చీకటి వెలుగుల రంగేళి ......


పాత రోజుల ..... రోజు.. :)


ఈ రోజు మామూలే గానే గడిచింది........ పెద్ద గా చెప్పు కోవడానికి ఎం లేవు........


మద్యానం మధు కి కాల్ చేసాను... కాసేపు మాట్లాడాను.. ముక్కు కుట్టిన్చికుందట ..... ఇంకే మరే black frame కళ్ళజోడు పెట్టు అచ్చం సానియాల వుంటావ్ అన్నాను....


సైట్ కి వెళ్లి సాయంత్రం 7:00 కి రూం కి వచ్చాను .... పొద్దున్న నుంచి ఎం తినలేదోమో బాగా ఆకలిగా వుంది..


ఇంకా రెండు egg puff తిని....... బ్లాగ్ రాస్తూ కోర్చున్నాను........

10:00 కి తింటూ మ్యాచ్ చూసాను........ చివర్లో ఓడిపోయారు........ కాని బావుంది మ్యాచ్...


తర్వాత రాజీవ్ సైట్ దగ్గరనుంచు చెరుకులు తెచాడు......... తినమని ఇచ్చాడు.. అవి కాసేపు టైం పాస్ చేసాను..


ఆ చెరుకులు తింటుంటే........ చిన్నప్పటి రోజులు గుర్తు వచాయి..........


చిన్నప్పుడు మా అమ్మమ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు బలే తినేవ్వాళ్ళం.. నేను చందు, రాజ, క్రిష్న అక్క, ఫణి అక్క , సింధు ఎలా మా గ్యాంగ్ అంత...


అప్పుడప్పుడు ఊళ్ళో వున్నా రావి చెట్టు వెనక నిలబడి ఎద్దుల బండి ఆ చెట్టు దాటి వెళ్ళాక... బండి వాడు
చూడకుండా... కొన్ని చెరుకులు లాగేవాళ్ళం.... వాడు చూసాడా !!! ఇక పోరుగో ........పరుగు....


కొన్ని సార్లు మా మావయ్య పొలం నుంచి తెచేవాడు..... ఇవి ఇంకా తాటి కాయలు వాటితో చేసే బళ్ళు....... బావుండేవి...


ఇంకా చెరుకు చెత్త తో రాత్రి పూట తెగలు ...,కాల్చేవాళ్ళు... బలే ఉండేవి అవి కూడా...
ఇంకా అప్పట్లో అమ్మమ్మ వాళ్ళకి కేబుల్ టీవీ లేదు... జేజి వాళ్ళ ఇంటికి వెళ్లి రాత్రి సినిమాలు..
చూసేవాళ్ళం...
ఇప్పుడు ఈ అమ్మమ్మ , జేజి , చెరుకులు, తాటి కాయలు ఇవి టైపు చేస్తుంటేనే .... ఏదో మనసులో గొప్ప అనుభూతి...


నిజం గా భలే ఉండేవి ....... ఆ రోజులు...


ఇప్పుడు ఆ రోజులు లేవు.... ఆ అమ్మమ్మ లేదు ... జ్ఞాపకాలే మిగిలాయి....


1 comments:

సంతోష్ said...

మీరు బాగా రాస్తున్నారు ..
ఏదో డైరీ లా
నేను మా వూరికి వెళ్ళిన ప్రతిసారి ..వీలు చూసుకుని మా ఇంటి వెనకాల వున్న పొలాల్లోకి వెళ్లి చెరకు గడలు తెచులుని తింటువుంటాను అండి ...

Post a Comment

Blog Archive

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......