చీకటి వెలుగుల రంగేళి ......


" చిన్నప్పటి బంద్ "

ఈ రోజు బంద్ అని చెప్పాకదా... ఇదే చూస్తుంటే చిన్నపాటి రోజులు గుర్తు వచాయీ..

స్కూల్ లో వున్నపుడు బంద్ ఎప్పుడు వస్తుందా.. అని ఎదురు చూసే వాళ్ళం... ఇంక బంద్ అంటే హాయిగా ఇంటికి వెళ్లి

ఆడుకునేవాడిని.. గల్లి క్రికెట్.. అప్పుడు అంతకంటే ఇంకేం వద్దు అనిపించేది.. సెలవు వచ్చిన తర్వాత స్కూల్ కి వెళ్ళాలంటే

పెద్ద నరకమే... స్కూల్ కి వెళ్ళ బుద్ధి కాదు.. ఎవల ఎవరైనా బంద్ చేస్తే బావుండు అనిపించేది..

కాలేజీ లో అయతే ఇంక చెప్పకరలేదు.. నేను డైలీ సర్వీసు చేసేవాడిని గుడివాడ నుంచి గుడ్లవల్లేరు వరకు...

బంద్ రోజు కాలేజీ వుండేది... మేము కాలేజీ కి వెళ్ళేవాళ్ళం.. మా క్లాసు 2nd floor లో కరెక్ట్ గా మా కాలేజీ entrance

గేటు ముందు మా క్లాసు కిటికే వచెది.. ఇంక దాని దగ్గర కూర్చుని ఎప్పుడు ఎవరు వచ్చి కాలేజీ ముసేయండి అంటారా

అని ఎదురు చూస్తూ వుండేవాళ్ళం...

చివరికి వాళ్లు అప్పుడో 11:00 or 11:30 కి వచేవాళ్ళు.. అప్పుడు కాలేజీ కి holy day ఇచేవాళ్ళు...

అప్పుడు బస్ కూడా ఉండేవి కాదు.. ఇంక ఇంటినుంచి తెచుకున్న carrier తినేసి.. అక్కడే క్రికెట్ ఆడుకునేవాళ్ళం..

లేకపోతే వున్నా ఒకే ఒక సినిమా హాల్ లో ఏదో పథ సినిమాకి చేక్కేసే వాళ్ళం...

సాయంత్రం ఎప్పుడో 6:00 కో లేకపోతే 7:00 కో వెళ్ళేవాళ్ళం ఇంటికి...

బావుండేవి ఆ రోజులు... కాని ఇప్పుడు అవనీ జ్ఞాపకాలు........ చివరికి జ్ఞాపకాలే మనకు మిగుల్తాయి..

నాకు ఆ శక్తే వుంటే నాకు కావలిసిన వాటిని నాతోనే ఉంచుకునే వాడిని.... ముఖ్యం గా తనని....


ఇప్పుడు బయట హాల్లో పాట మారింది....

176 బీచ్ హౌస్ లో ప్రేమ దేవత .... ఎల్లో చుడిదార్ వైట్ చున్నితో దోచెనా ఎదా..........

అంటోంది టీవీ నాలాగా...


0 comments:

Post a Comment

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......