చీకటి వెలుగుల రంగేళి ......


చిన్నప్పటి బొమ్మలు - బాధలు
అబ్బ మళ్లీ చానాళ్ళకి ఊపిరి పీలుస్తున్నట్టు వుంది .......

కొంచం విరామం ....... బోల్డంత పని తర్వాత ....

నిన్న ఒక సైట్ దగ్గర పని చేస్తుంటే .... పక్కనే స్కూల్ వుంది ...

దాని గోడల మీద ఇండియా మ్యాప్ , ఆంధ్ర మ్యాప్ , ఇంకా మాతెలుగు తల్లి కి పాటలు...... అన్నీ వున్నాయ్ .......

మా స్కూల్ లో కూడా ఇలానే ఉండేవి ....

ఇంకా మరో గోడ మీద అమీబా , మనిషి మూత్రపిండాలు ఇలా చాలా బొమ్మలు వున్నాయి ..........

అవి చూడగానే ఇంతకుముందు నేను చదివినప్పటి N.S. గుర్తొచ్చింది ....

అదే జీవ శాస్త్రం .......

అబ్బ అందులో ఎన్ని బొమ్మలో ......... ఆ బొమ్మలు నేర్చుకోవడం ఒక ఎత్తైతే ... వాటిని పరీక్షలో వెయ్యడం ఇంకో ఎత్తు ...

నాకు అసలే బొమ్మలు సరిగ్గా రావేమో ...... ఈ జీవ శాస్త్రం బొమ్మలమీద అస్సలు ఇంట్రెస్ట్ వుండేది కాదు ....

ఇంకా పరీక్ష హాల్లోకి వెళ్లేసరికి ...... బొమ్మలు సరిగ్గా గుర్తుండేవి కాదు ......

పరీక్ష హాల్లో .... ప్రశ్న చూడగానే బొమ్మ బౌండరీ గుర్తొస్తది కానీ మధ్యలో ఏమున్నాయ్ ...

అసలా అందులో భాగాలేంటి ఏం గుర్తు రావ్ .........

ఇంకా చాలా సేపు ఆలోచించి చించి ... పెన్సిల్ ని నాలుగు సార్లు సూది గా చెక్కి ....

సరే ఏదోఒకటి గియ్యాలి  అని మొదలుపెట్టి ... నిదానం గా బయటి భాగం  గీస్తాను ...

కానీ దాని లోపల ఏముంటాయో గుర్తు రావు .......

ఇక అప్పుడు అసలు కష్టాలు మొదలు ...

కప్ప ఊపిరితిత్తుల్లో కి.......... చేప మొప్పలు .......

ఇలా ఎన్నెన్నో వెరైటీలు ........ అబ్బ.......!! అన్ని బొమ్మల్లోకి నాకు నచ్చిన బొమ్మ అమీబా ..........

ఎందుకంటె దానికి ఒక సపరేట్ ఆకారం వుండదట ....

మన ఇష్టం వచ్చినట్టు బొమ్మ వెయ్యొచ్చు .........

సరే అని ఆనందం గా మొదలెడతానా ... మళ్లీ అదే ప్రాబ్లం .......

లోపలి భాగాలు గుర్తు రావు ......... ఇక అప్పుడు మళ్లీ కష్టాలు మొదలు ........

మున్దోడినో, వెనకోడినో......... అడగాలి ..... వాడిని question పేపర్ వెనుక గియ్యమనాలి ......

గీశాడా సరే ..... లేకపోతే అదిగో అలా పైన గీసినట్టు .......... ఏవేవో వస్తాయి అమీబాలో ......

ఎన్ని బొమ్మలో .......... అన్ని కష్టాలు ............

ఏదో అలా అలా లాక్కొని ఇదిగో ఇలా ఇలా ..... ఇక్కడి దాక వచ్చాను ...

పరీక్ష రాసి వచ్చాక పుస్తకం లో నుంచి అమీబా అంటుంది  .......

" అబ్బ ....! నువ్వు మెక్డొనాల్డ్స్ మూర్తివి రా బాబాయ్ ... వీలైతే  కొత్త ప్రపంచాన్నే సృష్టించగలవ్ అని ....."

"ఛి .... పో సిగ్గు నాకు ...." నేను .

ప(ని)ణి.......ఓ విరక్తి కథ


హమ్మ బాబోయ్ ..!! కుడి పక్క తిరిగితే పని , ఎడమ పక్క తిరిగితే పని ,పైన పని , కింద పని ... ఎటు చూసినా పనే పని .....


అలా వుంది ప్రస్తుతానికి  నా పని .......!! ఎప్పుడు వస్తున్నానో ........ ఎప్పుడు వెళ్తున్నానో ఏం అర్ధం కానట్టు గా .....!!


అబ్బో దేముడా చాలు ఇంకా నా కడుపు నిండింది .... అని గట్టిగా అరవాలని వుంది .. కాని దేవుడు వింటాడా ...!!


అందుకే ప్రస్తుతానికి బ్లాగ్ లో గట్టి గా అరుస్తున్న ....!! ఇంకా చాలు బాబోయ్ ......!


హమ్మ ..!! ఎన్ని రోజులు బ్లాగ్ లు మిస్ అయ్పోయాను .......!!


ఇంకా అందుకే చివరికి ఇప్పటికీ సైట్ లో వున్నా....... ఇవాళ  ఎలాగైనా  రాయాల్సిందే అని డిసైడ్ అయ్పోయాను ...!!


హ్హ ..........హ్హ ...... హ్హ........!!


అప్పుడప్పుడు సినిమాల్లో చూడటం తప్ప ఎప్పుడు ఇంతపని చేయ్లేదేమో దూల తీరుతోంది ....


ఇప్పుడుప్పుడే నిద్ర వస్తున్నట్టుంది ........ హా ......... ( ఆవలింత అదిగో ........)


నేను ఈ టైం లో కొంచం గమనించినవి ఏంటంటే .....


మనకు బేసిగ్గా ఈ విసుగు, చిరాకు ...... పని ఎక్కువగా ఉన్నప్పుడే ఎందుకు వస్తాయో కదా .....


ఒకళ్ళ మీద కోపం ఒకరి మీద చూపించడం .... అయ్యో ఎన్ని ఘోరాలు జరుగుతాయో మరీ  ....


ఇలాంటి టైం లోనే మన గౌరవం పెరిగినా, తగ్గినా కూడా ....


మనం అవతలి వాళ్ళకి ఏమిస్తామో మనం కూడా అవతలి వాళ్ళనుంచి అదే .......అంతే మొత్తం లో ప్రతిఫలం గా కోరుకుంటాం ...

అది మనిషి సహజ లక్షణం ...

ఒక వేళ అలా మనం అవతలి వారి నుంచి పొందలేనప్పుడు మనం అవతలి వారి మీద కోపం తెచ్చుకుంటాం...

ఇంకేముంది చిరాకు విసుగు .....

అందులోనే కోపాలు , బాధలు .. అయ్యో ఎన్ని కష్టాలో ....

అందుకే .....కోపం లో వున్నప్పుడు ఒక క్షణం మౌనం గా వుండండి ......

అన్నీ అవే సర్దుకుంటాయి .......

అప్పుడు నిజమైన కారణాలు బయట పడతాయి .......

ఫర్ example :

మీకు బాగా ఇష్టమైన ఫ్రెండ్ ...... మీకు ఇష్టం లేని ఫ్రెండ్ తో మాట్లాడాడు ......

అది మీకు నచ్చలేదు ..... ఆ విషయం చెప్పినా వెంటనే మీకు కోపం వస్తుంది ....

అప్పుడు ఆ క్షణం కోపం తగ్గే వరకు కొంచం మాట్లాడుకుందా వుండండి .......

ఆతర్వాత ఇలా అనిపించొచ్చు ..... నాకనిపించినట్టు .........

" మన ఫ్రెండ్ అయిన పాపానికి వాడితో వీడు మాట్లాడ కూడదా ఏంటి ?????"

"అయనా మాట్లాడితే మాట్లాడాడు ...... మళ్లీ వాడే చెప్పాడు కదా అనవసరం గా అబద్దం చెప్పకుండా ...

అంటే మనల్ని  గౌరవిస్తున్నట్టే గా ......!!"

ఇలా పది రకాలు గా పాజిటివ్ ఆలోచనలు వస్తాయి .........

అప్పుడు వాటిని బట్టి ముందుకి కదలండి .....

అదే ఈ టపా లో నేను చెప్పాలనుకున్నది .....
                                   ******************

సరే గాని నేను పైన పెట్టిన ఫోటో నాదీ కాదు ........ ఆ ఫోటో  పెట్టిన వారికి నా కృతజ్ఞతలు ...

అబ్బ ఎంత అందం గా వుందో చూడండి ఆ ఫోటో .. అందమైన ముక్కు ..... చేతులు ..అబ్బ సింప్లీ సూపర్...

అబ్బ ఇప్పుడు బోల్డంత "సభ్యత" గా వుంది ఏంటో ఒళ్లంతా ....!!

మెక్ డొనాల్డ్స్ వారి ఉగాది పచ్చడి ...

రోజూ లాగే తెల్లారింది ......  ఆ సూర్యుడు మారలేదు ... చంద్రుడు మారలేదు ... నేనూ మారలేదు ....


అన్నీ అలానే వున్నాయి ఒక్క  తేది తప్ప .... అదీ మాములుగా మారలేదు ...  మారుతూ మారుతూ .....


ఇన్నాళ్ళు నాతో వున్న జీవితాన్ని జ్ఞాపకాలు చేసి ......... మళ్లీ కొత్త తెల్ల కాగితాన్ని నింపమని నాకిచ్చింది ......


ఇప్పటి కాలాన్ని చూస్తుంటే ......


త్వరలోనే ఈ ఉగాది పచ్చడి కూడా .... యే రిలయన్స్ వాడో , లేకపోతే ఏ మెక్ డొనాల్డ్స్ వాడో


అమ్మటం మొదలుపెడతదేమో కదా ......!!


ఇంకా మనం కూడా వెళ్లి మెను లో చూసి ....


Telugu newyear pickle .....


Telugu newyear pickle spicy ....


Telugu newyear pickle 65


ఇట్లా అందులో   ... మనకి నచ్చింది తెచ్చుకోవాలేమో .....


************************************************


కాని భలే వుంటుంది ఉగాది పచ్చడి రుచి .....


మొదటగా వేపపూలు ... అబ్బ చిన్న చిన్నగా ...... భలే వుంటాయి ....


ఉగాదికి ముందు అస్సలు కనపడవు ... ఇంకా ఉగాది రోజైతే చెట్టుమీద కాకుండా ... అందరి ఇళ్ళల్లో కనపడతాయి ...


చిన్నప్పుడు అబ్బాయ్ .. పక్కన వేప పూలు కోసి అమ్మకిచ్చేవాడు ... అమ్మ అవి కడిగి మళ్లీ అబ్బాయికిచ్చేది ...


అబ్బాయి వాటిని పేపర్ లో వేసి ... పువ్వుల్ని వేరుచేయ్యాలి ... రేకులు వేరు చెయ్యాలి ....


అప్పుడు మళ్లీ అమ్మ వాటిని చేట లో వేసి .... అన్నిటిని వేరు చేస్తుంది ...


ఇక మామిడి తేవాలి ....


అబ్బాయి బయల్దేరుతాడు .... అబ్బాయిని చూడగానే .. మామిడి కాయలు ఆకుల్లో దాక్కుంటాయి ....


కాని అబ్బయి ఊరుకోడుగా ... చెట్టెక్కి మంచి మామిడి కాయ ఒకటి కోస్తాడు ...


అమ్మ కింది నుంచి అది కొయ్ ... ఇది కొయ్ అని చెప్తుంటే ......


ఇక అది కొయ్య గానే ........ తొడిమలోనుంచి .... చెట్టునుంచి ఒకటే కన్నీటి ధారలు .... అదే సొన అంటారుగా అది ...


అది కాయని, చెట్టునుంచి వేరు చేసినందుకా .... బాధా లేక .....


ఉగాది పచ్చడి లో భాగం అవుతున్నందుకు ఆనందమో అర్ధం కాదు ...


కాని ఆ సొన వాసన భలే వుంటుంది .....


ఇక దాన్ని కడిగి .... ముక్కలు కోసి ... బెల్లం తరిగి ... ఇంకా అరిటి కాయ వేసి ....


ఇలా చాలా వేసేది అమ్మ ...... ఇప్పుడు అబ్బాయికి అన్నీ గుర్తు లేవు ...


ఆ మళ్లీ ఒకటి గుర్తొచ్చింది .... చింత పండు పులుసనుకుంటా ...........


అవన్నీ కలిపి అమ్మ చేసాక ........ అప్పుడు దేవుడికి దణ్ణం పెట్టుకుని ... అందరు తినాలి ..


ఇంకా పాయసం , గారెలు .... లాంటివి ...


ఇప్పుడు  ఆ జ్ఞాపకాలతో దేవుడి గుడి లో ఉగాది పచ్చడి తిని ఇలా బ్లాగ్ రాస్తున్నా ....


అందరికీ ఉగాది శుభాకాంక్షలు .....:):)


మీ ,


ఫణి  యలమంచిలి. 

Password Recovery అనే ఓ కథ ..!!ఈ రోజు మధ్యానం ఎప్పటిలాగే నా జిమెయిల్ ఓపెన్ చేద్దామని ట్రై చేసాను ...

User username and password is incorrect అని వచ్చింది ...

సరే లే ఏదో తప్పు టైపు చేసానేమో అని మళ్లీ ట్రై చేసాను .. కాని మళ్లీ అదే రిప్లై ...

అలా చాలా సార్లు చేసాను కాని ప్రయోజనం సున్నా .. అన్నీ సార్లు అదే అనుభవం నాకు ఎదురైంది ...

సరే అని I can't access my account అని కొట్టాను ... అందులో వెతకని ఆప్షన్ అంటూ లేదు ...

అన్నీ ట్రై చేసాను .. మీ Secondary mail id కి password పంపామని వచ్చింది కాని ... నాకు ఆ మెయిల్ id గుర్తు లేదు ..

దగ్గర దగ్గర నేను ఈ జిమెయిల్ create చేసి ఒక ఆరు ఏళ్ళు గడిచుంటుంది ...

నాకు secondary mail id కాని Security question గాని గుర్తు  లేవు ...

ఇక ఎనిమిది గంటల వరకు అదే పని .. నాకళ్ళకి అలుపొచ్చి నిద్ర వచ్చింది కాని .. ఫలితం  మాత్రం రాలేదు ...

నా జిమెయిల్ , నా ఆర్కుట్ , నా బ్లాగ్ అన్నిటికి ఈ రోజుతో శుభం కార్డు పడిపోయిందనుకున్న...

ఇంకా నాకు దొరకదు అని మనసులో అనేసుకుని  చిన్న గా నిద్ర లోకి జారుకున్న ...

మధ్యలో మా అక్కా ఫోన్ ... ఇది విషయం...!! అని చెప్పాను ... తనకి తోచింది చెప్పింది ...

సరే మళ్లీ మొదలెట్టా వెతుకులాట .. అదేంటంటే గూగుల్ వాడు ఇరవై నాలుగు గంటలు ఆగమంటాడే... !!

ఇంకా గూగుల్ వాడి పీక మీద కాలేసి తొక్కలన్నంత కోపం వచ్చింది ... నా యాహూ మెయిల్ id  ని ఒక వంద సార్లు రిఫ్రెష్ చేసుంటా .. ఏదైనా మెయిల్  వస్తుందేమో అని ... కాని రానిదే ...

మళ్లీ జిమెయిల్ ఓపెన్ చెయ్యడం ... మళ్లీ ట్రై చెయ్యడం ... ఇదే పని ఇవాళ ...

అలా ట్రై చేస్తూ వుండగా .. Password Reset దాంట్లో ఏదో .... మీ Secondary mail గాని security question గాని access

చెయ్యలేకపోతే .. ఈ ఫారం ఫిల్ చెయ్యండని వచ్చింది ...

అదే ఓపెన్ చేస్తే అందులో నానా ప్రశ్నలు వున్నై ...

నువ్ జిమెయిల్ యే తారీకున స్టార్ట్ చేసావ్ ..

నీకు ఆర్కుట్ ఉందా ... అది ఎప్పడు స్టార్ట్ చేసావ్ ..

నీకు బ్లాగర్ ఉందా .. అది ఎప్పుడు స్టార్ట్ చేచావ్ ...

నీకు ఎవరినా జిమెయిల్  కి రావటానికి ఆహ్వానం పంపారా .. వాళ్ళ మెయిల్ id ఏంటి ...

ఇలాంటి ప్రశ్నలు అందులో ... అయ్యో కనీసం security Question కూడా గుర్తులేన్నప్పుడు ఇవన్నీ ఎలా గుర్తుంటాయి

చెప్పండి ... ఇంకా ఏదో నాకు గుర్తున్నమట్టికి రాసి .. ఆత్మా రాముడు ఆవురావురు....!! మనేసరికి తినటానికి  వెళ్ళా ... 

వచ్చి అలా మంచం మీద ఒరిగేసరికి ... మళ్లీ అక్కా ఫోన్ ఏమయిందిరా  అని ...

ఏమీ కాలేదు  .. ఇంకా దొరకదులే అని నా రిప్లై ...

కాదు యాహూ చెక్ చై ... మని అటునుంచి ...

అబ్బ పొద్దునుంచి వందసార్లు చేస్తే రానిది ఇప్పుడు వస్తుందా అనుకుని .. ఓపెన్ చేసాను ...

రెండు మెయిల్స్ వచ్చాయి ... ఏవో చెత్త funny మెయిల్ అయివుంటాయి అనుకున్నా ..

కాని ఆశ్చర్యం అవి జిమెయిల్ వాడి దగ్గరినుంచి నా password recovery mail...

అబ్బ ....... నా ఆనందానికి హద్దు లేదు ... త్వరత్వరగా వచ్చిన లింక్ ఓపెన్ చేసేసా ...

ఇంకేం ......... Enter New password ....... Re-enter new password అని వచ్చింది ..

అబ్బ .... ఒక్కసారి యెగిరి గంతెయ్యాలని అనిపించింది ......

అది ఇవాళ జరిగింది క్లుప్తం గా ......

సరే గాని ఇప్పడు మళ్లీ రెండు ప్రశ్నలు ....

1)  పొదున్న నుంచి  నేను ఓపెన్ చేస్తే రాని మెయిల్ మా అక్క ఓపెన్ చెయ్యి అనగానే  ఎలా వచ్చిందబ్బ ??

2 ) అసలు ఇంత కథ కి కారణమయిన  password  ఎలా మారింది ??

ఏమో అంతా దేవుడికే తెలియాయి ... దొరికింది కదా ఇంకా lite ...

మా అక్కకి రేపు interview వుంది ....... అందుకే ......

"Wish U ........ Best Of Luck ..........  :)"

ఒంటి పూట బడి వచ్చిందోచ్ ...!!

అప్పుడు టైం పొద్దున్న ఏడున్నర ...


ఇంత విశాలమైన భూగోళం లో ఓ ఇంట్లో ఇలా .......


" అమ్మోయ్...! నా షూసు ...!!"


"నిన్న వచ్చాక ఎక్కడేసావ్ సరిగ్గా చూడు అక్కడే వుంటాయి  ...."


"ఒరేయ్ చిన్నోడా...! నువ్ తొందరగా కానియ్యరా టైం అవ్తోంది. "


"అమ్మా నాకు లేట్ అవ్తోంది ... అదిగో రిక్షా వాడూ వచ్చేసాడు ..."


"అయ్పోయింది చిన్నోడి పని కూడా ..... రెండు నిముషాలు వుండమను .... "


"ఇదిగో టిఫిన్ బాక్స్ ... పదండి పదండి త్వరగా ..."


"అబ్బ ...! ఇప్పుడు తిన్నాం గా మళ్లీ టిఫిన్ ఎందుకు ?"


"ఆకలేస్తుంది మధ్యలో ..... పదండి పదండి ......"


అలా మూడుచక్రాల పుష్పక విమానం స్కూల్ వైపు బయల్దేరుతుంది ......


సరిగ్గా వెళ్ళే సరికి పిల్లలందరూ పరిగెడుతూ వుంటారు ... వాళ్ళ వెనకే మేమూ.....


ఒకల్లనోకళ్ళు... తోసుకుంటూ .. పరుగోపరుగు ...


ఎనిమిదైంది ... వందేమాతరం మొదటగా ..... (అందుకేననుకుంటా ఇప్పటికీ అది గుర్తుంది పొల్లు పోకుండా ..)


తర్వాతి కార్యక్రమం ప్రతిజ్ఞ ...  భారతదేశం నా మాతృభూమి .... (దీని అంతటికన్నా చివర్లో జైహింద్ గట్టిగా వినపడేది ..)


ఇక తరవాత  ఎవరి క్లాసులకి వాళ్ళు ...


ఇంక  చెప్పేదేముంది ...... ఉతుకుళ్ళు .... బాదుళ్ళు ... జజ్జ నకరి జనారే ....


మళ్లీ పదిన్నర అవ్తుందా ...... మధ్యలో చిన్న బ్రేక్ .......


అమ్మ పెట్టిన టిఫిన్ తెరిచి చూస్తే ... అందులో వున్న ఉప్మా ని మళ్లీ ఒక రౌండ్ వేసే  లోపే  .... మళ్లీ బెల్లు మోగుద్ది...


మళ్లీ మొదలు జజ్జ నకరి జనారే .....


అబ్బ క్షణం ఒక యుగం లా గడుస్తుంది .... ఒకో క్లాసు ...


అబ్బ పన్నెండున్నర ..... హమ్మ బెల్లు కొట్టారు .....


ఇక సందడే సందడి ... పరుగో పరుగు ... వాడినీ, వీడిని గిచ్చుకుంటూ .... గిల్లుకుంటూ  ...


తోసుకుంటూ ... ఇంకా ఆ జైలు నుంచి నిదానం గా మళ్లీ మా పుష్పక విమానం దగ్గరికి ...


ఇంతలో ఏదో మర్చిపోయినట్టు గుర్తొస్తుంది ... అదేంటా అంటే ...


పుస్తకమో ... పెన్నో కాదు ......మా తమ్ముడిని ...


"అయ్య... బాబోయ్ వీడక్కడే వున్నాడేమో .......!!!" (మనసులో ...)


మళ్లీ స్కూల్ లోపలి కి  పరుగు ... ఇంక వెళ్లి చూస్తే ఒంటరిగా తమ్ముడు ..


"ఒరేయ్ రా...! రా...! పద పదా ..."


ఇంక స్కూల్ నుంచి ఇంటికెళ్ళి షూస్ విప్పేసి .. ఇంట్లోకి అలా పరిగెత్త బోతుండగా .. గుండు మీద ఒక పిడుగు పడినట్టు ....


" సాక్సులు ... షూ లో పెట్టమని ఎన్నిసార్లు చెప్పాను ...."


ఆ దెబ్బతో వెనకొచ్చే తమ్ముడు షూ నీట్ గా విప్పి పక్కన పెడతాడు ....


"ఛ ...! నేను వెనకొచ్చినా బావుండేది ..." (మనసులో ....)


ఇంక కాసేపు ఆగి అన్నం తిని అలా క్రికెట్ ఆడుకుందాం అనుకుంటాన ....


"ఒరేయ్ ...! బయట ఎండగా వుంది వచ్చి పడుకో ...."


ఇందాక గుండు మీద దెబ్బ గుర్తు రాగానే ... కాళ్ళు కదలటం ఆగిపోయి ... వెనక్కి తిరుగుతాయి ...


" అమ్మా ..!! కేరమ్స్ ఆడుదామా ? "


" సరే పట్టుకురా ...."


ఇంక కూర్చుంటాం .... అలా ఆట మొదలెదతామ ఇంతలో కరెంటు గోవిందా ......


మళ్లీ  బోర్డు బయట వరండాలోకి .... తమ్ముడేమో చిన్నోడు కదా .. వాడికి సరిగ్గా కొట్టటం రాదు ...


కాని ఆట మొదటినుంచి వాడూ రెడ్ కాయినే కొడదాం అనుకునేవాడు ...


దానిని చూస్తూ మిగతావి వదిలేసే వాడు .. ఓడిపోయే స్టేజి దగ్గరికి రాగానే ...


అమ్మ  వాడికి పదో,  ఇరవయ్యో అప్పులిస్తువుండేది ...


ఛి తొండాట .. నాకు అప్పట్లో అస్సలు నచ్చేది కాదు ...


ఇంక అలా కాసేపు ఆడేసరికి టైం నాలుగయ్యేది .... కిందనుంచి ఏవో రెహ్మాన్ మ్యూజిక్ లాంటి శబ్దాలు ...
"
టక్ ... టక్ .. నువ్ అక్కడుండు ... వికెట్లేవి ... పట్టుకో .. క్యాచ్ ... అవుట్ .."


ఇంక నామనసు ... నేను నిదానం  గా అటువైపు ....


"సరే ఇంకా ఆపండి నీళ్ళు పట్టుకోవాలి ...."


అమ్మ అలా లోపలికేల్తుందా ....


"దేవుడా ... ఓ మంచి దేవుడా ... "(మనసులో ....)


నిదానం గా కిందకి .. నావెనకే తమ్ముడూ ...


అబ్బ ఇంక ఆరున్నర , ఏడు గంటల దాక ఆడి అప్పుడు ఇంటికెళ్ళి ... స్నానం చేసి .. అప్పుడు ..


CW లోది HW లోకి ....


ఒకోసారి HW లోవి రాసిందే అయిదుసార్లు రాసి ... (దాన్ని ఇంపోగిషన్ అంటారనుకుంటా ..)


ఎనిమిదిన్నర, తొమ్మిది ఎప్పుడు అవుద్డా .. అని ఎదురు చూస్తూ చదివేవాడ్ని ...


అలా గడిచేవి ఒంటిపూట బళ్లప్పుడు ...!!

కొత్తలో ....


అదే మొదటి సారి .....


అంతకుముందు దాక టీవీ లో తప్ప, దాని పేరు కూడా వినని ప్రాంతం .......


టీవీ లో వచ్చేది కూడా మామూలు వార్తల్లో కాదు పోలీసులు, మావోఇస్ట్లు మధ్య కాల్పులు .....


అలాంటి చోటికి నేను.......... జీవితం లో మొదటిసారి ........


అమ్మ , నాన్న ఎవరూ విడిచిపెట్టకుండానే ..... ఒంటరిగా .....


" అమ్మా ...!! వెళ్లనని చెప్పెయ్యనా ......"


"లేదులే .... చూడు .. ఒక రెండు రోజులు .. బాగోకపోతే అప్పుడు చేసేదేమీ లేదు గా .. అప్పుడే వచ్చేద్దు గాని ..."


"అంతేనంటావా ......"


కాని నాన్న నోట్లో నుంచి  మాట రాలేదు  .... వెళ్ళేటప్పుడు జాగ్రత్త అన్న మాట తప్ప ...


బహుశా ఎప్పుడూ వాళ్ళు ఊహించి వుండరు ... ఇలా నేను వెళ్తానని ......


ఇక భారమైనా హృదయం తో బయల్దేరాను...


ఇక మా మేనేజర్ గాడిని తిట్టని బూతు వుందంటే అది నాకు తప్పకుండా తెలియందే అయివుంటుంది ...


పొద్దున్నే ఇదున్నరకి నాన్న ఫోను ....


"ఏ అయ్యా ...!! వెళ్ళావా ....??"


" లేదు నాన్నా .... వెళ్తున్నా ... ఇంకా మూడు గంటలు పట్టొచ్చు ......"


బహుశా నాన్నకి నిద్ర పడుతున్నట్టు లేదు .... ప్చ్ ....


కొంచం సేపు తర్వాత ........


టైం అప్పుడు ఎనిమిదిన్నర అయ్యింది ......


బస్సు .... బస్స్టాండ్ లో ఆగింది .... ఇక నిదానం గా లేచి ఒక భుజాన బట్టల బాగ్ , ఇంకో భుజాన లాప్ టాప్ బాగ్ ...


బస్టాండ్ బయటికి వచ్చా కాళ్ళీడ్చుకుంటూ .......


ఇప్పుడే పెద్ద సమస్య ...... ఇప్పుడు కుడికి తిరుగుదామా?? ఎడమకి తిరుగుదామా ??


సరే దేవుడి మీదే భారం ఎడమకే తిరుగుదాం పద ......


ఒక పక్క ఏదో షాపింగ్ కాంప్లెక్స్, మరో పక్క ఏదో హోటల్ , పాన్ షాప్ , ATM, టిఫిన్ సెంటర్ ...... అలా ఒక్కొక్కటే నన్ను దాటి పోతున్నాయి .......


దూరం గా ఏదో చిన్న Lodge .... ఇక అక్కడ ఉందామని అనేసుకున్నా ...


వెళ్లి రూం తీసుకున్న ...... ఇంకా అమ్మ కి కాల్ చేసి రూం తీసుకున్నానని చెప్పాను......
కనీసం ఒక మానవమాత్రుడు కూడా తెలియని ప్రదేశం .....

ఏదో కొత్త ప్రపంచం లోకి వచ్చినట్టు అనిపించింది ....

అందరు నా చుట్టూ తిరుగుతూ వుంటారు కాని ఎవరూ నన్ను పలకరించరు .....

నాకష్టాలు నాతోనే చెప్పుకోవాలి ..... నా ఆనందం నేనే పంచుకోవాలి ....

అలా ఒక వారం గడిచాక నిదానం గా వేరే వాళ్ళు పరిచయమయ్యారు ....

అప్పుడు ఇంకా వాళ్ల రూం కి వెళ్లి పోయా ....

ఈ వారం లో నాన్న ఎన్నిసార్లు ఫోన్ చేసేవారో తెలీదు .....

గుర్తోచినప్పుడల్లా ...... తిన్నావా ? లేచావా ? ఇలా అన్నీ ప్రశ్నల వర్షాలే ....

అలా నిదానం గా నాకూ అలవాటైపోయింది .... కొంతమంచ్ది పరిచయమయ్యారు ....

అలా చూస్తూ వుండగానే ఏడు నెలలు గడిచిపోయాయి ....

అంతే కాలం మనకోసం ఆగదుగా ...

ఎందుకో రాత్రి నేను , సంతు గాడు చేసిన discussion వల్ల అనుకుంటా ఇప్పుడు మళ్లీ ఇవన్నీ గురోచ్చాయి ...

గొడుగులు .... పుట్ట గొడుగులు .......

ఇంకా మాకు తెలియకుండానే  పాలేరుకు కబురెల్తుంది .........


వాడూ రేపొద్దున్న తీసుకురాకుండా వచ్చాడా అంతే వాడి పని ...........


"అమ్మా .......!! ఇవిగోండి పుట్టగొడుగులు ............."


"అమ్మమ్మ ...!! ఇవెక్కడ వుంటాయి ....... ఎవరి చేలో వేస్తారు ఇవి ????"


" ఇవి చేల్లో వెయ్యరు నాన్న  ...... చేలో గట్ల మీద మొలుస్తాయి .......... అలా అని అన్నీ కాలాల్లో రావు ........"


"ఇవేంటి అంతా మట్టే వుంది ......?"


"ఇవి నేలలో మొలుస్తాయి నాన్నా .... కడిగి మనం కూర వాడుకోవాలి ....."


" అవునా  ..... సరే వండు ఈ కూర ..... "


నేను , చందు గాడు ...... చీపిరి పుల్లతో .... బాణాలు చేసి ....... బొప్పాయి ఆకులకి వేస్తున్నామా .........


ఇంతలోనే కమ్మటి వాసన ...... మషాలా నుకుంట ........... అది కూడా కొన్నది కాదు ........


రోట్లో నూరింది...... సూపర్ వాసన .........


అబ్బ .... ఒక అరగంటలో ఏదో అంతకంటే  వాసన కమ్మగా .....


ఇంతలో కడుపులో పేగులు ....... కూ ......... కూ .... కూ ........


అని మొదలెట్టాయి ఏమీ తెలియనట్టు .............


"అబ్బాయ్ ..!! అన్నం  తిందురు రండి ......."


"ఆ వచ్చే ......"


అబ్బ ....  అన్నం లో ........ పుట్టగొడుగుల కూర ...........


అబ్బ .. పైన గొడుగు సూపర్ అయితే ........


దాని కింద  కాండం ములక్కయల్లా వుంటుంది ...... మషాలా ...... తో .......


ఇంకా అంతే వెనుక  వాళ్ళ గురించి ఆలోచిస్తే అది పెద్ద పాపమే ...........


దొరికింది దొరికినట్టు కుమ్మడమే .............


"అబ్బ అమ్మమ్మ ...... సూపర్ గా వుంది కూర .........."


"మళ్లీ రేపు తెప్పించు నేను తింటాను ......... చాలా బావుంది ......."


" ఎప్పుడూ దొరకవునాన్న ....... ఎవరో ఒకళ్ళు తీసుకు పోతారు ......."


"అవునా..... సరే........ ఇవి మార్కెట్ లో ఎక్కడ దొరుకుతాయో చెప్పు ........ మేము తెచ్చి నీకిస్తాం .... నువ్వు వండొచ్చు .."
" వెర్రి భడవా ......... అన్నీ మార్కెట్ లో దొరకవురా ........."
(అమ్మమ్మ ప్రేమ , పుట్ట గొడుగులు లాంటివి ........ అనుకుంటా దాని అర్ధం ....)


***********************************


నిజమేననుకుంటా  ..... ఆతర్వాత వంద సార్లు తిన్నా ఆ రుచి రాలేదు ...........


అవి కృత్రిమం గా పెంచడం వల్లో ......


లేక అమ్మమ్మ వండక పోవటం వల్లో ...... నాకు తెలీలేదు ...


నేను అనుకోవడం మాత్రం అవి నలభై శాతం అవి కృత్రిమంగా పెంచడం వల్ల ఐతే ....


మిగతాది మా అమ్మమ్మ వండక పోవటం  వల్లేనేమో .......


ఇప్పుడు తిందామన్నా ఆ పుట్టగొడుగులు లేవు ..... ఆ అమ్మమ్మ లేరు ...........

BSNL - disconnecting India అనే ఓ వ్యధ ....


అబ్బ నేను, టెలికాం లో చేస్తూ వుండటం వల్లో ఏమో తెలీదు కాని నాకు BSNL గురించి కొన్ని విషయాలు తెలిసాయి ...


అవి మీతో పంచుకోవాలనే నా ఈ టపా ....


నాకు తెలిసి ఇండియా టెలికాం రంగం లో వెనుక పడటానికి మన ప్రభుత్వమే కారణం ...


ప్రభుత్వం తీసుకున్న చెత్త నిర్ణయాల వల్ల .. ఇలా తగలడింది టెలికాం రంగం ...


వందకోట్లు దాటిన జనాభా ...... వున్నారు ...


అందులో ఎన్ని కోట్లమంది మొబైల్ ఫోన్ లు వాడుతున్నారో మనకు తెలుసు ....


ఒకొక్కళ్ళు రెండేసి మూడేసి సిమ్ లు వాడుతున్నారు ........


కాని, ఇప్పటికీ.......... ఇన్నాళ్ళకి  ఏదో చేసామన్న పేరుకి ఇప్పుడు 3G వస్తోంది ఇండియా కి .........


BSNL 3G పని మొదలుపెట్టి దాదాపు ఒక పదిహేను నెలలు గడుస్తోంది ...


కాకపోతే ఇప్పటికీ పూర్తిగా నెట్వర్క్ లాంచ్  చేయలేకపోయింది ....


ఈ రోజు ఏదో పేరుకి ఒక మూడు చోట్ల లాంచ్ చేస్తోంది ....


ప్చ్ ....  ఏంటో ఈ విధానాలు ...


అదే ఈపాటికి Airtel కో , Idea కో , Vodafone కో...... ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చుంటే ....


ఈ పాటికి మనం  చెప్పుకుంటూ వుండేవాళ్ళం గర్వం గా ......


Now India is in 3G అని ......


మనకి కావలిసిన వాళ్ళతో ఈ పాటికి వీడియో కాల్స్ చేసుకుంటూ వుండేవాళ్ళం ...


సూపర్ ఫాస్ట్ డేటా రేట్స్ తో నెట్ బ్రౌస్ చేస్తూ వుండేవాళ్ళం .....


మొబైల్ లో టీవీ చూస్తూ వుండేవాళ్ళం .......


ఇప్పటికీ పోయింది లేదు ... ఇప్పుడు ఇచ్చినా చాలు .. నెల రోజుల్లో చెప్పుకోగలం మనం .....

నేను VS నా మనసు ....
****************************
ముందుగా ,

మీలో ఎవరికైనా చేతబడి గట్రా వస్తే కొంచెం చెప్దురు ... ఓ సినిమా తీసిన డైరెక్టర్ గాడికి మళ్లీ ఇలాంటి సినిమా తియ్యకుండా వాడి

మీద వాడుతా ....
*********************************************

హబ్బ .... ఈ రోజు కూడా ఏదో అలా అలా గడిచింది ..........

ఇంకా సెకండ్ షో సినిమాకి వెళ్లి వచ్చాను " రాంబాబు గాడి పెళ్ళాం "... మురళి బాలేదని చెప్పినా ......

సంతు గాడు , శ్రీ గాడు కలిపి తీసుకెళ్ళారు ...... చెత్తగా వుంది సినిమా... దానిగురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం ...

ఇంకా సినిమా అయిపోయాక రైల్వే స్టేషన్ దగ్గర చాయ్ తాగి వచ్చాం రూం కి.........

వచ్చాక శ్రీను గాడితో ఇప్పుడు దాక ఫోన్ మాట్లాడాను ...... చాలా రోజులైంది వాడితో ఫోన్ మాట్లాడి ....

వాడూ నాలాగే దెయ్యం లాగా మూడు గంటల దాకా  లేచే ఉంటాడు .....

ఏవో చాల ఆఫీసు కబుర్లు చెప్పుకున్నాం .......

తర్వాత ఇంకా బ్లాగ్ రాయటం మొదలుపెట్టాను ...

ఏంటో కాని ఒక రెండు, మూడు రోజులనుంచి ఏంటోలా ఉంటోంది ........

మొన్న బస్సు లో వచ్చేటప్పుడు ... నా మనసులో చిన్న సైజు యుద్దమే జరిగింది ...

ఏవో రకరకాల ఆలోచనాలు వచ్చాయి ......

ఎందుకో ఒక సారి మనసు, మనుషుల మీదకి వెళ్ళింది ......... ఏంటో ఈ జీవితం ఇలా ఒంటరిగా ...

కనీసం ఒక ఆనందాన్ని  పంచు కోవడానికి ....... బాధని చెప్పుకోవడానికో... ఏంటో ఎవరూ లేకుండా ఇంత దూరం లో  ఇలా వున్నాను ఏంటా

అనిపించింది ..... ( దీని అర్ధం గర్ల్ ఫ్రెండ్ కావాలని మాత్రం కాదు ...)

మళ్లీ నాకు నేనే ... సర్లే జీవితాంతం ఇలానే వుండనుగా అనుకున్నా......

మళ్లీ కొత్త వుద్యోగం లో చేరితే అంతా మాములుగానే ఉంటుంది గా ...

అందరితో కలిసి ఉండొచ్చుగా అనుకున్నా ...


కాని మనుషుల మధ్యలో భూమి ఆకర్షణ శక్తిని మించిన శక్తేదో వుంది ......

అదే మనం ఎంత దూరం లో వున్నా మనల్ని అవతలి వాళ్ళకి దగ్గర చేస్తుందేమో కదా ........

దానికి ప్రేమ అని రెండు చిన్న అక్షరాల్లో నిర్వచనం ఇవ్వలేం ... అంత కంటే గొప్ప పదమేదో కావాలి .....

అది అబ్బాయి, అమ్మాయి మధ్యే కానవసరం లేదు ........

మనకి ఓదార్పు ఇచ్చేది ఏదైనా అదే కదా....

సూర్యుడు ఎంత దూరం లో వున్నా ఆ కిరణాలు తప్పకుండా మనల్ని తాకినట్టు ...

వాళ్ళ ఆప్యాయత మనల్ని తప్పకుండా చేరుతుంది ...

ఇంకా ఇలా చాలా ఊసులు చెప్పుకున్నాం .. నేను , నా మనసు .....

ఇలా చెప్పుకుంటూ వుండగానే నేను దిగాల్సిన స్టేజి వచ్చేసింది .....

అప్పటికైతే అలా ఆపేసాను కాని ...... ఇప్పటికీ ఏవేవో ఇంకా తిరుగుతూనే వున్నాయ్ .... భూత్ బంగ్లా లాంటి నా మైండ్ లో ...

అబ్బ......... టైం కి తగ్గట్టు బయట సంతు గాడు పాట పెట్టాడు ...

"దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి ........ ఇక ఊరేల, సొంత ఇల్లేల, ఓ చెల్లెలా ...."
__________________________________

సరే గాని ఇందాక ఏదో పాట చూస్తుంటే  ఎందుకో   ఒక అనుమానం వచ్చింది ....... అది ఏంటంటే ....

" సరిగ్గా పెళ్ళిలో తాళి కట్టే సమయానికి ఒక అబ్బాయికి గాని , అమ్మాయికి గాని ఏమనిపిస్తుంది మనసులో ....!!!" అని ..

ఇంతకీ ఎమనిపిస్తుందంటారు ...... సర్లే పోనీ  మీకేమనిపించిందో చెప్పండి సరదాగా ....

చిన్నప్పుడు .. కాదుకాదు బుడ్డి గా వున్నప్పుడు ..."ఊరుకో నాన్న ఊరుకో ...... కొడదాం లే అక్కని ...... ఊరుకో ......!!"

"అమ్మాయ్ ...!! ఆ తుండు ఇట్లా తీసుకు రా ...... "

"ఏంటి నీళ్ళు పోసిందా నీ మీద ...... కొడుదువులే పెద్దయ్యాక ......హమ్మ  .. అస్సలు భయం లేదు ... కదా ..దానికి !!"

అబ్బాయిని అమ్మ కాళ్ళ మీద పడుకోబెట్టుకుంది ......

తుండు పెట్టి తుడుస్తువుంటే  వాడు ఉంటేనా కాళ్ళ మీద ... అటు ఇటు దోర్లటమే సరిపోతోంది ....

అబ్బాయికి ఇంకా సాంబ్రాణి వేసి .......

" ఒల్ల్లో లో  ...... ఆయీ ..... అయ్పోయింది .... అయ్పోయింది నాన్న ఊరుకో ..."

"అమ్మాయ్ ..!! అక్కడ మంచం మీద తమ్ముడి బట్టలున్నాయి  తీసుకు రా ..."

"ఇదిగో దా.... కొత్త బట్ట లేసుకుందు నాన్న .... మమ్మ కదూ అయ్పోయింది గా .. ఊరుకో ..  " అంటూ బట్టలు  వేసేసింది ...

" ఇదిగో బొట్టు పెట్టించుకో ..... అయ్పోయింది నాన్న ...... అయ్పోయింది ..........."

ఇలా మాయ చేస్తూనే నుదుటి మీద ఒక నల్లని కాటుక బొట్టు ........

బుగ్గ మీద ఒక నల్లని కాటుక చుక్క ...... ఇంకా అరికాల్లో ఒక నల్లని కాటుక చుక్క .....

అబ్బ..!! ఆ అరికాల్లో ఆ కాటుక చుక్క వుందీ .... తెల్లని ఆకాశం లో నల్లని చంద్రుడిలా వుంది ........

" అమ్మ ఎందుకే తమ్ముడూ ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు ....?? స్నానం చెయ్యడానికి కూడా ఏడుపేనా ..??"

"అబ్బ...!! నువ్వూ అంతేలేవే ..... చిన్నప్పుడు ....!!!"

ఇంట్లో కట్టిన చీర ఉయ్యాల కిందకి దించింది ....

అబ్బాయి అందులో పడుకున్నాడు .... కాని ఏడుపు ఆపితేగా .....

"ఇదిగో తమ్ముడి ఉయ్యాల ఊపుతూ ఉండు .... నేను పొయ్య  దగ్గరికి వెళ్ళొస్తా ...."

"సరే ....."

అక్క.. ఉయ్యాల ఊపుతూ వుంది ....... కాని వాడు ఏడుపు ఆపితేగా ...

" ఊరుకో తమ్ము ...!! పడుకో ..... ఏడవకు .......!!!"

"అమ్మా !! వీడు ఏడుపాపట్లేదే .........!!"

" వచ్చే .... వచ్చే ... రెండు నిముషాలు ..... చూడమ్మా ...!!!"

అబ్బ .... అమ్మ రానే వచ్చింది ........

"ఒంట్రా ....!! పడుకో నాన్న .....!!! పడుకో .......!!"

"
ఏడవకు ఏడవకు వెర్రి అబ్బాయిఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు..!

నీలాలు కారితే నేజూడలేను


పాలైన కారవే బంగారు కళ్ళు..!

నిద్రపో నాబాబు నిద్రపోనాన్నా


నిద్రలకు నూరేళ్ళు నీకు నూరేళ్ళు

నిద్రపో భలభద్ర రాజకుమార


నినుగన్న తండ్రికి నిండు నూరేళ్ళు..!
"
అబ్బాయి బొటనేలు నోట్లో వేసుకుంటున్నాడు ...
 
నిద్రలోకి జారుకున్నాడు ........

అక్కకి ... అమ్మ చేతిలో ఏదో మంత్ర దండం కనపడింది .......

అమ్మ వంక అలా చూస్తూ వుండి పోయింది .......

నేను - మా అక్క
"దిల్షుఖ్ నగర్ నుంచి మలక్పేట్ రావడానికి ........ ఐదేళ్ళు ....


మలక్పేట్ నుంచి కోఠి రావడానికి ..... పదేళ్ళు ......


కోఠి నుంచి అడిబ్స్ రావటానికి ....... పదేళ్ళు ....


అబిడ్స్ నుంచి నాంపల్లి రావడానికి .... పదేళ్ళు ......


నాంపల్లి నుంచి రూం కి రావడానికి .... పదేళ్ళు .....


అదీ ..... నీకు నాకూ మద్య దూరం ........ దరిదాపు జీవితకాలం ....... :(:(:(:( "


ఇది.......... నాకు అనిపించింది..............  ఇందాక మా అక్కని వదిలేసి వస్తున్నప్పుడు ........


మా ఇద్దరిది రక్తసంబంధం కాదు ....  ఏదో దూరపు చుట్టరికం .......


ఒక అమ్మ కడుపున పుట్టక పోయినా ..... ఎన్ని పంచుకున్నామో మేం ...........


కొన్ని తీపి జ్ఞాపకాలు ..... కొన్ని చేదు అనుభవాలు ..........


ఎన్ని తిట్టుకున్నాం ....... ఎన్ని కబుర్లు చెప్పుకున్నాం .....


ఎన్ని సార్లు ఒకళ్ళ మీద ఒకళ్ళు కోపం తెచ్చుకున్నాం .........


కాని అదంతా మా  మద్య ఒక్క గీత కూడా గియ్యలేకపోయింది .........


మళ్ళి రాదేమో ఇలాంటి రోజు ......


అంతేలే .... ఆడపిల్ల కి పెళ్ళైతే ఇక ఎన్ని అనుబందాలున్న అవి చుట్టపు చూపులే అవుతాయేమో
...... కదా ....!!


నాకు అన్నీ ఇచ్చిన దేవుడు .. ఒక సొంత  అక్కని ఎందుకివ్వ లేదో ?? అనిపిస్తుంది కాసేపు ...


కొన్నాళ్ళ పరిచయానికే ఇంత బాధగా వుంటే  .... అమ్మో ఇంకా చిన్నప్పటి నుంచి వుంటే ఇంకేమన్నా ఉందా .... అనిపిస్తుంది కాసేపు ...!!

రాసేటప్పుడు గొంతులో ఏదో అదిమిపెట్టిరాస్తున్న .......

ఇంతలోనే ఏదో మెసేజ్ యాహూ లో ...... తమ్ముడూ అని .......

అది చూడగానే  కళ్ళు  మసక బారాయి ......

అదిగో అది ఆరటానికే  ఇంత టైం పట్టింది .......

మళ్లీ నేనా పిలుపు వినలేనేమో ......!!!!!!

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......