చీకటి వెలుగుల రంగేళి ......


మా ఊరి బజ్జిలబండి ....


ఇంతకు ముందు ఈ బండి దగ్గర నేను, చందు సాయంత్రం తింటూ వుండేవాళ్ళం ...

అప్పట్లో జేబులో ఇరవై రూపాయలు వుంటే పండగ లా అనిపించేది ... చదువుకునేటప్పుడు  రోజులు నిజం గా బావుండేవి...

ఇప్పుడు ఆ ఇరవై రూపాయలకి వెయ్యి రెట్లు వస్తున్నా అప్పుడు వున్న ఆనందం  ఇప్పుడు లేదేందుకో... !!!!

ఈ బండి దగ్గర ఎన్ని రకాలు దొరుకుతాయో .... మషాలా , బజ్జీలు, మళ్ళి అందులో రకాలు అరిటికాయ బజ్జీలు , ఎగ్ బజ్జి ,వంకాయ బజ్జి, ముంత మషాలా ..........

అబ్బ!!! ఎన్నాళ్ళయిందో తిని .... అందుకే మొన్న వెళ్ళినప్పుడు ఒక చూపు చూసాం ఇద్దరం ..... చాల రోజుల తర్వాత ...

సాయంత్రం కాలేజీ నుంచి వచ్చాక ... కాసేపు నిద్రేసి ... సాయంత్రం ఆరు గంటలకి లేచి .... అలా చల్ల గాలికి బయటికెళ్ళి ...

అలా కాసేపు బండి దగ్గర మసాల తిని ... అలా స్టేడియం దగ్గర కాసేపు ఆడుకే వాళ్ళని చూసి .... అలా గడిచేవి ఆ రోజులు  ...

అందుకే మొన్న ఒక ఫోటో క్లిక్ మనిపించాను .... ఇప్పుడు ఏవో ఫోటోలు చూస్తుంటే కనబడింది ...

అంతేలే మనిషికి జ్ఞాపకాలే అందం గా కనపడతాయి ..... ఇవ్వాల్టి రోజు కూడా రేపు చూస్తే అందం గానే వుంటుంది ....

ఒకో సారి అనిపిస్తుంది చూసే మనసుండాలి కాని గడిచిన ప్రతి క్షణం కూడా అందం గానే ఉంటుందేమో .... :):):)
3 comments:

'Padmarpita' said...

మీ జ్ఞాపకాలు బాగున్నాయండి.

Indian Minerva said...

అంతేలే మనిషికి జ్ఞాపకాలే అందం గా కనపడతాయి ..... ఇవ్వాల్టి రోజు కూడా రేపు చూస్తే అందం గానే వుంటుంది ....

How true!

Phani Yalamanchili said...

@పద్మర్పిత గారు
ధన్యవాదములు
@మినర్వ గారు
నిజమే కదా ....!!! అందుకే అన్నారు జ్ఞాపకాలే నిట్టుర్పు ....జ్ఞాపకాలే ఓదార్పు అని ....!!!

Post a Comment

Blog Archive

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......