెళ్ళేటప్పుడు.......... ఎం తీసుకు వెళ్ళాలి.............

నా కొత్త ఫోన్.........


ఈ రోజు.... నేను ఆఫీసు పని మీద హైదరాబాద్ వచాను....
ఈ రోజు నా చాల రోజుల కల నెరవేరింది... అదే హైదరాబాద్ రావాలని కాదు...........
ఒక slide మొబైల్ కొనాలని.............. కాని ఫస్ట్ ఏదైనా చిన్న మొబైల్ కొనదామని వెళ్ళాం ....
నేను, చందు................. కాని ఏమి నచలేదు..............
చివరికి Sony Ericsson W205 ఫోన్ కొనేసాను..... slide model........ నాకు చాల బాగా నచ్చింది............. cost వచేసి............. 4,350............
Now i m happy now............ ఇంకా ఇప్పుడే రూం కి వచ్చి చందు నేను తింటున్నాం.........
రేపు ఇంటికి వెళ్తున్న............. ఎందాక ఇంటికి ఫోన్ చేస్తే ........ అందరు పెద్ద లిస్టు చెప్పారు.......
తేవలిసినవి.............. నీను ఇంకా ఏమి ఆలోచించలేదు............. ఎం తీసుకున్నానో .......... తీసుకున్న తర్వాత చెప్తా...........
bye..........

పెళ్లి పుస్తకం.......ఈ రోజు పనేం లేదు......... కాళీ గావున్నాను...............


మురళి ని పంపెసం అతని ఊరు........ తర్వాత రూం లోనే వున్నాను...... నేను, సంతోష్........


సాయంత్రం ధీరూవాళ్ల రూం కి వెళ్ళాం ........ రాత్రి 8:00 దాక అక్కడే వున్నాను.............


తర్వాత రూం కి వచేసాను................ ఇంక రూం లో కి రాగానే ............... yahoo లో......... ఇంక చాల సేపు చాట్ చేశాను..............


చాటింగ్ లో చాల మాట్లాడుకున్నాం...............


అప్పుడు మద్యలో .......... ఏదో లవ్ గురించి వచ్చింది............... తన లవ్ స్టొరీ చెప్పింది...............


ఏంటో ఇంటింటి కస్టాలు అనుకున్నా............. కాని నాక ఈ మద్య ఏ లవ్ స్టొరీ విన్న............ ఒకటే ఫీలింగ్ వస్తది.......... చివరికి అన్ని లవ్ స్టోరీస్ కి జరిగినట్టే జరుగుతాయి.................


లవ్ అనేదే లేదనిపిస్తుంది ఒకసారి.............. ఒకసారి ప్రేమ లేకపోతే ఈ లోకమే లేదనిపిస్తుంది............


ఎందుకంటే......... లవ్ చేసిన వాళ్లు వేరేవాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకుని ఎంతమంది సుఖం గా లేరు............


వీళ్ళు కూడా మొదట్లో " నువ్ లేకపోతే నేను చచిపోతను" , "నువ్వే నా ఊపిరి" అన్నోల్లెగా.........


అందుకే మన సమాజం లో పెళ్లి కి అంత విలువ ఇస్తారు............... అనిపిస్తుంది అప్పుడప్పుడు.........


అదేదో సినిమా లో అన్నటు............ " మనసు .........మనసు ........ కలపడమే మంత్రం పరమార్ధం......." అని..
కాకపోతే అలంటి ప్రేమ విషయాలు విన్నప్పుడో.................. ప్రేమ జంటలని చూసినప్పుడో కొంచం బాధ అనిపిస్తుంది అంతే................
ఇంకా చాల సేపు......... ఈ విషయం మీద చర్చ జరిగింది..............

తర్వాత 11:00 కి బ్లాగ్ రాయటం మొదలుపెట్టాను............


ఇంక మా మేనేజర్ ఫోన్.......... అరగంట తిన్నాడు నా బుర్ర............
తర్వాత కాసేపు సాగర్ తో చాట్ చేసి............ తినడం మొదలుపెట్టా.............
ఎంతైనా లవ్ ఫెయిల్ అవడం కొత్తలో కొంచం బాధ అనిపిస్తాదేమో.............. ఎందుకంటే నా అనుభవం...................
అందుకే నాకు అనాలనిపిస్తుంది...............
" Orkut లో నీ profile తాకితే........... నిన్ను తాకినప్పటి జ్ఞాపకాలు ........ అందుకే రోజు చుస్తువుంటా!!!!"
అని...........


ప్రవరాక్యుడు.............

నిన్న రోజంతా కాళి............... అలీ సాగర్ అని చిన్న బోటింగ్ పాయింట్ వుండి............. నిన్న సాయంత్రం అక్కడ గడిపాం................


నేను , సంతు గాడు ఇంకా మురళి.............. తర్వాత రూం కి వచేసం.............


బావుంది అలీ సాగర్........... బోటింగ్ పాయింట్.......... మేము అక్కడికి వెళ్ళే సరికి............6:15 అయింది.............ఆ టైం లో వాడు పెడల్ బోటు ఇవ్వనన్నాడు............. మోటర్ బోటు అయతే ఎక్కమనాడు..............


మోటర్ బోటు నాకు పెద్ద గా నచాడు............. వాడు పదినిముషాలలో అంత తిప్పి తెసుకుని వస్తాడు......... పెడల్ బోటు అయతే నే బావుంటది అని............. ఇంక ఎక్కలేదు..............


కొన్ని బిస్సుత్స్ , ఇంక కూల్ డ్రింక్స్ తాగి 7:00 దాక వుండి వచేసం...............


తర్వాత రూం కి వచ్చాక అందరు సినిమా ప్లాన్ చేసాం.............. నైట్ సెకండ్ షో చాల బావుంది.... సినిమా కూడా.. నచ్చింది.... బానేవుంది..............


ఇంక సినిమ ఐయిపోయాక రైల్వే స్టేషన్ దగ్గర ఒక టీ తాగి సరదాగా కాసేపు కార్ లో రోడ్ మీద తిరిగి నిదానంగా 2:౦౦ కి రూం కి వచ్చి అప్పుడు పడుకున్నాం ..........


అల గడిచింది....... ఈ రోజు.......... sorry నిన్న...మనసంటూ వునోల్లె మారాజులు.......... మమతంటూ లేనూల్లె నిరుపేదలు................


అంటోంది బయట హాల్ లో ఎవరి laptop ఓ...

తెలుగెంత తియ్యనా!!!!......కదా........


రోజు కుంటాల వెళ్ళే టప్పుడు పాటలు వింటూ వుండటం వల్లో ఏమో కాని........... నాకు నచిన lyrics

ఆలోచిస్తువున్న...........

మద్య నేను విన్న lyrics అన్నిటిలో ఆర్య-2 lyrics best of the best......

రోజు విన్న పాటలలో నాకు నచిన lyrics కొన్ని...........

(ఆర్య -2 లోని baby he loves u పాట లోనిది........)

ఎంత దగ్గరైన నీకు నాకు మద్య వున్న అంతులేని దూరమంత..........
ఎంత చేరువయ్నా నువ్వు నేను కలిసి చేరలేని తీరమంతా...........
ఎంత ఒర్చుకున్న నువ్వు నాకు చేసే జ్ఞాపకాల గాయమంత.......

(ఆర్య -2 cinema లోని i love u పాట లోనిది.........)

నిన్ను చూసే కళ్ళకి లోకమంతా ఇంక ఎందుకో.............

తీసుకుంటే నువ్వు ఊపిరి పోసుకుంట ఆయువే........ చెలి..


చిలుకలె నీ పలుకు తిరిగి పలికాయంటే తొలకరే లేకుండా కాసేయనా...........


(ఆర్య-2 cinema లో కరిగేలోగా క్షణం పాట లో........ )

సాగే మీ జంటని చూస్తుంటే ............ నా బాదంతటి అందం గా వుండీ...........

(చక్రం cinema లో ఒకే ఒక మాట లో...........)

నువ్వు రాక ముందు జీవితం గురుతైనా లేదని... నిను కలుసుకున్న క్షణం నను విడిచి పోదని ........ప్రస్తుతానికి గుర్తున్నవి ఇవీ............. మల్లి గుర్తొస్తే ఇంకో post లో కలుద్దాం...........

మీకు తెలిసినా మంచి lyrics వున్న పాటలు వుంటే చెప్పండి నేను try చేస్తాను........

అదుర్స్ ........ డే..
ఈ రోజు మద్యానం మా మేనేజర్ కాల్ చేసాడు.............. చెత్త details అన్ని అడిగి......... గంటసేపు బుర్ర తిన్నాడు......

నేను మెయిల్ పెడతాన్రా బాబు అన్నా ........ వినడు.............

తర్వాత కాసేపు పడుకున్నాను..............

time 6:00 అయింది................... అప్పుడు టీవీ పెడితే అదుర్స్ ఆడియో ఫంక్షన్ వస్తోంది...........

అదే చూస్తూ కూర్చున్న............. ఫంక్షన్ కి మోహన్ బాబు కుడా వచ్చారు.......... అప్పుడే అనుకున్నా ఎవల చిరంజీవి

మీద ఏవో సెటైర్స్ వేస్తారని.............

మొదట్లో రాజ మౌళి మాట్లాడుతూ.............. ఈ సినిమా మగధీర రికార్డ్స్ క్రాస్ చేస్తుంది అని అన్నాడు......... ఇంకా

జనాలు అరుపులు........... రచ్చ ...........రచ్చ............

ఇంక తర్వాత మోహన్ బాబు మాట్లాడుతూ............... ఈ సినిమా kodali nani M.L.A. సమర్పిస్తున్నారు........

M.L.A. అనే పదానికి కరెక్ట్ పర్సన్ ఈయన అన్నారు.......... అని ఊరుకోలేదు కొంతమంది M.L.A. పదానికి అర్ధం

తెలియనివాళ్ళు కూడా వున్నారు ........ అన్నారు............ (చిరు ని ఉద్దేశించి అనుకుంటా).

ఇప్పుడు దాసరి గారి వంతు............. నాకు డాన్సులు , fights ముఖ్యం కాదు........... హీరో అనే వాడు అభినయం

వుండాలి........... ఒక dialouge చెప్పగలగాలి........... నా దృష్టిలో హీరో లు అందరు స్టార్లు కాదు...............

స్టార్ అంటే న దృష్టిలో మినుగురుపురుగులతో లెక్క అని చెప్పారు................ (mega star, power star........అల

అనుకుంటా...........)

నాకు ఈ ఫంక్షన్ చుసాననే కాని.... ఇదేంటి ఒక సినిమా ప్రపంచం లో ఇన్ని గొడవల.. అని అనిపించింది..............

నాకు నిజంగానే N.T.R. అంటే ఇష్టం కాని ఈ మాటలు నాకు నచలేదు.................

మొత్తానికి ఫంక్షన్ అల సందడిగా జరిగింది................. పాటలు మొత్తం నేను వినలేదు............ ఒక 3 పాటలు

విన్నాను...........బాగున్నాయి ఆ పాటలు... కొంచం rap టైపు లో వుండి ఒకటి .................... N.T.R చాలా

బావున్నాడు ఒక సాంగ్ లో...... సినిమా హిట్ అవ్వాలనే కోరుకుందాం...........

ఇంక ఇప్పుడే తిందాము అనుకుంటున్నాను......................

నిన్ను చూసే ఈ కళ్ళకి లోకమంతా ఇంక ఎందుకో...
ఇప్పుడే
!!!! తిందామని రూం కి వచాను............... సరదాగా బయట తిరిగే..

అంజి గాడు వండుతున్నది........... బెండకాయ కూర........పర్లేదు ఒక రకం గా బానే వండుతాడు...........

ఇంక ఎం చేద్దామా అని మెయిల్ చెక్ చేసుకుని బ్లాగ్ రాస్తూ కూర్చున్న............

నేను కొన్ని రోజులుగా ఒకటి గమనిస్తున్న........ అదేంటంటే ........... రోడ్ మీద వెళ్ళేటప్పుడు షాప్స్ పేర్లు వుంటై కదా.........

అవన్నీ నేను ఇష్టపడిన అమ్మాయే పేర్లే కనబడుతున్నాయి.................

మొదట్లో పెద్ద గా పట్టించుకోలేదు...........

ఎందుకో ఇవాళ సడన్ గా అనిపించింది.............

అదేంటి రోజు ఆ పేరే కనబడుతోంది ఏ షాప్ వైపు చూసినా అని...................

........ general stores, ........... medical stores, ........... bakery, .......... agencies, ........... cloth show room,

........ restaurant చివరికి

.......... pan shop,

........... wine shop అని కూడా..........

చివరికి ఏ మని నిర్ణయానికి వచానంటే............ (బయట తిరిగేటప్పుడు కళ్లు మూసుకొని తిరగాలని కాదులే!!)


మిగిలిన పేర్లన్నే..............

నా కళ్ళే చుస్తునయే..........

వదేలేస్తున్నాయి............

కానీ ఆ పేరు మాత్రం మనసు చూస్తోంది........................

అందుకే ఆ పేరు చూసినప్పుడల్లా ఏదో చిన్న disturbance.......

హమ్మయ్య ...........


అబ్బ ఎట్టకేలకి................ చిట్టచివరికి మా network launch అయింది...............

మొన్న 3 rd నా......... offers పెద్దగా ఎం లేవు కాని.......... 29paisa ఆఫర్ వుండి కాని.............దానికి రోజుకి ఒక రూపై కట్టాలి............... చూడాలి న్యూ ఇయర్ కి ఎమన్నా offers ఇస్తాడేమో...............

ఇంక నేను ఈ రోజు కాళీ .......................... పనేంలేదు............... చందు వస్తానన్నాడు.............. కాల్ చెయ్యాలి............


నేను అనుకోవటం త్వరలో నేను నిజామాబాదు నుంచి వెల్లిపోవచు................ ఎక్కడికి అన్నది మాత్రం ఇంక తేలేదు...........

ఏంటో జీవితం అంత.......అలా పరిగెడుతోంది...............

Moody day........ఈ రోజు 11:30 కి బయటకి వెళ్ళాను.. మద్యానం చాల సేపు సైట్స్ లో తిరుగుతూ వున్నాను....

ప్రేమ్ ఈ రోజు నుంచి వాళ్ల ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడే ఇచ్చారు అతనికి పోస్టింగ్.... నా లైఫ్ లో ఇప్పటిదాకా అంత

మంచి ఫ్రెండ్ ని చూడలేదు నేను... చాల మంచి పర్సన్.... సబ్జెక్టు కుడా బాగా తెలుసు.... senior అనే ఫీలింగ్ కొంచం

కుడా వుండదు...

పాపం అతనిని చాలా ఊళ్లు తిప్పారు... నైస్ పర్సన్..... సర్లే మనోడికి మంచి రోజులు వచాయి అనుకున్నాను.....

ఇంక సాయంత్రం 6:30 కి రూం కి వచేసాను. చాలా తల నొప్పిగా వుండి ............ వచేటప్పుడు టీ కుడా తాగి వచాను...

అయనా లాభం లేదు............. ఒక అరగంట పడుకున్నాను............... కొంచం relax అనిపించింది.........

తర్వాత మెయిల్స్ చెక్ చేసుకున్నాను.......

కాసేపు మధు తో మాట్లాడాను.............

కుష్బూ స్క్రాప్ పెట్టింది........... పాపం తనుకూడా తన లవ్ పేరు టైపు చేసింది............. నాకు దొరికిపోయింది...........

ఇంక తర్వాత ఒక అర గంట ప్రేమ్ తో ఫోన్ మాట్లాడాను......................

తిన్తూ......... కన్నాతో.............. తర్వాత రాజ తో..................... ఫోన్..........

అంతే ఇంక ఇప్పుడే నారూం లోనికి వచ్చి బ్లాగ్ రాయటం మొదలుపెట్టాను..................

ఒక విషయం మీద ఎం చెయ్యాలో అర్ధం కాని పరిస్థితి..................

అంతకన్నా ఎం రాయలేను ఇక్కడ ...................... అంతే...............

My all time fav.....

వెర్రిది అమ్మేరా ............... పిచ్చిదాని కోపం రా........... పచ్చి కొట్టి వెళ్దామా............ బూచికిచ్చి పోదామా ......... పచ్చి కొట్టి పోయామా....... పాలేవళ్ళు ఈట్టారు................ బూచాడికి ఇచ్చామా బువ్వేవాళ్ళు పెడతారు చెప్పు..........

" చిన్నప్పటి బంద్ "

ఈ రోజు బంద్ అని చెప్పాకదా... ఇదే చూస్తుంటే చిన్నపాటి రోజులు గుర్తు వచాయీ..

స్కూల్ లో వున్నపుడు బంద్ ఎప్పుడు వస్తుందా.. అని ఎదురు చూసే వాళ్ళం... ఇంక బంద్ అంటే హాయిగా ఇంటికి వెళ్లి

ఆడుకునేవాడిని.. గల్లి క్రికెట్.. అప్పుడు అంతకంటే ఇంకేం వద్దు అనిపించేది.. సెలవు వచ్చిన తర్వాత స్కూల్ కి వెళ్ళాలంటే

పెద్ద నరకమే... స్కూల్ కి వెళ్ళ బుద్ధి కాదు.. ఎవల ఎవరైనా బంద్ చేస్తే బావుండు అనిపించేది..

కాలేజీ లో అయతే ఇంక చెప్పకరలేదు.. నేను డైలీ సర్వీసు చేసేవాడిని గుడివాడ నుంచి గుడ్లవల్లేరు వరకు...

బంద్ రోజు కాలేజీ వుండేది... మేము కాలేజీ కి వెళ్ళేవాళ్ళం.. మా క్లాసు 2nd floor లో కరెక్ట్ గా మా కాలేజీ entrance

గేటు ముందు మా క్లాసు కిటికే వచెది.. ఇంక దాని దగ్గర కూర్చుని ఎప్పుడు ఎవరు వచ్చి కాలేజీ ముసేయండి అంటారా

అని ఎదురు చూస్తూ వుండేవాళ్ళం...

చివరికి వాళ్లు అప్పుడో 11:00 or 11:30 కి వచేవాళ్ళు.. అప్పుడు కాలేజీ కి holy day ఇచేవాళ్ళు...

అప్పుడు బస్ కూడా ఉండేవి కాదు.. ఇంక ఇంటినుంచి తెచుకున్న carrier తినేసి.. అక్కడే క్రికెట్ ఆడుకునేవాళ్ళం..

లేకపోతే వున్నా ఒకే ఒక సినిమా హాల్ లో ఏదో పథ సినిమాకి చేక్కేసే వాళ్ళం...

సాయంత్రం ఎప్పుడో 6:00 కో లేకపోతే 7:00 కో వెళ్ళేవాళ్ళం ఇంటికి...

బావుండేవి ఆ రోజులు... కాని ఇప్పుడు అవనీ జ్ఞాపకాలు........ చివరికి జ్ఞాపకాలే మనకు మిగుల్తాయి..

నాకు ఆ శక్తే వుంటే నాకు కావలిసిన వాటిని నాతోనే ఉంచుకునే వాడిని.... ముఖ్యం గా తనని....


ఇప్పుడు బయట హాల్లో పాట మారింది....

176 బీచ్ హౌస్ లో ప్రేమ దేవత .... ఎల్లో చుడిదార్ వైట్ చున్నితో దోచెనా ఎదా..........

అంటోంది టీవీ నాలాగా...


తెలంగాణా బంద్...

" రైళ్ళు బంద్, హోటళ్ళు బంద్, ఆటోలు బంద్, రిక్షాలు కుడా బంద్....."

అలా వుండి ఈ రోజు పరిస్థితి..

ఈ రోజు తెలంగాణా బంద్.... బయట బస్సులు లేవు............. సైట్ కి వెళ్దాం

అంటే కార్ లో డీసిల్ లేదు......... కొట్టించడానికి పెట్రోల్ బుంక్ లు లేవు..............

ఇంక అందుకే రూం లో నే వున్నాను..... కాలి ఈ రోజు....... మద్యానం

వండుకుని రూం లో తిని టీవీ చూస్తూ వున్నా......

స్టూడెంట్స్ గొడవ గొడవ చేస్తున్నారు...... బస్సులు అద్దాలు

పగలగోడుతున్నారు... బస్సులు తగలబెడుతున్నారు...... బయటంతా రచ్చ

రచ్చ గా వుండి....... కొందరు ఒంటికి నిప్పంటించుకుని చచిపోయారు........

కొందరు గాయపడ్డారు..

అంత గొడవ గొడవ గా వుండి... పాపం జనాల పరిస్థితి అయతే మరి ఘోరం..........

పాపం పార్టీలు ఇంక ఏదైనా ఆలోచించోచుగా అనుకున్నా...

ఇంక సాయంత్రం కాసేపు పడుకున్న...

మద్యానం ఆర్కుట్ profiles లో లవ్ గురిచి అందరికి స్క్రాప్స్ చేశాను...

అదే లవ్ పేరు టైపు చేస్తే.... ఎంత పెర్సెంట్ perfect అని చెప్తుంది..

ఇంతకీ విషయం ఏంటంటే .... అది నిజం గా చెప్పదు.. పేర్లు టైపు చేసి submit

కొట్టగానే.. వాళ్లు కొట్టిన పేర్లు నాకు మెయిల్ వచ్చి.. వాళ్లకు screen మీద

Oops.. u become Fool.......... అని వస్తది......... ఎందుకంటే నేను fool

అయ్యానుకాబట్టే తెలిసింది...

ఇంక సాయంత్రం చాల సేపు పడుకున్న...

ఇప్పుడే తిని నా రూం లో కూర్చున్న... ఇంతలో ఇంకో వార్త తెలిసింది ... KCR

దీక్ష విరమించారు అని.. అదేంటో అనిపించింది...

OU లో ప్రోదున్న దాక పొగిడిన students ఇప్పుడు తిడుతున్నారు అని వేస్తున్నాడు టీవీ లో....

ఈరోజు అంతే ...........

బయట హాల్లో నుంచి స్నేహితుడా !! స్నేహితుడా !! రహస్య స్నేహితుడా!! అని పాట వినిపిస్తోంది..

అలానే వుండి పోయా.... ఏదో ఆలోచిస్తూ...Blog Archive

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......