చీకటి వెలుగుల రంగేళి ......


నిజంగానే ఏదో మాయ చేసింది ......

హెచ్చరిక :   ఒకళ్ళని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకున్న వాళ్ళు   ఈ సినిమా చూడొద్దు .... మనకి ఇలా ఎందుకు జరగలేదా....!!! అని బాధ అనిపిస్తుంది ... ఇక ప్రేమించను.... నీ తో మాట్లాడను  అనుకున్న వాళ్ళు  కూడా ఈ సినిమా చూడకండి ... లైఫ్ లో ఏదో మిస్స వుతున్నాం అనే భావన కలుగుతుంది ... అది మిమ్మల్ని, మీ నిర్ణయం మీద స్తిరం గా ఉండనివ్వదు... ప్రేమికులు ఇక మీకు చెప్పేదేముంది మీరు చెలరేగండి ....


ఇది ప్రజా ప్రయోజనాల రీత్యా జారీచేయబడింది ....


ఈ రోజు కొంచెం పని వుంటే సైట్ కి వెళ్ళాను ... వచ్చేసరికి సాయంత్రం అయ్యింది ...

ఇంకా ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే ... ఇంతలోకి సినిమా ఇలా వుందో అని గుర్తొచ్చింది ...

ఇంకా అంతే వెంటనే జీవి రివ్యూ ఓపెన్ చేశా ....

ఇక్క సారి మైండ్ బ్లాస్ట్ 4/5..... ఇచ్చాడు .....

అసలే సినిమా చూడాలని నిన్నే ఫిక్స్ అయ్యానేమో ... ఇంకా ఎప్పుడు టైం

 అవ్తుందా అని ఎదురుచూస్తూ కూర్చున్న ...

నేను ఎదురు చూసిన టైం రానే వచ్చింది...

" ప్రపంచం లో ఎంతో మంది అమ్మయిలుంటే నేను జెస్సినే.... ఎందుకు లవ్ చేసాను ....?? "

చైతన్య మొదటి డైలాగ్ సినిమా లో...

ఇక్కడ మొదలైన కథ ఎన్ని మలుపులు తిరుగుతూ వుంటుందో అది స్క్రీన్ మీదే చూడాలి ...

చక్కటి ప్రేమ కథని సుతిమెత్తగా తెరకెక్కించారు ....

సినిమా మొత్తం లో ఎక్కడో  ఒక్క  సీన్ లో అయినా, ఒక్క డైలాగ్ లో అయినా  .... 

నిజంగా నాకూ ఇలానే జరిగిందే అనుకుంటారు ...

కథ గాని, చిత్రీకరణ కాని చాలా బావుంది ...

సంభాషణలు చాలా సహజ సిద్దం గా వుంటాయి ...

ఇక హీరో నటనా , హీరోయిన్ నటనా బావుంది ...

ఇక పోతే హిందీ సినిమా స్టైల్ చిన్న గా  తెలుగు కి  దిగినట్టుంది ...

సినిమాలో నాగ చైతన్య ఒక పది సార్లు హీరోయిన్ పెదాలకి తన పెదాలతో లంకె వేస్తాడు ....

ఇదే .... నేను మొదటి సారి ఇన్ని లిప్ టు లిప్ సీన్ లు తెలుగు సినిమా లో చూడటం ...

అది సినిమా.......... నాకైతే బాగా నచ్చింది ....

ఇక రేటింగ్ అంటారా ........

నాదీ జీవి బాటే ..........


నిజం గా "ఏమాయ చేసావే ".......ఈ రోజు బానే గడిచింది .... మధ్యానం దాక సైట్స్ తిరిగి వచ్చాను రూం కి .... మా సర్ కూడా ,....ఇవాళ హైదరాబాద్ వెళ్ళిపోయాడు ...


తర్వాత వచ్చి టీవీ చూస్తూ కూర్చున్నాను ..." మా "టీవీ లో " ఏమాయ చేసావే " గురించి ప్రోగ్రాం వచ్చింది ...


బాగా నచ్చింది అందులో మాటలు ... ఈ సినిమా కోసం నేను బాగా వెయిటింగ్ ...


మీరు సినిమా రేపు చూడకపోయినా పర్లేదు,...... నేను చూసి రేపు ఈ పాటికి నా రివ్యూ చెప్తాను ..


నా రివ్యూ నేను చెప్తాను ....... అంతే ...... ఎందుకంటే  ఇది నా బ్లాగ్ ...... నాకు నచ్చితే  బావుందని చెప్తాను .. లేకపోతే బాలేదని చెప్తాను అంతే ..........


ఈ సినిమా ట్రైలర్ లో కొన్ని మాటలు నా ఆర్కుట్ లో కూడా పెట్టుకునాను ...... అవి ఏంటంటే ......
"
ప్రేమంటే వెతుక్కుంటూ వెళ్ళలేం .... అలాంటి ప్రేమ ఎప్పటికి మనతో వుండదు ....అదే జరగాలి.... మనల్నేదో మాయ చేసినట్టుండాలి ....


తలకిందులు చేసెయ్యాలి ....ఎప్పుడూ మనతోపాటే వుంటుంది


అది నిజమైన ప్రేమ ....


అదే నాకు జరిగింది ........


A different love story ..... yet again ....


Between jessie n karthik .... "
Just watch it .........


చూద్దాం సినిమా ఎలా వుంటుందో .........!!!!!!!!!


నేను రాసిన లీడర్ రివ్యూ ఎవరినైనా నొప్పించి వుంటే ....... నాకు సంబంధం లేదు ..........


ఎందుకంటే నేను రాసిన రివ్యూ  నాకు అనిపించింది అంతే .......


ఇప్పటికీ చెప్తున్నాను లీడర్ నాకు అస్సలు నచ్చలేదు ........


రేపు చెప్తాను ఏమాయ చేసావో ఎలావుందో ....... నా బాషలో ..........


Stay connected .........

కొన్ని creative adds..

ఈ రోజు నా మెయిల్ కి కొన్ని మంచి ప్రకటనలు అని మెయిల్ వచ్చింది ....చూడండి అవి ఒక సారి  ....శ్రీ రాం సాగర్ ప్రయాణం ......

నిన్న సాయంత్రం నేను, వెంకట్ గారు కలిసి శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్ట్ చూద్దామని వెళ్ళాం ....


సాయంత్రం తిన్న తర్వాత బయల్దేరాం ..... నేను ప్రాజెక్ట్ అంటే బాగా నీళ్ళు వుంటాయేమో అనుకున్న .... ఎందుకంటే ఇంతకుముందు ఒక సారి వానా కాలం లో శ్రీశైలం ప్రాజెక్ట్ లో నీళ్ళు చూస్తే భయమేసింది ... అలా ఉంటుందేమో అనుకున్నా...
కాని అంత లేదు ఇక్కడ ... మాములుగానే వుంది ...


ఇంకా వెళ్ళే దారిలో దారి తప్పి ఎటో కొంత దూరం తీసుకెళ్ళాడు మా డ్రైవర్  ... ఆ దారిలో ఒక పెద్ద పాము కనపడింది ... గబగబా నేను , వెంకట్ గారు కిందకి దిగి ఫోటో తీసాం... రెండుతలల పాము అది ...తర్వాత ఎవర్నో దారి అడిగి అప్పుడు మళ్ళి కరెక్ట్ దారి  లోకి వచ్చాం ...

ఇంకా అక్కడికి వెళ్లేసరికి అయిదున్నర అయినట్టుంది ... పైకి ఎక్కేటప్పుడు దారి బావుంది ...

కార్ మొత్తం డం మీదకి వెళ్ళిపోతుంది ..
 
ఇదే ఆ డ్యాం ఫోటో ..

ఇది డ్యాం గేట్లు ..
డ్యాం మీద నుంచి అవతలి సైడ్ ..
డ్యాం లో సేద తీరుతున్న పిట్టలు ...

డ్యాం మీద ఇది ...
డ్యాం కి ఇంకో  వైపు
డ్యాం పక్కని థర్మల్ పవర్ స్టేషన్ ...

డ్యాం పేరు చూపే బోర్డు ...

డ్యాం గురించి లెక్కలు చూపే బోర్డు ...

డ్యాం లో నీళ్ళు...

అస్తమిస్తున్న భానుడు .....

ఇంకా ఒక ఐస్ క్రీం తిని బయల్దేరాం ... వచేటప్పుడు నేనే డ్రైవ్ చేసాను ...

హై వే మీద డ్రైవ్ చేస్తుంటే మస్తు మజా ...గా వుంది ...

ఇంకా వచ్చే దారిలో ఒక మలుపు దగ్గర ఒక బస్సు చుట్టూ జనం వున్నారు ... ఏంటా ...!! అని చూస్తే ఒక కుర్రాడు బైక్ తో సహా బస్సు ముందు tyre   కింద వున్నాడు ...

ఇంకా అది చూడ గానే మళ్ళి అటు వైపు చూడలేదు ... అలాంటివంటే భలే భయం నాకు ...

ఒక్క సారి గుండె జల్లుమంది ... అయ్యో పాపం అనిపించింది ...

ఎంత చిన్నదో కదా జేవితం ... రెప్పపాటులో జరిగుంటుంది ఆ ప్రమాదం ...

ఇంకా రూం కి వచేసాను ... తర్వాత  వెంకట్ పిలిచారు ... ఏంటా...!! అని చూస్తే ...

టీవీ లో స్క్రోల్లింగ్ వస్తోంది ... బస్సు ప్రమాదం ఇద్దరు మృతి అని ....

అదేంటి ఒక్కరేగా అన్నాను ... వెంకట్ అన్నాడు..... కాదు, అవతలి tyre కింద ఇంకో అతను వున్నాడు అని ...

ఇంకా నాకు ఏం అనాలో కూడా  తెలియలేదు ...

ఇంకే మనగలం : May their Soul rest in peace అని తప్ప...

అందుకే ఈ టైం లో ఒకటి చెప్పాలనుకుంటున్నా : ఒక సారి మీరు  బండి తోలేతప్పుడు మీ వాళ్ళని గుర్తు పెట్టుకోండి , మీ కోసం  ఎవరో ఒకళ్ళు ఎదురు చూస్తూ ఉంటారని గమనించండి

ఓ సాయంత్రం ...
ఇప్పుడే అబ్బాయి నిద్ర లేచాడు ......

బయట భీకరమైన హోరు గాలి ...........

కరెంట్ వస్తూ పోతూ వుంది ......

"అబ్బాయి  టీవీ ఆపు ...... కరెంటు వస్తా పోతా వుంది ....."

ఇంతలోనే చుట్టూ చీకటైంది ......

విశాలమైన ఆకాశాన్ని ..... కారు మేఘాలు ఏలుతున్నాయి ....

పక్క డాబా మీద ఆరబెట్టిన బట్టలకోసం అమ్మాయ్ పరిగెత్తుతోంది .....

డాబా ఎదురుగా వున్న కాళీ ప్రదేశం, ఆత్రుతగా వర్షం కోసం ఎదురుచూస్తోంది ....

నా పక్కనుంచి  " ఇంత గాలి వస్తోంది గా, వర్షం రాదు ....."

గట్టిగా అనకు బయట నేల వింటే బాధ పడుద్ది అనాలనిపించింది .......

పక్కన కిటికీ అద్దాలు వాన ఆహ్వానిస్తూ మేళాలు వాయిస్తున్నాయి ....

కింద వున్న ఇసుక మీద పట్టా కప్పుతున్నారు .... అది చూసి నేను , నేల ఎంత సంతోషించామో .....

ఇంతలో ఏదో ఫోన్, అది మాట్లాడి పెట్టేసేలోపే ..... నేల ఎదురు చూపులు ఫలించాయి ....

ఒక చినుకు ... దాని వెంబడే మరో చినుకు .... ఇలా చినుకుల సవ్వడి మొదలైంది ....

నేల ఎదురు చూపులు ఫలించాయి .... నేలతల్లి హైదరాబాది బిర్యానిని మించిన వంటకమేదో వండి పోస్తున్నట్టుంది....

ఒకటే కమ్మని వాసన ....

ఇంతలో అమ్మ  పిలిచింది...... పొద్దున్న మిగిలిన పిండితో .... దిబ్బ రొట్టెలు .... నాకొకటి .... తమ్ముడుకొకటి ....

అందులోకి అల్లం పచ్చడి ....

అమ్మా ముందు నాకు ... కాదు కాదు  నాకు కావాలి .....

అబ్బ ఆపండ్రా మీ గోల చెరో ఒకటి  తీసుకోండి ....

అబ్బ!! ఎన్ని పంచుకున్నం రా తమ్ముడు మనం ... అమ్మ ఒడి దగ్గరనుంచి ... ఇప్పటి దిబ్బ రొట్టెల దాక ... (నాతో నేనే మనసులో ఇప్పుడు ....)

వరండాలో పట్టీల మంచం మీద .... చల్ల గాలి కొడుతువుంది .....

ఆ గాలి వస్తూ వస్తూ కొన్ని వాన తుమ్పరల్ని తోడ్కొని వచ్చి నా మీద వదిలి వెళుతోంది ....

వాన పెద్దదయింది ..... అబ్బాయ్ మంచం లోపలెయ్ వానకి తడిసిపోద్ది.....

అయ్యో కరెంటు పోయింది ....

అమ్మా  కువ్వొత్తి ఏది .... ఆ దొరికింది లే ....

కువ్వొత్తి కాంతిలో  కాళీ అయిన నా ప్లేటు ఇంకో రొట్టె కోసం చూస్తోంది ....

అబ్బ వర్షం తగ్గింది ..... కరెంటు వచ్చింది .......

ఒరేయ్ remote  ఇటివ్వు ........ నేనివ్వను .....

ఇవ్వమన్నానా ........!!!!! ......... ఇవనన్నానా .....!!!

అమ్మ అన్నయ్య చూడు ..... remote లాకున్టున్నాడు .......

అబ్బ మళ్ళి మొదలు గొడవ ..... కానీయండి నాన్న  వచ్చే టైం అయింది లే ..... అంది అమ్మ

ఆహా remote దొరికింది .... అబ్బ కత్తి లాంటి పాట ....

వీడెందుకు నేను పాటలు పెట్టుకుంటే నవ్వుతున్నాడు .... తమ్ముడిని చూసి ....

వెనక్కి తిరిగా .... ఇంకేముంది నాన్న ...... అప్రయత్నం గా  remote  నా చేతిలోనుంచి ... నాన్న చేతిలోకి వెళ్ళిపోయింది ..

చానల్ కూడా మారిపోయింది .... గెంతులేసే వాళ్ళు పోయి .... గేన్తులేయించే  వాళ్ళు వచ్చారు టీవీ లోకి .... అదే న్యూస్

ఛానల్ వాళ్ళు  .....


( ఇలా వుండేది వర్షం పడిన రోజు ఇంతకుముందు .... ఇప్పుడు వర్షం మొదలు కాగానే అవన్నీ ఒక్కసారి కురిశాయి మనసులో ...)

ఇప్పడు ఆ వర్షము అలానే వుంది ... ఆ ప్రకృతి అలానే వుంది ...

ఒక్క నేను తప్ప .....

ఇప్పుడు మా తమ్ముడికీ పోటీ లేరు గా ......

నేను - "లీ డర్" తో .....ఈ రోజు సినిమాకి వెళ్ళాం .... ఇప్పుడే వచ్చాను  .... రోజూ బ్లాగ్ రాద్దాం అనుకుంటున్నాను కాని ఏదో పని లో వుండి రాయటం కుదరటంలేదు  ... చాల రోజుల తర్వాత ఈ రోజు సెకండ్ షో కి వెళ్లి వచ్చాను .... ఇంతకీ సినిమా  పేరు చెప్పేదేముంది ...
మన శేఖర్ కమ్ముల సినిమా "లీడర్ "....

ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5.......... అంతే దీనికి ఇదే ఎక్కువ అనిపించింది .... ఒక పక్క శేఖర్ కమ్ముల సినిమా అని , ఏదో రాజకీయాల మీద అంటే వెళ్ళాను .... కాని అసలు శేఖర్ కమ్ముల ఎం చెప్పాలనుకున్నాడో మాత్రం నాకు అర్ధం కాలేదు ....

సినిమాలో పెద్దగా యే సీనూ అంత హత్తుకునేది గా నాకు అనిపించలేదు ...

అవినీతిని అరికట్టడం కూడా పెద్దగ ఏం గొప్పగా చుపిన్చాడనిపించలేదు .....

ఏదో సినిమాలో సీన్లు అన్నీ అక్కడక్కడ అతికించినట్టు అనిపించాయి ..... నా అభిప్రాయం ప్రకారం శేఖర్ కమ్ములకి లవ్ , యూత్ సినిమాలే కర్రెక్టేమో ........!!!!

idlebrain.com లో జీవి రివ్యూ లో మాత్రం .... 3/5 రేటింగ్ ఇచ్చాడు ...

ఏది ఎంతవరకు నిజమో మీరే సినిమా చూసి చెప్పండి ....

ఇంకా సినిమా అయ్పోయాక రైల్ వే స్టేషన్ కి వెళ్లి మామూలు గానే చాయ్ తాగి రూం కి వచ్చాం ....

పక్కన లాప్ టాప్  లో " కన్నులు నీవే రెప్పలు నీవే ..... కలలు మాత్రం చెలియా నావే ...... " పాట వస్తోంది .....

ఉరుములు నీ మువ్వలై .......

నిన్న మా ఫ్రెండ్ దగ్గర ఈ పాట విన్నాను ......... చాల బాగా నచ్చింది .....


ఇంకా వెంటనే ఇది నా కాలర్ ట్యూన్ గా పెట్టేసాను .... వెంటనే ఆంధ్ర విలాస్ నుంచి డౌన్లోడ్ చేసేసా ....


... ఈ పాట నిన్న ఒక యాభై సార్లన్న వినివుంటా ... నిన్న మూడుగంటల వరకు ఈ పాటే మోగుతువుంది ...


పాటలో భావమంతా ముత్యాల్లా ఎంత అందం గా పేర్చారో చూడండి ఒక సారి ......

ఉరుములు నీ మువ్వలైమెరుపులు నీ నవ్వులై


తొలకరి మేఘానివై రా అలివేణి


పరుగులు నీ గానమై


తరగలు నీ తాళమై


చిలిపిగ చిందాడవే కిన్నెరసాని


కాలానికే కాలాడక ఆగాలి నువ్వు ఆడే వేళ


అది చూడగా మనసాగక ఆడాలి నీతో నింగి నేల


తకధిమి తాళాలపై తళుకుల తరంగమై


చిలిపిగ చిందాడవే కిన్నెరసాని


మెలకల మందాకిని కులుకుల బృందావని


కనులకు విందీయవే ఆ అందాన్ని


చంద్రుల్లో కుందేలే మా ఇంట ఉందంటూ


మురిసింది ఈ ముంగిలి


చిందాడే కిరణంలా మా ముందు నువ్వుంటే


ప్రతి పూట దీపావళి


మా కళ్ళల్లో వెలిగించవే సిరివెన్నెల


మా ఆశలే నీ అందెలై ఈ మంచు మౌనం మ్రోగే వేళ


ఆ సందడే ఆనందమై


ప్రేమించు ప్రాణం పాడే వేళ


ఉరుములు నీ మువ్వలై


మెరుపులు నీ నవ్వులై


తొలకరి మేఘానివై రా కల్యాణి


పరుగులు నీ గానమై


తరగలు నీ తాళమై


చిలిపిగ చిందాడవే కిన్నెరసాని


నడయాడే నీ పాదం నట వేదమేనంటు


ఈ పుడమే పులకించగా


నీ పెదవే తనకోసం అనువైన కొలువంటు


సంగీతం నిను చేరగా


మా గుండెనే శృతి చేయవా నీ వీణగా


ఈ గాలిలో నీ వేలితో రాగాలు ఎన్నో రేగేవేలా


నీ మేనిలో హరివిల్లులే వర్ణాల వాగులై సాగేవేళ


ఉరుములు నీ మువ్వలై


మెరుపులు నీ నవ్వులై


తొలకరి మేఘానివై రా అలివేణి


పరుగులు నీ గానమై


తరగలు నీ తాళమై


చిలిపిగ చిందాడవే కిన్నెరసాని
 
ఇంతకీ ఈ పాట ఎందులోదో తెసులా : చంద్ర లేఖ

ఆంధ్రుడు - ఆంగ్లమునిన్న మా బాల్యమిత్రుడు ..... నా ఆరో ప్రాణం ........... నా మూడో కాలు ..... అయిన నా కాలేజీ స్నేహితుడు రాజా  నిజామాబాదు విచ్చేసాడు. వాడు ఏదో ఆఫీసు పని మీద వచ్హాడు .... వాడిని నేను కలిసి దగ్గర దగ్గర ఒక ఏడు నెలలు అవ్తోంది ...

 ఇంకా కాసేపూ పిచ్చా పాటి మాట్లాడు కున్నాక .... ఇంకా రాత్రికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ....

ఈయన ఆంగ్లము చూస్తే అంగ్లేయులకే దిమ్మ తిరుగును .... అన్నేళ్ళు మనల్ని పరిపాలించిల వాళ్ళ మీద నాకు తెలిసి వీడికి మించి బాగా ఎవరూ కక్ష తీర్చుకోరేమో .......

నేను డిప్లొమా చేసి ఇంజనీరింగ్ జాయిన్ అవ్వటం వల్ల అప్పట్లో ఏదో మమ్ముల్ని పురుగుల్ని చూసినట్టు చూసేవాళ్ళు ....

మనోడు కూడా నన్ను రాగింగ్ చేద్దాం అని ట్రై చేస్సాడు కాని .... వర్క్ అవుట్ కాలేదు ....

అప్పట్లో వాడు అమ్మాయిలని ఏడిపిస్తూ ఉండేవాడు ..... ఇంకా మా క్లాసు లో ప్రియ అని ఒక అమ్మాయి వుండేది... చాల బావుండేది .... ఒక సారి పొరపాటున ఆ అమ్మాయి నెంబర్ వీడికి దొరికింది ..... ఇంకా ఆ అమ్మాయి సెల్ కి missed  కాల్స్ ఇవ్వటం లాంటివి చేసేవాడు ....

ఒక సారి సరదాగా ఆ సంగతి నాతో చెప్పాడు ......

ఇంకా నేను రూం కి వెళ్ళాక మా ఫ్రెండ్ టాటా నెంబర్ నుంచి వీడికి missed  కాల్ ఇచ్చాను ........

వీడు తిరిగి కాల్ చేసాడు ...  ఇంకా అంతే ఎందుకు రా పద్దాక నా లవర్ కి missed కాల్స్ ఇస్తున్నావ్ అని ..... ఇంకా పిచ్ఛ తిట్లు తిట్టేసా .... నువ్వెవరో నాకు తెలుసు రేపు కాలేజీ లో చూస్తావ్ నేనంటే ఏంటో అని ఫోన్ పెట్టేసా....

దానికి వీడూ భయపడినట్టు వున్నాడు ... ఒక మెసేజ్ పంపాడు ......

అబ్బ అది ఎన్ని సార్లు చదివానో నాకే గుర్తు లేదు .... యింకా అది ఇప్పటికీ అలానే గుర్తుంది .....

"Sorry for all these things.... iam not happen any bad things..... just giving missed calls ...... those also happen my friends ......... ok....... thank u "

అది ఆ మెసేజ్ ...... తర్వాత రోజు కాలేజీ లో మా ఫ్రెండ్స్ అందరం చూసి తెగ నవ్వుకున్నాం ...... తర్వాత వాడికి చెప్పాం అనుకోండి .....

ఆ దెబ్బతో ........ ఇంజనీరింగ్ లో నాకున్న బెస్ట్ ఫ్రెండ్స్ లో వీడు ఒకడై పోయాడు అప్పటినుంచి .....

నేను - నా రిజల్ట్స్


అది 2005 ....... అప్పుడప్పుడే నేను........... పిల్లాడి నుంచి పెద్దాడిని అవుతున్న రోజులు ...

ఇంట్లో మంచం మీద హాయిగా పడుకుని ...... తలకింద దిండు వత్తు పెట్టుకుని .... పక్కన ఈ రోజు న్యూస్  పేపర్లో, అమ్మ వండిన

చెక్కిడాలు పోసుకుని ..... ఏ ఛానల్ లో ఎలాంటి ప్రోగ్రాం లు వస్తున్నాయో సర్వే చేస్తున్న రోజులు ....

ఇంతలో నేను రాస్తా రోకోలు , ధర్నాలు , నిరాహార దీక్షలు చేసి సాదించిన నా నోకియా 1108 మొబైల్ మోగింది ...

దాని గురించి చెప్పాలంటే ఒక రోజు పట్టుద్దిలే ... తర్వాతా ఎప్పుడైనా తీరిగ్గా  ఆఫీసు లో వున్నప్పుడు చెప్తాను .....

ఎవడో నాకుతగ్గ వెధవ కాల్ చేసాడు .... సర్లే వీడూ ఇంట్లో కాళిగానే వుండుంటాడని ఫోన్ ఎత్తాను ....

ఇంతలో పిడుగు లాంటి వార్త .... కెవ్వు మని పెద్ద పొలి కేక .... అలా జరగటానికి వీలు లేదు ...

సజావుగాసాగుతున్న నా జీవితాన్ని చిన్నా భిన్నం  కానీయను .... కాని

ఈలోపే ఇవాల కాకపోతే రేపైనా తెలియాల్సిందే ఇంట్లో

అనే నిట్టుర్పు ......

సరే అని ఫోన్ పెట్టేసాను .......

ఇంకా అడుగులో అడుగు వేసుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళాను ..... నా గుండెలు వేగం గా కొట్టుకున్తున్నాయ్  ....

అమ్మ దగ్గరికి వెళ్ళాను ... అమ్మ కూరగాయలు తరుగుతోంది ... చేతిలో కత్తిపీట..... కొంచం దూరం లో చీపురు  కట్ట ..... ఈ టైం

లో చెప్పోచా అని ..... చిన్న సందేహం ...

సర్లే ఎం కాదులే అని చెప్పేసా ......

 " అమ్మా ...!!! ECET రిజల్ట్స్ వచ్చాయి ......!!!!"

"ఎంత ...... rank ???"

చెప్పా ...........

తదిగినతోం ..... తదిగినతోం ....... తదిగినతోం .......

(ఎక్కువ ఊహించుకునేరు ........ గీతోపదేశమేలే జరిగింది ..... )

ఇంకా తర్వాత మా నాన్నకి చెప్పాలి .... ఇంకా నాన్న రాలేదు ....

నాలోని మనో వేదన , ఆత్మా క్షోభ నన్ను దహించ సాగాయి ......

ఈ లోపు తెలివిగా నేను నాకంటే  వెధవలు ఎవరన్నా వున్నారేమో ....

వాళ్ళని చూపించి నేను తప్పించుకుందాం అనుకున్నాను ....

ఒక నలుగురు వెధవల్ని ఎంచుకున్నాను ... అందులో మా రాజేష్ గాడు ఒకడు ....

అందరి డేటా సమీకరించే లోపు ...... మా నాన్న రానే వచ్చాడు  ....

ఇంకా అమ్మ  చెప్పింది విషయం .....

తదిగినతోం ..... తదిగినతోం ....... తదిగినతోం ....... (చిన్నదేలే .....)

అమ్మా!!!!! బ్రతికి బయటపడ్డననుకున్న .......... ఈలోపు మా ఫ్రెండ్స్ కి వచ్చిన ర్యాంక్ లు చెప్పా  ....

ఇంకా మా నాన్న తిని వచ్చి ......

ప్రశాంతం  గా కూర్చున్నాడు ... నేను నా మొబైల్ లో ఏదో కెలుకుతూ వున్నా ......

ఇంతలో మా నాన్నకి ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది ....

ఉన్నట్టుండి నా మొబైల్ అడిగారు ......  తీసుకెళ్ళి  ఇచ్చాను .... ఇంకా రాజేష్ వాళ్ళ ఇంటి నెంబర్ చూసి వాడికి ఫోన్ చేస్తే ...

వాళ్ళ నాన్న ఫోన్ లిఫ్ట్ చేసాడు ... ఇంకేముంది ....

నా కొడుకు ఎదవంటే ...... కాదు, నాకొడుకు ఎదవని ఇద్దరు పోటీలు  పడి మరీ ....చెలరేగారు ....

ఆ సమయం లో నాకు మా నాన్న "ప్రజలతో ముఖ్యమంత్రి" లో చంద్ర బాబు లా కనపడ్డాడు ...

నాలో ఉడుకురక్తం సలసల  కాగసాగింది .... కాని  ఎం చేస్తాం .... ప్చ్ .......ప్చ్ ...

అప్పటినుంచి మా నాన్న , మా  బాబు అయ్యాడు .......

ఇదంతా చూస్తున్న మా అమ్మ , తమ్ముడు....... మా బాబు బయటికి వెళ్ళాక నన్ను చూసి ఒకటే నవ్వు .....


ఇన్ని కష్టాలు వుంటాయి తెలుసా రిజల్ట్స్ వచ్చినప్పుడు  .... హా ....

కెరటాల మాటున ......


నీ పరిచయం నాలో పరవశం నింపిన సమయాన ....
ఆ పరవశం నా లోని ప్రేమను ఉప్పోగించిన క్షణాన ....


ఆ ఉప్పొంగిన సముద్రం లో నుంచి కొన్ని అలలనే......... నీ కు చూపించాలని ప్రయత్నించాను ...


ఇక నా ప్రేమ ప్రశాంతత నే చూసి భయపడిన నీకు ....


అది ఉత్తుంగ తరంగాలై ప్రవహిన్చేసమయం లో చూసి తట్టుకునే శక్తి లేదు...


ఇక అందుకే నేస్తం ..... నేను...... ప్రేమ అనుకునే ఈ సముద్రం ... సమస్త నీ హృదయాన్ని ముంచేత్తకముందే ....


ఈ ప్రేమికుల రోజు సాక్షిగా నిన్ను, నీ ప్రేమను ..... పరిత్యజిస్తున్నాను .....

నువ్విచ్చిన వెన్నెల......నా ఊహలు చెప్పిన ఊసులు వింటూ ....


నా మనసుకు తోచిన మాటలు అంటూ .....

నాతో నేను కాలం గడిపే సమయాన ....

తొలకరి చినుకులు పుడమిని తాకినట్టు.......నీ స్పర్శ నా హృదయాన్ని తాకింది ....


నా కంటి పాపలో నువ్వు వెలుగుతువుంటే .....


ఆ కాంతి నా జీవితానికి కొత్త దారిని చూపింది ....


ఒకానొక సమయం లో........


నీ ఒరచూపులొ భస్మి పటలం అయ్పోయినా...... ఈ జన్మ  ధన్యమే అనిపించింది ....,


ఇన్ని జ్ఞాపకాలు నాతో ఉండగా నువ్వు నాతో లేకపోతేనేం .....


నువ్విచ్చిన జ్ఞాపకాల వెలుగుతో .... తర్వాతి నా జీవితాన్ని గడిపేస్తా ....


ఏచంద్రుడైతేనేం  ....


ఆ వెలుగు నీ నుంచే వచ్చిందన్న ఆనందం తో ఆ వెన్నెలని ఆస్వాదిస్తా ....

(రేపు ప్రేమికుల రోజు .....!!! అందుకే .... నీకు నా ఈ అక్షరార్చన ....)

శివ రాత్రి - తిరనాలఅద్ది ... ఇంతకుముందు పోస్ట్ లో చెప్పాను కదా నేను ... సాయంత్రం రూం కి వచాను అని ... ఇంకా ఆరు గంటల దాక నిద్రేసాను ... తర్వాత నేను , సంతు, యేసు కలిసి బయటికి బయల్దేరాం ....

కాసేపూ bsc దగ్గర కూర్చున్నాం ....

ఆ తర్వాత ఇంకా ఇక్కడి దగ్గర ఊరిలో  ఏదో తిరనాల జరుగుతుందని తెలిసింది .... ఇంకా అక్కడికి వెళ్దాం అని డిసైడ్ అయ్పోయం ...

ఇంకా తినేసి 10 :25  కి బయల్దేరాం అక్కడికి ... నేను ,సంతు,శ్రీరామ్ ఇంకా యేసు కలిసి .....

వెళ్లేసరికి పదకొండు అయింది .... కాసేపూ తిర్నాలలో తిరిగాం ... చాల బావుంది తిరనాల... అచ్చం పల్లెటూరి తిర్నాలలా వుంది ...

బూరలు ఊదుతూ పిల్లలు తిరుగుతున్నారు ....

ఇంకా గాజులు అమ్మే కొట్లు .... గిల్టు నగలు అమ్మే కొట్లు వున్నాయి ....

ఇంకా బల్ల మీద సబ్బులు అవి పెట్టి రింగు వేస్తె వేటిమీద పడితే అవి మనకిస్తారు.... ఆ కొట్టు కూడా వుంది .... మేము రెండు సార్లు ఆడాం... కాని ఒక్క సారి కూడా పడలేదు...

ఇంకా గన్ తో బెల్లున్ లు పగలకోట్టేది కూడా వుంది ....

ఇంకా దారి పొడుగుతా .... బొమ్మలు అమ్మే కొట్లు వున్నాయి ...

అక్కడక్క పోలీసులు కూడా వున్నారు ....

మేము వెళ్ళే టైం కి చాల మందే వున్నారు జనం ....

ఇంకా తినుబండారాలు అంటే మరమరాలు , సెనగలు ... ఇంకా కర్జురం లాంటివి గుట్టలుగా పోసి అమ్ముతున్నారు ...

మేము వెళ్లి దేముడి దర్శనం చేసుకున్నాం .... కాని సమయానికి కెమెరా దొరకలేదు ....

తర్వాత వచేటప్పుడు ఒక కాశి దారం అంటారే... నల్లగా వుంటుంది తాడు ... ఎక్కువగా  తిరుపతి గుడి కి వెళ్ళినప్పుడు ఇస్తారు ... అలాంటిది కొనుక్కుని కట్టుకున్నాను...

ఇంకా వచేటప్పుడు ... ఒక పుచ్చకాయ  కొని తిన్నాం ... రాత్రి పన్నెండు గంటలకి .....

ఇంతకుముందు .... నేను చదువుకొనేటప్పుడు నేను ,వీరు కలిసి సింగరకొండ తిరణాలకి వెళ్ళాం ...

అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేసాం రాత్రంతా బెల్లం చెరుకులు తింటూనే వున్నాం ....

పోద్దునకి ఫుల్ గా జలుబు .....

ఇంకా బయల్దేరి తిరిగి వచ్చి శ్రీరామ్ ని రూం లో దింపే సరికి ఒంటిగంట అయ్యింది .... ఇంకా సినిమా హాల్ దగ్గర కనుక్కుంటే మూడుగంటలకి "కేడి "షో వుంది అన్నాడు ... కాని ఇంకా రెండు గంటలు వెయిట్ చెయ్యాలి ....
సర్లే రేపు చుదోచులే అని ఇంకా రూం కి వచేసాం ...

వచ్చి "ఏ మాయ చేసావో" పాటలు డౌన్లోడ్ పెట్టాను ..... కన్నా చెప్పింది పాటలు బావున్నాయని ....

సంతు గాడు బయట హాల్ లో ఏదో దేవుడి సినిమా చూస్తున్నాడు .... నేను ఇలా నా రూం లో బ్లాగ్ రాస్తువున్నాను ....

ఇప్పుడే నిద్ర ఫుల్ గా వస్తోంది ... ఇంకా ఆగలేనట్టు వున్నాను ... ఇప్పుడే సంతు గాడు వచ్చి లేగిసే వున్నానా ?? లేక పడుకున్నాన ?? అని చూసి వెళ్తున్నాడు ....

:):):):)         ::):):):)

శివరాత్రి .......అబ్బ !!! నిన్న నైట్ సైట్ లో పని వుంది ... అది అయ్యేసరికి రాత్రి ఒంటి గంట అయ్యింది .... ఇంకా అప్పుడు నేను ,సంతు గాడు రూం కి వచ్చి రెండున్నర దాక ఆర్కుట్ లో అందరికి శివరాత్రి గ్రీటింగ్ పంపి  పడుకున్నాం ... 


అంతకంటే ముందు కాసేపూ రైల్వే స్టేషన్ లో గడిపాం .... ఒక 45 మినిట్స్ అక్కడే వున్నాం .... చాల రోజులయింది అలా ఖాళీ రైల్ వే స్టేషన్ బెంచ్ మీద కూర్చుని కబుర్లు చెప్పుకుని ... ఇంతకుముందు నేను మా, ఫ్రెండ్ చక్రి సింగరాయకొండ స్టేషన్ లో కూర్చుని అలా కబుర్లు చెప్పుకునే వాళ్ళం  ....

మళ్ళి చానాళ్ళకి అలా గడిపాను .... నిజం గా అలా కూర్చున్నప్పుడు ఎన్ని కబుర్లు గుర్తోస్తాయో తెలీదు ... ఖాళీ ఖాళీ ప్లాట్ ఫారాలు ... అబ్బ దోమలుగుర్తు  చేసేదాక మనకి టైం అవుతోందన్న సంగతే తెలీదు ...

ఇంకా రూం కి వచ్చి పడుకుని పొద్దున్న ....లేచి గుడికి వెళ్దాం  అనుకున్నాం .....కాని మెలుకువరాలేదు ....
ఇంకా లేచేసరికి తొమ్మిదయింది .... అప్పుడు నేను, సంతు కలిసి కంటేశ్వర్ అని ఇక్కడ పెద్ద గుడి దానికి బయల్దేరాం ...

కాని ఈ లోపే శివ కాల్ చేసి బాగా పెద్ద లైన్ వుందనేసరికి, దగ్గరలో వున్న చిన్న శివుడి గుడికి వెళ్లి .... దర్శనం చేసుకున్నాం ...

తర్వాత చూద్దాం అని ఆ పెద్ద గుడి వైపు వెళ్ళాం .... అబ్బో ఎంతమంది జనామో .... ఇంకా మా కార్ ఓనర్ కి తెలిసిన వాళ్ళుంటే అందరు వచ్చే దారిలోనుంచి మేం లోపలి వాళ్ళం ....

ఇలా పండగకి నేను గుడికి వెళ్లి చాలా ఏళ్ళు అయినట్టుంది .... చిన్నప్పుడు అమ్మ చెప్పినా సంగతులు గుర్తువచ్చాయి ...

శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని చెప్పేది మా అమ్మ ..... ఇంకా శివరాత్రి రోజు కొన్ని సార్లు రాత్రి టీవీ లో వచ్చే సినిమాలు చూస్తూ జాగారం చేద్దామనుకునే వాడిని ... కాని మూడు , నాలుగు గంటలవరకు మాత్రమె ఉండగలిగే వాడిని .... తర్వాత నిద్ర వచ్చేది ... నేను టీవీ లో శివరాత్రి రోజు  చూసిన సినిమాల్లో నాకు బాగా గుర్తున్నది "శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రమ్హేంద్ర స్వామి చరిత్ర" .... అందులో ఒక పాట కూడా వుంటుంది " నందామయ గురడ నందామయ వీరబ్రమ్హం మాట వేదమయా!!" అని ...

ఇంకా ఒక శివరాత్రికి మాకు తెలిసిన ఒక ఆవిడ చనిపోయింది ... అప్పుడు అమ్మ చెప్పింది .. శివరాత్రి రోజు స్వర్గం తలుపులు తీసివుంటాయని ... చనిపోయిన వాళ్ళు స్వర్గానికే  వెళ్తారట ....

ఇంకా గుడినుంచి వచ్చిన  తర్వాత నేను, సంతు గాడు తినేసి సరదాగా అలీ సాగర్ వెళ్ళాం .... నేను కార్ డ్రైవింగ్ లో రెండో లేస్సన్ లోకి ఎంటర్ అయ్యాను ... జనాలు లేని సందుల్లో కారు నడపటం ఆపేసి ... ఊరిలో నిదానం గా నేర్చుకుంటున్నాను ....


కాని ఓవర్ తాకే చెయ్యాలంటే భయమేస్తోంది .... ఇంకా ముందు వెళ్ళే వాడి వెనుకే నిదానం గా వెళ్తున్నాను .... కాకపోతే పర్వాలేదు నామీద నాకూ ఒక 60 % నమ్మకం వచ్చింది ... ఇంకా సంతు గాడు ఫస్ట్ లేస్సన్ లోనే వున్నాడు ... వాడు జనాలు లేని చూట ... అద్దరాత్రి పూట రోడ్ మీద తోలుతున్నాడు .... ఇంకా అలీ సాగర్ నుంచి వచ్చి రూం లో బ్లాగ్ రాయటం మొదలుపెట్టాను .....

అవును .......అంతే కదా......!!! శివుడాజ్ఞ లేకుండా చీమే కుట్టనప్పుడు ... మనుసులెంత .. తప్పకుండ అన్నీ ఆయనకు తెలిసే జరుగుతున్నాయి కదా ...

ఆయనిష్టం ప్రకారమేనేమో..... ఎవరు వచ్చినా  ... ఎవరు పోయినా జీవితంలోనుంచి ....కదా....

హర .... హర .... మహాదేవ ...శంభో ..శంకర... 

నేను-నా చిన్న దొంగతనం .....చిన్నప్పుడు నాకు మా ఇంట్లో వున్న పేరు వల్లో..... భయం వల్లో తెలియదు గాని .... నేను దొంగతనం అంటే కొంచం దూరం గా వుండే వాడిని ....

అది కాకుండా మా అమ్మమ్మ నా గురించి మా చుట్టాల పిల్లలందరికీ  ఆదర్శం గా చూపించేది .... చివరికి మా అన్నలకి కూడా ....

అందుకనో..... ఏమో నాకు దొంగతనమంటే చిన్న భయం వుండేది ....

కాని నేను కూడా ఒక దొంగతనం చేసాను .....

చిన్నప్పుడు అమ్మ,నాన్న ఇంట్లో లేరు .... నేను ఒక్కడినే వున్నాను ...

ఇంతలో మా సందులోకి ఒక రంగులరాట్నం వచ్చింది ...

చిన్నది .... అప్పట్లో వాటికి చక్రాలు పెట్టి, సందుల్లో తిప్పుతూ వుండే

వాళ్ళు ....

అందరు పిల్లలు ఎక్కుతున్నారు .... నాకూ ఎక్కాలనిపించింది .... కాని నా

దగ్గర ఏమి లేవు ...

చీమిడి ముక్కు ...... చినిగిన నిక్కరు తప్ప .........

చాలా సేపు చూసాను ..... అందరు బలే ఆడుకుంటున్నారు ... నాకు

ఒక్కసారిగా ఎందుకో తెలియదు .... ఏడుపొచ్చింది.......

వెళ్లి ఆ రంగులరాట్నం దగ్గర నిలబడ్డాను ...... పిల్లలు తిరుగుతున్నారు ...

ఎగురుతున్నారు .... గోలగోల గా వుంది ....

వాడిని ఎవరో అడిగారు ఎంత అని .... వాడు రూపాయ్ అన్నాడు .... కాని

నా దగ్గర ఆ సమయం లో ఆ రూపాయి కూడా లేదు ...

ఇంకా చాల సేపు చూసాను ..... పిల్లలందరూ ఎక్కేసారు ....... దిగేశారు ...

నేను మాత్రం అక్కడే వున్నాను ....... ఇంకా ఆ బండి వాడు కూడా వీడు

ఎక్కడు అనుకున్నాడో ఏమో వాడు కూడా తోసుకుంటూ ...

పక్క సందుకి బయల్దేరాడు .......

నాకూ అది ఎక్కాలనిపించింది ..... ఇంకా నేను ఇంట్లోకి వెళ్ళాను... అన్ని

వెతికాను ...

చివరికి ఒక టీ కప్పులో ... అర్ధరూపాయ  దొరికింది ..... ఇంకా అది

తీసుకుని పరుగు........ వాడి బండి వెనుక ....

కాని చిన్న భయం వాడు ఎక్కించుకుంటాడా  లేదా అని .....

వెళ్లి వాడి దగ్గర నుంచున్నాను ........ నా చేతిలో వున్న అర్ధరూపాయి

వాడికి .... చూపించాను ...వాడు సరే ఎక్కు అన్నాడు ....

అబ్బా !!! ఎంత ఆనందం గా ఎక్కానో ......... నిదానం గా అది తిరగటం

మొదలయింది .....

నాకూ నిదానం గా భయం మొదలయింది ..... అది వేగం పుంజుకుంది ....

నాలో భయం వేగం పుంజుకుంది ...

ఇంతలో నేనిచ్చిన అర్ధరూపాయ అయ్పోయినట్టుంది ... వాడే ఆపేసి

దిగమన్నాడు ....

ఇంకా  బ్రతుకు జీవుడా అంటూ ........ దిగేసి పరుగో ....... పరుగు .... ఇంటికి ....

ఇలా అర్ధరూపాయి తీసుకున్న సంగతి ... ఇప్పటికి ఇంట్లో కూడా చెప్పలేదు ... మీరు చెప్పకండే మా అమ్మ తో .....

స్టడీ పాడ్ .....

ఈ రోజు పొద్దున్నంతా చూస్తూ వుండగానే గడిచిపోయింది ....


పొద్దున్న నేను , సంతు, శివ కలిసి ఇల్లు వెతకడానికి తిరిగాము... 


ఈ రోజు కార్ నేనే డ్రైవ్ చేసాను .... ఇప్పుడు నాకు కొంచం కాన్ఫిడెన్సు

వచ్చింది .... నేను నడుపగలను అని .... మొత్తం మీద ఒక 


40 % వచ్చింది నడపటం...  ఇలా నేను జాబ్ ట్రైనింగ్ లో వున్నప్పుడు లెక్క

వేసుకునే వాడిని ... ఎంత నేర్చుకున్నాను అని ....


ఒక పది రోజులు good అని , ఆ తర్వాత నేను నేర్చుకున్న దానిని బట్టి

better అని, best అని అలా నాకు నేనే గ్రేడ్ లు వేసుకునే వాడిని 


క్యాలెండరు మీద  .......


ఇప్పుడు కార్ డ్రైవింగ్ కూడా అలానే అనిపించింది .....


ఈ సమయం లో ఒకటి గుర్తొచింది ... ఈ మాట ఎక్కడ చూసానో గుర్తులేదు

కాని ...ఆ మాటలు మాత్రం  అలానే గుర్తుండిపోయాయి  .... నా ఇంజనీరింగ్

స్టడీ పాడ్ మీద కూడా ఇది రాసుకున్నాను ... అది ఏంటంటే ..


" అవకాశాన్ని కల్పించుకునేవాడు - ఉత్తముడు 


వచ్చిన అవకాశాన్ని వుపయోగించుకునేవాడు - మధ్యముడు 


ఈ రెండు చేతకాని వాడు - అధముడు "


నాకు తెసిలి ఇంజనీరింగ్ లో పేపర్ల మీదకంటే ఈ పాడ్ ల మీదే ఎక్కువ రాస్తారనుకుంట ....కదా !!!! :):):)

ఇంజనీరింగ్ చేరగానే ఎవరైనా చేసే మొదటి పనేంటంటే పెద్ద పొడిచేసే వాడి

లాగా ఒక కుర్చీ దాని మీదకి ఒక స్టడీ పాడ్ కొనటం .....

ఈ సంస్కృతి ఎక్కడ నుచి వచ్చిందో గాని బలే గమ్మత్తు గా వుండేది ...

కాలేజీ లో జాయిన్ అవ్వడం ... పోలో మని ఇవి కొనుకుని వచ్చి రూం లో

ఏదో మూల పడెయ్యడం ... మహా అయితే ఇది సాయంత్రం ఎదురు డాబా

మీద అమ్మాయికి చల్ల గాలిలో కాసేపూ షో చెయ్యడానికి తప్ప దేనికి

వాడరు....

ఇక బుద్ది పుట్టి ఏదో ఒక రోజు చదువుదామని .....

ఒక వాలు కుర్చీ, స్టడీ పాడ్ ఇంకా  దాని మీద ఒక బండ పుస్తకం ...

నాలుగు చిత్తు కాగితాలు, ఒక పెన్ను ... చాలు

ప్రపంచాన్ని జయించగలనన్న  ధైర్యం ... కన్నోళ్ళ ఆశల్ని నెరవేర్చాలనే

కోరిక ..... కాని ఇవేవి పక్క రూం లో దమ్ము వాసన రాగానే గుర్తుండవు ....

నలుగురు స్నేహితులు కనపడగానేనో , ఒక అమ్మాయి ఊసు

వినిపించాగానేనో అసలు కాలు కుర్చీలో నిలవదనుకో ...

 సరే ఇవన్ని ముగించుకుని వచ్చి ఈ సారికి నేను కాలేజీ ఫస్ట్

అనేటంత కట్టింగ్ కొడుతూ చదవటం మొదలుపెడతామా ...

చివరికి చూస్తే ఖాళీ ....

అట్ట మీద ఇలాంటిరాతలు ... లేదంటే ఐ లవ్ యు అని గీతలు .... అబ్బ ఆ

రోజులే వేరు ...


ఇలాంటి అట్ట మీద నా  స్నేహితుడొకడు వాడి అభిమాన హీరో బొమ్మలు

వేసుకునే వాడు .... మేము అరె వాడు  నీ బొమ్మలు చూస్తే ఛ నేను ఇంత

ఛండాలం గా ఉంటాన అని సినిమాలు తియ్యడం ఆపేస్తాడు రా అని

ఏడిపించేవాళ్ళం ...

ఎక్కడున్నాడో ఇప్పుడు వాడు ..

ఇవి నా స్టడీ పాడ్ విశేషాలు ... నాకు తెలిసి అందరు చేసేది అంతే

అనుకుంటా..... చేసేవి కోతిపనులు ... చెప్పేవి శ్రీరంగ నీతులు అంటే

ఇదేనేమో ......... హ్హ ... హ్హా .... హ్హా

గోరింక కథ ....." బాబు !!! ఆ దూరం గా కనపడేదేంటి ?? "
"గోరింక నాన్నా!! "

రెండు నిముషాల తర్వాత ....

" బాబు !!! ఆ దూరం గా ఉందేంటి ??"
" చెప్పగా ... గోరింక  అని  !"

ఇంకో రెండు నిముషాల తర్వాత ....

" బాబు !! అక్కడ కనపడేదేంటి ?"

" నాన్నా !! ఎన్ని సార్లు చెప్పాలి నీకు ..... గోరింక అని .... మరీ చాదస్తం ఎక్కువైంది నీకు ... వెళ్లి పడుకో లోపల !!!"

కాసేపటి  మౌనం తర్వాత ....

తండ్రి లోపలికెళ్ళి ఒక పుస్తకం తెచ్చాడు ..... అందులో ఒక పేజి తీసి కొడుక్కి చూపించాడు ...

అది చూడ గానే కొడుకు ముఖం లో భావాలు మారోపోయాయి ... ఏదో తప్పు చేసాననే  భావన అతని ముఖం లో ...

ఇంతకీ అది వాళ్ళ నాన్న డైరీ ముప్పై ఏళ్ళ కిందటిది ...

 ఆ పేజి లో ఇలా వుంది

" ఈ రోజు మా అబ్బాయి, నేను పార్క్ లో వుంటే ... ఒక గోరింక కనపడింది ..... దాని పేరు వాడు నన్ను పన్నెండు  సార్లు అడిగాడు ... అదేంటో తెలియదు,  నాకు కొంచం కూడా విసుగనిపించలేదు. పన్నెండు సార్లూ నేను సమాధానం చెప్పాను ... వాడు ముద్దు గా గోరింక అంటుంటే .. ఎంత ముచ్చటగా వుందో ....!!!"

*****************************************

ఎందుకో ఇందాక " ఆ నలుగురు" సినిమా చూస్తుంటే ... ఎక్కడో చదివిన ఈ

మాటలు గుర్తు వచ్చాయి ... అవే ఒక సారి మీ

కోసం ...

నేనున్నానని..........

చీకటి తో వెలుగే చెప్పెను నేనున్నానని
ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని

నేనున్నాననీ నీకేం కాదనీ

నిన్నటి రాతనీ మర్చేస్తాననీ

తగిలే రాళ్ళని  పునాది చేసి ఎదగాలనీ

తరిమే వాళ్ళని  హితులుగ తలచీ ముందు కెల్లాలని

కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలనీ

కాల్చే నిప్పుని ప్రమిదగ మలచి కాంతి పంచాలనీ

గుండెతో  ధైర్యం చెప్పెను

చూపు తో మార్గం చెప్పెను
అడుగు తో గమ్యం చెప్పెను నెనున్నానని

నేనున్నాననీ నీకేం కాదనీ

నిన్నటి రాతనీ మర్చేస్తాననీ


ఏవ్వరు లేని ఒంటరి జీవికి తోడు దొరికిందనీ

అందరు ఉన్నా ఆప్తుడు నువ్వై చెరువయ్యావనీ
జన్మకు ఎరుగని  అనురాగాన్ని పంచుతున్నావనీ
జన్మలు చాలని అనుబందాన్ని పెంచుతున్నావనీ


శ్వాస తో శ్వాసే చెప్పెను

మనసు తో మనసే చెప్పెను
ప్రశ్న తో బదులే చెప్పెను నేనున్నానని

నేనున్నాననీ నీకేం కాదనీ

నిన్నటి రాతనీ మర్చేస్తాననీ

చీకటి తో వెలుగే చెప్పెను నేనున్నానని

ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని
నేనున్నాననీ నీకేం కాదనీ
నిన్నటి రాతనీ మర్చేస్తాననీ

విప్పెసా .... కట్ చేశా .... చెరిపేసా....


హమయ్య !!! చాలా రోజుల నుంచి నా బ్లాగ్ థీమ్ మార్చుదాం అనుకుంటున్నా ...


మొదట్లో ఏదో అంత తెలియక సింపుల్ గా ఉండేవి పెట్టేసాను ... పేరు కూడా అంతే ... నాకు మైకేల్ అంటే ఇష్టం అందుకే "THIS IS IT " అని పెట్టాను పేరు ....


కాని మొన్నీ మధ్య ఎందులోనో వెతుకుతుంటే కనపడింది ..... ఇదే పేరుతో ఇంకో బ్లాగ్ వుంది .... కాకపోతే ఎవరో ఆంగ్లేయులది .....


అందుకే నా బ్లాగ్ పేరు  మార్చాలని అనుకున్నాను ..... చాలా ఆలోచించి చించి ........" నేను లేనప్పుడు " అని పెడదాం అనుకున్నాను ... సరే అని ఫిక్స్ అయ్పోయాను .....


ఇంకా టెంప్లేట్ కూడా మార్చాలి ....గూగుల్ లో వెతికాను .... చాల templates చూసాను .... ఇది బాగా నచ్చింది ....


దీని పేరు "Notepad chaos " ... చాల మందికి తెలుసనుకుంట ...


ఈ థీమ్ కోసం దగ్గర దగ్గర రెండు రోజులు కూర్చున్నాను .... నెట్ మీద ....


నా పోస్టులకి labels వేసి వాటిని విడకోట్టాను .... సెట్టింగ్స్ అన్ని పోతే ... widgets అన్ని మళ్ళి తెచ్చుకుని  పెట్టుకున్నాను...


పోతాయని తెలుసు కాని, పోకుండా ఎం చెయ్యాలో తెలియదు .... చెప్పేవాళ్ళు లేరు ...


ఇంకా అందుకే నోట్ చేసి పెట్టుకుని టెంప్లేట్ మార్చేసాను ....


ఇక్కడ దాక బానే వుంది .. చివరికి నా మొదటి పోస్ట్ చూస్తుంటే .... బ్లాగ్ పేరు దీపావళి అని

పెడితే బావుంటుందేమో  అనుకున్న...


ఇంకో ఆలోచన లేకుండా ఆ పేరు పెట్టేసా...


కింద " చీకటి వెలుగుల రంగేళి ..... " అని పెడదాం అని చాల ట్రై చేశా కాని రాలేదు ...

ఇంకా కింద టెక్స్ట్ add చేసి సంతృప్తి పడ్డాను ...

కాని పైన about అన్నప్పుడు నా ప్రొఫైల్ వచ్చేటట్టు  పెడదామని చాల ప్రయత్నించా ......

archives  అంటే నా పాత పోస్ట్లు వచేటట్టు పెడదాం అనుకున్న ... అది కుదరలేదు ..

ఎవరన్నా తెలిసిన వాళ్ళు వుంటే వెంటనే చెప్పగలరు ....

మర్చిపోయా ...!! ఈ నాలుగు రోజులు నా ప్రొఫైల్ access disable

చేసేశాను... ఎవరన్నా చూడాలని ప్రయత్నించి వుంటే ... ఏమనుకోకండి ... ప్లీజ్ ...!!!

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......