చీకటి వెలుగుల రంగేళి ......


తెలుగింటి కొలంబస్ కథ

మోహన్ :  మరి  ఒప్పుకుందా ....... ??

కృష్ణ : నువ్వేం అనుకుంటున్నావ్ ...?

మోహన్ : మూడు రోజుల  పరిచయానికి  I Love You  అని చెప్తే ఏ అమ్మాయి ఒప్పుకుంటుంది చెప్పు ...... నీ


గురించి కనీసం తనకు కొంచమన్నా తెలియాలికదరా .......... నాకు తెలిసి ఒప్పుకుని వుండదు... అవునా ....!!!

కృష్ణ చిన్న నవ్వు నవ్వి  .......


కృష్ణ : అంటే ఒక అమ్మాయిని ప్రేమించాలంటే ....... ముందు ఆ అమ్మాయితో ఇంటర్వ్యూ లో tell me about your


self చెప్పినట్టు  మొత్తం చెప్పి ...... అప్పుడు ఆ అమ్మాయికి propose చెయ్యాలి అంటావ్ అంతేనా ???


మోహన్ : ఒరేయ్ మెంటల్ ...... ఇప్పుడు............ ప్రేమించాలి అంటే నువ్వు ఎలాంటి వాడివో  ఆ


అమ్మాయికి తెలియాలి కదా .. ముందు ఆ అమ్మాయి ఇష్టాలు ఏంటో ..... నీ అలవాట్లు ఏంటో ........ నీ


ఇష్టాలు ఏంటో ... నీ అలవాట్లు తనకి నచుతాయో లేదో .. తెలియకుండా ఎలా  ప్రేమిస్తుంది రా ... ??కృష్ణ : అంటే నేను ముందు తన అలవాట్లు తెలుసుకుని... తన కి ఏమి ఇష్టమో తెలుసుకుని ..... ఫస్ట్ నా ప్రేమని


మనసులో పెట్టుకుని .... దాని మీద స్నేహం అని ముసుగు వేసి ... తనకి నచ్చని అలవాట్లని దాచిపెట్టి ....


మంచోడిలాగా నటించి ఒక ఆరు నెలలు గడిచాక అప్పుడు ముసుగు తీసేసి ..... ఐ లవ్ యు అని చెప్పాలా ???


మోహన్ : నిన్ను ఎవడు మార్చలేడు రా... చెప్పింది వినవు ..... అర్ధం చేసుకోవు ....

నేను : కొన్ని విషయాలో మరి అంత ముక్కు సూటిగా వుంటే పని కాదు రా ....


 కృష్ణ : ఎడ్చావ్...... అబ్బో .... !!! మూడునర్రైంది రా..... నిద్ర రావట్లేదా మీకు  ???


నేను : లేదు చెప్పు ..... బావుంది కొత్తగా , ఇంటరెస్టింగ్ గా   ...... చెప్పు .....

కృష్ణ : సరే, తర్వాత .....


 అంటూ  మళ్ళి చెప్పడం మొదలు పెట్టాడు ..... వాడు చెప్పినా విధానం సినిమా స్టొరీ లావుంది ....వాడి ప్రేమ కథ


మొత్తం  విన్నాక అర్ధం అయింది .... సినిమా కథలు కూడా నిజ జీవిత లోనుంచే తయారవుతాయని ....

Blog Archive

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......