చీకటి వెలుగుల రంగేళి ......


మెక్ డొనాల్డ్స్ వారి ఉగాది పచ్చడి ...

రోజూ లాగే తెల్లారింది ......  ఆ సూర్యుడు మారలేదు ... చంద్రుడు మారలేదు ... నేనూ మారలేదు ....


అన్నీ అలానే వున్నాయి ఒక్క  తేది తప్ప .... అదీ మాములుగా మారలేదు ...  మారుతూ మారుతూ .....


ఇన్నాళ్ళు నాతో వున్న జీవితాన్ని జ్ఞాపకాలు చేసి ......... మళ్లీ కొత్త తెల్ల కాగితాన్ని నింపమని నాకిచ్చింది ......


ఇప్పటి కాలాన్ని చూస్తుంటే ......


త్వరలోనే ఈ ఉగాది పచ్చడి కూడా .... యే రిలయన్స్ వాడో , లేకపోతే ఏ మెక్ డొనాల్డ్స్ వాడో


అమ్మటం మొదలుపెడతదేమో కదా ......!!


ఇంకా మనం కూడా వెళ్లి మెను లో చూసి ....


Telugu newyear pickle .....


Telugu newyear pickle spicy ....


Telugu newyear pickle 65


ఇట్లా అందులో   ... మనకి నచ్చింది తెచ్చుకోవాలేమో .....


************************************************


కాని భలే వుంటుంది ఉగాది పచ్చడి రుచి .....


మొదటగా వేపపూలు ... అబ్బ చిన్న చిన్నగా ...... భలే వుంటాయి ....


ఉగాదికి ముందు అస్సలు కనపడవు ... ఇంకా ఉగాది రోజైతే చెట్టుమీద కాకుండా ... అందరి ఇళ్ళల్లో కనపడతాయి ...


చిన్నప్పుడు అబ్బాయ్ .. పక్కన వేప పూలు కోసి అమ్మకిచ్చేవాడు ... అమ్మ అవి కడిగి మళ్లీ అబ్బాయికిచ్చేది ...


అబ్బాయి వాటిని పేపర్ లో వేసి ... పువ్వుల్ని వేరుచేయ్యాలి ... రేకులు వేరు చెయ్యాలి ....


అప్పుడు మళ్లీ అమ్మ వాటిని చేట లో వేసి .... అన్నిటిని వేరు చేస్తుంది ...


ఇక మామిడి తేవాలి ....


అబ్బాయి బయల్దేరుతాడు .... అబ్బాయిని చూడగానే .. మామిడి కాయలు ఆకుల్లో దాక్కుంటాయి ....


కాని అబ్బయి ఊరుకోడుగా ... చెట్టెక్కి మంచి మామిడి కాయ ఒకటి కోస్తాడు ...


అమ్మ కింది నుంచి అది కొయ్ ... ఇది కొయ్ అని చెప్తుంటే ......


ఇక అది కొయ్య గానే ........ తొడిమలోనుంచి .... చెట్టునుంచి ఒకటే కన్నీటి ధారలు .... అదే సొన అంటారుగా అది ...


అది కాయని, చెట్టునుంచి వేరు చేసినందుకా .... బాధా లేక .....


ఉగాది పచ్చడి లో భాగం అవుతున్నందుకు ఆనందమో అర్ధం కాదు ...


కాని ఆ సొన వాసన భలే వుంటుంది .....


ఇక దాన్ని కడిగి .... ముక్కలు కోసి ... బెల్లం తరిగి ... ఇంకా అరిటి కాయ వేసి ....


ఇలా చాలా వేసేది అమ్మ ...... ఇప్పుడు అబ్బాయికి అన్నీ గుర్తు లేవు ...


ఆ మళ్లీ ఒకటి గుర్తొచ్చింది .... చింత పండు పులుసనుకుంటా ...........


అవన్నీ కలిపి అమ్మ చేసాక ........ అప్పుడు దేవుడికి దణ్ణం పెట్టుకుని ... అందరు తినాలి ..


ఇంకా పాయసం , గారెలు .... లాంటివి ...


ఇప్పుడు  ఆ జ్ఞాపకాలతో దేవుడి గుడి లో ఉగాది పచ్చడి తిని ఇలా బ్లాగ్ రాస్తున్నా ....


అందరికీ ఉగాది శుభాకాంక్షలు .....:):)


మీ ,


ఫణి  యలమంచిలి. 

8 comments:

చిలమకూరు విజయమోహన్ said...

మీకు,మీ కుటుంబానికి కూడా వికృతి నామ తెలుగు సంవత్సర శుభాకాంక్షలు.

చేతన_Chetana said...

Ugadi subhakankshalu!!.. mee photo ki source konchem cheptara?

మధురవాణి said...

sweet memories and cool picture!
మీకూ, మీ కుటుంబ సభ్యులకూ ఉగాది శుభాకాంక్షలండీ!

Phani Yalamanchili said...

@ చేతనా
మీరు మరీనూ ...... అన్నీ తెలియనట్టే దొంగా ..!!! నేను చెప్పను బాబోయ్ నాకు అసలే సిగ్గెక్కువ ...!

ఇంత చెప్పాక కూడా ఇంకా చెప్పాలి అంటారా ??

రాధిక(నాని ) said...

ఉగాది శుభాకాంక్షలు.

విష్వక్సేనుడు said...

వికృతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

'Padmarpita' said...

Telugu newyear pickle spicy 65's ఎన్ని వచ్చినా మన ముంగిట.
మన ఇంట చేసిన ఉగాది పచ్చడి ముందు దిగదుడుపేనట.
ఉగాది శుభాకాంక్షలు!

చేతన_Chetana said...

దొంగ దొర కాదు కానీండీ, ఎవరిదైనా ఫొటో/వ్యాసం/వర్క్‌ మీకు నచ్చి మీరు డైరెక్టుగా కానీ ఇంస్పిరేషన్‌గా కానీ వాడుకోవటం ద్వారా వచ్చే నష్టం ఏమి లేదు, పైగా ఒకరకంగా స్వంతదారుకి కాంప్లిమెంటే.. కానీ, అలా వాడుకునేప్పుడు ఆ source చెప్పటం, వీలైతే link ఇవ్వటం, స్వంతదారుకి చెప్పటం అనేవి mandatory కాకపొయినా మీకు సభ్యత, అవతలి వారికి గౌరవం (ఆ వివరాలు మనదగ్గెర లేని, ఎట్టి పరిస్థితిలోను తెలిసే వీలు లేని casesలో తప్ప). :-) నాకు అర్జెంటుగా క్రెడిట్ ఇచ్చేయమని కాదు ఇదంతా, ఎవరి వర్క్‌ గురించి అయినా ఇలాగే కమెంటు/ఈమెయిల్‌ చేస్తాను, మరోలా అనుకోకండి.

Post a Comment

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......