చీకటి వెలుగుల రంగేళి ......


అనుకుని ... అనుకోని రోజు ....ఒక రెండు రోజుల ముందునుంచి నేను, మా అక్క హైదరాబాద్ లో కలుద్దాం అనుకుంటున్నాం ....


కాని నేను ఫిక్స్ అయ్యాక  హ్యాండ్ ఇచ్చింది  .... కాని మనం ఒకసారి కమిట్ అయితే మా బాస్ మాట తప్పితే ఎవరి మాటా వినం కదా ... కాని మనం హైదరాబాద్ వెళ్తున్న విషయం ఆయనకీ చెప్పలేదు కాబట్టి ప్రాబ్లం లేదు....


ఇంకా నేను వస్తున్నానని తెలిసిన వెంటనే హైదరాబాద్ లో నా అభిమానులు హర్షం వ్యక్తం చేసారు ... అంటే శ్రీను గాడు, రంగి గాడు వీళ్ళు ఇద్దరు అంతేలే ... అసలే నిన్న శాలరీ పడిందేమో పెద్ద పెద్ద స్చేచ్ లు వేసేసం ....


ఇంకా నేను పండ పండగగా నా మొబైల్ లో పాటలు వింటూ ... JBS లో దిగేసా .....


ఇంకా శ్రీను గాడి కోసం వెయిటింగ్ .... అసలే నేను సమయాన్ని వృధా చెయ్యను కాబట్టి .... ఈ టైం లో ప్రేమ్ తో నా గొప్పతనం గురించి, నా తెలివి తేటలు గురించి , కథలు కథలు గా చెప్తుంటే .....


"అవును, డైరెక్ట్ గా కార్ లో వచ్చేయ్యోచు గా హైదరాబాద్ " అన్నాడు ప్రేమ్ .... నా అద్బుతమైనా తెలివితేటలూ ప్రదర్శించే సమయం ఆసన్నమయిందని గుర్తించి.... " మద్యలో టోల్ గేటు  వుంది ... అక్కడ వంద బొక్క ఎందుకని బస్సు లో వచాను ." అన్నా... అప్పుడు గుర్తోచింది అసలు విషయం ... " టికెట్ తీసుకునేటప్పుడు వంద ఇచ్చి యాభై చిల్లర తీసుకోవడం మర్చిపోయా ."

ఇంకా చేసేది లేక .. ఇప్పుడు ఈదుకుంటూ CBS వెళ్ళే ఓపిక లేక వదిలేసా....ఇంకా ఆ విషాదం ప్రేమ్ కి చెప్పి .. కాసేపూ తను పకా


పకా నవ్వాక... పరాభవ భారం తో ... "పాంచాలి పంచ భద్రుక ....." అన్న రేంజ్ లో ఫోన్ పెట్టేసా ...

సర్లే ఈ శ్రీను గాడి ఎక్కడున్నాడో అని వాడికి కాల్ చేస్తే .... వాడు నువ్వేక్కడున్నావ్ .... అన్నాడు ....

నేను ఈ JBS దగ్గర అదుర్స్ పోస్టర్ దగ్గర వున్నానని చెప్పా.... సరే వస్తానని చెప్పి .... 


ఎప్పుడో ఒక అర గంటకి వచాడు ... తెల్ల జుట్టుకి బూరలిచ్చేవాళ్ళు ఊరంతా తిరిగి వచ్చినట్టు ..... (ఇది కూడా వాడి తిట్టే ...)

ఇంకా రంగి గాడి దగ్గరకి వెళ్ళాం  ... వాడూ నాలాగే ఉంటాడు ....... సంక్రాంతికి సన్నాయి ఊది ఊది ఊపిరితిత్తులు లోపలకి వెళ్లి 

పోయినాడి లాగా ...

ఇంకేముంది రంగి గాడు చికెన్ తెచ్చేస్తే .. వాడి రూం మేట్ వండటం మొదలెట్టాడు ....అది ఉడికే లోపు కావలిసిన పరికరాలు తెచుకోవటానికి బయటకి బయల్దేరాం రంగి గాడి బండి మీద ... రాత్రి పూట దోమల మందు 

కొట్టేవాళ్ళ లాగా ....


మా శ్రీను గాడి వెరైటీ అభిరుచి కి తగ్గట్టు ... వాడు మామిడి తాండ్ర అవి ఇవి తింటూ ఉంటాడు .... కాసేపూ వాడు ఆ చెత్త చెదారం 

తిని అన్ని తీసుకుని రూం కి బయల్దేరాం


ఇక నిదానం గా మొదలెట్టి అన్ని కబుర్లు ..... కస్టాలు మూడింటి దాక చెప్పు కున్నాక .... తిని పడుకోటానికి తయ్యరవుతుంటే ... 

శ్రీను గాడు "జోసెఫ్ అంకుల్ ..........!!!" అన్న రేంజ్ లో ......... వాడికి ఎప్పుడో తిట్టిన మా మేనేజర్ గుర్తు వచాడు ....


ఇంకా వాడికి ఫోన్ చెయ్యటం మొదలెట్టాడు .... అరేయ్ అద్దరాత్రి ఎం మద్దెల దరువురా ...... అన్న కూడా వినడు ...


మా అదృష్టం బావుంది ఆ మేనేజర్ ఫోన్ ఎత్తలేదు కాబట్టి బ్రతికి పోయాం.... 


తర్వాత "ఒరేయ్ .... ఫోన్ లిఫ్ట్ చేస్తే ఎం చేసే వాడివి రా" అని అడిగితే ......


ఏముంది ".... ఒరేయ్ .. మీ అన్నయ్య  హైదరాబాద్ వస్తున్నదంట .. నీ ఫోన్ కలవక పోతే నాకు చేసాడు ......" అని చెప్పేవాడిని ..... "అయ్యో ...!! మీరా సర్ ..... నిద్ర కళ్ళలో పేరు సరిగ్గా కనపడలా ......" అని పెట్టేసే వాడిని అన్నాడు ....


"అబ్బ .....! నువ్వు మగాడివి రా బుజ్జి .......!" అన్నా నవ్వుతూ శ్రీను గాడి తో .... (అతడు లో తనికెళ్ళ భరణి టైపు లో ...)


అవి నిన్నటి విశేషాలు ..... ***************************


అక్కా ..........!!!  హైదరాబాద్ లో కలుస్తానని ఆశ పెట్టి .... కలవేలేదు గా ......... నీకు ఆశ కురుపులు వస్తాయ్ పో.........4 comments:

నేస్తం said...

:) మా అక్కని నేనూ ఇలాగే అనేదాన్ని..ఆశ కురుపుల విషయం లో :)

Maruti said...

:)

kalpasri said...

sorry thamudu kudharaledu ra

Phani Yalamanchili said...

@ నేస్తం
మీకు పాత జ్ఞాపకాలు గుర్తు వచ్చాయన్నమాట :)

@మారుతి
:):)

@ కల్పశ్రీ
నువ్వు నాకు చెప్పేదేంటి అక్కా .... సరదాగా అన్నాను ...:):)

Post a Comment

Blog Archive

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......