చీకటి వెలుగుల రంగేళి ......


సంక్రాంతి సంగతులు - 2 (దారిలో )

ఇంకా అక్కడనుంచి బయల్దేరాక.... ఓహో... ఎక్కడికో చెప్పలేదు కదూ !!! మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ... మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఒక రెండు మూడు కిలో మీటర్లే దూరం.. ఇంకా నేను , చందు నడుచుకుంటూ బయల్దేరం...ఇదే నేను మొదట చదువుకున్న స్కూల్ ... దారిలో వస్తుంది ...
   
దారిలో  కనపడిన చెరుకు తోట ...

చిన్నప్పుడు ఈ దారి వెంట రాత్రి వెళ్ళాలంటే భయం... చిమ్మ చీకటి .. ఇప్పటికి అలానే వుంది ... రోడ్ మీద ఎక్కడ లైట్లు కనబడలేదు ...


ఇదే మా ఊరి  గంగానమ్మ చెరువు ... ఈ కనపడే చెట్టు మీద పండగకి  బాణాలు పెడతారు ... జమ్మి చెట్టు ఇది..


ఇదే ఆ చెరువు ...

ఆ చెరువు ఎదురుగా వుండే గుడి.. గంగానమ్మ గుడి అంటారు .. చిన్నప్పుడు గుడి ఇంత బాగావుండేది కాదు .. ఈ మద్యన బాగుచేసినట్టునారు ....

గుడి లోపలి విగ్రహాలు ఇవీ.. చిన్న గుడి ఐనా బావుంటుంది..

గుడి గంటకి వరి కంకులు...

ఇదే మా ఊరి పాల కేంద్రం .. ఇక్కడ పొద్దున్నే ఆరు గంటలకి పేపర్ వస్తుంది .. చాల మంది ఇక్కడికి వచ్చి చదువు తారు .. రాత్రి ఏడు గంటలకి టీవీ పెడతారు రాత్రి పది గంటల వరకు అందరు కూర్చుని ఇక్కడ టీవీ చూస్తూ వుండే వాళ్ళం..
ఇప్పటికి అలానే జరుగుతోందట ఇక్కడ ...  మా వాలే వాలే పొద్దు చెప్పింది ... (మా మరదలు లే...  )

ఇంటి సందు మొదట్లో రావి చెట్టు.. దీని వెనుక దాన్కొని ఎడ్ల బళ్ళలో చెరుకు లాగేవాళ్ళం .. కింద కనిపించేదే ఆంజనేయ స్వామి గుడి ...
 

రావి చెట్టు పక్కన పాల కేంద్రం...


ఇదే ఆంజనేయ స్వామి గుడి ఇక్కడే శ్రీ రామ  నవమికి పానకం ఇచేవాళ్ళు... :)


అలా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చేరుకున్నాం..

4 comments:

Anonymous said...

nice photos :)

Phani Yalamanchili said...

thank u...... :) :) :)

మధురవాణి said...

అందమైన పల్లెటూరు చూసొచ్చారన్నమాట..!

Phani Yalamanchili said...

@ మధురవాణి గారు
అవునండి .... కాకపోతే అందమైనా ఊరు అంటే చాలేమో .....!! ఎందుకంటే అందం గావుందేవి పల్లేటూల్లె కదా...!!! ఏమంటారు....

Post a Comment

Blog Archive

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......