చీకటి వెలుగుల రంగేళి ......


నిజంగానే ఏదో మాయ చేసింది ......

హెచ్చరిక :   ఒకళ్ళని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకున్న వాళ్ళు   ఈ సినిమా చూడొద్దు .... మనకి ఇలా ఎందుకు జరగలేదా....!!! అని బాధ అనిపిస్తుంది ... ఇక ప్రేమించను.... నీ తో మాట్లాడను  అనుకున్న వాళ్ళు  కూడా ఈ సినిమా చూడకండి ... లైఫ్ లో ఏదో మిస్స వుతున్నాం అనే భావన కలుగుతుంది ... అది మిమ్మల్ని, మీ నిర్ణయం మీద స్తిరం గా ఉండనివ్వదు... ప్రేమికులు ఇక మీకు చెప్పేదేముంది మీరు చెలరేగండి ....


ఇది ప్రజా ప్రయోజనాల రీత్యా జారీచేయబడింది ....


ఈ రోజు కొంచెం పని వుంటే సైట్ కి వెళ్ళాను ... వచ్చేసరికి సాయంత్రం అయ్యింది ...

ఇంకా ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే ... ఇంతలోకి సినిమా ఇలా వుందో అని గుర్తొచ్చింది ...

ఇంకా అంతే వెంటనే జీవి రివ్యూ ఓపెన్ చేశా ....

ఇక్క సారి మైండ్ బ్లాస్ట్ 4/5..... ఇచ్చాడు .....

అసలే సినిమా చూడాలని నిన్నే ఫిక్స్ అయ్యానేమో ... ఇంకా ఎప్పుడు టైం

 అవ్తుందా అని ఎదురుచూస్తూ కూర్చున్న ...

నేను ఎదురు చూసిన టైం రానే వచ్చింది...

" ప్రపంచం లో ఎంతో మంది అమ్మయిలుంటే నేను జెస్సినే.... ఎందుకు లవ్ చేసాను ....?? "

చైతన్య మొదటి డైలాగ్ సినిమా లో...

ఇక్కడ మొదలైన కథ ఎన్ని మలుపులు తిరుగుతూ వుంటుందో అది స్క్రీన్ మీదే చూడాలి ...

చక్కటి ప్రేమ కథని సుతిమెత్తగా తెరకెక్కించారు ....

సినిమా మొత్తం లో ఎక్కడో  ఒక్క  సీన్ లో అయినా, ఒక్క డైలాగ్ లో అయినా  .... 

నిజంగా నాకూ ఇలానే జరిగిందే అనుకుంటారు ...

కథ గాని, చిత్రీకరణ కాని చాలా బావుంది ...

సంభాషణలు చాలా సహజ సిద్దం గా వుంటాయి ...

ఇక హీరో నటనా , హీరోయిన్ నటనా బావుంది ...

ఇక పోతే హిందీ సినిమా స్టైల్ చిన్న గా  తెలుగు కి  దిగినట్టుంది ...

సినిమాలో నాగ చైతన్య ఒక పది సార్లు హీరోయిన్ పెదాలకి తన పెదాలతో లంకె వేస్తాడు ....

ఇదే .... నేను మొదటి సారి ఇన్ని లిప్ టు లిప్ సీన్ లు తెలుగు సినిమా లో చూడటం ...

అది సినిమా.......... నాకైతే బాగా నచ్చింది ....

ఇక రేటింగ్ అంటారా ........

నాదీ జీవి బాటే ..........


7 comments:

శరత్ 'కాలమ్' said...

హీరోయిన్ మాత్రం కమలినీ ముఖర్జీలా స్టిల్సులో మాత్రం నాకు నచ్చలేదు. సినిమాలో నటన చక్కగా చేసిందని వింటున్నాను కానీ అందం ఎలా వుందో?

నాగప్రసాద్ said...

అయితే, ఇప్పుడు సినిమా చూడొద్దంటారా..ప్చ్.. పోన్లెండి డబ్బులు మిగిలాయి. :)))

కత్తి మహేష్ కుమార్ said...

http://navatarangam.com/2010/02/vinnai-taandi-varuvaaya_review/
సహజమైన ప్రేమకథ- విన్నైతాండి వరువాయా

Phani Yalamanchili said...

@శరత్ గారు ,
మీరు అందం విషయం లో ఏం సందేహం అవసరం లేదు .... హీరోయిన్ వాయిస్ modulation చాలా బావుంది వుంది... ఇంకా మనక్కావలిసిన ముద్దు ముచట్లసంగతి చెప్పకర్లేదు ..... ఇంతకీ మీకు కమలిని ఎందుకు నచ్చదో ??:):)
@నాగ గారు ....
ఇంతకీ మీదే కేటగిరీ ....... చెప్పనేలేదు ........

@ మహేష్ గారు
మీరు నిజం గానే కత్తి ..... నాకూ నిజం గానే తెలీదు ఆ సినిమా ఇంతకుముందు వచ్చిందని ....
బావుంది మీ ఇన్ఫర్మేషన్ ..... మన తెలుగు సినిమా లో హీరో same ఇదే సినిమా తీస్తాడు .... హీరో సింభు ...... హీరోయిన్ త్రిష ........ !!!!

నాగప్రసాద్ said...

ప్రొద్దున మీ రివ్యూ చదివాక మొదట్లో లైట్ తీస్కున్నాను గానీ, తర్వాత నాకు మనసెందుకో ఉండబట్టలేకపోయింది. సాయంత్రం నాలుగ్గంటల వరకు ఏ విషయం తేల్చుకోని నేను, ఇంక ఆగలేక అప్పటికప్పుడు ఫస్ట్ షోకి వెళ్ళాను. టికెట్లు దొరక్కపోయినా బ్లాక్‌లో కొని మరీ వెళ్ళాను. అంతాబాగానే ఉంది కాని, నాకు థియేటర్ నచ్చలేదు. :((. నా పిచ్చి కాకపోతే బ్లాక్‌లో టికెట్లుకొని మరీ చూడటమేంటో. నిజానికి, దీనికన్నా ముందు నేను థియేటర్‌లో చూసిన ఆఖరి సినిమా "కొంచెం ఇష్టం కొంచెం కష్టం". మళ్ళీ ఇన్నాళ్ళకి చూశాను మరో సినిమా థియేటర్‌లో మీ దయవల్ల. I think I was crazy at that moment. :)).

Phani Yalamanchili said...

మాస్టారు అంతా బానే వుంది గాని , సినిమా ఇలా వుందో చెప్పలేదు ??

నాగప్రసాద్ said...

సినిమా బాగుందండి. :)))

Post a Comment

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......