చీకటి వెలుగుల రంగేళి ......


నేను-నా చిన్న దొంగతనం .....చిన్నప్పుడు నాకు మా ఇంట్లో వున్న పేరు వల్లో..... భయం వల్లో తెలియదు గాని .... నేను దొంగతనం అంటే కొంచం దూరం గా వుండే వాడిని ....

అది కాకుండా మా అమ్మమ్మ నా గురించి మా చుట్టాల పిల్లలందరికీ  ఆదర్శం గా చూపించేది .... చివరికి మా అన్నలకి కూడా ....

అందుకనో..... ఏమో నాకు దొంగతనమంటే చిన్న భయం వుండేది ....

కాని నేను కూడా ఒక దొంగతనం చేసాను .....

చిన్నప్పుడు అమ్మ,నాన్న ఇంట్లో లేరు .... నేను ఒక్కడినే వున్నాను ...

ఇంతలో మా సందులోకి ఒక రంగులరాట్నం వచ్చింది ...

చిన్నది .... అప్పట్లో వాటికి చక్రాలు పెట్టి, సందుల్లో తిప్పుతూ వుండే

వాళ్ళు ....

అందరు పిల్లలు ఎక్కుతున్నారు .... నాకూ ఎక్కాలనిపించింది .... కాని నా

దగ్గర ఏమి లేవు ...

చీమిడి ముక్కు ...... చినిగిన నిక్కరు తప్ప .........

చాలా సేపు చూసాను ..... అందరు బలే ఆడుకుంటున్నారు ... నాకు

ఒక్కసారిగా ఎందుకో తెలియదు .... ఏడుపొచ్చింది.......

వెళ్లి ఆ రంగులరాట్నం దగ్గర నిలబడ్డాను ...... పిల్లలు తిరుగుతున్నారు ...

ఎగురుతున్నారు .... గోలగోల గా వుంది ....

వాడిని ఎవరో అడిగారు ఎంత అని .... వాడు రూపాయ్ అన్నాడు .... కాని

నా దగ్గర ఆ సమయం లో ఆ రూపాయి కూడా లేదు ...

ఇంకా చాల సేపు చూసాను ..... పిల్లలందరూ ఎక్కేసారు ....... దిగేశారు ...

నేను మాత్రం అక్కడే వున్నాను ....... ఇంకా ఆ బండి వాడు కూడా వీడు

ఎక్కడు అనుకున్నాడో ఏమో వాడు కూడా తోసుకుంటూ ...

పక్క సందుకి బయల్దేరాడు .......

నాకూ అది ఎక్కాలనిపించింది ..... ఇంకా నేను ఇంట్లోకి వెళ్ళాను... అన్ని

వెతికాను ...

చివరికి ఒక టీ కప్పులో ... అర్ధరూపాయ  దొరికింది ..... ఇంకా అది

తీసుకుని పరుగు........ వాడి బండి వెనుక ....

కాని చిన్న భయం వాడు ఎక్కించుకుంటాడా  లేదా అని .....

వెళ్లి వాడి దగ్గర నుంచున్నాను ........ నా చేతిలో వున్న అర్ధరూపాయి

వాడికి .... చూపించాను ...వాడు సరే ఎక్కు అన్నాడు ....

అబ్బా !!! ఎంత ఆనందం గా ఎక్కానో ......... నిదానం గా అది తిరగటం

మొదలయింది .....

నాకూ నిదానం గా భయం మొదలయింది ..... అది వేగం పుంజుకుంది ....

నాలో భయం వేగం పుంజుకుంది ...

ఇంతలో నేనిచ్చిన అర్ధరూపాయ అయ్పోయినట్టుంది ... వాడే ఆపేసి

దిగమన్నాడు ....

ఇంకా  బ్రతుకు జీవుడా అంటూ ........ దిగేసి పరుగో ....... పరుగు .... ఇంటికి ....

ఇలా అర్ధరూపాయి తీసుకున్న సంగతి ... ఇప్పటికి ఇంట్లో కూడా చెప్పలేదు ... మీరు చెప్పకండే మా అమ్మ తో .....

0 comments:

Post a Comment

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......