చీకటి వెలుగుల రంగేళి ......


భోగి ప్రయాణం ..........

ఈ రోజు ప్రొద్దున్నే టైం 6:00 అయిందనుకుంటా ........... బస్సు విజయవాడ  చేరుకుంది  .........

" బస్సు స్టాండ్ ........... దిగాలండి ........... " చిన్న కేక.....

చందు "అరేయ్ లేరా విజయవాడ వచ్చింది ........."

మొహం మీద ముసుగు తీసి ....... కిటికీ కి  వున్నా కర్టెన్ పక్కకి జరిపాను... "

పక్కన కృష్ణ బ్రిడ్జి ....... కృష్ణా బ్రిడ్జి కి తెల్ల చీర కట్టినట్టు ........... ఎంత అందం గావుందో .....

అలా చూస్తూ ఉండగానే బస్సు స్టాండ్ రానే వచ్చింది ........... ఇక కిందకి దిగాం .....

తర్వాత  చందు ని బస్సు ఎక్కించి .......... నేను మా వూరు  బస్సు ఎక్కాను..........

మా కండక్టర్ బెంజ్ సర్కిల్ దగ్గరికి వచేసరికి ఒక పది టికెట్స్ మాత్రమె కొట్టగలిగాడు...

అందుకే బెంజ్ సర్కిల్ కంటే  ముందు కాసేపు ఆగింది బస్సు...

బస్సు ఆగినచోట రెండు గంగిరెద్దు  బృందాలు ఎడ్లను తయ్యారు చేస్తున్నారు...


ఒక 20 నిముషాలు  అక్కడ ఆగాం.... అది చూస్తూ వున్నాను .... మొత్తం ఆరుగురు వున్నారు, రెండు ఎడ్లు వున్నాయి..


ఒకళ్ళు సన్నాయి ఊదే అతను, ఒకతను డోలు వాయించే అతను... ఇంకొక  అతను ఇళ్ళల్లో వాళ్ళని పిలిచేఅతను...


ఒక పదిహేను నిముషాల తర్వాత వాళ్ళు బయల్దేరారు ...వాళ్ళు ఆగిన చోటే పక్కన ఒక ఇంటి తోనే మొదలుపెట్టారు...

వారి పిలిచినా పిలుపుకి వస్తారా ఎనుకున్న... ఇంతలో ఇంటి గేటు  పెద్ద గా చప్పుడయింది...

ఒక 18 ఏళ్ళ అమ్మాయి బయటకోచింది...

ఇప్పుడే లేచినట్టుంది చింపిరి జుట్టు  తో చాల అందం గా వుంది (సింపుల్ గా వుంది కదా అందుకే అలా అనిపించిన్దనుకుంట )...

ఒక గ్లాస్ లో బియ్యం తెచ్చి వాళ్ళ సంచి లో పోసి టక్కున గేటు వేసేసి పోయింది..

వాళ్ళు బయల్దేరారు ............ వాళ్ళు బయల్దేరిన ఒక ఐదు నిముషాలకి మేము కూడా బయల్దేరం...


ఇంకా దార్లో ....... రోడ్డు మీద అక్కడక్కడ అదుర్స్ కట్ అవుట్ లు  పెట్టి వున్నాయి...


ఇంకా ఒక ఇంటికి అప్పుడే పచ్చని మామిడి తోరణాలు కడుతున్నారు...


ఒక  ఇంటిముందు పెద్ద ముగ్గు వేసి వుంది .... దాని మీద బంతిపూలు అక్కడక్కడ చల్లి వున్నాయి ....

ఆ ముగ్గు చూడడానికి చాల పెద్దదిగా ........ చతురస్రాకారం లో వున్నా ..........కారపూస ల వుంది .... :) :)ఇంకా  ఒక రెండు చోట్ల భోగి మంట వేస్తున్నారు... దాని మీద రెండు మూడు గిన్నెల్లో  నీళ్ళు కూడా పెట్టారు .... వేడినీళ్ళ స్నానానికి అనుకుంటా..టైం ఏడు కావస్తోంది ......... ఇంకా బయట మంచుగానే వుంది... పొలాలకి  చెట్లకి తెల్ల చీర అడ్డంపెట్టినట్టు వుంది ...అందులో నుంచి కని కనపడని అందాలలాగా చెట్లు పొలాలు కనపడుతున్నాయి ......." పచ్చని పంటలు వెచ్చని జంటలు............ కమ్మని జీవితం ఇదే నవభారతం .............." ఆ పాట గుర్తు వచ్చింది..


ఇంకా కొంచం ముందుకి వెళ్ళ గానే .. ఒక అమ్మాయి లంగా-వోణి వేసుకుని ............. పూలు పట్టుకుని వెళ్తోంది గుడి కి అనుకుంట..

ఆ అమ్మాయి

" పచ్చని చేల పావడ గట్టి............ బొండుమల్లెలె కొప్పున బెట్టి వచ్చే దొరసాని ......... మా వన్నెల కిన్నెరసాని ...."

అన్నట్టు వుంది..

ఇంకా ఆ పాట ఊహల్లో  వుండ గానే ......... మా ఇల్లు వచ్చింది .... ఇంకా దేగేసా..........

2 comments:

srujana said...

Happy bhogi journey.:)
మీకు సంక్రాంతి శుభాకాంక్షలు

Phani Yalamanchili said...

ధన్యవాదాలు సృజన గారు...

మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ......... :)

Post a Comment

Blog Archive

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......