చీకటి వెలుగుల రంగేళి ......


అనుకుని ... అనుకోని రోజు ....ఒక రెండు రోజుల ముందునుంచి నేను, మా అక్క హైదరాబాద్ లో కలుద్దాం అనుకుంటున్నాం ....


కాని నేను ఫిక్స్ అయ్యాక  హ్యాండ్ ఇచ్చింది  .... కాని మనం ఒకసారి కమిట్ అయితే మా బాస్ మాట తప్పితే ఎవరి మాటా వినం కదా ... కాని మనం హైదరాబాద్ వెళ్తున్న విషయం ఆయనకీ చెప్పలేదు కాబట్టి ప్రాబ్లం లేదు....


ఇంకా నేను వస్తున్నానని తెలిసిన వెంటనే హైదరాబాద్ లో నా అభిమానులు హర్షం వ్యక్తం చేసారు ... అంటే శ్రీను గాడు, రంగి గాడు వీళ్ళు ఇద్దరు అంతేలే ... అసలే నిన్న శాలరీ పడిందేమో పెద్ద పెద్ద స్చేచ్ లు వేసేసం ....


ఇంకా నేను పండ పండగగా నా మొబైల్ లో పాటలు వింటూ ... JBS లో దిగేసా .....


ఇంకా శ్రీను గాడి కోసం వెయిటింగ్ .... అసలే నేను సమయాన్ని వృధా చెయ్యను కాబట్టి .... ఈ టైం లో ప్రేమ్ తో నా గొప్పతనం గురించి, నా తెలివి తేటలు గురించి , కథలు కథలు గా చెప్తుంటే .....


"అవును, డైరెక్ట్ గా కార్ లో వచ్చేయ్యోచు గా హైదరాబాద్ " అన్నాడు ప్రేమ్ .... నా అద్బుతమైనా తెలివితేటలూ ప్రదర్శించే సమయం ఆసన్నమయిందని గుర్తించి.... " మద్యలో టోల్ గేటు  వుంది ... అక్కడ వంద బొక్క ఎందుకని బస్సు లో వచాను ." అన్నా... అప్పుడు గుర్తోచింది అసలు విషయం ... " టికెట్ తీసుకునేటప్పుడు వంద ఇచ్చి యాభై చిల్లర తీసుకోవడం మర్చిపోయా ."

ఇంకా చేసేది లేక .. ఇప్పుడు ఈదుకుంటూ CBS వెళ్ళే ఓపిక లేక వదిలేసా....ఇంకా ఆ విషాదం ప్రేమ్ కి చెప్పి .. కాసేపూ తను పకా


పకా నవ్వాక... పరాభవ భారం తో ... "పాంచాలి పంచ భద్రుక ....." అన్న రేంజ్ లో ఫోన్ పెట్టేసా ...

సర్లే ఈ శ్రీను గాడి ఎక్కడున్నాడో అని వాడికి కాల్ చేస్తే .... వాడు నువ్వేక్కడున్నావ్ .... అన్నాడు ....

నేను ఈ JBS దగ్గర అదుర్స్ పోస్టర్ దగ్గర వున్నానని చెప్పా.... సరే వస్తానని చెప్పి .... 


ఎప్పుడో ఒక అర గంటకి వచాడు ... తెల్ల జుట్టుకి బూరలిచ్చేవాళ్ళు ఊరంతా తిరిగి వచ్చినట్టు ..... (ఇది కూడా వాడి తిట్టే ...)

ఇంకా రంగి గాడి దగ్గరకి వెళ్ళాం  ... వాడూ నాలాగే ఉంటాడు ....... సంక్రాంతికి సన్నాయి ఊది ఊది ఊపిరితిత్తులు లోపలకి వెళ్లి 

పోయినాడి లాగా ...

ఇంకేముంది రంగి గాడు చికెన్ తెచ్చేస్తే .. వాడి రూం మేట్ వండటం మొదలెట్టాడు ....అది ఉడికే లోపు కావలిసిన పరికరాలు తెచుకోవటానికి బయటకి బయల్దేరాం రంగి గాడి బండి మీద ... రాత్రి పూట దోమల మందు 

కొట్టేవాళ్ళ లాగా ....


మా శ్రీను గాడి వెరైటీ అభిరుచి కి తగ్గట్టు ... వాడు మామిడి తాండ్ర అవి ఇవి తింటూ ఉంటాడు .... కాసేపూ వాడు ఆ చెత్త చెదారం 

తిని అన్ని తీసుకుని రూం కి బయల్దేరాం


ఇక నిదానం గా మొదలెట్టి అన్ని కబుర్లు ..... కస్టాలు మూడింటి దాక చెప్పు కున్నాక .... తిని పడుకోటానికి తయ్యరవుతుంటే ... 

శ్రీను గాడు "జోసెఫ్ అంకుల్ ..........!!!" అన్న రేంజ్ లో ......... వాడికి ఎప్పుడో తిట్టిన మా మేనేజర్ గుర్తు వచాడు ....


ఇంకా వాడికి ఫోన్ చెయ్యటం మొదలెట్టాడు .... అరేయ్ అద్దరాత్రి ఎం మద్దెల దరువురా ...... అన్న కూడా వినడు ...


మా అదృష్టం బావుంది ఆ మేనేజర్ ఫోన్ ఎత్తలేదు కాబట్టి బ్రతికి పోయాం.... 


తర్వాత "ఒరేయ్ .... ఫోన్ లిఫ్ట్ చేస్తే ఎం చేసే వాడివి రా" అని అడిగితే ......


ఏముంది ".... ఒరేయ్ .. మీ అన్నయ్య  హైదరాబాద్ వస్తున్నదంట .. నీ ఫోన్ కలవక పోతే నాకు చేసాడు ......" అని చెప్పేవాడిని ..... "అయ్యో ...!! మీరా సర్ ..... నిద్ర కళ్ళలో పేరు సరిగ్గా కనపడలా ......" అని పెట్టేసే వాడిని అన్నాడు ....


"అబ్బ .....! నువ్వు మగాడివి రా బుజ్జి .......!" అన్నా నవ్వుతూ శ్రీను గాడి తో .... (అతడు లో తనికెళ్ళ భరణి టైపు లో ...)


అవి నిన్నటి విశేషాలు ..... ***************************


అక్కా ..........!!!  హైదరాబాద్ లో కలుస్తానని ఆశ పెట్టి .... కలవేలేదు గా ......... నీకు ఆశ కురుపులు వస్తాయ్ పో.........స్కూల్ జ్ఞాపకం.............(మరో సారి )
ఇందాక aarya2 పాటలు వింటుంటే ................ ఏదో ఒక పాట వుండి baby he loves u అని..........బావుంది పాట....... కాని అది వింటుంటే ఏదో ఆలోచిస్తూ వుండి పోయా........

అసలు
love అనేది నాకు ఎప్పటినుంచి తెలుసు అని.. అప్పుడు చిన్నప్పటి చిలిపి పనులు గుర్తు వచాయీ......

చిన్నప్పుడు
స్కూల్ లో అమ్మాయి పేరు పైనా అబ్బాయే పేరు కింద రాసి........... అందులో common గా వున్నా అక్షరాలు కొట్టేసేవాళ్ళం!!!! చివరికి మిగిలిన వాటితో ఏదో word వుండేది FEL.... నాకు word సరిగ్గా గుర్తు లేదు.......F వస్తే friend అని...........

E వస్తే enemy అని.......

L
వస్తే lover అని........

ఇలా
చాలా బావుండేవి రోజులు........... స్కూల్ లైఫ్ చాల బావుంటది.........కల్లా కపటం లేని మనసులు........నాకు నచిన అమ్మాయే పేరు రాసినప్పుడు L వస్తే పండగే.........అప్పుడు......................... వేలల్లో వచ్చే జీతాలోద్దు.........

స్కూల్
అయిపోయాక అమ్మ పెట్టె తాయిలం చాలు........
bonus లు increment లు వద్దు............

teacher
హోం వర్క్ చేసేక పెట్టె good చాలు.........

weekend పుబ్ లు ........... drunken drive లు వద్దు..........

august 15 ముందు రోజు స్కూల్ లో చేసే సందడి చాలు...........

plastic నవ్వులు........ అర్ధం లేని ప్రేమ లు వద్దు............

టెన్త్
లో human sex పాఠం చెప్తున్నప్పుడు పడే సిగ్గులు చాలు..........

ఇప్పుడు
అవితలచుకుంటే ................. అదో జ్ఞాపకం..............అంతే..............

మధురమె మధురమే lyrics (సుమంత్ సత్యం సినిమా నుంచి ....)
మధురమె మధురమే మధురమే......ఈ కనులకి కలలు మధురమే.......


సెలయేటికి అలలూ మధురమే......


నీలాల మేఘం నువ్వై.......


నీ నవ్వే తేనెల వానై.........


నాకోసం వస్తె మధురమే ఆ........


నన్నె తడిపేస్తె మధురమే మధురమే..........


నీకోసం నే రాసే చిరు పాటైన మధురమే........


నాకోసం నువ్వు పలికే అరమాటైన మధురమే.......


నీకోసం నే రాసే చిరు పాటైన మధురమే........


నాకోసం నువ్వు పలికే అరమాటైన మధురమే.........


లిపిలేని సడి లేని ఆ కన్నుల భాష మధురమే........


హృదయాన్ని మురిపించె ఆ సాగర ఘోష మధురమే..........


మధుమాసం మధురమే నీ దరహాసం మధురమే...........


ఉంటె నువ్వుంటె ఆ శూన్యం అయినా మధురమే మధురమే మధురమే..........


సఖి విడిచే శ్వాసల్లో పరిమళమెంతో మధురమే....


చెలి నడిచె దారుల్లో మట్టిని తాకిన మధురమే......


సఖి విడిచే శ్వాసల్లో పరిమళమెంతో మధురమే........


చెలి నడిచె దారుల్లో మట్టిని తాకిన మధురమే......


ఉదయాన ఉదయించే ఆ సూర్యుడి ఎరుపు మధురమే........


రేయంత వికసించే ఆ వెన్నెల తెలుపు మధురమే...........


చెక్కిలి మెరుపు  మధురమే.......


చెలి కాటుక నలుపు మధురమే.........


రాల్చె కన్ను రాల్చె ఆ కన్నీరైన మధురమే మధురమే మధురమే.........

తెలుగింటి కొలంబస్ కథ -3


" ఆకాశం నుంచి రాలిన నీటి బిందువులు ముత్యాలే అవుతాయని అనుకునేవాడిని  ,
నీ పుట్టు మచ్చ చూడకముందు వరకు .... "కృష్ణ:  ఆ రోజు అంతకుమించి పెద్దగ ఎం ఆలోన్చించలేదు... కాని ఆ అమ్మాయి లెఫ్ట్ సైడ్ బుగ్గ మీద ఒక పుట్టు మచ్చ వుంది ... ఎంత బావుందో .... ( ఈ అమ్మాయికి దేవుడి దిష్టి తగలకుండా ఒక చుక్క పెట్టినట్టు వున్నాడు అనుకున్న ... )ఆ అమ్మాయితో మాట్లాడిని కాసేపూ కళ్ళు అటే వెళ్తున్నాయి .. ఆ అమ్మాయి ఎమనుకుంటుందో అని భయం ... అదే విషయం రాజేష్ గాడి తోనూ చెప్పాను... సర్లే .... వదిలేయ్ అన్నాడు ....


************ మరుసటి రోజు ************


కృష్ణ: ఆ...!!! ఏంటి ఇవాళ ప్రోగ్రాం ....??? ఎం చేద్దాం ఇవాళ ?????


రాజేష్ : ఆలోచిద్దాం లే వుండు ....... (ఫోన్ మాట్లాడుతూ .... )


కృష్ణ : ఏంటో ఆలోచించేది ఒంటిగంట అవ్తుంటే ఆకలేస్తోంది  .... (పేపర్ చూస్తూ )


రాజేష్ : అరేయ్ ఈ రోజు కన్య రాసి ఎం రాసుందో చూడు .....


కృష్ణ : నీదా ?????


రాజేష్ : కాదు ... రజిత ది .... లైన్ లో వుంది చూడు ...


కృష్ణ : (చూసి చెప్పాను ..... ) 


రాజేష్ : అరేయ్ ....!!! కర్కాటక రాసి అంట చూడరా....


కృష్ణ : ఇది ఎవరిది రా ....???


రాజేష్ : మీనా ది అంట ......


******************************************


కృష్ణ : ఇంకా అంతే నిశబ్దం కాసేపూ రాజ్యమేలింది .......

ఎందుకంటే .... నాదీ..... అదే ........ !!!!


 (కొన్ని సంఘటనలు యాదృశ్చికంగా జరిగినా ... మనసుమీద చిన్న ముద్ర  వేస్తాయేమో ... ముఖ్యం గా అమ్మాయిలకి సంబందించినవి ...కదా !!!!)

 

అల్లడిన్ కార్టూన్ సీరియల్
ఈ రోజు సైట్ కి వెళ్లి వచ్చాక ... నెట్ బ్రౌస్ చేస్తుంటే ... ఈ ఫోటో కనిపించింది ....

ఇంతకుముందు స్కూల్ నుంచి వచ్చాక నాలుగు గంటలకి ఇంట్లో టీవీ పెట్టగానే ఇదే వచ్చేది. దీని కోసమన్నా కొంచం తొందరగా

ఇంటికి  వచ్చి చూసే వాడిని...

ఇప్పటికి ఆ క్యారక్టర్లు గుర్తే వున్నాయి .....

హీరో పేరు అల్లడిన్

హీరోయిన్ పేరు జాస్మిన్

భూతం పేరు జీని .....

ఇంకా ఒక ఎగిరే తివాచి , ఒక కోతి , ఇంకా ఒక పక్షి ఉండేవి కాని వాటి పేరు గుర్తు లేదు...

జీని చేసే మాయలు .... ఆ తివాచి ఎక్కడికి పడితే అక్కడ్డికి తీసుకుని వెళ్ళడం ...

ఆ పక్షి చేసే తింగరి పనులు ...... బావుండేవి ....

అప్పట్లో ఇది దూరదర్శన్ లో హిందీ లో వచ్చేది .....

తర్వాత ఈ టీవీ లో తెలుగు లో వేసినట్టు గుర్తు .....

ఎందుకో నాకు అల్లావుద్దీన్ అద్బుత దీపం సినిమా కంటే ఇదే బావున్దనిపిస్తుంది .....

మనకీ అలాంటిది ఒక అద్భుత దీపం దొరికితే బావుండు కదా.............!!!!!!

ఇంకా ఇప్పుడే Ice Age-3 (Dawn of the Dinosarus) డౌన్లోడ్ చేసాను ...
ఇంకా దాన్ని ఒక చూపు చూడాలి ... !!!

విహారి - 2

ఇక అక్కడి నుంచి బయల్దేరాక  అలీ సాగర్ వెళ్దామంటే మద్యలో ఏదో గుడి కనిపించింది ... సరే అక్కడికి వెళ్దాం అని బయల్దేరాం ...

వెళ్ళే దారిలో నేను తెసిన ఫోటో ఇది ...

ఇదే ఆ గుడి లక్ష్మి నరసింహ స్వామీ ఆలయం
గుడి కి వెళ్ళే దారి ఇదే..

ఆ దారిలో వేసిన ముగ్గులు .. కింద జై తెలంగాణ...

ఇది అక్కడ వేసిందే ...

ముగ్గుల పోటీలు పెట్టినట్టు వున్నారు అనుకున్నాం .... ఈ ముగ్గులు చూసి ..


ఇది గుడి దగ్గర వేసిన దేవుని బొమ్మ ...
ఇది గుడి లోపల ప్రదేశం ....

గుడి లో ఒక ప్రక్కన ఇలా విగ్రహాలు పెట్టి వున్నాయి ... అన్ని దేవుళ్ళవీ ..

గుడి లోపల కృష్ణుడు .. పక్కన గోవులు ...

గుడి గోపురం ...


గుడి వెనుక వైపు వున్న లక్ష్మి నరసింహ స్వామి .....

గుడి వెనుక వున్న .... వెలగ కాయల చెట్టు ....

ఈ చెట్టుకి ఇలా కట్టి వున్నాయి ... బహుశా కోరికలు లాంటివి తీరడానికేమో అనుకున్నాం ...

గుడి బయటవైపు పెద్ద చెట్టు ....


ఇది కొలను అంటా ...

ఇదే కొలను ఎంట్రన్స్ ..... దీనికి కొంచం చరిత్ర  ఉందంట ..

ఇది ఆ కొలను చరిత్రని తెలిపే బోర్డు ... ఇందులో మునిగి స్నానం చేస్తే ... శని దోషాలు అన్ని పోతాయని రాసి వుంది దాని మీద ..
ఇంకా అంతే తర్వాత ఆలీసాగర్ వెళ్ళాం ... కాని అప్పటికే వెలుతురూ సరిగా లేనందువల్ల ఎక్కువ సేపు ఉండలేదు ...
:):):):):):):):)

విహారి -1

ఈ రోజు సైట్ కి వెళ్లి మద్యాహ్నానికి వచాను. తర్వాత రూం లో నే తిని కాసేపు రూం లో మంచం మీద డోల్లిన తర్వాత ... ఇంకా సాయంత్రం నాలుగు గంటలకి నేను, సంతు, వెంకట్ గారు బయటికి బయల్దేరాం ..... అశోక్ సాగర్ కి  ..

ఇంకా నాలుగున్నర ఆ ప్రాంతం లో అశోక్ సాగర్ చేరుకున్నాం ... ఇదే ఆ ఎంట్రన్స్ బోర్డు... ఇంతకుముందు దీని ముందు నుంచి చాల సార్లు వెళ్ళాం కాని ఎప్పుడూ నాకు లోపలి వెళ్ళాలని అనిపించలేదు ....
ఇదే అశోక్ సాగర్ లోని సరస్వతి విగ్రహం ....


ఇంకా అశోక్ సాగర్ లో తిరుగుతున్న బోటు .... మేము పెడల్ బోటు ఎక్కుదాం అనుకున్నాం కాని మళ్ళి ఆగిపోయం ... వాడు మరి పది నిముషాలు అనిసరికి కొంచం ఆలోచించం ... మనిషికి యాభయ్ రూపాయలు !!!
ఇంకా ఇంగెన్ వుండే బోటు లో వెళ్ళడం నాకు నచ్చదు.

ఇదే బోటింగ్ పాయింట్ ..

అస్తమించడానికి సిద్దమవుతున్న సూర్యుడు మాకు కాసేపు కనువిందు చేసాడు ...

ఇది అశోక్ సాగర్ లోపల వున్న రెస్టారెంట్ ... ఇలా ఈగలు తోలుకున్తున్నాడు ... హాలి డేస్ లో బాగా వస్తారేమో జనం అనుకున్నాం ...

ఇది ఆ రెస్టారెంట్ కి వెళ్ళడానికి వేసిన చెక్క వంతెన ... ఊగుతూ బలే గమ్మత్తు గా వుంది ....ఇది కూడా లోపల వున్న చెట్లే ... బావుంది సంధ్యా సమయం లో ..

ఇవి వెదురు చెట్లు ... దీని ఆకు తీసి జేబులో పెట్టుకుంటే ఎదురు ఉండదని చెప్పి  సంతు గాడు జేబులో పెట్టుకున్నాడు ...
 

లోపలి ప్రకృతి అందాలు ...

బాదం చెట్టు లోనుంచి భానుడు ...

ఇది పిల్లలు ఆడుకోటానికి చోటు ... ఎవరు లేరని చూసి మేము ముగ్గురం ఒక సారి జారుడుబల్ల జారేసాం గా .....:):):)

చెట్ల చాటునుంచి ఇక సెలవంటూ ....


బయటికి వచ్చేముందు  ఎవరో  ఫ్యామిలీ, పెడల్ బోటు లో వెళ్తున్నారు ... అప్పుడు క్లిక్ మనిపించిందే ఇది...


అలీ సాగర్ లో వున్న పెద్ద చెట్టు ... ఈ మద్య ఏ పెద్ద చెట్టు చూసినా అవతార్ సినిమాలో చెట్టులా కనపడుతోంది ...


ఇది కూడా లోపలి చెట్లే ... ఎంత బావున్నాయో ఇవి... చూడండి ఒక దాని మీద ఒకటి పది నన్ను ఫోటో తెయ్యడంటే... నన్ను తియ్యమని  పోటి పడుతున్నట్టు లేవు ... !!!

తర్వాత బయల్దేరి అలీ సాగర్ వెళ్ళాం  మా వెంకట్ గారు చూడలేదు కదా ... అందుకే ....!!!

తెలుగింటి కొలంబస్ కథ -2కృష్ణ: ఇంకా నేను , రాజేష్ బండి దిగాం ...!!! వాళ్ళు ఎక్కడున్నారా ...... అని వెతుకుతున్నాం ...!!! ఇంతలో కృష్ణ కాంత్ పార్క్ గేటు ఎంట్రన్స్ దగ్గర వున్నారు ....... దగ్గరికి వెళ్ళాం ..... రజిత పక్కన వాళ్ళ ఫ్రెండ్ ....

నేను : ఆగు తర్వాత నేను చెప్తాను ..... ఆ అమ్మాయిని చూడగానే నువ్వు ... ఆడువారి మాటలకు లో వెంకటేష్ లా " ఏమైంది ఈ వేళ........... యెదలో ఈ సందడేలా...... మిలమిలమిల మేఘమాల ....... చిటపట  చినుకేయువేళ ... చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయనేలా .......!!!!" అంతే గా ........??

కృష్ణ : కాదులే ..!! రజిత నాకు పరిచయం చేసింది .... ఆ అమ్మాయి పేరు "మీన" .

నేను : అంతేనా ...?? ఇంకేం అనిపించలేదా నీకు ???

కృష్ణ : లేదు ... మామూలు అమాయిల్ని చూసినప్పుడు ఎలా అనిపిస్తుందో అలానే వుంది .... ఇంకా పార్క్ లోపలి కి  వెళ్ళాం ...


నేను , రాజేష్ , రజిత , మీన ...


ఒక చిన్న సర్కిల్ వేసి కూర్చున్నాం ... ఏదో కాసేపు కబుర్లు చెప్పుకున్నాక ... ఇంకా చాట్ తెచుకుని కూర్చున్నాం .. అది తినేసాక ..


తర్వాత lays ప్యాకెట్ ఓపెన్ చేసాం .... రాజేష్ , రజిత తినరు .... ఇక ఓపెన్ చేసిన ప్యాకెట్ నా వైపు ....


నాకు పెద్దగా lays నచ్చవు .... కాని ఎందుకో ఆ రోజు ట్రై చేసాను ...


ఇప్పటికి గుర్తే అవి టమాట flavour ....


ఇంకా ప్యాకెట్ అయిపోయేవరకు .......


ప్యాకెట్ తన చేతిలో నే వుంది .... మా ఇద్దరి మధ్యలో .... 


సినిమాలుచూసి న ప్రభావమో  ఏమో తెలియదు ....
అలా తింటుంటే ఏదో కొత్త అనుభూతి ....


చిలుక కొరికిన జామ కాయ తిన్నట్టు ...


కాని ఇప్పుడు అది గుర్తు చేసుకుంటే ...
"
 చిలుక గోరింక  ఒక గూట్లో వున్నట్టు .. మా ఇద్దరి చేతులు ఒక lays ప్యాకెట్ లో .... " అనిపిస్తుంది ...


ఇంకా కాసేపు మాట్లాడుకుని ఎవరి దారిన వాళ్ళు బయల్దేరం ...... రాజేష్,నేను .... రజిత, మీన ....


ఆ రోజు అంతే ...... ఆ రోజు వెళ్ళే తప్పుడు వెనక్కి తిరిగి చూసుకోవటం అలాంటి సీన్ ఎం లేవులే ....


నేను : సరే .... హ...హః... :):)

మా ఊరి బజ్జిలబండి ....


ఇంతకు ముందు ఈ బండి దగ్గర నేను, చందు సాయంత్రం తింటూ వుండేవాళ్ళం ...

అప్పట్లో జేబులో ఇరవై రూపాయలు వుంటే పండగ లా అనిపించేది ... చదువుకునేటప్పుడు  రోజులు నిజం గా బావుండేవి...

ఇప్పుడు ఆ ఇరవై రూపాయలకి వెయ్యి రెట్లు వస్తున్నా అప్పుడు వున్న ఆనందం  ఇప్పుడు లేదేందుకో... !!!!

ఈ బండి దగ్గర ఎన్ని రకాలు దొరుకుతాయో .... మషాలా , బజ్జీలు, మళ్ళి అందులో రకాలు అరిటికాయ బజ్జీలు , ఎగ్ బజ్జి ,వంకాయ బజ్జి, ముంత మషాలా ..........

అబ్బ!!! ఎన్నాళ్ళయిందో తిని .... అందుకే మొన్న వెళ్ళినప్పుడు ఒక చూపు చూసాం ఇద్దరం ..... చాల రోజుల తర్వాత ...

సాయంత్రం కాలేజీ నుంచి వచ్చాక ... కాసేపు నిద్రేసి ... సాయంత్రం ఆరు గంటలకి లేచి .... అలా చల్ల గాలికి బయటికెళ్ళి ...

అలా కాసేపు బండి దగ్గర మసాల తిని ... అలా స్టేడియం దగ్గర కాసేపు ఆడుకే వాళ్ళని చూసి .... అలా గడిచేవి ఆ రోజులు  ...

అందుకే మొన్న ఒక ఫోటో క్లిక్ మనిపించాను .... ఇప్పుడు ఏవో ఫోటోలు చూస్తుంటే కనబడింది ...

అంతేలే మనిషికి జ్ఞాపకాలే అందం గా కనపడతాయి ..... ఇవ్వాల్టి రోజు కూడా రేపు చూస్తే అందం గానే వుంటుంది ....

ఒకో సారి అనిపిస్తుంది చూసే మనసుండాలి కాని గడిచిన ప్రతి క్షణం కూడా అందం గానే ఉంటుందేమో .... :):):)
ఇది చదవగలరా మీరు ??కింద వున్న దాన్ని చదవండి ...... దీన్ని 100 మందిలో 55 మంది మాత్రమె చదవగాలరంత... మరి చూడండి ఆ 55 మంది లో మీరు వున్నారో లేదో !!!!!!


This is weird, but interesting!fi yuo cna raed tihs, yuo hvae a sgtrane mnid too


Cna yuo raed tihs? Olny 55 plepoe out of 100 can.


i cdnuolt blveiee taht I cluod aulaclty uesdnatnrd waht I was

rdanieg. The phaonmneal pweor of the hmuan mnid, aoccdrnig to a

rscheearch at Cmabrigde Uinervtisy, it dseno't mtaetr in waht oerdr

the ltteres in a wrod are, the olny iproamtnt tihng is taht the frsit

and lsat ltteer be in the rghit pclae. The rset can be a taotl mses and

you can sitll raed it whotuit a pboerlm. Tihs is bcuseae the huamn

mnid deos not raed ervey lteter by istlef, but the wrod as a wlohe.

Azanmig huh? yaeh and I awlyas tghuhot slpeling was ipmorantt! if

you can raed tihs forwrad it

మా బేబీ షామిలి ...........
ఈ ఫోటోలో పాప  చూడండి ఎంత ముద్దుగా వుందో ....అమాయకమైన చూపులు.... పట్టు పరికిణి ... పాపిడి బిళ్ళ .....చిన్ని గాజులు ... బంగారు గొలుసు తో .....

నేను పరీక్ష లో ఎందుకు ఫెయిల్ అయ్యానంటే ?


అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇలా ఇవ్వబట్టి ......

చుడండి ఒక సారి ...

తెలుగింటి కొలంబస్ కథ - 1కృష్ణ : ఇంజనీరింగ్ అయ్పోయి హైదరాబాద్ వెళ్ళాను... నేను మా అన్న వుండే వాళ్ళం ఒక రూం లో ...


నేను : ఛ !!!... కొంచం ఫీలింగ్ తో చెప్పరా...  ఇప్పుడు నేను చెప్తాను చూడు అలా .....


అవి నేను  నూనుగు మీసాలతో ........ ఎన్నో ఆశలతో ......... హైదరాబాద్ చేరుకున్న తొలిరోజులు......


నేను, మా  అన్నయ్య ఒక రూం లో వుండే వాళ్ళు.... పొద్దున్నే అన్న ఆఫీసు కి వెళ్ళాక తీరిగ్గా లేచి .... టిఫిన్ చేసి ... DC


పేపర్ తెచుకుని ..... ఏ వెధవన్నా...... వుద్యోగం ఇస్తాడేమో అని చూసే రోజులు ....


అలా చెప్పు ....


కృష్ణ : సరే ... ఇక చూడు .... అదే నా  రోజు వారి పని కూడా ....కాకపోతే అప్పుడప్పుద్ హైదరాబాద్ లో వున్నా నా స్నేహితుల్ని


కలుస్తూ వుండే వాడిని ....  అప్పటికి  ఏదో చిన్న వుద్యోగం దొరికితే చాలనుకునే వాడిని ...అంతే యీ జీవితానికి...


నేను : కుమ్మేసావ్ కానియ్ ఇంకా...


కృష్ణ : కాని ... ఒక రోజు ఉన్నట్టుండి ... మా అన్న ఢిల్లీ ట్రైనింగ్ వుంది ఒక అయిదు రోజులు  అక్కడే వుంటాను అని చెప్పాడు ... 


సరే వుంటే వున్నాడు కాని... అసలే కాళి కాళి గా ఉంటున్నాం  ..... ఒక్కడినే ఎలా వుండాలి రూం లో ... అనుకుంటున్నా...


ఇంతలో మెరుపు లాంటి ఆలోచన .... నేను యీ అయిదు రోజులు మా ఫ్రెండ్ రూం కి వెళ్తే పోలా అనుకున్న ... వాడి పేరే


రాజేష్ .... నాతో పాటే ఇంజనీరింగ్  చేసాడు  ......... ఇక మా అన్న  ఆటో  లో ఎయిర్


పోర్ట్  కి బయదేరితే  నేను మెట్రో లో అమీర్పేట్ బయల్దేరాను ...


నేను : అబ్బ ... నాన్చకుండా చెప్పరా ..................!!!!!!!!


కృష్ణ : కాని అయిదు రోజులే నా జీవితాన్ని మారుస్తాయని ఊహించలేదు .... అప్పుడు టైం 6:00 అయింది సాయంత్రం .... నేను


వెళ్ళే సరికి రాజేష్ గాడు టిప్ టాప్ గా రెడీ అయ్యివున్నాడు ...


************ ఇక్కడ రెండు మూడు రింగులు వేసుకోండి ఎందుకంటే ఇది ఫ్లాష్ బ్యాక్ ************


రాజేష్ : రారా .... మొహం కడుకుని ఫ్రెష్ అవ్వు బయటికి వెళ్దాం....


కృష్ణ : ఎక్కడికి ...... ??


రాజేష్ : కృష్ణ కాంత్ పార్క్ కి ......


కృష్ణ : ఎందుకు ...... ?


రాజేష్ : రజిత వస్తోంది పార్క్ కి ......... ఇక్కడే వుంది............ ఏదో కంప్యూటర్ కోర్సు నేర్చుకున్తానికి వచిన్దంతా ..... 


(రజిత అంతే వాడి లవర్ , లివర్  , కిడ్నీ అన్ని లే....... )


కృష్ణ : అవును ..... మీ ఇద్దరి మద్యలో  నేనెందుకు ..... పానకం లో పుడకలా ........ మీరు మాట్లాడుకుంటుంటే


నేనేంచెయ్యను .... పార్క్ లో పల్లీలు అమ్మనా ??


రాజేష్ : నీ యబ్బ ... ఊరకే రా ..... రజిత  ఫ్రెండ్ కూడా వస్తోంది ... రా నువ్వు కూడా ...


కృష్ణ : యేహ!!!! వద్దు .... బాగోదు నేను రాను ....


రాజేష్ : ఎక్కువ చెయ్యకు.... ఎం కాదు .... కాసేపు అక్కడ కూర్చుని ...బయటే అన్నం  తినేసి రూం కి వచేద్దం పద ...


కృష్ణ : సరే లే కానియ్ ............ వెళ్దాం ........ !!! అయిదు నిముషాల్లో వస్తాను రెడీ అయ్యి ...


******** ఇక్కడ మళ్ళి రింగులు ..... కాకపోతే ఇప్పుడు రివర్స్  లో ... ఎందుకంటే ఇది ప్రస్తుతం ************


నేను : అమ్మాయిలు....... పక్కన ఎవరు తోడు లేకుండా బయటకి రారా ............???


కృష్ణ : ఏమో నాకేం తెలుసు ... అయినా ఒక్కత్తే  ఎలా వస్తది లే బయటకి ..... !!!


నేను : ఇంకేమింది ........ తర్వాత నేను చెప్తాలే ........ ఆ అమ్మాయి బావుంది ... కొనాళ్ళు మాట్లాడి ... ప్రోపోసే చేసావ్ ...


అంతేనా ..........!!!!!!! తెలిసిందే  ఇదంతా.............


కృష్ణ : అలా అయితే  అందులో కిక్కేముంది చెప్పు ........


నేను : మరి ఏమైంది ....


కృష్ణ : ఆ రోజు పార్క్ లో ఎం జరిగిందంటే .........


(కృష్ణ గాడి భాషనీ , నా భావాన్ని మిక్సి  లో వేసి కాసేపు తిప్పితే ఇలా వచ్చింది ......... యీ టపా....... )

తెలుగింటి కొలంబస్ కథ

మోహన్ :  మరి  ఒప్పుకుందా ....... ??

కృష్ణ : నువ్వేం అనుకుంటున్నావ్ ...?

మోహన్ : మూడు రోజుల  పరిచయానికి  I Love You  అని చెప్తే ఏ అమ్మాయి ఒప్పుకుంటుంది చెప్పు ...... నీ


గురించి కనీసం తనకు కొంచమన్నా తెలియాలికదరా .......... నాకు తెలిసి ఒప్పుకుని వుండదు... అవునా ....!!!

కృష్ణ చిన్న నవ్వు నవ్వి  .......


కృష్ణ : అంటే ఒక అమ్మాయిని ప్రేమించాలంటే ....... ముందు ఆ అమ్మాయితో ఇంటర్వ్యూ లో tell me about your


self చెప్పినట్టు  మొత్తం చెప్పి ...... అప్పుడు ఆ అమ్మాయికి propose చెయ్యాలి అంటావ్ అంతేనా ???


మోహన్ : ఒరేయ్ మెంటల్ ...... ఇప్పుడు............ ప్రేమించాలి అంటే నువ్వు ఎలాంటి వాడివో  ఆ


అమ్మాయికి తెలియాలి కదా .. ముందు ఆ అమ్మాయి ఇష్టాలు ఏంటో ..... నీ అలవాట్లు ఏంటో ........ నీ


ఇష్టాలు ఏంటో ... నీ అలవాట్లు తనకి నచుతాయో లేదో .. తెలియకుండా ఎలా  ప్రేమిస్తుంది రా ... ??కృష్ణ : అంటే నేను ముందు తన అలవాట్లు తెలుసుకుని... తన కి ఏమి ఇష్టమో తెలుసుకుని ..... ఫస్ట్ నా ప్రేమని


మనసులో పెట్టుకుని .... దాని మీద స్నేహం అని ముసుగు వేసి ... తనకి నచ్చని అలవాట్లని దాచిపెట్టి ....


మంచోడిలాగా నటించి ఒక ఆరు నెలలు గడిచాక అప్పుడు ముసుగు తీసేసి ..... ఐ లవ్ యు అని చెప్పాలా ???


మోహన్ : నిన్ను ఎవడు మార్చలేడు రా... చెప్పింది వినవు ..... అర్ధం చేసుకోవు ....

నేను : కొన్ని విషయాలో మరి అంత ముక్కు సూటిగా వుంటే పని కాదు రా ....


 కృష్ణ : ఎడ్చావ్...... అబ్బో .... !!! మూడునర్రైంది రా..... నిద్ర రావట్లేదా మీకు  ???


నేను : లేదు చెప్పు ..... బావుంది కొత్తగా , ఇంటరెస్టింగ్ గా   ...... చెప్పు .....

కృష్ణ : సరే, తర్వాత .....


 అంటూ  మళ్ళి చెప్పడం మొదలు పెట్టాడు ..... వాడు చెప్పినా విధానం సినిమా స్టొరీ లావుంది ....వాడి ప్రేమ కథ


మొత్తం  విన్నాక అర్ధం అయింది .... సినిమా కథలు కూడా నిజ జీవిత లోనుంచే తయారవుతాయని ....

సంక్రాంతి సంగతులు -3 (అమ్మమ్మ చూపించిన ప్రపంచం లో ....)

అలా గంగానమ్మ గుడిలో దణ్ణం పెట్టుకుని ..... నిదానం గా నేను, చందు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చేరుకున్నాం ..


అప్పటికే అందరు  వచేసారు.. ఇంకా గోల మొదలు.. ఒకటే సందడి  ... ఆ గొడవలో పడి  ఫోటో ల  సంగతి మర్చిపోయా..

తీసినమటుకు కొన్ని ...వెళ్ళే  సరికి పక్కన మామ్మ వాళ్ళ ఇంట్లో అరిసెలు చేస్తున్నారు .... అవే ఇవి ...


నూనె లో వేయిన్చుతున్న అరిసెలు ..


మా ఊళ్ళో వున్నా స్కూల్... అప్పుడప్పుడు ఇక్కడ ఆడుకున్తుందే వాడిని..

మా ఊరి బస్సు స్టాండ్.. చిన్నప్పుడు నేను , అమ్మ మా ఊరికి  బస్సు ఇక్కడే ఎక్కేవాళ్ళం... నేను ఈ రోజు బస్సు రాక పోతే బావుండు అనుకునేవాడిని.. ఇక్కడ నుంచి వెళ్ళడం ఇష్టం లేక..... :)


ఇంకా  ఇంటికాడ భోజనాలు  అయ్యాక  అందరం  పొలానికి  బయల్దేరం .. ఆ దారిలో మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో వున్నా పూల మొక్క ...


పొలానికి  వెళ్ళే  దారిలో  వున్నా  ఇంకొక  పొలం  ....

  

దారిలో  జనుము  మొక్కలు  .... పక్కన  తాటి చెట్లు ...

  

చుడండి ఎంత  అందం గా వున్నాయో .....
  

దూరం గా చెరకు తోట .... ఇంకా చెరకు తుక్కు అనుకుంటా...
 

ఇదే మా పొలం ... మినప తోట ....

 

అలా గడిచింది ఈ సంక్రాంతి ... చాల స్పెషల్ గా వుంది ఈ సంక్రాంతి ... నాకైతే అస్సలు ఆ ఊరు వదిలి రాబుద్ది కాలేదు... కాని ఎం చేస్తాం తప్పదు గా... :) :) :)

"కరిగేలోగా ఈ క్షణం గడిపేయాలి జీవితం...... " అనుకుంటూ అందరం ఎవరి ఇళ్ళకి వాళ్ళు తిరుగు ప్రయానమయ్యం ...

మళ్ళి ఇలాంటి సంక్రాంతి కై ఎదురుచూస్తూ .....!!!

Blog Archive

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......