చీకటి వెలుగుల రంగేళి ......


ఆనందం... నా భాష లో... (సుత్తి లేకుండా ... సూటిగా..)
చాల మంది ఆనందం గా లేమని అనుకుంటారు... అందరు ఏవేవో అనుభవిస్తున్నారు నాకు enjoy చెయ్యడానికి లేదు అనుకుంటారు......... అలంటి వాళ్ళ కోసమే ఇది..


నేను ఇంతకూ ముందు ఇలానే అనుకునే వాడిని ... కాని జీవితం అనే schoool లో నేర్చుకున్నది ఒకటే..


ఆనందం అనేది ఒక్కసారే రాదు.. చిన్న చిన్న ఆనందాలు అన్ని కలిపితేనే... మనకి ఆనందం గా వున్నట్టు అనిపిస్తది..


చిన్న చిన్న ఆనందాలు కొన్ని చుడండి ... వీటిలో కొన్ని నాకు అని పించినవి .. కొన్ని నేను enjoy చేసేవి..


  • మీరు బస్సు లో నైట్ journy చేస్తున్నపుడు ... చిన్న గా విండో గ్లాస్ తీసి మీ చేతి వేళ్ళు బయటపెట్టండి... ఆ చల్లని గాలిని కాసేపు మీ అందమైన వేళ్ళని తాకే భాగ్యం కలిగించండి.. (ఒక ప్రక్క వెనక వాడిని కనిపెట్టుకు వుండండి... వాడు గ్లాస్ వేసేడా.... ఇంకా చూస్కో దానికి కూడా ఉండవ్.. :))  • మీ బాస్ మిమ్మల్ని తిడదామని ఫోన్ లో మొదలుపెడుతున్నప్పుడు ..... వున్నటుంది... ఫోన్ hello .... hello... అని కట్ చేసేయండి ఫోన్... తర్వాత ఒక 5 నిముషాలు ఫోన్ switch off చేసేయండి... తర్వాత కాల్ చేస్తే ... సిగ్నల్ ప్రాబ్లం అని చెప్పండి... ఈ లోపు మీ బాస్ కోపము తగ్గుతుంది.. మీకు సరదాగా వుంటుంది..  • రాత్రి ఒంటి గంటకి బయటకు బయల్దేరండి.. చలికాలం అయతే మరీను... దమ్ము కొట్టే అలవాటు వుంటే అలా రైల్వే స్టేషన్ దాక వెళ్లి ఒక దమ్ము కొట్టి... ఒక టీ తాగి రండి....  • మీ ఫ్రెండ్ ఓ , లేకపోతే మీ ఆఫీసు లో ఫ్రెండ్ కో ఒక కొత్త నెంబర్ నుంచి కాల్ చేసి.. కాసేపు ఆటపట్టించండి... మీ ఆఫీసు లో ఫ్రెండ్ అయతే ఆ details... ఈ details అని అడిగి కాసేపు భయపెట్టండి...  • ఇంకా orkut లో మంచి , దిమ్మ తిరిగి పోయే status message ఒకటి పెట్టండి... అది చుసినోల్లు అదో జరిగింది అనుకుని ఫోన్ చెయ్యాలి...  • చాల రోజులనుంచి మాట్లాడని పాత స్నేహితులని అందర్నీ ఒకసారి conference call లో తీసుకుని మాట్లాడండి... మల్లి ఒక సారి పాత రోజులు గుర్తు తెచుకోండి...  • మీ దగ్గర north indians వుంటే .... వాళ్ళ దగ్గర కూర్చొని ... హిందీ లో బాగా కష్టమైనా మాటల్ని ... తెలుగు లో ... ఏమంటారో నేర్చుకోండి... ఆప్యాయత, అనురాగం, పుర్జన్మా.... ఉరుములు... ఎలా .......... ఇవి ముందు వాళ్లకి చెప్పడానికి పడే కష్టం వుందటి... అబ్బ భలే నవ్వు వస్తది...నాకు తెలిసి ఇలాంటివి చెప్తూ పోతే ... ఇంకా రాస్తూనే పోవాలి....

చివరిగా చెప్పేది ఏంటంటే... చేసి ప్రతి పని లోను కొంచం సంతోషం వెతకండి... అంతే...
2 comments:

'Padmarpita' said...

భలేగుంది ఐడియా:)

శిశిర said...

అవునండి. చిన్న చిన్న బిందువులు కలిస్తేనే సముద్రం అయినట్టు చిన్న చిన్న ఆనందాలు, అనుభూతులు కలిస్తేనే జీవితమవుతుంది.

Post a Comment

Blog Archive

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......