చీకటి వెలుగుల రంగేళి ......


తెలుగింటి కొలంబస్ కథ -2కృష్ణ: ఇంకా నేను , రాజేష్ బండి దిగాం ...!!! వాళ్ళు ఎక్కడున్నారా ...... అని వెతుకుతున్నాం ...!!! ఇంతలో కృష్ణ కాంత్ పార్క్ గేటు ఎంట్రన్స్ దగ్గర వున్నారు ....... దగ్గరికి వెళ్ళాం ..... రజిత పక్కన వాళ్ళ ఫ్రెండ్ ....

నేను : ఆగు తర్వాత నేను చెప్తాను ..... ఆ అమ్మాయిని చూడగానే నువ్వు ... ఆడువారి మాటలకు లో వెంకటేష్ లా " ఏమైంది ఈ వేళ........... యెదలో ఈ సందడేలా...... మిలమిలమిల మేఘమాల ....... చిటపట  చినుకేయువేళ ... చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయనేలా .......!!!!" అంతే గా ........??

కృష్ణ : కాదులే ..!! రజిత నాకు పరిచయం చేసింది .... ఆ అమ్మాయి పేరు "మీన" .

నేను : అంతేనా ...?? ఇంకేం అనిపించలేదా నీకు ???

కృష్ణ : లేదు ... మామూలు అమాయిల్ని చూసినప్పుడు ఎలా అనిపిస్తుందో అలానే వుంది .... ఇంకా పార్క్ లోపలి కి  వెళ్ళాం ...


నేను , రాజేష్ , రజిత , మీన ...


ఒక చిన్న సర్కిల్ వేసి కూర్చున్నాం ... ఏదో కాసేపు కబుర్లు చెప్పుకున్నాక ... ఇంకా చాట్ తెచుకుని కూర్చున్నాం .. అది తినేసాక ..


తర్వాత lays ప్యాకెట్ ఓపెన్ చేసాం .... రాజేష్ , రజిత తినరు .... ఇక ఓపెన్ చేసిన ప్యాకెట్ నా వైపు ....


నాకు పెద్దగా lays నచ్చవు .... కాని ఎందుకో ఆ రోజు ట్రై చేసాను ...


ఇప్పటికి గుర్తే అవి టమాట flavour ....


ఇంకా ప్యాకెట్ అయిపోయేవరకు .......


ప్యాకెట్ తన చేతిలో నే వుంది .... మా ఇద్దరి మధ్యలో .... 


సినిమాలుచూసి న ప్రభావమో  ఏమో తెలియదు ....
అలా తింటుంటే ఏదో కొత్త అనుభూతి ....


చిలుక కొరికిన జామ కాయ తిన్నట్టు ...


కాని ఇప్పుడు అది గుర్తు చేసుకుంటే ...
"
 చిలుక గోరింక  ఒక గూట్లో వున్నట్టు .. మా ఇద్దరి చేతులు ఒక lays ప్యాకెట్ లో .... " అనిపిస్తుంది ...


ఇంకా కాసేపు మాట్లాడుకుని ఎవరి దారిన వాళ్ళు బయల్దేరం ...... రాజేష్,నేను .... రజిత, మీన ....


ఆ రోజు అంతే ...... ఆ రోజు వెళ్ళే తప్పుడు వెనక్కి తిరిగి చూసుకోవటం అలాంటి సీన్ ఎం లేవులే ....


నేను : సరే .... హ...హః... :):)

0 comments:

Post a Comment

Blog Archive

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......