చీకటి వెలుగుల రంగేళి ......


బావ........ బావా ....... cartoon తో..


శివ గారి comment చూసాక ........ అప్పుడు నాకు గుర్తు వచ్చింది ........ ఈ పాట ... చివరికి దొరికింది వెతికితే.....
ఇంతకి... దీనికి ఫోటో ఎం పెట్టాలో అర్ధం కాలేదు.. చివరికి ఇది పెడుతున్న... ఎవరి దగ్గరో కాపీ కొట్టి..
ఇది ఎవర్ని నొప్పించటానికి కాదు... సరదాగా... అంతే... ఇంతకి ఆ cortoon ఎవరి గురించి కనిపెట్టండి.. చూద్దాం...

"బావా! బావా! పన్నీరు బావను పట్టుకు తన్నేరు

మూడు గుద్దులు గుద్దేరు

మూలన మంచం వేసేరు

ముంతెడు గంజి యిచ్చేరు

బావా! బావా! పన్నీరు బావను పట్టుకు తన్నేరు

వీధి వీధి తిప్పేరు వీశెడు గంధం పూసేరు

చావిడి గుంజకు కట్టేరు చప్పిడి గుద్దులు గుద్దేరు."

పల్లేరు తెప్పించి పక్క వేయండీ

నల్లేరు తెప్పించి నలిచి విడువండీ

నల్లేరు చేతాను నయము కాకుండీ

దూలగొండి తెచ్చి దులుపి పంపండి."

3 comments:

Anonymous said...

ఇది మరీ వెటకారం ! అంత చక్కగా పోలికలు తెలుస్తుంటే ...కనిపెట్టమని సవాలా? మొగల్తూరు, పలకొల్లూనూ .....

SIVA said...

కృతజ్ఞతలు, ఈ పాటకూడ మీ బ్లాగులో పోస్టు చేసినందుకు. మీరు పాటతో పాటుగా వేసిన కార్టూన్ ఎవరిగురించో ఎవరైనా ఇట్టే కనిపెడతారు. కాని పాటకు సరిపోలేదనుకుంటాను.

పాటలో, కొత్తగా పెళ్ళైన అక్క భర్త పండుగకు వచ్చినప్పుడు, ఆ బావను ఉడికిస్తూ పాడే పాట ఇది. 2వతరగతి తెలుగు వాచకంలో చిన్న చిన్న బొమ్మలతో కామిక్ స్ట్రిప్ లాగ వేసినది, 1963-64 సంవత్సరాలలో అనుకుంటాను, ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించిన పాఠ్య పుస్తకం అది. గుర్తొచ్చినప్పుడల్లా ఆనందం కలుగుతుంది ఆ బొమ్మలు గుర్తుకొచ్చి.


ఈ పాట మరింత ఉన్నట్టున్నది. బొమ్మలలో చివరలో మేనాలో కూచుని ఉన్న అక్క ఉంటుంది, బావ అక్కను తీసుకుని వెళ్ళిపోవటం, చిన్ని తమ్ముడి/చెల్లెలి దృష్టినుండి వ్రాయబడినది ఆ గేయం.

ఆ టెక్స్టు బుక్ ఎవరన్న జాగ్రత్త చేసి ఉంటారా!! అసాధ్యం. సంబంధిత శాఖ కూడ చెత్తలో పారేసి ఉంటుంది. ఇలా దాచిపెట్టే ఆచారం, అలవాటు మనకు లేదు కదా!!

మీరు ఈ పాటలు ఏ వెబ్ సైటులోనుండి సేకరిస్తున్నారో దయచేసి తెలియచేయగలరు.


మరొకసారి ధన్యవాదములు.

Phani Yalamanchili said...

శివ గారు ధన్యవాదాలు.... నేను చాల సేపు వెతికనండి.... కాని దీనికి సరిపడే ఫోటో దొరకలేదు... చివరికి ఈ ఫోటో కొంచం వెరైటీ గా వుంటే పెట్టాను... ఇక పోతే మొదటి అరటి పాట wikipedia.org లో వుంది... ఇక బావా!! బావా !! పాట telugudanam.co.in... లోనిది .. చుడండి ఇంకా చాలా... పాటలు వున్నాయి మీకు నచుతాయేమో... చుడండి....

Post a Comment

Blog Archive

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......