చీకటి వెలుగుల రంగేళి ......


స్టడీ పాడ్ .....

ఈ రోజు పొద్దున్నంతా చూస్తూ వుండగానే గడిచిపోయింది ....


పొద్దున్న నేను , సంతు, శివ కలిసి ఇల్లు వెతకడానికి తిరిగాము... 


ఈ రోజు కార్ నేనే డ్రైవ్ చేసాను .... ఇప్పుడు నాకు కొంచం కాన్ఫిడెన్సు

వచ్చింది .... నేను నడుపగలను అని .... మొత్తం మీద ఒక 


40 % వచ్చింది నడపటం...  ఇలా నేను జాబ్ ట్రైనింగ్ లో వున్నప్పుడు లెక్క

వేసుకునే వాడిని ... ఎంత నేర్చుకున్నాను అని ....


ఒక పది రోజులు good అని , ఆ తర్వాత నేను నేర్చుకున్న దానిని బట్టి

better అని, best అని అలా నాకు నేనే గ్రేడ్ లు వేసుకునే వాడిని 


క్యాలెండరు మీద  .......


ఇప్పుడు కార్ డ్రైవింగ్ కూడా అలానే అనిపించింది .....


ఈ సమయం లో ఒకటి గుర్తొచింది ... ఈ మాట ఎక్కడ చూసానో గుర్తులేదు

కాని ...ఆ మాటలు మాత్రం  అలానే గుర్తుండిపోయాయి  .... నా ఇంజనీరింగ్

స్టడీ పాడ్ మీద కూడా ఇది రాసుకున్నాను ... అది ఏంటంటే ..


" అవకాశాన్ని కల్పించుకునేవాడు - ఉత్తముడు 


వచ్చిన అవకాశాన్ని వుపయోగించుకునేవాడు - మధ్యముడు 


ఈ రెండు చేతకాని వాడు - అధముడు "


నాకు తెసిలి ఇంజనీరింగ్ లో పేపర్ల మీదకంటే ఈ పాడ్ ల మీదే ఎక్కువ రాస్తారనుకుంట ....కదా !!!! :):):)

ఇంజనీరింగ్ చేరగానే ఎవరైనా చేసే మొదటి పనేంటంటే పెద్ద పొడిచేసే వాడి

లాగా ఒక కుర్చీ దాని మీదకి ఒక స్టడీ పాడ్ కొనటం .....

ఈ సంస్కృతి ఎక్కడ నుచి వచ్చిందో గాని బలే గమ్మత్తు గా వుండేది ...

కాలేజీ లో జాయిన్ అవ్వడం ... పోలో మని ఇవి కొనుకుని వచ్చి రూం లో

ఏదో మూల పడెయ్యడం ... మహా అయితే ఇది సాయంత్రం ఎదురు డాబా

మీద అమ్మాయికి చల్ల గాలిలో కాసేపూ షో చెయ్యడానికి తప్ప దేనికి

వాడరు....

ఇక బుద్ది పుట్టి ఏదో ఒక రోజు చదువుదామని .....

ఒక వాలు కుర్చీ, స్టడీ పాడ్ ఇంకా  దాని మీద ఒక బండ పుస్తకం ...

నాలుగు చిత్తు కాగితాలు, ఒక పెన్ను ... చాలు

ప్రపంచాన్ని జయించగలనన్న  ధైర్యం ... కన్నోళ్ళ ఆశల్ని నెరవేర్చాలనే

కోరిక ..... కాని ఇవేవి పక్క రూం లో దమ్ము వాసన రాగానే గుర్తుండవు ....

నలుగురు స్నేహితులు కనపడగానేనో , ఒక అమ్మాయి ఊసు

వినిపించాగానేనో అసలు కాలు కుర్చీలో నిలవదనుకో ...

 సరే ఇవన్ని ముగించుకుని వచ్చి ఈ సారికి నేను కాలేజీ ఫస్ట్

అనేటంత కట్టింగ్ కొడుతూ చదవటం మొదలుపెడతామా ...

చివరికి చూస్తే ఖాళీ ....

అట్ట మీద ఇలాంటిరాతలు ... లేదంటే ఐ లవ్ యు అని గీతలు .... అబ్బ ఆ

రోజులే వేరు ...


ఇలాంటి అట్ట మీద నా  స్నేహితుడొకడు వాడి అభిమాన హీరో బొమ్మలు

వేసుకునే వాడు .... మేము అరె వాడు  నీ బొమ్మలు చూస్తే ఛ నేను ఇంత

ఛండాలం గా ఉంటాన అని సినిమాలు తియ్యడం ఆపేస్తాడు రా అని

ఏడిపించేవాళ్ళం ...

ఎక్కడున్నాడో ఇప్పుడు వాడు ..

ఇవి నా స్టడీ పాడ్ విశేషాలు ... నాకు తెలిసి అందరు చేసేది అంతే

అనుకుంటా..... చేసేవి కోతిపనులు ... చెప్పేవి శ్రీరంగ నీతులు అంటే

ఇదేనేమో ......... హ్హ ... హ్హా .... హ్హా

5 comments:

నిషిగంధ said...

నిజమే ఆ రోజులే వేరు! నైట్ అవుట్ చేయాలని ఒక్కొక్కళ్ళం లోటాడు టీ తాగి రాత్రంతా సొల్లు కబుర్లు చెప్పుకుని పడుకునేవాళ్ళం మేము :-)

మీ కొత్త టెంప్లేట్ చాలా బావుంది.. బ్లాగ్ పేరులానే హంగామా చేయాలి మరి :-)

కొత్త పాళీ said...

Interesting .. I too was thrown back to my hostel days .. for all of 5 seconds .. pch

Phani Yalamanchili said...

@ నిషిగంధ గారు
అవునా ... మేము అంతే .. నైట్ అవుట్ అని రాత్రి బస్సు స్టాండ్ దగ్గర రైల్ వే స్టేషన్ దగ్గర టీ లు తాగడమే సరిపోయేది .... టెంప్లేట్ నచ్చినందుకు ధన్యవాదాలు ... అలాగే దీపావళి టపాసులు ఇక్కడే కాలుద్దాం... ధాం.... ధాం ..... ధాం ....అని :):):)

@ కొత్త పాళీ

అయితే మీకు మీ పాత జ్ఞాపకాలు గుర్తు వచ్చాయన్నమాట ........ అంతే లెండి ఇప్పుడెం చెయ్యగలం గుర్తుతెచుకోవడం తప్ప కదా .......!!! ప్చ్ ... ప్చ్ ...

శిశిర said...

యండమూరి ఇలా అంటారు ప్రార్ధన నవలలో.

"తెలివైనవాడు ఎప్పుడూ తొందరపడడు, అవకాశంకోసం ఎదురుచూస్తాడు.

తెలివైన వాడు ఎప్పుడు అవకాశంకోసం ఎదురు చూడడు, తనే అవకాశాన్ని సృష్టించుకుంటాడు.

పరస్పర విరుద్ధమైన ఈ అభిప్రాయాల్ని ఏది ఎప్పుడు వాడాలో తెలిసినవాడే నిజమైన తెలివైనవాడు."

Phani Yalamanchili said...

@ శిశిర గారు
బావుందండి ....
:):)

Post a Comment

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......