చీకటి వెలుగుల రంగేళి ......


అవతార్ డే...


రోజు సన్ డే అలానే గడిచింది.... రాత్రి అవతార్ సినిమా కి వెళ్లి వచాను.... అది అనుకోకుండా... అప్పటికప్పుడు ఫిక్స్ అయింది.. సినిమా రాత్రి 9:00 కి సంతు గాడు కాల్ చేసి టికెట్స్ తెసుకున్నాను రూం కి వస్తున్నాను అన్నాడు...
ఇంకా గబగబా రెడీ అయ్యి బయల్దేరాను... తిండి కూడా తినలేదు... నాకు పెద్దగా ఇంగ్లీష్ సినిమాలు నచవు.... అందులో డబ్బింగ్ సినిమాలు మరీను... ఇంకా అందరు వెళ్తున్నారు అనేసరికి నేను బయల్దేరాను...
సినిమా పర్లేదు ... బానే వుంది.. నేను దేనికి 3.5/5 ఇస్తాను rating......
సినిమా అయ్పోయేసరికి 12:15 అయింది.. అప్పుడు ఇక్కడ దగ్గరలో ధాబ వుంటే అక్కడికి వెళ్లి తిని రూం కి వచ్చి పడుకునే సరికి... 2:30 అయింది...
సినిమా లో కొంచం మెసేజ్ వుంది.. పర్యావరణం ఎంత అందం గా వుంటుంది.. దాన్ని మన ప్రయోజనాల కోసం ఎలా పాడు చేస్తున్నాం ......... అనేది చూపించాడు... గ్రాఫిక్స్ బావున్నాయి....
ఇంకా రోజు ఎం చెయ్ లేదు.. కాళి నే...

0 comments:

Post a Comment

Blog Archive

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......