చీకటి వెలుగుల రంగేళి ......


మా సంతు గాడి కథలు...
నిన్న పోస్ట్ లో నార్త్ వాళ్ళతో మాట్లాడండి ....... అని రాసాను కదా........ అది ఎలా గుర్తువచిందో చెప్పాలంటే దానికో చిన్న కథ వుంది... అది వినాల్సిందే.. sorry చదవాల్సిందే..


మా రూం లో సంతు , నేను, ఇంకో నార్త్ ఇండియన్ ఉంటున్నాం.......... సంతు గాడికి హిందీ...కొద్ది కొద్ది గా వచ్చు ......


ఒక రోజు భోజనం తింటుంటే ముగ్గురం... బయట పెద్దగా ఉరుములు.. మెరుపులు వస్తున్నాయి... వున్నటుంది మా రూం పక్కన పెద్ద సౌండ్ తో పిడుగు పడింది...


కాసేపు అటు ఇటు కంగారు పడి తిరిగాక... మల్లి తినటానికి కూర్చున్నాం...


అప్పుడు మా సంతు గాడికి అనుమానం వచ్చింది.... నాతో " అరేయ్!! ఇప్పుడు బయట పిడుగు పడింది కదా .... దాన్ని హిందీ లో ఏమంటారు రా???" అని అడిగాడు నన్ను...


నాకు నిజం గా తెలియదు... అదే మాట వాడితో చెప్పాను ....


ఇంకా వాడు అక్కడ వున్నా మా నార్త్ ఫ్రెండ్ ని " అభి బాహర్ ఆయాన వో డబుక్ .... దుబెక్... ఇస్కో హిందీ మే క్యా బోల్తా హై..!!!" అన్నాడు..


ఇంకా అంతే... పావుగంట సేపు నవ్వలేక చచ్చి పోయా............ పాపం వాడి బాధ ఆ నార్త్ అతను అర్ధం చేసుకుని చివరికి ఏదో చెప్పాడు ఏమంటారో ...... నాకు గుర్తులేదు...


అది గుర్తు వచినప్పుడల్లా ఇప్పటికి నవ్వు వస్తూనే వుంటుంది...
ఇప్పుడు వాడు పక్క ముగ్గురు నార్త్ ఇండియాన్స్ తో ఉంటున్నాడు...
ఇప్పుడు అదే పరిస్థితి... కాకపోతే..
వాళ్ళ దగ్గర రెండు, మూడు హిందీ తిట్లు నేర్చుకున్నాడు.. వాళ్లకి నాలుగు తెలుగు తిట్లు నేర్పాడు...
అలా నడిపిస్తున్నాడు లైఫ్ ని...

0 comments:

Post a Comment

Blog Archive

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......