చీకటి వెలుగుల రంగేళి ......


తెలుగింటి కొలంబస్ కథ - 1కృష్ణ : ఇంజనీరింగ్ అయ్పోయి హైదరాబాద్ వెళ్ళాను... నేను మా అన్న వుండే వాళ్ళం ఒక రూం లో ...


నేను : ఛ !!!... కొంచం ఫీలింగ్ తో చెప్పరా...  ఇప్పుడు నేను చెప్తాను చూడు అలా .....


అవి నేను  నూనుగు మీసాలతో ........ ఎన్నో ఆశలతో ......... హైదరాబాద్ చేరుకున్న తొలిరోజులు......


నేను, మా  అన్నయ్య ఒక రూం లో వుండే వాళ్ళు.... పొద్దున్నే అన్న ఆఫీసు కి వెళ్ళాక తీరిగ్గా లేచి .... టిఫిన్ చేసి ... DC


పేపర్ తెచుకుని ..... ఏ వెధవన్నా...... వుద్యోగం ఇస్తాడేమో అని చూసే రోజులు ....


అలా చెప్పు ....


కృష్ణ : సరే ... ఇక చూడు .... అదే నా  రోజు వారి పని కూడా ....కాకపోతే అప్పుడప్పుద్ హైదరాబాద్ లో వున్నా నా స్నేహితుల్ని


కలుస్తూ వుండే వాడిని ....  అప్పటికి  ఏదో చిన్న వుద్యోగం దొరికితే చాలనుకునే వాడిని ...అంతే యీ జీవితానికి...


నేను : కుమ్మేసావ్ కానియ్ ఇంకా...


కృష్ణ : కాని ... ఒక రోజు ఉన్నట్టుండి ... మా అన్న ఢిల్లీ ట్రైనింగ్ వుంది ఒక అయిదు రోజులు  అక్కడే వుంటాను అని చెప్పాడు ... 


సరే వుంటే వున్నాడు కాని... అసలే కాళి కాళి గా ఉంటున్నాం  ..... ఒక్కడినే ఎలా వుండాలి రూం లో ... అనుకుంటున్నా...


ఇంతలో మెరుపు లాంటి ఆలోచన .... నేను యీ అయిదు రోజులు మా ఫ్రెండ్ రూం కి వెళ్తే పోలా అనుకున్న ... వాడి పేరే


రాజేష్ .... నాతో పాటే ఇంజనీరింగ్  చేసాడు  ......... ఇక మా అన్న  ఆటో  లో ఎయిర్


పోర్ట్  కి బయదేరితే  నేను మెట్రో లో అమీర్పేట్ బయల్దేరాను ...


నేను : అబ్బ ... నాన్చకుండా చెప్పరా ..................!!!!!!!!


కృష్ణ : కాని అయిదు రోజులే నా జీవితాన్ని మారుస్తాయని ఊహించలేదు .... అప్పుడు టైం 6:00 అయింది సాయంత్రం .... నేను


వెళ్ళే సరికి రాజేష్ గాడు టిప్ టాప్ గా రెడీ అయ్యివున్నాడు ...


************ ఇక్కడ రెండు మూడు రింగులు వేసుకోండి ఎందుకంటే ఇది ఫ్లాష్ బ్యాక్ ************


రాజేష్ : రారా .... మొహం కడుకుని ఫ్రెష్ అవ్వు బయటికి వెళ్దాం....


కృష్ణ : ఎక్కడికి ...... ??


రాజేష్ : కృష్ణ కాంత్ పార్క్ కి ......


కృష్ణ : ఎందుకు ...... ?


రాజేష్ : రజిత వస్తోంది పార్క్ కి ......... ఇక్కడే వుంది............ ఏదో కంప్యూటర్ కోర్సు నేర్చుకున్తానికి వచిన్దంతా ..... 


(రజిత అంతే వాడి లవర్ , లివర్  , కిడ్నీ అన్ని లే....... )


కృష్ణ : అవును ..... మీ ఇద్దరి మద్యలో  నేనెందుకు ..... పానకం లో పుడకలా ........ మీరు మాట్లాడుకుంటుంటే


నేనేంచెయ్యను .... పార్క్ లో పల్లీలు అమ్మనా ??


రాజేష్ : నీ యబ్బ ... ఊరకే రా ..... రజిత  ఫ్రెండ్ కూడా వస్తోంది ... రా నువ్వు కూడా ...


కృష్ణ : యేహ!!!! వద్దు .... బాగోదు నేను రాను ....


రాజేష్ : ఎక్కువ చెయ్యకు.... ఎం కాదు .... కాసేపు అక్కడ కూర్చుని ...బయటే అన్నం  తినేసి రూం కి వచేద్దం పద ...


కృష్ణ : సరే లే కానియ్ ............ వెళ్దాం ........ !!! అయిదు నిముషాల్లో వస్తాను రెడీ అయ్యి ...


******** ఇక్కడ మళ్ళి రింగులు ..... కాకపోతే ఇప్పుడు రివర్స్  లో ... ఎందుకంటే ఇది ప్రస్తుతం ************


నేను : అమ్మాయిలు....... పక్కన ఎవరు తోడు లేకుండా బయటకి రారా ............???


కృష్ణ : ఏమో నాకేం తెలుసు ... అయినా ఒక్కత్తే  ఎలా వస్తది లే బయటకి ..... !!!


నేను : ఇంకేమింది ........ తర్వాత నేను చెప్తాలే ........ ఆ అమ్మాయి బావుంది ... కొనాళ్ళు మాట్లాడి ... ప్రోపోసే చేసావ్ ...


అంతేనా ..........!!!!!!! తెలిసిందే  ఇదంతా.............


కృష్ణ : అలా అయితే  అందులో కిక్కేముంది చెప్పు ........


నేను : మరి ఏమైంది ....


కృష్ణ : ఆ రోజు పార్క్ లో ఎం జరిగిందంటే .........


(కృష్ణ గాడి భాషనీ , నా భావాన్ని మిక్సి  లో వేసి కాసేపు తిప్పితే ఇలా వచ్చింది ......... యీ టపా....... )

0 comments:

Post a Comment

Blog Archive

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......