చీకటి వెలుగుల రంగేళి ......


గొడుగులు .... పుట్ట గొడుగులు .......

ఇంకా మాకు తెలియకుండానే  పాలేరుకు కబురెల్తుంది .........


వాడూ రేపొద్దున్న తీసుకురాకుండా వచ్చాడా అంతే వాడి పని ...........


"అమ్మా .......!! ఇవిగోండి పుట్టగొడుగులు ............."


"అమ్మమ్మ ...!! ఇవెక్కడ వుంటాయి ....... ఎవరి చేలో వేస్తారు ఇవి ????"


" ఇవి చేల్లో వెయ్యరు నాన్న  ...... చేలో గట్ల మీద మొలుస్తాయి .......... అలా అని అన్నీ కాలాల్లో రావు ........"


"ఇవేంటి అంతా మట్టే వుంది ......?"


"ఇవి నేలలో మొలుస్తాయి నాన్నా .... కడిగి మనం కూర వాడుకోవాలి ....."


" అవునా  ..... సరే వండు ఈ కూర ..... "


నేను , చందు గాడు ...... చీపిరి పుల్లతో .... బాణాలు చేసి ....... బొప్పాయి ఆకులకి వేస్తున్నామా .........


ఇంతలోనే కమ్మటి వాసన ...... మషాలా నుకుంట ........... అది కూడా కొన్నది కాదు ........


రోట్లో నూరింది...... సూపర్ వాసన .........


అబ్బ .... ఒక అరగంటలో ఏదో అంతకంటే  వాసన కమ్మగా .....


ఇంతలో కడుపులో పేగులు ....... కూ ......... కూ .... కూ ........


అని మొదలెట్టాయి ఏమీ తెలియనట్టు .............


"అబ్బాయ్ ..!! అన్నం  తిందురు రండి ......."


"ఆ వచ్చే ......"


అబ్బ ....  అన్నం లో ........ పుట్టగొడుగుల కూర ...........


అబ్బ .. పైన గొడుగు సూపర్ అయితే ........


దాని కింద  కాండం ములక్కయల్లా వుంటుంది ...... మషాలా ...... తో .......


ఇంకా అంతే వెనుక  వాళ్ళ గురించి ఆలోచిస్తే అది పెద్ద పాపమే ...........


దొరికింది దొరికినట్టు కుమ్మడమే .............


"అబ్బ అమ్మమ్మ ...... సూపర్ గా వుంది కూర .........."


"మళ్లీ రేపు తెప్పించు నేను తింటాను ......... చాలా బావుంది ......."


" ఎప్పుడూ దొరకవునాన్న ....... ఎవరో ఒకళ్ళు తీసుకు పోతారు ......."


"అవునా..... సరే........ ఇవి మార్కెట్ లో ఎక్కడ దొరుకుతాయో చెప్పు ........ మేము తెచ్చి నీకిస్తాం .... నువ్వు వండొచ్చు .."
" వెర్రి భడవా ......... అన్నీ మార్కెట్ లో దొరకవురా ........."
(అమ్మమ్మ ప్రేమ , పుట్ట గొడుగులు లాంటివి ........ అనుకుంటా దాని అర్ధం ....)


***********************************


నిజమేననుకుంటా  ..... ఆతర్వాత వంద సార్లు తిన్నా ఆ రుచి రాలేదు ...........


అవి కృత్రిమం గా పెంచడం వల్లో ......


లేక అమ్మమ్మ వండక పోవటం వల్లో ...... నాకు తెలీలేదు ...


నేను అనుకోవడం మాత్రం అవి నలభై శాతం అవి కృత్రిమంగా పెంచడం వల్ల ఐతే ....


మిగతాది మా అమ్మమ్మ వండక పోవటం  వల్లేనేమో .......


ఇప్పుడు తిందామన్నా ఆ పుట్టగొడుగులు లేవు ..... ఆ అమ్మమ్మ లేరు ...........

2 comments:

భావన said...

బాగున్నాయి అమ్మమ్మ గారి ఇంటి పుట్టగొడుగులు. అవును ఎన్ని తిన్నా చిన్నప్పుడు అమ్మమ్మ ల ఇంట్లో, మేనత్త ల ఇంట్లో తిన్న వాటికి సరి కావు, బహుశా ఆ ప్రేమ గారాబం కలిసి వుండటం మూలం గానేమో. :-)

Phani Yalamanchili said...

ధన్యవాదాలు .... అవుననుకుంటా వాటి ముందు ఏవీ సరిరావు ... మనం అడగటమే తడవు.. అన్నీ వచ్చి సమకూరుతాయి కదా ...:):)

Post a Comment

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......