చీకటి వెలుగుల రంగేళి ......


ఒంటి పూట బడి వచ్చిందోచ్ ...!!

అప్పుడు టైం పొద్దున్న ఏడున్నర ...


ఇంత విశాలమైన భూగోళం లో ఓ ఇంట్లో ఇలా .......


" అమ్మోయ్...! నా షూసు ...!!"


"నిన్న వచ్చాక ఎక్కడేసావ్ సరిగ్గా చూడు అక్కడే వుంటాయి  ...."


"ఒరేయ్ చిన్నోడా...! నువ్ తొందరగా కానియ్యరా టైం అవ్తోంది. "


"అమ్మా నాకు లేట్ అవ్తోంది ... అదిగో రిక్షా వాడూ వచ్చేసాడు ..."


"అయ్పోయింది చిన్నోడి పని కూడా ..... రెండు నిముషాలు వుండమను .... "


"ఇదిగో టిఫిన్ బాక్స్ ... పదండి పదండి త్వరగా ..."


"అబ్బ ...! ఇప్పుడు తిన్నాం గా మళ్లీ టిఫిన్ ఎందుకు ?"


"ఆకలేస్తుంది మధ్యలో ..... పదండి పదండి ......"


అలా మూడుచక్రాల పుష్పక విమానం స్కూల్ వైపు బయల్దేరుతుంది ......


సరిగ్గా వెళ్ళే సరికి పిల్లలందరూ పరిగెడుతూ వుంటారు ... వాళ్ళ వెనకే మేమూ.....


ఒకల్లనోకళ్ళు... తోసుకుంటూ .. పరుగోపరుగు ...


ఎనిమిదైంది ... వందేమాతరం మొదటగా ..... (అందుకేననుకుంటా ఇప్పటికీ అది గుర్తుంది పొల్లు పోకుండా ..)


తర్వాతి కార్యక్రమం ప్రతిజ్ఞ ...  భారతదేశం నా మాతృభూమి .... (దీని అంతటికన్నా చివర్లో జైహింద్ గట్టిగా వినపడేది ..)


ఇక తరవాత  ఎవరి క్లాసులకి వాళ్ళు ...


ఇంక  చెప్పేదేముంది ...... ఉతుకుళ్ళు .... బాదుళ్ళు ... జజ్జ నకరి జనారే ....


మళ్లీ పదిన్నర అవ్తుందా ...... మధ్యలో చిన్న బ్రేక్ .......


అమ్మ పెట్టిన టిఫిన్ తెరిచి చూస్తే ... అందులో వున్న ఉప్మా ని మళ్లీ ఒక రౌండ్ వేసే  లోపే  .... మళ్లీ బెల్లు మోగుద్ది...


మళ్లీ మొదలు జజ్జ నకరి జనారే .....


అబ్బ క్షణం ఒక యుగం లా గడుస్తుంది .... ఒకో క్లాసు ...


అబ్బ పన్నెండున్నర ..... హమ్మ బెల్లు కొట్టారు .....


ఇక సందడే సందడి ... పరుగో పరుగు ... వాడినీ, వీడిని గిచ్చుకుంటూ .... గిల్లుకుంటూ  ...


తోసుకుంటూ ... ఇంకా ఆ జైలు నుంచి నిదానం గా మళ్లీ మా పుష్పక విమానం దగ్గరికి ...


ఇంతలో ఏదో మర్చిపోయినట్టు గుర్తొస్తుంది ... అదేంటా అంటే ...


పుస్తకమో ... పెన్నో కాదు ......మా తమ్ముడిని ...


"అయ్య... బాబోయ్ వీడక్కడే వున్నాడేమో .......!!!" (మనసులో ...)


మళ్లీ స్కూల్ లోపలి కి  పరుగు ... ఇంక వెళ్లి చూస్తే ఒంటరిగా తమ్ముడు ..


"ఒరేయ్ రా...! రా...! పద పదా ..."


ఇంక స్కూల్ నుంచి ఇంటికెళ్ళి షూస్ విప్పేసి .. ఇంట్లోకి అలా పరిగెత్త బోతుండగా .. గుండు మీద ఒక పిడుగు పడినట్టు ....


" సాక్సులు ... షూ లో పెట్టమని ఎన్నిసార్లు చెప్పాను ...."


ఆ దెబ్బతో వెనకొచ్చే తమ్ముడు షూ నీట్ గా విప్పి పక్కన పెడతాడు ....


"ఛ ...! నేను వెనకొచ్చినా బావుండేది ..." (మనసులో ....)


ఇంక కాసేపు ఆగి అన్నం తిని అలా క్రికెట్ ఆడుకుందాం అనుకుంటాన ....


"ఒరేయ్ ...! బయట ఎండగా వుంది వచ్చి పడుకో ...."


ఇందాక గుండు మీద దెబ్బ గుర్తు రాగానే ... కాళ్ళు కదలటం ఆగిపోయి ... వెనక్కి తిరుగుతాయి ...


" అమ్మా ..!! కేరమ్స్ ఆడుదామా ? "


" సరే పట్టుకురా ...."


ఇంక కూర్చుంటాం .... అలా ఆట మొదలెదతామ ఇంతలో కరెంటు గోవిందా ......


మళ్లీ  బోర్డు బయట వరండాలోకి .... తమ్ముడేమో చిన్నోడు కదా .. వాడికి సరిగ్గా కొట్టటం రాదు ...


కాని ఆట మొదటినుంచి వాడూ రెడ్ కాయినే కొడదాం అనుకునేవాడు ...


దానిని చూస్తూ మిగతావి వదిలేసే వాడు .. ఓడిపోయే స్టేజి దగ్గరికి రాగానే ...


అమ్మ  వాడికి పదో,  ఇరవయ్యో అప్పులిస్తువుండేది ...


ఛి తొండాట .. నాకు అప్పట్లో అస్సలు నచ్చేది కాదు ...


ఇంక అలా కాసేపు ఆడేసరికి టైం నాలుగయ్యేది .... కిందనుంచి ఏవో రెహ్మాన్ మ్యూజిక్ లాంటి శబ్దాలు ...
"
టక్ ... టక్ .. నువ్ అక్కడుండు ... వికెట్లేవి ... పట్టుకో .. క్యాచ్ ... అవుట్ .."


ఇంక నామనసు ... నేను నిదానం  గా అటువైపు ....


"సరే ఇంకా ఆపండి నీళ్ళు పట్టుకోవాలి ...."


అమ్మ అలా లోపలికేల్తుందా ....


"దేవుడా ... ఓ మంచి దేవుడా ... "(మనసులో ....)


నిదానం గా కిందకి .. నావెనకే తమ్ముడూ ...


అబ్బ ఇంక ఆరున్నర , ఏడు గంటల దాక ఆడి అప్పుడు ఇంటికెళ్ళి ... స్నానం చేసి .. అప్పుడు ..


CW లోది HW లోకి ....


ఒకోసారి HW లోవి రాసిందే అయిదుసార్లు రాసి ... (దాన్ని ఇంపోగిషన్ అంటారనుకుంటా ..)


ఎనిమిదిన్నర, తొమ్మిది ఎప్పుడు అవుద్డా .. అని ఎదురు చూస్తూ చదివేవాడ్ని ...


అలా గడిచేవి ఒంటిపూట బళ్లప్పుడు ...!!

3 comments:

పరుచూరి వంశీ కృష్ణ . said...

chaalaa chaalaaa baagundi post ...bhale untaayi aa rojulu.. post chala baagundi

వీరుభొట్ల వెంకట గణేష్ said...

Nice one. I felt Nostalgic.

Phani Yalamanchili said...

@ వంశీ

ధన్యవాదాలు పోస్ట్ నచ్చినందుకు ....

@ గణేష్

ధన్యవాదాలు ...అబ్బోయ్ మరీ అంతా కష్టమైనా పదాలు వాడకండి .. నా లాంటి వాళ్ళు అర్ధాలు గూగుల్ లో వెతకాల్సి వస్తోంది ...
Nostalgic ::::------- is a adjective describing the longing desire to go back to a sentimental place, time, or to be in a person's company who was once a source of comfort and happiness long ago.

Post a Comment

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......