నేను - నా రిజల్ట్స్
అది 2005 ....... అప్పుడప్పుడే నేను........... పిల్లాడి నుంచి పెద్దాడిని అవుతున్న రోజులు ...
ఇంట్లో మంచం మీద హాయిగా పడుకుని ...... తలకింద దిండు వత్తు పెట్టుకుని .... పక్కన ఈ రోజు న్యూస్ పేపర్లో, అమ్మ వండిన
చెక్కిడాలు పోసుకుని ..... ఏ ఛానల్ లో ఎలాంటి ప్రోగ్రాం లు వస్తున్నాయో సర్వే చేస్తున్న రోజులు ....
ఇంతలో నేను రాస్తా రోకోలు , ధర్నాలు , నిరాహార దీక్షలు చేసి సాదించిన నా నోకియా 1108 మొబైల్ మోగింది ...
దాని గురించి చెప్పాలంటే ఒక రోజు పట్టుద్దిలే ... తర్వాతా ఎప్పుడైనా తీరిగ్గా ఆఫీసు లో వున్నప్పుడు చెప్తాను .....
ఎవడో నాకుతగ్గ వెధవ కాల్ చేసాడు .... సర్లే వీడూ ఇంట్లో కాళిగానే వుండుంటాడని ఫోన్ ఎత్తాను ....
ఇంతలో పిడుగు లాంటి వార్త .... కెవ్వు మని పెద్ద పొలి కేక .... అలా జరగటానికి వీలు లేదు ...
సజావుగాసాగుతున్న నా జీవితాన్ని చిన్నా భిన్నం కానీయను .... కాని
ఈలోపే ఇవాల కాకపోతే రేపైనా తెలియాల్సిందే ఇంట్లో
అనే నిట్టుర్పు ......
సరే అని ఫోన్ పెట్టేసాను .......
ఇంకా అడుగులో అడుగు వేసుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళాను ..... నా గుండెలు వేగం గా కొట్టుకున్తున్నాయ్ ....
అమ్మ దగ్గరికి వెళ్ళాను ... అమ్మ కూరగాయలు తరుగుతోంది ... చేతిలో కత్తిపీట..... కొంచం దూరం లో చీపురు కట్ట ..... ఈ టైం
లో చెప్పోచా అని ..... చిన్న సందేహం ...
సర్లే ఎం కాదులే అని చెప్పేసా ......
" అమ్మా ...!!! ECET రిజల్ట్స్ వచ్చాయి ......!!!!"
"ఎంత ...... rank ???"
చెప్పా ...........
తదిగినతోం ..... తదిగినతోం ....... తదిగినతోం .......
(ఎక్కువ ఊహించుకునేరు ........ గీతోపదేశమేలే జరిగింది ..... )
ఇంకా తర్వాత మా నాన్నకి చెప్పాలి .... ఇంకా నాన్న రాలేదు ....
నాలోని మనో వేదన , ఆత్మా క్షోభ నన్ను దహించ సాగాయి ......
ఈ లోపు తెలివిగా నేను నాకంటే వెధవలు ఎవరన్నా వున్నారేమో ....
వాళ్ళని చూపించి నేను తప్పించుకుందాం అనుకున్నాను ....
ఒక నలుగురు వెధవల్ని ఎంచుకున్నాను ... అందులో మా రాజేష్ గాడు ఒకడు ....
అందరి డేటా సమీకరించే లోపు ...... మా నాన్న రానే వచ్చాడు ....
ఇంకా అమ్మ చెప్పింది విషయం .....
తదిగినతోం ..... తదిగినతోం ....... తదిగినతోం ....... (చిన్నదేలే .....)
అమ్మా!!!!! బ్రతికి బయటపడ్డననుకున్న .......... ఈలోపు మా ఫ్రెండ్స్ కి వచ్చిన ర్యాంక్ లు చెప్పా ....
ఇంకా మా నాన్న తిని వచ్చి ......
ప్రశాంతం గా కూర్చున్నాడు ... నేను నా మొబైల్ లో ఏదో కెలుకుతూ వున్నా ......
ఇంతలో మా నాన్నకి ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది ....
ఉన్నట్టుండి నా మొబైల్ అడిగారు ...... తీసుకెళ్ళి ఇచ్చాను .... ఇంకా రాజేష్ వాళ్ళ ఇంటి నెంబర్ చూసి వాడికి ఫోన్ చేస్తే ...
వాళ్ళ నాన్న ఫోన్ లిఫ్ట్ చేసాడు ... ఇంకేముంది ....
నా కొడుకు ఎదవంటే ...... కాదు, నాకొడుకు ఎదవని ఇద్దరు పోటీలు పడి మరీ ....చెలరేగారు ....
ఆ సమయం లో నాకు మా నాన్న "ప్రజలతో ముఖ్యమంత్రి" లో చంద్ర బాబు లా కనపడ్డాడు ...
నాలో ఉడుకురక్తం సలసల కాగసాగింది .... కాని ఎం చేస్తాం .... ప్చ్ .......ప్చ్ ...
అప్పటినుంచి మా నాన్న , మా బాబు అయ్యాడు .......
ఇదంతా చూస్తున్న మా అమ్మ , తమ్ముడు....... మా బాబు బయటికి వెళ్ళాక నన్ను చూసి ఒకటే నవ్వు .....
ఇన్ని కష్టాలు వుంటాయి తెలుసా రిజల్ట్స్ వచ్చినప్పుడు .... హా ....
2/14/2010 06:45:00 PM
|
Labels:
చదువు - చట్టుబండలు
|
Subscribe to:
Post Comments (Atom)
Blog Archive
-
▼
2010
(90)
-
▼
February
(18)
- నిజంగానే ఏదో మాయ చేసింది ......
- నిజం గా "ఏమాయ చేసావే ".......
- కొన్ని creative adds..
- శ్రీ రాం సాగర్ ప్రయాణం ......
- ఓ సాయంత్రం ...
- నేను - "లీ డర్" తో .....
- ఉరుములు నీ మువ్వలై .......
- ఆంధ్రుడు - ఆంగ్లము
- నేను - నా రిజల్ట్స్
- కెరటాల మాటున ......
- నువ్విచ్చిన వెన్నెల......
- శివ రాత్రి - తిరనాల
- శివరాత్రి .......
- నేను-నా చిన్న దొంగతనం .....
- స్టడీ పాడ్ .....
- గోరింక కథ .....
- నేనున్నానని..........
- విప్పెసా .... కట్ చేశా .... చెరిపేసా....
-
▼
February
(18)

4 comments:
ha ha ha bhale raasaaru
@ నేస్తం గారు
ధన్యవాదాలు ....
మీరు మరీ అండి. చదువుకోకుండా పైగా కామెడీ లు. :-)
@ భావన గారు
అప్పుడు చదువుకుని వుంటే ఇప్పుడు చెప్పుకోడానికి ఇలా ఉండేదా చెప్పండి ...... :):):)
అంతా మన మంచికే .... కదా ...!!!!
Post a Comment