చిన్నప్పుడు .. కాదుకాదు బుడ్డి గా వున్నప్పుడు ...
"ఊరుకో నాన్న ఊరుకో ...... కొడదాం లే అక్కని ...... ఊరుకో ......!!"
"అమ్మాయ్ ...!! ఆ తుండు ఇట్లా తీసుకు రా ...... "
"ఏంటి నీళ్ళు పోసిందా నీ మీద ...... కొడుదువులే పెద్దయ్యాక ......హమ్మ .. అస్సలు భయం లేదు ... కదా ..దానికి !!"
అబ్బాయిని అమ్మ కాళ్ళ మీద పడుకోబెట్టుకుంది ......
తుండు పెట్టి తుడుస్తువుంటే వాడు ఉంటేనా కాళ్ళ మీద ... అటు ఇటు దోర్లటమే సరిపోతోంది ....
అబ్బాయికి ఇంకా సాంబ్రాణి వేసి .......
" ఒల్ల్లో లో ...... ఆయీ ..... అయ్పోయింది .... అయ్పోయింది నాన్న ఊరుకో ..."
"అమ్మాయ్ ..!! అక్కడ మంచం మీద తమ్ముడి బట్టలున్నాయి తీసుకు రా ..."
"ఇదిగో దా.... కొత్త బట్ట లేసుకుందు నాన్న .... మమ్మ కదూ అయ్పోయింది గా .. ఊరుకో .. " అంటూ బట్టలు వేసేసింది ...
" ఇదిగో బొట్టు పెట్టించుకో ..... అయ్పోయింది నాన్న ...... అయ్పోయింది ..........."
ఇలా మాయ చేస్తూనే నుదుటి మీద ఒక నల్లని కాటుక బొట్టు ........
బుగ్గ మీద ఒక నల్లని కాటుక చుక్క ...... ఇంకా అరికాల్లో ఒక నల్లని కాటుక చుక్క .....
అబ్బ..!! ఆ అరికాల్లో ఆ కాటుక చుక్క వుందీ .... తెల్లని ఆకాశం లో నల్లని చంద్రుడిలా వుంది ........
" అమ్మ ఎందుకే తమ్ముడూ ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు ....?? స్నానం చెయ్యడానికి కూడా ఏడుపేనా ..??"
"అబ్బ...!! నువ్వూ అంతేలేవే ..... చిన్నప్పుడు ....!!!"
ఇంట్లో కట్టిన చీర ఉయ్యాల కిందకి దించింది ....
అబ్బాయి అందులో పడుకున్నాడు .... కాని ఏడుపు ఆపితేగా .....
"ఇదిగో తమ్ముడి ఉయ్యాల ఊపుతూ ఉండు .... నేను పొయ్య దగ్గరికి వెళ్ళొస్తా ...."
"సరే ....."
అక్క.. ఉయ్యాల ఊపుతూ వుంది ....... కాని వాడు ఏడుపు ఆపితేగా ...
" ఊరుకో తమ్ము ...!! పడుకో ..... ఏడవకు .......!!!"
"అమ్మా !! వీడు ఏడుపాపట్లేదే .........!!"
" వచ్చే .... వచ్చే ... రెండు నిముషాలు ..... చూడమ్మా ...!!!"
అబ్బ .... అమ్మ రానే వచ్చింది ........
"ఒంట్రా ....!! పడుకో నాన్న .....!!! పడుకో .......!!"
"
ఏడవకు ఏడవకు వెర్రి అబ్బాయి
ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు..!
నీలాలు కారితే నేజూడలేను
పాలైన కారవే బంగారు కళ్ళు..!
నిద్రపో నాబాబు నిద్రపోనాన్నా
నిద్రలకు నూరేళ్ళు నీకు నూరేళ్ళు
నిద్రపో భలభద్ర రాజకుమార
నినుగన్న తండ్రికి నిండు నూరేళ్ళు..!
"
అబ్బాయి బొటనేలు నోట్లో వేసుకుంటున్నాడు ...
నిద్రలోకి జారుకున్నాడు ........
అక్కకి ... అమ్మ చేతిలో ఏదో మంత్ర దండం కనపడింది .......
అమ్మ వంక అలా చూస్తూ వుండి పోయింది .......
3/01/2010 08:55:00 PM
|
Labels:
ముత్యాలు
|
Subscribe to:
Post Comments (Atom)
Blog Archive
-
▼
2010
(90)
-
▼
March
(11)
- చిన్నప్పటి బొమ్మలు - బాధలు
- ప(ని)ణి.......ఓ విరక్తి కథ
- మెక్ డొనాల్డ్స్ వారి ఉగాది పచ్చడి ...
- Password Recovery అనే ఓ కథ ..!!
- ఒంటి పూట బడి వచ్చిందోచ్ ...!!
- కొత్తలో ....
- గొడుగులు .... పుట్ట గొడుగులు .......
- BSNL - disconnecting India అనే ఓ వ్యధ ....
- నేను VS నా మనసు ....
- చిన్నప్పుడు .. కాదుకాదు బుడ్డి గా వున్నప్పుడు ...
- నేను - మా అక్క
-
▼
March
(11)

5 comments:
Beautiful!
wonderful.........
చాలా బాగుందండి.
chala baagundi...
@పరిమళం
thk u.....
@సుభద్ర
thk u.....
@జయ ,venuram
ధన్యవాదాలు
Post a Comment