చీకటి వెలుగుల రంగేళి ......


నేను VS నా మనసు ....
****************************
ముందుగా ,

మీలో ఎవరికైనా చేతబడి గట్రా వస్తే కొంచెం చెప్దురు ... ఓ సినిమా తీసిన డైరెక్టర్ గాడికి మళ్లీ ఇలాంటి సినిమా తియ్యకుండా వాడి

మీద వాడుతా ....
*********************************************

హబ్బ .... ఈ రోజు కూడా ఏదో అలా అలా గడిచింది ..........

ఇంకా సెకండ్ షో సినిమాకి వెళ్లి వచ్చాను " రాంబాబు గాడి పెళ్ళాం "... మురళి బాలేదని చెప్పినా ......

సంతు గాడు , శ్రీ గాడు కలిపి తీసుకెళ్ళారు ...... చెత్తగా వుంది సినిమా... దానిగురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం ...

ఇంకా సినిమా అయిపోయాక రైల్వే స్టేషన్ దగ్గర చాయ్ తాగి వచ్చాం రూం కి.........

వచ్చాక శ్రీను గాడితో ఇప్పుడు దాక ఫోన్ మాట్లాడాను ...... చాలా రోజులైంది వాడితో ఫోన్ మాట్లాడి ....

వాడూ నాలాగే దెయ్యం లాగా మూడు గంటల దాకా  లేచే ఉంటాడు .....

ఏవో చాల ఆఫీసు కబుర్లు చెప్పుకున్నాం .......

తర్వాత ఇంకా బ్లాగ్ రాయటం మొదలుపెట్టాను ...

ఏంటో కాని ఒక రెండు, మూడు రోజులనుంచి ఏంటోలా ఉంటోంది ........

మొన్న బస్సు లో వచ్చేటప్పుడు ... నా మనసులో చిన్న సైజు యుద్దమే జరిగింది ...

ఏవో రకరకాల ఆలోచనాలు వచ్చాయి ......

ఎందుకో ఒక సారి మనసు, మనుషుల మీదకి వెళ్ళింది ......... ఏంటో ఈ జీవితం ఇలా ఒంటరిగా ...

కనీసం ఒక ఆనందాన్ని  పంచు కోవడానికి ....... బాధని చెప్పుకోవడానికో... ఏంటో ఎవరూ లేకుండా ఇంత దూరం లో  ఇలా వున్నాను ఏంటా

అనిపించింది ..... ( దీని అర్ధం గర్ల్ ఫ్రెండ్ కావాలని మాత్రం కాదు ...)

మళ్లీ నాకు నేనే ... సర్లే జీవితాంతం ఇలానే వుండనుగా అనుకున్నా......

మళ్లీ కొత్త వుద్యోగం లో చేరితే అంతా మాములుగానే ఉంటుంది గా ...

అందరితో కలిసి ఉండొచ్చుగా అనుకున్నా ...


కాని మనుషుల మధ్యలో భూమి ఆకర్షణ శక్తిని మించిన శక్తేదో వుంది ......

అదే మనం ఎంత దూరం లో వున్నా మనల్ని అవతలి వాళ్ళకి దగ్గర చేస్తుందేమో కదా ........

దానికి ప్రేమ అని రెండు చిన్న అక్షరాల్లో నిర్వచనం ఇవ్వలేం ... అంత కంటే గొప్ప పదమేదో కావాలి .....

అది అబ్బాయి, అమ్మాయి మధ్యే కానవసరం లేదు ........

మనకి ఓదార్పు ఇచ్చేది ఏదైనా అదే కదా....

సూర్యుడు ఎంత దూరం లో వున్నా ఆ కిరణాలు తప్పకుండా మనల్ని తాకినట్టు ...

వాళ్ళ ఆప్యాయత మనల్ని తప్పకుండా చేరుతుంది ...

ఇంకా ఇలా చాలా ఊసులు చెప్పుకున్నాం .. నేను , నా మనసు .....

ఇలా చెప్పుకుంటూ వుండగానే నేను దిగాల్సిన స్టేజి వచ్చేసింది .....

అప్పటికైతే అలా ఆపేసాను కాని ...... ఇప్పటికీ ఏవేవో ఇంకా తిరుగుతూనే వున్నాయ్ .... భూత్ బంగ్లా లాంటి నా మైండ్ లో ...

అబ్బ......... టైం కి తగ్గట్టు బయట సంతు గాడు పాట పెట్టాడు ...

"దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి ........ ఇక ఊరేల, సొంత ఇల్లేల, ఓ చెల్లెలా ...."
__________________________________

సరే గాని ఇందాక ఏదో పాట చూస్తుంటే  ఎందుకో   ఒక అనుమానం వచ్చింది ....... అది ఏంటంటే ....

" సరిగ్గా పెళ్ళిలో తాళి కట్టే సమయానికి ఒక అబ్బాయికి గాని , అమ్మాయికి గాని ఏమనిపిస్తుంది మనసులో ....!!!" అని ..

ఇంతకీ ఎమనిపిస్తుందంటారు ...... సర్లే పోనీ  మీకేమనిపించిందో చెప్పండి సరదాగా ....

8 comments:

భావన said...

మీకు మాత్రం పెళ్ళి చేసుకునే టైం దగ్గరకు వచ్చింది ఇది మొదటి స్టెప్ దానికి అని అనిపిస్తోంది ఇప్పుడు నాకు. . ;-)

Phani Yalamanchili said...

హ్హ ... హ్హ ... హ్హ ... మీరు "రాంబాబు గాడి పెళ్ళాం " సినిమా హాల్లో కాలెట్టారు ... ఇంకా నా పెళ్ళికి చాలా టైం వుంది ... దాదాపు ఒక ఐదేళ్ళు .....అయినా ఆనందాన్ని పంచుకోవాలంటే పెళ్ళే చేసుకోవాలా !!! మనల్ని అర్ధం చేసుకునే స్నేహితుడో, అమ్మో , అన్నో , అక్కో అయితే సరిపోరా ....... ఇక నా డౌట్ గురించయ్తే నాకు సరదాగా వచ్చిన డౌట్ అడిగాను అంతే ..... హ్హ ...హ్హ ... :):)

శిశిర said...

ఫణీ, మీరు బ్లాగు మొదలుపెట్టినప్పటి నుండీ అంటే మీ మొదటి టపా నుండి ఈ టపా వరకూ ప్రతి టపా చదువుతున్నాను నేను. ఏదో టైం పాస్ కి రాస్తున్నట్టుగా ఉండేవి మీ టపాలు మొదట్లో. కానీ రోజురోజుకీ చాలా పరిణితి కనిపిస్తూంది (రాసే విధానంలో కానీ, రాసే విషయంలో కానీ) మీ టపాలలో. చాలా బాగా రాస్తున్నారు. Keep It Up. All the best. :)

Phani Yalamanchili said...

ధన్యవాదాలు శిశిర గారు, మొన్న ఒక రోజు ఖాళీ గా వుండి నా పాత టపాలు చదివినప్పుడు .. ఏదో తేడా కనిపించింది నాకు అప్పటికి, ఇప్పటికీ .. కాని భలే ఆనందం గా ఉంది ... మీరా మాటలు అంటుంటే ....
Thk u so much ......

Vinay Chakravarthi.Gogineni said...

me toooooo agree with bhavana........అయినా ఆనందాన్ని పంచుకోవాలంటే పెళ్ళే చేసుకోవాలా !!! మనల్ని అర్ధం చేసుకునే స్నేహితుడో, అమ్మో , అన్నో , అక్కో అయితే సరిపోరా .......
after marriage u could get the answer......

if its happy mood then no prob u can share with anyone........but what abt sorrows ...?ur blog loking very nice man............

భావన said...

ఆనందం పంచుకుంటానని అన్నందుకు కాదు ఫణి నేను అన్నది, మీరు పెళ్ళి చేసుకునే ఆ క్షణం లో ఏమనిపిస్తోందో చెప్పమన్నారు కదా.. దాని అర్ధం అదే లే. ;-) మేము కూడా మీ వయసు పాస్ అయ్యే ఈ ఏజ్ కు వచ్చాము, కధలు వద్దమ్మా. ;-).

Thanks గోగినేని. అవును అమ్మ అక్క స్నేహితులు వీటన్నిటిని కలిపి ఇచ్చే పేకేజ్ పెళ్ళి

అవును మీరు రాసే శైలి లో మార్పు వచ్చింది. ఇది వరకటి కంటే ఇప్పుడు బాగా రాస్తున్నారు.

Phani Yalamanchili said...

@ వినయ్ ,
వద్ద్దు బాబోయ్ ఇంకా ఆపేయ్ అక్కడే...
నా బ్లాగ్ నచ్చినందుకు thks ............

@ భావన
బాగా రాస్తున్నారు అన్నందుకు మీకు ధన్యవాదాలు .......

సరే లెమ్మా ఇంతకీ తాళి కట్టేటప్పుడు మీకేమనిపించిందో చెప్పరూ ప్లీజ్ ........

శ్రీకర్ బాబు said...

నాకు పెళ్లి కాలేదు కానీ, నేను ఊహించినంత వరకు ... తాళి కట్టేప్పుడు అసలు ఏమి ఆలోచించరు.... అసలు ఆలోచించే ఓపిక ఉండదు... వాళ్ళు జరిపే తంతు వల్ల చాలా అలసిపోయి ఉంటారు. .... కాకపోతే పెళ్ళికి ముహూర్తం పెట్టిన నుండి పెళ్లి వరకు అడగండీ..... ఎవరన్నా ఏమయినా చెప్తారేమో చూద్దాం..........

Post a Comment

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......