చీకటి వెలుగుల రంగేళి ......


వెన్నెల్లో ఆడపిల్ల ........గురించి వెన్నెల్లో మగపిల్లాడు చెప్పిన ఊసులు .....


అది నేను ఇంజనీరింగ్ చదువుతున్న రోజులు ...........


వున్నది ఇంటిదగ్గర ..........


సంక్రాంతి సెలవలు ......


ఈ రోజు బయల్దేరి ఇంకా వెళ్లి పోవాలి ........ కాలేజీ కి .


అన్నం తింటూ టీవీ చూస్తున్న..........


ఏదో ప్రోగ్రాం లో ....... ఇంటర్వ్యూ జరుగుతోంది ............ ఉత్తేజ్ ది అది.....


మీకు ఇష్టమైనా పుస్తకాలు అని అడిగారు.... "వెన్నెల్లో ఆడపిల్ల "........ ఇదే అతని సమాధానం ...


ఇంతకుముందు నేను ఈ పేరు చాల సార్లు విన్నాను...


కాని ఎప్పుడూ అంతగా ఆలోచించలేదు  ..............


ఎందుకో ఆ రోజు ఒక క్షణం ఆలోచించ....


*************** కట్ చేస్తే ************


గుంటూరు బస్టాండ్ కి వచాను బస్సు ఎక్కడానికి .............


డైరెక్ట్ గా బుక్ షాప్ కి వెళ్లి .......... బుక్ అడిగాను .......... ఉందన్నాడు...


తీసుకున్న ........ 50 రూపయలనుకుంట దాని ధర ....... నాకు సరిగ్గా గుర్తు లేదు..


ఇంకా అంతే బస్సు లో కూడా చదువుతూ వెళ్ళాను......... మూడు రోజుల్లో మొత్తం చదివేసాను...


చాల బావుంది..... హీరోయిన్ ఏడిపించటం .... కవ్వించడం.. చివరికి కనుమరుగై పోవటం ....


ఎందుకో ఈరోజు మల్లి చదవాలని పించింది... కాని నా దగ్గర ఇప్పుడా బుక్ లేదు...


ఆ బుక్ దగ్గరదగ్గర రెండు సార్లు చదివినట్టు గుర్తు ...........


ఒక సారి మాములుగా ........ ఒక సారి అందులో మంచి లైన్స్ అండర్ లైన్ చేస్తూ ............


కాని చివరికి నా ఇంజనీరింగ్ పుస్తకాలతో పాటు ఇంటికి వచ్చి .... అక్కడ నుంచి నాకూడా హైదరాబాద్ వచ్చింది ....


******** నాకు ఇష్టమైనా కొన్ని లైన్ లు  ******


హీరోయిన్ చనిపియినప్పుడు ........... హీరో ఏడుస్తూ ఉంటాడు చితిదగ్గర కూర్చుని .............


కాటి కాపరి వచ్చి బాబు నక్కలు వచ్చే వేళయింది ఇంకా బయల్దేరు అంటాడు....


దానికి హీరో " లేదు నేను ఇక్కడే వుంటాను  .... తను ఇక్కడే వున్నటుంది.... నాకు అలానే అనిపిస్తోంది ... " అంటాడు...


దానికి ఆ కాటి కాపరి ........ " బాబు మనిషి చనిపోయాక ఆత్మా ఆ భవ బంధాలు వీడలేక ఇక్కడే తిరుగుతూ వుంటుంది .... అందుకే పదో రోజు కర్మ చేసేటప్పుడు పిండాలు పెడతారు ............ వాటిని తినటానికి వచ్చిన కాకులతో యెగిరి  శూన్యం లో కలిసిపోద్ది!!!!!!!!" అంటాడు...


అప్పడు హీరో అబ్బ అజ్ఞానం కూడా మనసుకి ఎంత ప్రశాంతత ఇస్తుంది అనుకుంటాడు......


( మా అమ్మమ్మ చనిపోయినప్పుడు నాకు అలానే అనిపించింది.... కొన్నాళ్ళు ఆ ఇంట్లో ఆవిడ తిరుగుతున్నటు .... అప్పుడు ఇదే గుర్తోచింది నాకు... అంత ఇష్టం ఆవిడంటే నాకు .....)


******** నాకు నచినవి ******


తర్వాత హీరో నడుచుకుంటూ వెళ్తుంటే... ఒక కన్నీటి చుక్క అతని కంట్లోనుంచి వస్తూ ఇలా అంటుంది...


" నేస్తమా !!! ఇన్నాళ్ళు నీతో పాటే వున్నాను .... నీ కస్టాలు పంచుకున్నాను... నీ సుఖాలలోను నీ తోడుగా వున్నాను...


కాని నీ బాధ చూసి నేను ఇక బయటికి వెళ్లి పోతున్నాను .......... నే వెళ్లి పోవడం నీ బాధను కొంచమైనా తగ్గిస్తే ......


నాకంతకన్న కావలిసిందేముంది అని.....  "


దాంతో కథ ముగుస్తుంది.... ఇంకా చాల మంచి వాక్యాలు వున్నాయి కాని నాకు గుర్తు లేవు ....... దాదాపు చదివి మూడు ఏళ్ళు గడిచింది...


ఈ సారి అయీనా హైదరాబాద్ వెళ్ళినప్పుడు తెచ్కోవాలి... ఆ బుక్ ...ఇంత మంచి రచన అందించినా యండమూరి గారికి లేట్ గా   చాల లేట్ గా అయినప్పటికీ నా కృతజ్ఞతలు ...


ఇంతకి పైనా ఆ టైటిల్ ఏంటి అంటారా ........... ఇప్పుడు రాత్రి ......... అందుకే

4 comments:

'Padmarpita' said...

నాకిష్టమైన నవల్లోని అంతిమ వాక్యాలని గుర్తుచేసుకున్నారు.....ఎన్ని సార్లు చదివినా కొత్తగా అనిపిస్తుంది.

Giridhar Pottepalem said...

"వెన్నెల్లో ఆడపిల్ల " నేను చదివిన కొద్ది నవలల్లో నాకు బాగా నచ్చిన నవల. అందులో ముగింపు వాక్యం గుర్తుచేసారు. చాలా థాంక్స్. మళ్ళీ ఆ నవల చదవాలనిపిస్తోంది. అలాగే "పయనమయే ప్రియతమా" అనే నవల కూడా నాకు చాలా బాగా నచ్చిన నవల.

శిశిర said...

మీకా నవల నెట్ లో ఇక్కడ దొరుకుతుంది.

http://www.ziddu.com/download/2270732/vennelloaadapilla.rar.html

Phani Yalamanchili said...

@ పద్మార్పిత గారు మీరు చెప్పింది కరెక్టే ...... !! ఈ వాక్యాలు ఎన్నిసార్లు చదివినా మళ్ళి చదవాలనిపిస్తుంది ...

@ గిరిధర్ గారు ముందు గా మీకు నా ధన్యవాదాలు ...... మీరు చెప్పినా పయనమే ప్రియతమా నవల నేను చదవలేదు .... ఈ సారి తప్పకుండా చదువుతా...

@ శిశిర గారు మీకు మరి మరి మరి ........ థాంక్స్ ..... ఇప్పుడే ఆ నవల డౌన్లోడ్ అవ్తోంది .... అవగానే మళ్ళి ఒక సారి తిరగేస్తాను .... మళ్ళి ఒక సారి థాంక్స్ ....

Post a Comment

Blog Archive

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......