చీకటి వెలుగుల రంగేళి ......


నిజంగా క్రిస్మస్ గిఫ్ట్ .........నేను మా, అమ్మ, నాన్న హాస్పిటల్ లో వున్నాం............


ఎందుకంటే ఇంకా నుంచి నేను ఆడుకోవటానికి బయటకి వీల్లనవసరం లేదంట .......


మా ఇంట్లోనే ఆడుకోవచంతా........


ఎందుకంటే నాకు బుల్లి తమ్ముడు పుట్టాడు....


చిన్న చిన్న కాళ్ళు...........


బుల్లి బుల్లి చేతులు............


బుజ్జి బుజ్జి కళ్ళు..............


ఎప్పుడు నిద్రే ...........


లేగిస్తే ఇంకా ఏడుపే ..........


హాస్పిటల్ అంత గోల .... గోల............


ఉన్న ప్రదేశం American hospital, Vijayawada...............


కాని నన్ను, వాడిని ముట్టుకోనివ్వడం లేదు ....... అమ్మ చెప్పింది నీ గోళ్ళు వాడికి తగిల్తే నొప్పి పుడుతుంది వాడికి...


లేత చర్మం కదా అని............. సరే అని నేను ఒక ముద్దు పెట్టి ఊరుకున్న..........


క్రిస్మస్ ముందు రోజు అంటే 24 th నైట్ పన్నెండు తర్వాత santa claus (క్రిస్మస్ తాత ) వచాడు......... నాకు అతనిని

చూడగానే భయం వేసింది....

రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని.............. తెల్ల టోపీ పెట్టుకుని........... చేతిలో చాక్లెట్స్.. ఇంకా బలూన్స్........ చాల బిస్కట్స్ ....

అసలే నేను స్వతహా గానే భయస్తుడిని............ ఇంకా అతని దగ్గరకి వెళ్ళాలంటే భయం వేసింది... కాని చాల మంది

అతని చుట్ట తిరుగు తున్నారు.............ఏవేవో పాటలు పాడుతున్నారు........... గొడవ గొడవ చేస్తున్నారు...........

అతను నాదగ్గరకే వస్తున్నాడు........ అమ్మ మంచం మీద వుంది........ నేను భయం తో అమ్మ దగ్గరకి వెళ్లి పోయా........

కాని ఇవేమీ మా తమ్ముడికి తెలియవుగా........ వాడేమో చిన్నపిల్లోడు.......... ఈ గొడవకి లేచి అందరివంకా... చిత్ర


విచిత్రం గా చూస్తున్నాడు......... ఏడుస్తూ !!!!!!!!


ఇంకేముంది అతను నా దగ్గరికి రానే వచాడు................... నా ముందు చెయ్యి చాపాడు......... మా అమ్మ నా చెయ్యి

తెసుకుని అతని చేతిలో పెట్టింది..............

భయం భయం గా వెనక్కి లాగేసుకున్న................. కాని అతను ఒక shake-hand ఇచి ........ హ్యాపీ క్రిస్మస్ అని


చెప్పి..... ఒక ముద్దు పెట్టి......... నాకు ఒక బిస్సుట్ ప్యాకెట్ ఇచి వెళ్లి పోయాడు...........


అప్పుడు భయం తగ్గింది.............


ఇది నా క్రిస్మస్ అనుభవం.......


ఇంతకీ ఇది జరిగింది ఎప్పుడో తెలుసా!!........... december 25th 1992............... అంటే అప్పుడు నా వయసు... 5


ఏళ్ళు .... మా తమ్ముడి వయసు 8 రోజులు..........


కాని ఇప్పటికి ఆ జ్ఞాపకాలు అలానే వున్నాయి............

ఇప్పుడు వాడు నా అంత అయ్యాడు......... చక చకా........ చదివేసి.......... Engg దాక వచేసాడు..........

ఇప్పుడు ఎందుకో అవి గుర్తు వచాయి......... ఈ క్రిస్మస్ రోజు నా..........

2 comments:

శిశిర said...

అందమైన జ్ఞాపకం. :)

'Padmarpita' said...

అందమైన క్రిస్మస్ అనుభవం...

Post a Comment

Blog Archive

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......