చీకటి వెలుగుల రంగేళి ......


ఓ సాయంత్రం ...
ఇప్పుడే అబ్బాయి నిద్ర లేచాడు ......

బయట భీకరమైన హోరు గాలి ...........

కరెంట్ వస్తూ పోతూ వుంది ......

"అబ్బాయి  టీవీ ఆపు ...... కరెంటు వస్తా పోతా వుంది ....."

ఇంతలోనే చుట్టూ చీకటైంది ......

విశాలమైన ఆకాశాన్ని ..... కారు మేఘాలు ఏలుతున్నాయి ....

పక్క డాబా మీద ఆరబెట్టిన బట్టలకోసం అమ్మాయ్ పరిగెత్తుతోంది .....

డాబా ఎదురుగా వున్న కాళీ ప్రదేశం, ఆత్రుతగా వర్షం కోసం ఎదురుచూస్తోంది ....

నా పక్కనుంచి  " ఇంత గాలి వస్తోంది గా, వర్షం రాదు ....."

గట్టిగా అనకు బయట నేల వింటే బాధ పడుద్ది అనాలనిపించింది .......

పక్కన కిటికీ అద్దాలు వాన ఆహ్వానిస్తూ మేళాలు వాయిస్తున్నాయి ....

కింద వున్న ఇసుక మీద పట్టా కప్పుతున్నారు .... అది చూసి నేను , నేల ఎంత సంతోషించామో .....

ఇంతలో ఏదో ఫోన్, అది మాట్లాడి పెట్టేసేలోపే ..... నేల ఎదురు చూపులు ఫలించాయి ....

ఒక చినుకు ... దాని వెంబడే మరో చినుకు .... ఇలా చినుకుల సవ్వడి మొదలైంది ....

నేల ఎదురు చూపులు ఫలించాయి .... నేలతల్లి హైదరాబాది బిర్యానిని మించిన వంటకమేదో వండి పోస్తున్నట్టుంది....

ఒకటే కమ్మని వాసన ....

ఇంతలో అమ్మ  పిలిచింది...... పొద్దున్న మిగిలిన పిండితో .... దిబ్బ రొట్టెలు .... నాకొకటి .... తమ్ముడుకొకటి ....

అందులోకి అల్లం పచ్చడి ....

అమ్మా ముందు నాకు ... కాదు కాదు  నాకు కావాలి .....

అబ్బ ఆపండ్రా మీ గోల చెరో ఒకటి  తీసుకోండి ....

అబ్బ!! ఎన్ని పంచుకున్నం రా తమ్ముడు మనం ... అమ్మ ఒడి దగ్గరనుంచి ... ఇప్పటి దిబ్బ రొట్టెల దాక ... (నాతో నేనే మనసులో ఇప్పుడు ....)

వరండాలో పట్టీల మంచం మీద .... చల్ల గాలి కొడుతువుంది .....

ఆ గాలి వస్తూ వస్తూ కొన్ని వాన తుమ్పరల్ని తోడ్కొని వచ్చి నా మీద వదిలి వెళుతోంది ....

వాన పెద్దదయింది ..... అబ్బాయ్ మంచం లోపలెయ్ వానకి తడిసిపోద్ది.....

అయ్యో కరెంటు పోయింది ....

అమ్మా  కువ్వొత్తి ఏది .... ఆ దొరికింది లే ....

కువ్వొత్తి కాంతిలో  కాళీ అయిన నా ప్లేటు ఇంకో రొట్టె కోసం చూస్తోంది ....

అబ్బ వర్షం తగ్గింది ..... కరెంటు వచ్చింది .......

ఒరేయ్ remote  ఇటివ్వు ........ నేనివ్వను .....

ఇవ్వమన్నానా ........!!!!! ......... ఇవనన్నానా .....!!!

అమ్మ అన్నయ్య చూడు ..... remote లాకున్టున్నాడు .......

అబ్బ మళ్ళి మొదలు గొడవ ..... కానీయండి నాన్న  వచ్చే టైం అయింది లే ..... అంది అమ్మ

ఆహా remote దొరికింది .... అబ్బ కత్తి లాంటి పాట ....

వీడెందుకు నేను పాటలు పెట్టుకుంటే నవ్వుతున్నాడు .... తమ్ముడిని చూసి ....

వెనక్కి తిరిగా .... ఇంకేముంది నాన్న ...... అప్రయత్నం గా  remote  నా చేతిలోనుంచి ... నాన్న చేతిలోకి వెళ్ళిపోయింది ..

చానల్ కూడా మారిపోయింది .... గెంతులేసే వాళ్ళు పోయి .... గేన్తులేయించే  వాళ్ళు వచ్చారు టీవీ లోకి .... అదే న్యూస్

ఛానల్ వాళ్ళు  .....


( ఇలా వుండేది వర్షం పడిన రోజు ఇంతకుముందు .... ఇప్పుడు వర్షం మొదలు కాగానే అవన్నీ ఒక్కసారి కురిశాయి మనసులో ...)

ఇప్పడు ఆ వర్షము అలానే వుంది ... ఆ ప్రకృతి అలానే వుంది ...

ఒక్క నేను తప్ప .....

ఇప్పుడు మా తమ్ముడికీ పోటీ లేరు గా ......

1 comments:

sharu said...

Such a wonderful expression and a wonder photograph!!I liked it so much!!

Post a Comment

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......