చీకటి వెలుగుల రంగేళి ......


చిన్నప్పటి అరటి...


ఇందాక ఏదో సైట్ వెతుకుతుంటే అందు లో చిన్నప్పటి అరటి పాట కనబడింది... మీరు చదవండి ఒక సారి వీలుంటే ....

ఆదివారము నాడు అరటి మొలిచింది

సోమవారము నాడు సుడి వేసి పెరిగింది

మంగళవారము నాడు మారాకు తొడిగింది

బుధవారము నాడు పొట్టి గెల వేసింది

గురువారమునాడు గుబురులో దాగింది

శుక్రవారము నాడు చక చకా గెల కోసి

అందరికి పంచితిమి అరటి అత్తములు

అబ్బాయి, అమ్మాయి అరటి పండ్లివిగో..............

2 comments:

SIVA said...

అబ్బ ఎంతకాలానికి చూశానండి ఈ పాట. నేను రెండవ తరగతి చదువుతున్నప్పుదనుకుంటాను, తెలుగు వాచకంలో ఉందేది. ఈ పాటతో బాటుగా ఒక అద్భుతమైన రంగుల బొమ్మ ఉన్నట్టుగా జ్ఞాపకం. ఆ బొమ్మ లెని లోటు మీరు మంచి ఫొటోతో తీర్చారు. పాత జ్ఞాపకాలను తవ్వి తీసినందుకు ధన్యవాదాలు.

ఇలాగే మరొక పాట ఉండేది, రంగు రంగు బొమ్మలతో, బావా బావా పన్నీరు, బావను పట్టుకు తన్నేరు.

ఈ పాటకూడ ఎక్కడన్న దొరికితే బాగుందును. ఉలిబ్.ఒర్గ్ వాళ్ళు పాత పెద్ద బాలశిక్షలు, కొత్త ఆంద్ర వాచకం, అలాగే పాత తెక్స్టు పుస్తకాలు కూడ స్చాన్ చేసి భద్ర పరిస్తే బాగుండు. కాని వాళ్లకి కూడ దొరకాలిగా, దాదాపు 45 ఏళ్ళ క్రితానివి ఈ గుర్తులు.

Phani Yalamanchili said...

ధన్యవాదాలు .... అవునండి శివ గారు మీరు అంటే గుర్తువచింది.. ఆ పాత వెతకటం మొదలు పెడతా ....... దొరక గానే మీకోసమే special గా పోస్ట్ చేస్తాను...

Post a Comment

Blog Archive

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......