చీకటి వెలుగుల రంగేళి ......


మందుతాగితే మీ కార్జం చెడిపోతుంది జాగ్రత్త ... !మొన్న ఒక రోజు నేనూ భోజనం చేస్తుండ గా మా ఫ్రెండ్ ఒకమ్మాయి కాల్ చేసింది ...


కాసేపు మాట్లాడాక ఏం కూర అని అడిగింది .. నేను లివర్  fry అని చెప్పాను ...


కాసేపు మాట్లాడాక ఇంతకీ లివర్ ని తెలుగు లో ఏమంటారు అని అడిగాను ఏం చెప్తుందో విందామని  ..


" గుండె కాయ" అన్న సమాధానం తో నాకు షాక్ తగిలింది ...


కాసేపు నవ్వుకున్నాక ..  ఇంకో అమ్మాయిని అడుగుదాం అని తనని కాన్ఫరెన్స్ లో తీసుకున్నాం  ...


తను ఏం చెప్తుందా అన్న ఆత్రుతతో ఎదురు చూస్తున్న నాకు ఒక్క సారిగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది ..


అదేంటో తెలుసా " మూత్ర పిండాలు " ..


అయ్య బాబోయ్ వీళ్ళ తెలివి కి  జోహార్లు  చెప్పొంచానిపించింది ...

అందుకే ఇంకా ఎవ్వరని ఇలాంటి ప్రశ్నలు అడక్కుడదని  గట్టి నిర్ణయానికి వచ్చాను ...


ఇది జరిగిన కొన్నాళ్ళకి కొంత మంది ఫ్రెండ్స్  రెస్టారెంట్

లో కలుసుకున్నాం ... అందులో వీళ్ళు కూడా వున్నారు ...

అప్పుడు ఇంకో అమ్మాయి వుంటే తనని అడిగాం "లివర్ " ని ఏమంటారు అని ...

తను చెప్పిన సమాధానానికి పిచ్ఛ నవ్వుకున్నాం ... ఇంతకీ ఏం చెప్పిన్దనుకుంటున్నారు ...

"కార్జం " అని ....

అప్పుడన్నాను ... అయితే లివర్ పాడయింది అనటానికి ...

కార్జం పాడయింది అంటారా అని ?

అది గుర్తొస్తే ఇప్పటికి నవ్వొస్తుంది ... మళ్లీ కలుద్దాం ...

జీవిత సత్యం ....!తినటానికి తిండి వుండి తినక పోవటమే " ఉపవాసం "

పడుకోవటానికి మంచం వుండి పడుకోక పోవటమే " జాగారం "

కోపం వచ్చినప్పుడు చేతిలో కత్తి వుండి తెగనరకట పోవడమే 

"మానవత్వం "

బ్రతకడానికి మనతో  మనుషులు వుండి మనసు  విప్పి  మాట్లాటడానికి

 ఎవరు లేకపోవటమే " నరకం "

ఎప్పుడో వచ్చిన ఓ సినిమాలో మాటలకి కొన్ని మాటలు కలుపుతూ .... 

ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా ...........

నాకు చాల ఇష్టమైన పాట ఎందుకో ఈ రోజు ఇక్కడ రాయాలనిపించింది ... :):):)


ఒకే ఒక మాట

మదిలోన దాగుంది మౌనంగా


ఒకే ఒక మాట 

పెదవోపలేనంత తీయంగా


నా పేరు నీ ప్రేమనీ 

నా దారి నీ వలపనీ


నా చూపు నీ నవ్వనీ 

నా ఊపిరే నువ్వనీ


నీకు చెప్పాలని .......
నేను అనీ లేను అనీ 

చెబితే ఏం చేస్తావో

నమ్మననీ నవ్వుకుని 

చాల్లే పొమ్మంటావో


నీ మనసులోని ఆశగా 

నిలిచేది నేననీ


నీ తనువులోని స్పర్శగా 

తగిలేది నేననీ


నీ కంటి మైమరపులో 

నను పోల్చుకుంటాననీ


తల ఆంచి నీ గుండెపై 

నా పేరు వింటాననీ


నీకు చెప్పాలని .........

నీ అడుగై నడవడమే 

పయనమన్నది పాదం


నిను విడిచి బతకడమే 

మరణమన్నది ప్రాణం


నువు రాకముందు జీవితం 

గురుతైన లేదనీ


నిను కలుసుకున్న ఆ క్షణం 

నను వదిలిపోదనీ


ప్రతి ఘడియ ఓ జన్మగా 

నే గడుపుతున్నాననీ


ఈ మహిమ నీదేననీ 

నీకైన తెలుసా అనీ


నీకు చెప్పాలని ......... 
Arranged Marriage బెస్టా..... ?? love marriage ఆ .....??నగనగా ఒక పిల్లోడికి ఒక అనుమానం వచ్చిందంటా ....!! Arranged మ్యారేజ్ బెస్టా ? లేక లవ్ మ్యారేజ్ బెస్టా అని ? 


వెంటనే ఎడిసన్ లాగా దాని మీద పరిశోధనలు చెయ్యడం 


మొదలెట్టాడు .... ఇంతకీ పెళ్లి అంటేనే పెద్ద ___ 


లాంటివి పక్కన పెడితే .... నేను ఆలోచించిన దాన్ని బట్టి 


Arranged యే కరెక్ట్ అనిపించింది  .... !!!


ఎందుకంటె లవ్ మ్యారేజ్ లో అబ్బాయ్ కి అమ్మాయ్  , 


అమ్మాయ్ కి అబ్బాయ్   ముందే తెలుసు .... ఇంకా 


పెళ్ళయ్యాక కొత్తగా తెలుసు కోవడానికి ఏం వుంటాయ్  


చెప్పండి ....


అదే Arrnanged మ్యారేజ్ అయితే  అబ్బాయ్ కి అమ్మాయ్ కొత్త .. అమ్మాయ్ కి అబ్బాయ్ కొత్త ... లైఫ్ లో 


కొంత పార్ట్ వరుకైనా ఒకరి గురించి ఒకళ్ళకి 


తెలుసుకోవాలనే అభిప్రాయం వుంటుంది .... 


"అబ్బాయ్ మంచోడేనా ... బాగా చూసుకుంటాడ నన్ను 


...!!!!!!"  "అమ్మాయ్ ఎలాంటిది .. ఆమె అబిప్రాయాలు 


ఏంటి ...." ఇలా అన్నీ తెలుసుకోవాలని  వుంటుంది ...


లవ్ మ్యారేజ్ లో ఇవన్నీ ముందే తెలుసు కాబట్టి ఇక 


ఏముంటుంది .... 


ఇంకోటి నేను ఆలోచించింది ఏంటంటే ... లవ్ మ్యారేజ్ 


చేసుకున్నాక ఒక వేళ ఏమన్నా ప్రాబ్లం వచ్చినా 


ఎవరితోనూ ఓపెన్ గా చెప్పలేం ...


ఎందుకంటె అందరూ నువ్ ఇష్టపడి చేసుకున్న ... 


అబ్బాయేగా ... అంటారేమో అని భయం ....


అదే Arranged  మ్యారేజ్ లో అయితే " అమ్మ ... వాడు తిట్టాడే .... !!"


"అమ్మ .. దీనికి కూర వండటం కూడా రాదే  .... !!!" ( 


సరదాగా అన్నాను .. మరి  ఇంత  చిన్నవి  కాదు  లే  ... )


ఏదన్నా ప్రాబ్లం వచ్చినా త్వరగా పెద్దలతో చెప్పి దాన్ని 


సరిదిద్దుకోవచ్చు  ... 


అదే లవ్ మ్యారేజ్ లో అయితే మనమే మింగ లేక ... 


కక్కలేక చావాలి ...  ఇన్నీ  కారణాల  దృష్ట్యా  Arranged 


మ్యారేజ్ బెస్ట్ అని బ్లాగా ముఖం గా నా అభిప్రాయాన్ని 


తెలియ చేస్తున్నాను ....


అందుకే Arranged  మ్యారేజ్ చేసుకున్నోళ్ళు మీరేం 


కంగారు పడకండి .... U r Ultimate ...


చివరిగా ఎక్కడో విన్న మాటల్ని ఇక్కడ అన్వయిస్తూ ....


" లవ్ మ్యారేజ్ పార్క్ లాంటిది ... వారం రోజులు చూసాక 


ఇంకా అందులో చూడటానికి కొత్తగా ఏం వుండదు ....


అదే Arranged మ్యారేజ్ అయితే అడవి ...... ఏదో ఒక కొత్త 


విషయం కనపడుతూనే వుంటుంది ....


చచ్చేదాకా ....... !!!"


మళ్లీ కలుద్దాం .... :):):):)

నీలాపనిందలు మీరెప్పుడైనా పడ్డారా ????


బ్లాగ్ మిత్రులందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ........!!

ఇప్పుడు ఈ పోస్ట్ ఎందుకు రాస్తున్నానంటే ...... వినాయక చవితి నీలాపనిందలు మీరెప్పుడైనా పడ్డారా ....!!


నాకు వినాయక చవితి అంటే ముందు గుర్తొచ్చేవి అవే ....!!! ఎందుకంటె నా చిన్నప్పుడు ఓ వినాయక చవితికి ఏం జరిగిందంటే ..... !!!


" బాబు ఓ ఉల్లి దోస తీసుకురామ్మ .... "


ఆ ఏం చేస్ప్తున్నాను .... ఆ చిన్నప్పుడు ఏం జరిగిందంటే ....


" అలా అని మొత్తం ఉల్లి పాయలు వెయ్యొద్దు ... సగం ఉల్లి పాయలు సన్నగా తరిగి ... ఒక పచ్చి మిరప కాయ వేసి తీసుకురా ..."


ఆ ఇంతకీ ఏం జరిగిందంటే .... అవి నేను తొమ్మిదో తరగతి చదువుతున్న రోజులు ... (రీళ్ళు వెనక్కి తిప్పండి .... )


వినాయక చవితి సెలవలకి  ముందు మా క్లాసు టీచర్............ పోయిన ఇయర్ ది question పేపర్ ఇచ్చింది ... నా దగ్గర ఉంచమని ...


నేను ఆ సెలవుల సందడి లో ఆ పేపర్ ఎక్కడో పోగొట్టాను .... సరే ఒక నాలుగు రోజులకి మళ్లీ స్కూల్ తెరిచారు ...


అప్పుడు ఇంకేముంది మా టీచర్ అడగనే అడిగింది ...

నేను ఒక రెండు రోజులు ఇంట్లో పెట్టానని ... ఇంకో రెండు రోజులు

ఎవడో స్కూల్ కి రానోడికి ఇచ్చానని.....

యేవో కహానీలు చెప్పి కడుపు నిండా తిట్లు తిన్నాను ఆ నాలుగు రోజులు ....


ఇక ఐదో రోజు మా టీచర్ దగ్గరికి వెళ్లి అది పోయిందని నిజం చెప్పేసాను ...


అప్పుడు చూడాలి .... " వెధవ ...!! అందులో questions పిల్లలకి చదవమని చెప్పాలి ...నువ్వు అది పోగొట్టావ్ .... నువ్వేం లీడర్ వి ???" అని చెడామడా తిట్టింది .... ( అప్పట్లో మనం మా క్లాసు లీడర్ లే ...!!)


తిట్ల మధ్య లో "నాకు తెలీదు ఎవరో ఒకళ్ళని వేరే సెక్షన్ వాళ్ళని అడుగి తీసురా Half -yearly పేపర్ అంది... "


" అదేంటి మేడం మీరు నాకిచ్చింది Quarterly పేపర్ కదా అన్నాను .... "


" అదేంటి మరి Half -yearly పేపర్  ఎవరికిచ్చాను ...... వెళ్లి ఆ ప్రసాద్ ని అడుగు" అంది టీచర్ ....


వెళ్లి అడిగాను కదా వాడి దగ్గరుంది ఆ పేపర్  ... అబ్బ దీని కోసమా నేను వారం నుంచి తిట్టిచ్చుకుంది అనుకున్నా ...


ఇంతకీ విషయం ఏమిటంటే నాకు Quarterly పేపర్ ఇచ్చాక మా ఫ్రెండ్ ప్రసాద్ కి Half -yearly పేపర్ ఇచ్చారు ...

కాకపోతే ఆ పేపర్ నాకిచ్చారనుకుని నన్ను అడిగింది ఆమె ... నేను ఆ

సంగతి తెలీక రోజు తిట్టిన్చుకున్నాను ...

వాడు ఆ వారం స్కూల్ కి రాలేదు ...


ఇదంతా ఎందుకు జరిగిందంటే ఆ ఇయర్ మేము వినాయక చవితి చేస్కోకపోవడం  వల్ల అనుకుంటా .....

అది కాకపోయినా  ఆ రోజు చంద్రున్ని చూసా ... అప్పుడే అనుకున్నా ... ఏం జరుగుతుందో అని ...


అప్పట్నుంచి  వినాయక చవితి సాయంత్రం మాత్రం ఎత్తిన తల దించను  ... తల  ఎత్తి ఆకాశాన్ని చూడను  ...


అంత భయం నాకు ... మీకూ ఇలాంటిదేదన్న జరిగిందా ....  జరిగితే చెప్పండి చూద్దాం  ....


వుంటాను మరి .

" బాబు ఉల్లి దోస ఇంకా రాలేదు .... "

నేను చూసిన పెళ్లి .... :):):):)
నాకు ఉహ తెలిసాక ఇదే అనుకుంటా నేను చూసిన మొదటి పెళ్లి .... ఇప్పటి దాకా పెళ్ళంటే ... సినిమాల్లో తప్పితే మాములుగా చూడలేదు ... మొదటి సారి రియల్ గా చూసాను ....!!!!

చిన్నప్పుడు మా అక్క పెళ్ళికి వెళ్ళా గాని అప్పుడూ మరి చిన్న పిల్లోడినయ్యే ...!! అందుకే ఏం గుర్తు లేదు ...  


నేను పెళ్ళంటే సినిమాల్లో చూసినట్టు తాళి కట్టే టైం కి అందరూ లేచి అక్షింతలు వెయ్యటమేమో అనుకున్నా !!! కానీ కాదు ...


ఇంకా పెళ్లి ముహూర్తం అనగానే ఆ టైం కి తాళి కడతారేమో అనుకునే వాడిని ... కానీ అది తప్పే అని తెలుసు కున్న ...


ఆ టైం కి జీలకర్ర బెల్లం పెట్టిస్తారు ... నేను గమనించిందేంటంటే అదే పెద్ద తంతు అనుకుంటా ... అదయితే  దాదాపు పెళ్లి అయ్పోయినట్టే అనుకుంటా ....


కానీ చాలా బావుంది పెళ్ళంటే ...

పాము కొల్లేసుకుని పెళ్లి కొడుకు నడవటం ... 
తలంబ్రాలు ... బిందె లో ఉంగరం పట్టుకోవటం ...

ఇవన్నీ నిజం గా సూపర్ గా ... ఎంతైనా మన ఆచారాలు చాలా గొప్పవనిపించింది.....


నాకైతే పెళ్ళికొడుకు తాళి కట్టేటప్పుడు " పెళ్లి పుస్తకం " సినిమాలో రాజేంద్ర ప్రసాద్ తాళి కట్టే సీనే గుర్తొచ్చిందంటే నమ్మండి ...
ఇంకా బయట కనపడక పోయినా అరుంధతి నక్షత్రాన్ని వెతకటం ...


చుట్టాలందరూ కలిసి పేకాటలు .... మందు బాబుల చిందులు ....


ఇక అంతా అయ్యాక అప్పగింతలప్పుడు ఏడుపులు ....


నిజంగా పెళ్ళంటే అన్నీ.... ఆనందం, బాధ ..... అన్నీ కలిసిన పండగలా  అనిపించింది ....


పెళ్ళిగురించి ఆలోచిస్తుంటే "పెళ్లి పుస్తకం "  సినిమాలో కొన్ని మాటలు గుర్తొచ్చాయి ...

"
పెళ్ళికి పునాది నమ్మకం, గౌరవం...నమ్మకం ఉన్న చోట బూతు కూడా నారాయణ అని వినపడుతుంది...అదే నమ్మకం లేని చోట నారాయణ అన్నా కూడా బూతు లాగ వినపడుతుంది.... "

ఇక ఈ సినిమాలో పాట అయితే చెప్పనవసరం లేదు ......

తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా ...

తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా ...

సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా ...

మనసు మనసు కలపడమే మంత్రం పరమార్ధం ..... !!!! :):):):)

Once in a life .... మనిషి పెద్దయ్యాక తనకి తెలిసి జీవితం లో చేసుకునే పెద్ద పండగ ఇదే అనుకుంటా ....!!!

శుభాకాంక్షలు
 Marriage is the most adorable and pure event in the life of two persons which only comes once in life .


Marriage is the name of a great bond between two souls.


Wish U happy married life Mr. & Mrs. Rajesh .

కనుక్కోండి చూద్దాం ...!!!
ఇందాక ఏదో పాట చూస్తుంటే sub-titles కింద పడుతున్నాయ్ ...

అవి చదువుతూ వుంటే ఈ ఆలోచన వచ్చింది ..

ఇక్కడ ఒక పాట లిరిక్స్ ఇంగ్లీష లో ఇచ్చాను .... sub-titles లోవున్నట్టు ..

అది మీరు గుర్తు పట్టగాలరేమో చుడండి

ఆ రెడ్ కలర్ లో వున్నవి అమ్మాయ్ లిరిక్స్ ...

గ్రీన్ లో వున్నవి అబ్బాయి లిరిక్స్ ..

clues లాంటివి ఇవ్వబడవు ....!!!I’m mad about you …
You pierced into my heart...
I am caught in your magic of love …
And I gave myself to you in love …
Do u understand my love?
Tell me your love …
You are killing me to fall in love with you …
Won’t you leave me …?
If you cross your limits,
Won’t we commit a sin?
Don’t spark fire in me …
You don’t trust me...
But still you are my soul …
You fill my eyes & heart...

సర్లే బాగా కష్టపడుతున్నట్టునారు గా అయితే హింట్ ఈ సినిమా మన పూరి జగన్నాధ్ ది ...  

నీతో ఉ౦టే ఇ౦కా కొన్నాళ్ళు .....


నిలబడి చూస్తాయే ఆగి లేళ్ళూ సెలయేళ్ళూ చిత్ర౦గా నీవైపలా
 
పరుగులు తీస్తాయే లేచీ రాళ్ళు రాదార్లూ నీలాగా నలువైపులా
 ****************************

నీతో ఉ౦టే ఇ౦కా కొన్నాళ్ళు ఏమవుతాయో ఎదిగిన ఇన్నేళ్ళూ

నిన్నిప్పుడు చూస్తే చాలు చిన్నప్పటి చిలిపి క్షణాలు


గు౦డెల్లో గువ్వల గు౦పై వాలూ


నీతో అడుగేస్తే చాలూ మునుము౦దుకు సాగవు కాళ్ళూ

 

ఉ౦టు౦దా వెనుకకి వెళ్ళే వీలూ

కాలాన్ని తిప్పేసి౦దీ లీలా బాల్యాన్నే రప్పి౦చి౦దీ వేళా


పెద్దరికాలన్ని చినబోయేలా పొద్దెరుగని మరుపేదో పెరిగేలా
నిలబడి చూస్తాయే ఆగి లేళ్ళూ సెలయేళ్ళూ చిత్ర౦గా నీవైపలా
 

పరుగులు తీస్తాయే లేచీ రాళ్ళు రాదార్లూ నీలాగా నలువైపులా
 
భూమి అ౦త నీ పేర౦టానికి బొమ్మరిల్లు కాదా
 
సమయమ౦త నీ తార౦గానికి సొమ్మసిల్లిపోదా
 
చేదైనా తీపవుతు౦దే నీ స౦తోష౦ చూసి
 
చెడు కూడా చెడుతు౦దే నీ సావాసాన్ని చేసీ
 
చేదైనా తీపవుతు౦దే నీ స౦తోష౦ చూసి
 
చెడు కూడా చెడుతు౦దే నీ సావాసాన్ని చేసీ
నువ్వే చూస్తున్నా ఎ౦తో వి౦తల్లే అన్నీ గమని౦చే ఆశ్చర్యమా
 
ఏ పని చేస్తున్నా ఏదో ఘనకార్య౦ లాగే గర్వి౦చే పసి ప్రాయమా
 
చుక్కలన్ని దిగి నీ చూపుల్లో కొలువు ఉ౦డిపోగా
 
చీకటన్నదిక రాలేదే నీ క౦టి పాప దాకా
 
ప్రతి పూటా ప౦డుగలాగే ఉ౦టు౦దనిపి౦చేలా
 
తెలిసేలా నేర్పేట౦దుకు నువ్వే పాఠశాల
 
ప్రతి పూటా ప౦డుగలాగే ఉ౦టు౦దనిపి౦చేలా
 
తెలిసేలా నేర్పేట౦దుకు నువ్వే పాఠశాల

మొద్దోడు ..... ముద్దోడు

" రేయ్ ఈ ఊళ్ళో కాకులెన్నున్నాయో చెప్పరా ??"
" వుళ్లోయా ..!! పొలాల మీదవి  కూడానా ???"
" అన్ని చెప్పరా ....!!!"
 " ఆరువందల , ఏడువందల , పద్నాలుగు వందల  .... కొన్ని

ఎగురుతున్నాయ్ పంతులా  ....!! "
" అంత కంటే ఎక్కువుంటే ? "
" పక్కూరి కాకులు ఇక్కడికి వచ్చున్తాయ్ ... !!"
" అంత కంటే తక్కువుంటే ?"
"ఈ ఊరు కాకులు పక్కూరికి వెళ్లి వుంటాయ్ ? "
**********************************

ఇది ఎక్కడన్నా విన్నట్టున్నారా? అయితే  మీరు నా ట్రాక్ లో ఉన్నట్టే ..

ఇది " మొద్దబ్బాయి " అని నా చిన్నప్పుడు ఒక కామెడీ మిమిక్రీ క్యాసెట్ వుండేది ...

అందులోది ... మొన్న మా ఫ్రెండ్ ఒకతను తన దగ్గర వుంటే ఇచ్చాడు.......... పెన్ డ్రైవ్ లో ...

అప్పుడనిపించింది ఇంకా ఇది ఉందా ... cd లలోకి కూడా మారిందా ..? అని ..

నాకు తెలిసి మీలో చాలా మంది ఇది వినే వుంటారు .

కామెడీ చాలా బావుంటుంది  .. అప్పట్లో నేను ఇది చాలా సార్లు విన్నట్టు  గుర్తు ....

కొన్ని చోట్ల ద్వందార్ధాలు వున్నా .. అవి తెలుసు కునే లోపే సంభాషణ ముందుకి నడుస్తుంది ..

నాకు గుర్తున్న వాటిలో ఇది .. ఇంకా "అత్తరు సాయిబు" అనిఇంకోటి ఉండేది ..

ఇవి బాగుండేవి వినటానికి ... ఒక సారి మీకూ దొరికితే వినండి ...

ఇంతకీ ఇది అసలు రాసిందెవరు .. మిమిక్రీ చేసిందెవరు అని ఇది రాస్తూ సెర్చ్ చేసాను ...

కానీ లాభం లేకపోయింది ... మీకెవరికైనా తెలిస్తే చెప్పండి  .. నేనూ తెలుసు కుంటాను ..

ఇంకా ఈ ఆదివారం మామూలు గానే గడిచింది .. జస్ట్ టైం పాస్ .... అది రూం లోనే ..

విమానం లో వెళ్తున్న ఎవరిదో పెన్ను కక్కినట్టుంది .. ఆ రంగు ఆకాశం అంతా అంటుకుంది ...

మళ్లీ కలుస్తా ...

వదిలి వెల్లిపోయేటప్పుడు ఏమనుకోవాలి ....


ఇది ప్రస్తుతానికి ఇక్కడి విషయం ... అసలు ఇదెందుకు ఇప్పుడు వచ్చింది అంటే ...

నిన్న మా కాలేజీ లో Get To Gather ఫంక్షన్ జరిగింది ...

దానికి వెళ్ళాను.. బానే ఎంజాయ్ చేశాను .. కానీ వచ్చేటప్పుడు చిన్న అనుమానం ఇప్పుడు ఏమని ఆలోచించాలి ..

మళ్లీ కలుస్తాం అనా ?? లేక  .. ఇక కలవం అనా ??

నా వరకయితే నేను ఎవరిని కలిసినా మళ్లీ కలవననే అనుకుంటా ...!!

యే ప్రదేశానికి వెళ్ళినా మళ్లీ అక్కడికి రాననే అనుకుంటా ...!!

ఎందుకంటె నేను మళ్లీ కలుస్తాననే ఆశ వుంటే చెప్పాలనుకుంది సరిగ్గా చెప్పలేక పోవచ్చు ...

మళ్లీ ఈ ప్రదేశానికి వస్తాను అనుకుంటే ఇంకోసారి వచ్చినప్పుడు మిగతాది చుడోచ్చులే అనిపించొచ్చు ...

అందుకే మళ్లీ కలిస్తే మంచిదే .. కలవకపోతే ...

ఎందుకంటె నేను డిప్లొమా చేసేటప్పుడు అనుకున్నా అందరూ కలిసే వుంటాం ...

పెళ్ళిళ్ళకి వాటికి కలుస్తూ వుంటాం అని .. కానీ ఇప్పటి దాకా ఒక పది పెళ్ళిళ్ళు అయ్యుంటాయి కానీ నేను ఒక్కళ్ళని కలవలేదు ..

అందుకే అంత నమ్మకం ... నాకు మళ్లీ కలవం అని..

అందుకే ఈ రోజు వచ్చేటప్పుడు  మా ఫ్రెండ్ చేతిని నా చేతిలో కి తీసుకున్నా .. చివరి సారి గా .......

" ఈ మూడు ఏళ్ళల్లో నేను నిన్నెప్పుడయినా బాధ పెట్టుంటే ... ఏమి అనుకోకు అని ..."

" అదేంటి మళ్లీ మనం కలవమా ఏంటి ?" మా ఫ్రెండ్ ..

" కలవమనే అనుకో... ఎందుకంటే నేను ఒక సారి ఇలానే అనుకున్నాను .. కానీ కలవలేదు.......... ఎవ్వరిని కలవలేదు ...
మళ్లీ కలుస్తాం అంటే నీకు సారీ చెప్పేటప్పుడు నా ఇగో అడ్డు రావచ్చు .. అందుకే ...."

".................."

అంతే ...

అది నాలెక్క .. మా ఫ్రెండ్ లెక్క ప్రకారం " Globe is round we meet again ....!!"

ఈ రెంటిలో ఏది కరెక్ట్ అంటారు ...??

నా బ్లాగ్ కి ఆయోచ్చింది...!!!


హమ్మయ్య ... ఇప్పటికి ఓపెన్ అయ్యింది నా బ్లాగ్ ... మొన్నట్నుంచి చూస్తున్నా నా IE లో నా బ్లాగ్ అడ్రస్ కొడితే Page can not be displayed అని వస్తోంది ... కొన్ని సార్లు Fire Fox లో ఓపెన్ అయ్యింది తర్వాత కొన్ని సార్లు ఓపెన్ కాదు .....

నాదొక్కటే కాదు కూడలిలో వున్న యే బ్లాగర్ బ్లాగ్ కూడా ఓపెన్ కాలేదు ... వర్డ్ ప్రెస్ మాత్రం ఓపెన్ అయ్యేది ....!!!

మీలో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం వచ్చిందా ??? లేక నాకేనా అని చిన్న అనుమానం ...

ఇవాళ మళ్లీ దానికి అదే Solve అయ్యింది ....:):):)

మళ్లీ చాలా రోజుల తర్వాత  ఇవాళ ఓపెన్ అయ్యింది .... మంచి టైం చూసి ఒక పోస్ట్ తో వస్తా ...

Stay Tuned ....

చిన్న జీవితం ... పెద్ద జ్ఞాపకం ..!!


మళ్లీ చానళ్ళకి ఇలా దారి తప్పి వచ్చినట్టుంది ...
"కన్ను తెరిస్తే జననం ... కన్ను మూస్తే మరణం ... రెప్పపాటుడీ జీవితం ...." అన్నారో కవి ..

"ఎంతో చిన్నది జీవితం .. ఇంకెంతో చిన్నది యవ్వనం ...." అన్నారు మరో కవి ....

ఇలాంటి పాటలు వినీ వినో .... లేక అలాంటి మాటలు అనీ అనో లైఫ్ అంటే ఎంతో గొప్పదన్న ఫీలింగ్ నాలో వుండి పోయింది ..

జీవితం లో జరిగే ప్రతీ సంఘటన ... ఏదో రకం గా గుర్తుంటుంది ...

అది మంచో చెడో ... ఎలాగైనా కానీ ....

అందుకే జీవితం లో చిన్న ఆనందాల్ని కోల్పోకూడదనుకుంటాం....

అన్ని సమయాల్లో అలా జరగకపోవచ్చు ... మొన్నా అలాంటిదే జరిగింది ...

మొన్న పదకొండు మా అన్నయ్య పుట్టిన రోజు .. ఇంకో విచిత్రం ఏంటంటే ఇద్దరన్నయ్యలది ఒకే రోజు ...

ఇంకా అసలే వేసవి సెలవలు ... అక్క వాళ్ళు , వాళ్ళ పిల్లలు , మరదలు , ఇంకా చాలా మంది వచ్చారు, ఇంటికి ....

ఒక్క నేను తప్ప ..

ఎందుకనో ఆరోజు నేను వెళ్ళ లేక పోయినందుకు ... ఏదో కోల్పోయానేమో అనిపించింది ..

అది డబ్బు గిబ్బు కాబు ......... అంతా కంటే విలువైన జ్ఞాపకాలని ..

నేను అక్కడ వుంటే ... సరదాగా అందర్తో కలిసుంటే ఎంత బావుండేదో ..

ఒకోసారి అనిపిస్తుంది .. ఏంటో ఈ జీవితం మహా బ్రతికితే ఒక యాభై , మరి అదృష్టం దరిద్రం పట్టినట్టు పడితే అరవై ఏళ్ళు ....

ఇంత చిన్న జీవితం లో కూడా ... చదువని , ఉద్యోగమని , సంపాదనని ... ఎంత కాలం ఈ పరుగులు ... అని ...

చక్కగా అందరితో కలిసి వుంటే ఎంత బావుందో .. ఏంటో ఇంత దూరం లో అనిపిస్తుంది ...

మళ్లీ వెంటనే అనిపిస్తుంది ............. మరి పొట్టకి కూడూ .....ఇది ఇంకో ప్రశ్న ....!!!

అనుబంధాలని , ఆకలి కోసం వదిలేసి జీవితాంతం పరిగెడుతూనే ఉంటాడు మనిషి  ...

ఆకలి తీరే సమయానికి ఆయువు కూడా తీరి వెళ్లి పోతాడు ....

కానీ, ఇన్నీ తెలిసి మళ్లీ అదే కథ మొదలు ...

ఏం చేస్తాం ఇలా ఫోటో లు చూసుకుని సంబర పడ్డాను ...

Happy B'Day 2 U Darling ......

Miss U all on this family festival ...


"కృష్ణా నాకు రాజ్యము వలదు .... రాజ్య సుఖము వలదు ...." బ్యాక్ డ్రాప్ లో ....

"సింహ" మంటి చిన్నోడే .. వేటకొచ్చాడే....!!
" రేయ్ .... నేనెవరో తెలుసా .....???"

"అర క్షణం లో చచ్చే వాడివి ... నీ అడ్రస్స్ నాకెందుకు రా .... ???"

కెవ్వు ....... కేక .....

అద్ది .......... పెద్ద బాల కృష్ణ ఎంటర్ అయినప్పుడు చెప్పే డైలాగ్ ......*******************************************
మళ్లీ చానళ్ళకి బాక్స్ ఆఫీస్ బొనంజా ........ నందమూరి బాల కృష్ణ  హిట్ కొట్టాడు ...

నిన్నే సినిమా చూసాను .... సినిమా సూపర్ గా వుంది ...

నేనిచ్చే రేటింగ్ 3/5 ...... కాకపోతే ఫైట్స్ లో రక్తం పొంగిచ్చాడు .....

డైలాగ్స్ మాత్రం కేకలు ........

పదునైనా మాటలకి బాలకృష్ణ భావాలు తోడైతే ఎలావుంటుంది ... అలానే వుంది సినిమా ...

"చూడు ... ఒక వైపే చూడు .. రెండో వైపు చూడాలను కోకు .. తట్టుకోలేవ్ ......""పదిమందిని పంపు ... పది పది పెంచుతూ పంపు ..... పది పది సార్లు పంపు ... ""రికార్డులు సృష్టించాలన్న మేమే ... వాటిని తిరగ రాయాలన్న  మేమే ...."

అవి మచ్చుకి కొన్ని డైలాగులు ............
NBK Fans ....... njoy the Victory after a long time .... Cheers .......

అప్పుడూ - ఇప్పుడూ ...నిన్న మా ముఠా అంతా కలిసి ఎగ్జిబిషన్  కి వెళ్ళాం... చాలా రోజుల క్రితం వెళ్ళాను  అలా ...

మళ్లీ చాన్నాళ్ళకి  ...

వెళ్ళం గానే ఫస్ట్ జైంట్ wheel ఎక్కామా ........ అక్కడ చూడాలి ...

శ్రీరామ్ గాడు, సంతు గాడు ఫుల్ గా బిగపట్టి క్కూర్చున్నారు ...

నేను , రంజిత్ నవ్వ లేక చచ్చాం ..

తర్వాత పెద్ద అప్పడం తిన్నాం.. ఇంకా మళ్లీ బజ్జీ లు ...

తర్వాత మళ్లీ కొలంబస్ ఎక్కాం .. ఇంతకుముందు కొలంబస్ ఎక్కిన అనుభవం మర్చిపోలేనిది ...

దాదాపు రెండేళ్ళ తర్వాత ....... మళ్లీ నిన్న ...

అప్పటి అనుభూతి మాటల్లో చెప్పలేనిది ...


గగనం కన్నా మునుపటిది

భూతలం కన్నా ఇది వెనుకటిది
 
కాలం తోన పుట్టింది కానీ ఇప్పుడు గతం గా మారింది  ....
 
 
 
 
వింటున్నావా.....!!! వింటున్నావా....!!

వింటున్నావా ...... వింటున్నావా .....!!

ఫలుకులు నీ పేరె తలుచుకున్న..

ఫెదవుల అంచుల్లొ అనుచుకున్న..

మౌనముతో నీ మదినీ బంధించా.. మన్నించు ప్రియా..తరిమే వరమా.. తడిమే స్వరమా..

ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా..

వింటున్నావా.. వింటున్నావా...వింటున్నావా..తరిమే వరమా.. తదిమే స్వరమా..

ఇదిగొ ఈ జన్మ నీదని అంటున్నా..

వింటున్నావా.. వింటున్నావా...వింటున్నావా..

వింటున్నావా...వింటున్నావా..విన్నా.. వేవేల వీణల సంతోషాల సంకీర్తనలు

నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా

తొలిసారి నీ మాటల్లొ పులకింతలా పదనిసలు విన్నా..

చాలు చాలే చెలియా చెలియా బతికుండగా నీ పిలుపులు నేను విన్న..

ఓహ్...బతికుండగా నీ పిలుపులు నేను విన్న..ఏ..మొ.. ఏ..మొ... ఏమవుతుందో...

ఏదేమైనా .. నువ్వే చూసుకో..

విడువను నిన్నే ఇక పైనా వింటున్నావా... ప్రియా..

గాలిలో తెల్లకాగితంలా నేనలా తేలి ఆడుతుంటే

నన్నే ఆపి నువ్వే రాసిన..ఆ పాటలె వింటున్నాతరిమే వరమా.. తదిమే స్వరమా..

ఇదిగొ ఈ జన్మ నీధని అంటున్నా.. వింటున్నావా..

వింటున్నావా...వింటున్నావా..వింటున్నావా...వింటున్నావా..ఆద్యంతం యేదొ..యేదొ...అనుభూతి..

ఆద్యంతం యేదొ అనుభూతి అనవరతం ఇలా అందించేది

గగనం కన్నా మునుపటిది

భూతలం కన్నా ఇది వెనుకటిది

కాలం తోన పుట్టింది కాలం లా మారే.. మనస్సె లేనిది ప్రేమ..రా..ఇలా..కౌగిల్లలొ నిన్ను దాచుకుంట..

నీదానినై నిన్నె దారి చెసుకుంట

ఎవరిని కలువని చొటులలోన

ఎవరిని తలువని వేళలలోనతరిమే వరమా.. తదిమే స్వరమా..

ఇదిగొ ఈ జన్మ నీధని అంటున్నా.. వింటున్నావా..

వింటున్నావా...వింటున్నావా..వింటున్నావా..ఆ..

విన్నా.. వేవేల వీణల సంతోషాల సంకీర్తనలు

నా గుండెల్లోలొ ఇప్పుడే వింటున్నాతొలిసారి నీ మాటల్లొ పులకింతలా పదనిసలు విన్న..

చాలు చాలె చెలియా చెలియ బతికుండగా నీ పిలుపులు నేను విన్న..

చాలు చాలె చెలియా చెలియ బతికుండగా నీ పిలుపులు నేను విన్న..

ఓహ్...బతికుండగ నీ పిలుపులు నేను విన్న..Super song from YMC....

ఆక్రోఫోబియ.......... పైనుంచి-------కిందకి :(:(:(
నాకు మొదట్నుంచే పెద్ద పెద్ద బిల్డింగ్ లు ఎక్కి పైనుంచు కిందకి చూడటమంటే  మా చెడ్డ భయం ...

అలానే ఏదో లా నెట్టుకుంటూ వచ్చాను ... ఎప్పుడూ  పెద్ద గా ఏం ఇబ్బంది  రాలేదు చిన్నప్పుడు ...
కానీ  టెలికాం లోకి వచ్చేసరికి మాత్రం .. పెద్ద పెద్ద టవర్స్  ...

దాదాపు వాటిని ఎక్కాల్సిన పరిస్థితి రాదు ... కానీ అప్పుడప్పుడు ఎక్కాల్సి రావచ్చు ...

ఇంకా చూస్కోండి ఎక్కాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చూడాలి నా పని ...

దాదాపు గా అన్నీ టవర్స్ 60 మీటర్లు లేదా 40 మీటర్లు ఉంటే ...

వాటిని ఎక్కాలంటే చుక్కలే నాకు మాత్రం ...

ఇప్పటికి నేను టెలికాం లో జాయిన్ అయ్యి దాదాపు రెండేళ్ళు గడుస్తున్న ఇప్పటికీ నాకు తెలిసి ఒక్క సారి కాబోలు ...

కష్ట పడి........ కష్ట పడి......... ఒక నలభై మీటర్ల టవర్ ఎక్కాను ... అదీ చచ్చేంత భయపడుతూ ....

నాకు తెలిసి అదే చివరి సారి ఇంకా మొదటి సారి కూడా ...

ఆ తరువాత ఎక్కుదాం అని చాలా సార్లు ప్రయత్నించాను గాని ఎప్పుడూ  సఫలం కాలేకపోయాను.

ఎందుకో ఇప్పడు అది గుర్తొచ్చి గూగుల్ లో కాసేపు సెర్చ్ చేసాను ...

దీన్ని ఆక్రోఫోబియా అని అంటారంట ...

ప్రపంచం మొత్తం మీద చాలా మందికి ఈ ఫోబియా ఉందంట.

ఒక సైట్ లో అయితే ఎక్కువమందికి వున్న ఫోబియా కూడా ఇదే అని ఇచ్చాడు ...

ఇక్కడి దాకా బానే వుంది కానీ ...

దీన్ని  ఎలా అధిగమించాలో మాత్రం ఎందులోనూ నాకు సరిగ్గా దొరకలేదు...

ఒక దాంట్లో మాత్రం గట్టి గా గాలి పీల్చాలి లాంటి విషయాలేవో చెప్పాడు కానీ ...

అవి ఎంత వరకు పని చేస్తాయో మాత్రం నాకు అర్ధం కాలేదు ..

చూద్దాం ఇంతకన్నా మంచి టెక్నిక్ ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం .......!!

మరీ అప్పడు దాక ఏం చేస్తారని అడగకండి ........ ఏదో మళ్లీ నాలుగు కథలు కహానీలు చెప్పి నడిపించాలి ....

తప్పదుగా మరి ........ :) :) :)

పైనుంచి-------కిందకి

ఐతే ..........!!!


వేకువనే మురిపించే ఆశలు ......

వెనువెంటనే అంతా నిట్టూర్పులు ......

లోకం లో లేవా యే  రంగులు .....

నలుపొకటే చూపాలా కన్నులు .....

ఇలాగేనా ప్రతి రోజు ......

ఎలాగైనా ఏదో రోజు ....... మనదై రాదా ...

ఒకటి = రెండు అవుతుందా ???టపా అసలు నిన్న వేద్దాం అనుకున్నా ... కానీ సమయానుభావం వల్ల ... వేరే పని వుండటం వల్ల పేరు మాత్రం పెట్టి  వదిలేసాను ...


ఇదిగో ఇప్పుడు ఖాళీ  దొర్కినట్టుంటే ఇప్పుడు రాస్తున్నాను ...


నిన్న సైట్ నుంచి వచ్చి  ఏదో టీవీ పెడితే అందులో ఒక ప్రశ్న అడిగాడు ....


అదేంటంటే " మొదటి ప్రేమ లో ఉన్నంత ఇంట్రెస్ట్ రెండోసారి ప్రేమ కలిగినప్పుడు కూడా ఉంటుందా ?? "


అంతే ప్రశ్న... నేను ప్రశ్న విన్నాను కానీ అందరూ ఏం చెప్తారో వినే లోపే మా ఫ్రెండ్ ఛానల్ మార్చేశాడు ...


వాడు చానల్  మార్చినా నేను మాత్రం అదే ఛానల్ దగ్గర ఆలోచిస్తూ వుండి పోయాను ..


ఇంతకీ మీరేమంటారు ??


మొదటి సారి ప్రేమ అనేది కలిగినప్పుడు  అదేదో కొత్తగా...... వింతగా ... ఉంటుందట కదా  ??


( ఎరా .....!! సచ్చినోడా నీకు తెల్డురా .......??)


ఆ భావనే ఏదో మనసులో ఆనందాన్ని నిమ్పుతుందటగా ......!!!!!!!


(అది గో మళ్లీ ..........)


సరే... సరే ... అసలు విషయానికి వస్తే ...


మొదటి సారి ప్రేమ అనే భావన కొంచెం కొత్తగానే వుంటుంది సరదాగా  మొదట్లో ...

ఏదో మనకోసం ఒక మనిషి స్పెషల్ గా వున్నట్టు ....

మన కబుర్లు చెప్పటానికి , తన విశేషాలు  తెలుసు కోవటానికి .......

మన అనుభూతుల్ని  , అనుభవాల్ని ఒక స్పెషల్ మనిషి తో ....

కొన్ని సార్లు కోపం గా, కొన్ని సార్లు ప్రేమ గా, కొన్ని సార్లు బాధ గా ఇలా ఇలా ఇలా ......

అలా అలా అలా వుంటుంది మొదటి లవ్ ...

అది ఒక వేళ కంచికి చేరితే మంచిదే ........ లేకపోతేనే మళ్లీ కథ మొదటికి ........

నిదానం గా అన్నీ మాములే అయ్పోతాయ్ ఒక్క మనసు తప్ప ..

అది మాముల్ అవటానికే కొంచం టైం పడుతుంది ...

సరే సెకండ్ లవ్ మళ్లీ .........

అప్పుడూ అలానే అనిపిస్తుందా ......... మళ్లీ అదే ఫీలింగ్ కలుగుతుందా  ...

 ఏదో సినిమాలో చూసినట్టు ఫస్ట్ ఎప్పుడూ అలా గుర్తు వుంటుంది అంతే ...

గుండెలో ముల్లల్లె అప్పుడప్పుడు తగుల్తూ వుంటుంది ...

ఒకవేళ మనకు ఫస్ట్ కంటే మంచి భాగస్వామి దొరికితే అప్పడు ఎలా వుంటుంది అబ్బ..........

ఏమో నా చిన్న బుర్ర కి ఏమీ తట్టి చావట్లేదు ......

ప్రేమ లో  తల పండిన వాళ్ళు ఎవరైనా సమాధానం చెప్పరూ.........!!!

అదిగో ఎవరో రెండు జళ్ళ సీత వెళ్తోంది .... కొంపతీసి అదే నా నా నా నా నా ......... సెకండ్ .......

కళ్ళు అప్రయత్నం గా  అటు కదుల్తున్నాయ్ ....!!

హె.......... హె.......... హె........... !! 

బుడుగు ఫ్యామిలీ ఫోటో ...

"
బామ్మంటే నా వెనకాల కూచుంది అదన్నమాట. బామ్మ ముందర సీగాన పెసునాంబా , నేను.


ఈ చివ్వర ఓటి  లేదూ... అదే లావుపాటి పక్కింటి పిన్ని గారు .... చాలా లావు గదా ....అందుకే కుటో లో


లావుపాటి పిన్ని గారు అంతా లేదు ... కుంచెం వుంది .... ఇంకా చాలా బోల్డు పిన్ని గారు కుటో చివర అవతల
(మనకి కనబడదులే ...) ఉందన్నమాట ."

(బుడుగు పదాలు కొన్ని మన కంప్యూటర్ మీద  రాయటం కుదరలేదు ... అక్షర దోషాలుంటే క్షమించండి ....!!!)
**************

మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో వెతుకుతుంటే అకస్మాత్తుగా ... బుడుగు పుస్తకం కనపడింది ...చిన్నప్పటి నుంచి నేను బుడుగు అభిమానినేమో ... మళ్లీ ఒక సారి చదువుదాం అనిపించింది ...అలా కాసేపు తిరగేశాను ... బుడుగు నిజం ఎప్పుడూ చెప్పాలో తెలీక పడే కష్టాలు ...ఇంకా బాబాయి కబుర్లు , ప్రైవేటు మాస్టర్ ని  బుడుగు పెట్టె తిప్పలు ...రెండు జళ్ళ సీత గురించి ..... ఇంకా ముఖ్యం గా సీగాన పెసునంబ గురించి ...ఇలా చాలా బాగుంటుంది పుస్తకం ....ఇంకా కొంచం ముందుకి వెళ్ళాక వచ్చే ... రాచ్చాసుడు .. పద మూడో ఎక్కం ... నవ్వులపువ్వులు  పూయిస్తుంది ...అంతా చదివాక చివర్లో అందరి గురించి బుడుగు ఇచ్చే ఫ్యామిలీ ఫోటో అయితే  అరుపులు ...ఆ వాక్యాలే  మీకోసం ఒక సారి రాసాను ...ఎవరైనా చదవని వాళ్ళు వుంటే ఒకసారి చదవండి ...వేసవిలో మంచి టైం పాస్ ...నిజం గా చిన్నపిల్లల మాటలతో ముళ్ళపూడి గారు ఒక అద్భుతం చేసారనే చెప్పాలి ....


నేను చదువుకునే తప్పుడు బుడుగు ఒక హీరో ...బుడుగు పేరు చెప్తే పిల్లల మొహాల్లో నవ్వు ... కేరింతలు .....మా స్కూల్ లో అయితే వారానికి ఒకసారి చదివే రెండు పేజీల బుడుగు పుస్తకం కోసమైనా లైబ్రరీ క్లాసు కి వెళ్ళేవాళ్ళం ...ఇప్పుడు ఏమయ్యాడు బుడుగు ....మనలో ఎంత మందికి గుర్తున్నాడు ??మన పిల్లల్లో ఎంత మందికి బుడుగు కథ తెలుసు ??అలానే కాల గర్భం లో కలిసి పోతున్నాడు ....ఒక సారి ఆలోచిద్దాం ...ఇదిగో డౌన్లోడ్ లింక్ మీ కోసం  ........ బుడుగు ఈ-పుస్తకం

మా స్నేహ గీతం .....


ఓఓఓఓ మై ఫ్రెండ్;
తడి కన్నులనే తుడిచిన నేస్తమా ;
..ఓఓఓఓ మై ఫ్రెండ్;
ఓడి దుడుకులలో నిలిచిన స్నేహమా;
 
అది నేను ఇంజనీరింగ్ చేరిన ఫస్ట్ రోజు ..... నేను , అమ్మ , నాన్న వచ్చాం కాలేజీ కి ...
 
అదే .. మొదటి సారి కాలేజీ ని చూడటం ..... ఎలా వుంటుంది..... ఎలా ఉంటుందని .... అని ఆత్రుత ...
 
నేను ఎదురు చూసిన క్షణాలు రానే వచ్చాయి ... పర్లేదు కాలేజీ బానే వుందనిపించింది ....
 
ఇంకా ముగ్గురం లోపలి వెళ్ళాం ... అలా అలా ఏదో ఫార్మాలిటీస్ అన్నీ ముగించుకున్నం ...
 
మద్యానం భోజనం ముగించుకుని మళ్లీ మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాం ...
 
అక్కడ దగ్గరలో ఏదో రూం వుంది అంటే.. ఇంకా అది చూడ గానే .... హుటా హుటినా అమ్మ , నాన్న నన్ను అందులో పడేసి ...
 
వెళ్లి పోయారు ... ఇంకా నిదానం గా రాత్రయింది ..... ఒంటరిగా రూం లో పడుకుని ఫ్యాన్ నిముషానికి ఎన్ని సార్లు తిరుగుతోందో
 
 లేక్కేస్తున్నా ... ఇంతలో ఏదో బాధనిపించింది ... నేను కూడా బాగా చదువుకుని వుంటే మంచి ర్యాంక్ వచ్చి ఇంటిదగ్గరే సీటు
 
దొరికేది కదా అనుకున్నా .... అదే ననుకుంట నా జీవితం లో నేను చదువు గురించి బాధ పడిన మొదటి సంఘటన ...
 
అప్రయత్నం గా కళ్ళలో నీలాలు ...
 
నిదానం గా కళ్ళు మూతలు పడ్డాయ్ ... మళ్లీ తెరిచేసరికి చుట్టూ వెలుతురు .. తెల్లారింది ...
 
ఇంకా కాలేజీ కి వెళ్ళాలి ... గబా గబా రెడీ అయ్యి ... తొమ్మిదికి కాలేజీ అయితే ..... నేను ఆత్రం కొద్దీ ఎడునర్రకే బయల్దేరా ...
 
కాలేజీ కి వెళ్ళే సరికి ఎనిమిదయింది ... ఊరు చూద్దామని నడుచుకుంటూ వెళ్లాలే ....
 
ఎవరూ లేరు .. అంతా కాళీ .... ఇంకా వెళ్లి ఒక చోట నుంచున్నా ...
 
ఒక ఇరవై నిముషాలకి ఒక డొక్కు బండి మీద ఇద్దరోచ్చారు ...
 
రావటం తోనే నే కోర్చున్న క్లాసు లోకి వచ్చారు ...
 
అమ్మో సీనియర్స్  ఏమో అనుకున్నా ........
 
కానీ వాడు నాదగ్గరి కొచ్చి "మీరూ ...!! ఈ క్లాస్సేనా ?? " అన్నాడు ...
 
అబ్బ అప్పుడు ఊపిరి పీల్చుకుని "అవునండి "అన్నాను ...
 
వాడూ మా క్లాస్సే కాకపోతే ... మేము డైరెక్ట్ గా సెకండ్ ఇయర్ లోకి ఎంట్రీ ....వాడూ ఫస్ట్ ఇయర్ ఇక్కడే చదివాడు ... ఎందుకటే
 
మాది డిప్లొమా ...దీన్నే లేటరల్ ఎంట్రీ అంటారు ... ఇంకా నాచిన్న చిన్న సందేహాలు వాడిని అడిగి తీర్చుకున్నా ....
 
అలా మొదలయింది మా పరిచయం ...
 
ఆ తర్వాత ఈ పద్ధతి , పిలుపు లు ఏమయ్యాయో తెలీదు ...
 
ఇక మొదలు " ఒరేయ్ , మావా, బాబాయ్ , నీ యబ్బ , నీ యయ్య ..........etc ..........."
 
తర్వాత ఎంతోమంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు ..... ఇంకా నా ఒంటరితనం హుష్ కాకి అని ఎగిరిపోయింది ...
 
కానీ ఎంత మంది పరిచయం అయినా .... హ్యాపీ డేస్ పాట వినగానే ... మొదట గుర్తు వచ్చేది మాత్రం వాడే ...
 
'మీరు','మీరు' నుంచి మన స్నేహ గీతం;

'ఏరా' , 'ఏరా' లోకి  మారే; 
 
అది ఈ రెండు లైన్ల వల్లేమో ... మొదట్లో మీరూ ......... మీరూ అనుకున్నా మేము .....తర్వాత ఎంతగా కలిసి తిరిగామో ..
 
ఎన్ని సినిమాలకి వెళ్ళామో ..... ఎన్ని సార్లో బీచ్  లో బీరులు కొట్టి బండేస్కుని తిరిగామో ...... 
 
అదేనేమో స్నేహం గొప్పతనం ... ఇప్పుడు ఆ రోజులూ లేవు వాడూ నా దగ్గర లేదు  ...
 
దగ్గర దగ్గర అన్నీ గడిచి పోయి రెండేళ్ళు అవుతున్నా .....
 
ఇంకా నాకు అన్నీ నిన్న జరిగినట్టే వున్నాయ్ ... ఆ జ్ఞాపకాలు ఇంకా తాజా గానే వున్నాయ్ ...
 
ఇంతకీ వాడి పేరు చెప్పలేదు కదూ .... మూడేళ్ళు  వాడిని I.P. అనే పిలిచేవాళ్ళం ......
 
వాడి అసలు పేరు Indurthi Pavan ...........:):):)

Blog Archive

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......