చీకటి వెలుగుల రంగేళి ......


విహారి -1

ఈ రోజు సైట్ కి వెళ్లి మద్యాహ్నానికి వచాను. తర్వాత రూం లో నే తిని కాసేపు రూం లో మంచం మీద డోల్లిన తర్వాత ... ఇంకా సాయంత్రం నాలుగు గంటలకి నేను, సంతు, వెంకట్ గారు బయటికి బయల్దేరాం ..... అశోక్ సాగర్ కి  ..

ఇంకా నాలుగున్నర ఆ ప్రాంతం లో అశోక్ సాగర్ చేరుకున్నాం ... ఇదే ఆ ఎంట్రన్స్ బోర్డు... ఇంతకుముందు దీని ముందు నుంచి చాల సార్లు వెళ్ళాం కాని ఎప్పుడూ నాకు లోపలి వెళ్ళాలని అనిపించలేదు ....
ఇదే అశోక్ సాగర్ లోని సరస్వతి విగ్రహం ....


ఇంకా అశోక్ సాగర్ లో తిరుగుతున్న బోటు .... మేము పెడల్ బోటు ఎక్కుదాం అనుకున్నాం కాని మళ్ళి ఆగిపోయం ... వాడు మరి పది నిముషాలు అనిసరికి కొంచం ఆలోచించం ... మనిషికి యాభయ్ రూపాయలు !!!
ఇంకా ఇంగెన్ వుండే బోటు లో వెళ్ళడం నాకు నచ్చదు.

ఇదే బోటింగ్ పాయింట్ ..

అస్తమించడానికి సిద్దమవుతున్న సూర్యుడు మాకు కాసేపు కనువిందు చేసాడు ...

ఇది అశోక్ సాగర్ లోపల వున్న రెస్టారెంట్ ... ఇలా ఈగలు తోలుకున్తున్నాడు ... హాలి డేస్ లో బాగా వస్తారేమో జనం అనుకున్నాం ...

ఇది ఆ రెస్టారెంట్ కి వెళ్ళడానికి వేసిన చెక్క వంతెన ... ఊగుతూ బలే గమ్మత్తు గా వుంది ....ఇది కూడా లోపల వున్న చెట్లే ... బావుంది సంధ్యా సమయం లో ..

ఇవి వెదురు చెట్లు ... దీని ఆకు తీసి జేబులో పెట్టుకుంటే ఎదురు ఉండదని చెప్పి  సంతు గాడు జేబులో పెట్టుకున్నాడు ...
 

లోపలి ప్రకృతి అందాలు ...

బాదం చెట్టు లోనుంచి భానుడు ...

ఇది పిల్లలు ఆడుకోటానికి చోటు ... ఎవరు లేరని చూసి మేము ముగ్గురం ఒక సారి జారుడుబల్ల జారేసాం గా .....:):):)

చెట్ల చాటునుంచి ఇక సెలవంటూ ....


బయటికి వచ్చేముందు  ఎవరో  ఫ్యామిలీ, పెడల్ బోటు లో వెళ్తున్నారు ... అప్పుడు క్లిక్ మనిపించిందే ఇది...


అలీ సాగర్ లో వున్న పెద్ద చెట్టు ... ఈ మద్య ఏ పెద్ద చెట్టు చూసినా అవతార్ సినిమాలో చెట్టులా కనపడుతోంది ...


ఇది కూడా లోపలి చెట్లే ... ఎంత బావున్నాయో ఇవి... చూడండి ఒక దాని మీద ఒకటి పది నన్ను ఫోటో తెయ్యడంటే... నన్ను తియ్యమని  పోటి పడుతున్నట్టు లేవు ... !!!

తర్వాత బయల్దేరి అలీ సాగర్ వెళ్ళాం  మా వెంకట్ గారు చూడలేదు కదా ... అందుకే ....!!!

1 comments:

కొత్త పాళీ said...

looks like a beautiful place

Post a Comment

Blog Archive

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......