చీకటి వెలుగుల రంగేళి ......


నా న్యూ ఇయర్ నిర్ణయం........


నేను ప్రతి న్యూ ఇయర్ కి ఒక నిర్ణయం తీసుకుంటాను.............

ఉదాహరణకి........

  • 2009 న్యూ ఇయర్ కి, నేను కూడా ఈ ఇయర్ లో ఒక కొత్త పార్టీ పెట్టాలి అనుకున్న.............. (పార్టీ అంటే న్యూ ఇయర్ పార్టీ అనుకునేరు ...... కాదు రాజకీయ పార్టీ)

కాని, రాష్ట్రం లో అప్పటికి చాలా వచ్చి వాటి పరిస్తితే అంతంత మాత్రం గా వుండే సరికి ఆగిపోయాను ..............

  • ఇక 2008 న్యూ ఇయర్ కి లాడెన్ తో చర్చించి ........ ఇక ప్రపంచ శాంతికి కృషి చెయ్యమని చెప్దాం అనుకున్నాను.......

కాని , వాడితో ఫోన్ లో మాట్లాడటానికి నా ఆర్దిక స్తోమత సరిపోదని తెలిసి ఊరుకున్నాను...... (అప్పుడు సెకండ్ పల్సింగ్ లేదు, Docomo రాలేదు !!!)


  • ఇంకా చివరగా , 2007 న్యూ ఇయర్ కి ఏ రోజు చెప్పినా పాఠం ఆ రోజే చదివేసి , ఏ రోజు రికార్డ్ ఆరోజే రాసేద్దాం .... అనుకున్న......

కాని , మా అత్యాధునిక కళాశాలలో అన్ని పుస్తకములు లేనందువల్ల, మా తండ్రిగారు పంపిన రొక్కము నా చలన చిత్ర


వీక్ష్నకే, స్నేహితులతో విందు వినోదాలకు సరిపోయినందు వల్ల ఆ పనీ చెయ్యలేక పోయాను...... ( మరియు రికార్డ్ మా


కళాశాలలో సెమిస్టరు చివరిలోనే ఇచ్చే సదుపాయం ఉన్నందువల్ల అదికూడా మాఫీ చెయ్యడమైనది..)


ఇంకా ఇటువంటి అనుభవాలు చాల ఉన్నందువల్ల ........ ( ఇక విశదం గా కావాలంటే నేను ఇప్పటికి ఒక నాలుగు , ఐదు సార్లు సిగరెట్ మానేసాను......) ఇంకా న్యూ ఇయర్ రోజు ఎం నిర్ణయాలు తీసుకో కూడదని డిసైడ్ అయిపోయాను....


కాని నేను ఈ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాను........ అదేంటంటే....... (తెలంగాణా ఇచేద్దాం...! అని కాదులే )


నేను పని ఒత్తిడి లో పడి మా తల్లి తండ్రులకు ఫోన్ చెయ్యడం మానివేసితిని , వారు చేసినప్పటికిని ఏదో ముఖ స్తుతిగా మాట్లాడి ఫోన్ పెట్టివేయుచుంటిని............

కాని ఈ ఇయర్ నుండి ప్రతి రెండు రోజులకి ఒక సారి నా స్వతహా గా ఫోన్ చేసి మాట్లాడు తానని , ఈ బ్లాగా ముఖం గా ప్రమాణం చేయుచున్నాను..........


(కాని ఇంతకూ ముందు అనుకున్నవి కొన్ని కల్పితాలు, కొన్ని ఎవరికీ చెప్పలేదు ఈ నిర్ణయం తీసుకున్నట్టు .... అందుకే మీకు చెప్తున్నా ఈ ఇయర్ లో తీసుకున్న నిర్ణయం......... ఏదన్న నిర్ణయం తీసుకున్నప్పుడు అందరికి చెప్పాలంట కదా... అందుకే..)

Maa n Dad I want to hold ur hands once again........ Love you Some much...

3 comments:

blogubevars :) said...
This comment has been removed by a blog administrator.
నిజం said...

All the Best for new year....Docomo conncetion thisukunnara enti.....

Phani Yalamanchili said...

thk u n sme 2 u....ledu lendi......... saradaagaa raasaanu
anthe...

Post a Comment

Blog Archive

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......