చీకటి వెలుగుల రంగేళి ......


సంక్రాంతి సంగతులు -1 (నాయనమ్మతో)

మొన్న సంక్రాంతికి ఇంటికి వెళ్ళాను... ఈ  సంక్రాంతి చాల స్పెషల్ గా వుంది నాకు... నాకు తెలిసి ఏ సంక్రాంతి ఇంతే బాగా ఎంజాయ్ చేయలేదు...

మొన్న పదహారో తారీకు మా చుట్టాలందరం కలిసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి వెళ్ళాం ...

దాదాపు ఒక ఇరవై మంది కలిసి వెళ్ళాం.... పెద్దమ్మల్లు , అక్కలు, బావలు, వాళ్ళ పిల్లలు, మరదళ్ళు , మేన కోడళ్ళు, అల్లుళ్ళు  అందరు ... చాల   బాగా   ఎంజాయ్ చేసాం ...  ఆ ఫొటోలే కొన్ని ... మీతో ....

మొదట మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళము ... ఆ ఇల్లు నా చిన్నప్పుడు ఎలా వుందో ఇప్పుడు అలానే వుంది ...

ఇదే మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో పాత టీవీ ... నా చిన్నపాటి నుంచి ఇప్పటికి అలానే వుంది ...

మా నాయనమ్మ వాళ్ళు వచ్చిన లెటర్స్ ఇలా పెడతారు ... ఇప్పటికి అది అలానే వుంది .. అందులో చాల పాత లెటర్స్ వున్నాయి ...


మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో పాత టేకు కుర్చీ... చిన్నప్పుడు నేను మా తాత గారు ఇందులోనే ఆడుకునే వాళ్ళం ...


రాముల వారి పెళ్లి ఘట్టం ... నా చిన్నపాటి నుంచి అలానే వుంది ఇది ...

సంక్రాంతి స్పెషల్ చెక్కిడాలు... బావున్నాయి ....

ఇంటి చుట్టూ వున్నా చెట్లు ... ఆ మామిడి చెట్టు కింద పడకుర్చి వేసుకుని కూర్చునేవాడిని ... ఇక కాయలు కాస్తే వాటి సంగతి చెప్పకర్లేదు ..

జామ చెట్టు ... కొంకి తో కొయ్యటానికి ట్రై చేస్తున్నాడు మా అన్న గాడు చుడండి పరీక్షగా ...
మామిడి చెట్లు ...
ఇంటి బయట పాత  కాలపు antenna ... ఇంతకు ముందు పుల్లల్లగా వుండే వి వచేవి ... తర్వాత ఇవి వచాయి ... ఎందుకు వచయంటే కాకులు పుల్లలు విరగాకోదతాయని ఇలా చేసారేమో అనుకునేవాడిని ... కాని దానికి ఏదో reason  చదివాను కాని గుర్తు లేదు ఇప్పుడు..


నా చిన్నప్పుడు చాల రకాల మందారాలు ఉండేవి కాని .... ఇప్పుడు ఇది ఒకటే కనపడింది ... చాల రకాలు ఉండేవి ... ఒంటి రెక్క అని.. ముద్దా మందారం అని ఏవేవో చాల పేర్లు ఉండేవి ..

ఇది ఉసిరి చెట్టు ... నాచిన్నప్పుడు చిన్న గా వుండేది.. నాతో పాటే పెరిగి పెద్ద దయింది...

ఆ చెట్టు చూడగానే ఎక్కి కోయ్యలనిపించింది ... కోశాక ఉసిరి  కొమ్మలతో...

ఇంకా కాసేపు కోర్చుని .. బయల్దేరం ... పెద్ద టైం లేదు కదా..


2 comments:

మధురవాణి said...

బావున్నాయండీ మీ సంక్రాంతి జ్ఞాపకాలు బొమ్మల్లో :)

Phani Yalamanchili said...

థాంక్స్ అండి మధురవాణి గారు ..... :):)

Post a Comment

Blog Archive

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......