చీకటి వెలుగుల రంగేళి ......


అప్పుడూ - ఇప్పుడూ ...నిన్న మా ముఠా అంతా కలిసి ఎగ్జిబిషన్  కి వెళ్ళాం... చాలా రోజుల క్రితం వెళ్ళాను  అలా ...

మళ్లీ చాన్నాళ్ళకి  ...

వెళ్ళం గానే ఫస్ట్ జైంట్ wheel ఎక్కామా ........ అక్కడ చూడాలి ...

శ్రీరామ్ గాడు, సంతు గాడు ఫుల్ గా బిగపట్టి క్కూర్చున్నారు ...

నేను , రంజిత్ నవ్వ లేక చచ్చాం ..

తర్వాత పెద్ద అప్పడం తిన్నాం.. ఇంకా మళ్లీ బజ్జీ లు ...

తర్వాత మళ్లీ కొలంబస్ ఎక్కాం .. ఇంతకుముందు కొలంబస్ ఎక్కిన అనుభవం మర్చిపోలేనిది ...

దాదాపు రెండేళ్ళ తర్వాత ....... మళ్లీ నిన్న ...

అప్పటి అనుభూతి మాటల్లో చెప్పలేనిది ...


గగనం కన్నా మునుపటిది

భూతలం కన్నా ఇది వెనుకటిది
 
కాలం తోన పుట్టింది కానీ ఇప్పుడు గతం గా మారింది  ....
 
 
 
 
వింటున్నావా.....!!! వింటున్నావా....!!

వింటున్నావా ...... వింటున్నావా .....!!

ఫలుకులు నీ పేరె తలుచుకున్న..

ఫెదవుల అంచుల్లొ అనుచుకున్న..

మౌనముతో నీ మదినీ బంధించా.. మన్నించు ప్రియా..తరిమే వరమా.. తడిమే స్వరమా..

ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా..

వింటున్నావా.. వింటున్నావా...వింటున్నావా..తరిమే వరమా.. తదిమే స్వరమా..

ఇదిగొ ఈ జన్మ నీదని అంటున్నా..

వింటున్నావా.. వింటున్నావా...వింటున్నావా..

వింటున్నావా...వింటున్నావా..విన్నా.. వేవేల వీణల సంతోషాల సంకీర్తనలు

నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా

తొలిసారి నీ మాటల్లొ పులకింతలా పదనిసలు విన్నా..

చాలు చాలే చెలియా చెలియా బతికుండగా నీ పిలుపులు నేను విన్న..

ఓహ్...బతికుండగా నీ పిలుపులు నేను విన్న..ఏ..మొ.. ఏ..మొ... ఏమవుతుందో...

ఏదేమైనా .. నువ్వే చూసుకో..

విడువను నిన్నే ఇక పైనా వింటున్నావా... ప్రియా..

గాలిలో తెల్లకాగితంలా నేనలా తేలి ఆడుతుంటే

నన్నే ఆపి నువ్వే రాసిన..ఆ పాటలె వింటున్నాతరిమే వరమా.. తదిమే స్వరమా..

ఇదిగొ ఈ జన్మ నీధని అంటున్నా.. వింటున్నావా..

వింటున్నావా...వింటున్నావా..వింటున్నావా...వింటున్నావా..ఆద్యంతం యేదొ..యేదొ...అనుభూతి..

ఆద్యంతం యేదొ అనుభూతి అనవరతం ఇలా అందించేది

గగనం కన్నా మునుపటిది

భూతలం కన్నా ఇది వెనుకటిది

కాలం తోన పుట్టింది కాలం లా మారే.. మనస్సె లేనిది ప్రేమ..రా..ఇలా..కౌగిల్లలొ నిన్ను దాచుకుంట..

నీదానినై నిన్నె దారి చెసుకుంట

ఎవరిని కలువని చొటులలోన

ఎవరిని తలువని వేళలలోనతరిమే వరమా.. తదిమే స్వరమా..

ఇదిగొ ఈ జన్మ నీధని అంటున్నా.. వింటున్నావా..

వింటున్నావా...వింటున్నావా..వింటున్నావా..ఆ..

విన్నా.. వేవేల వీణల సంతోషాల సంకీర్తనలు

నా గుండెల్లోలొ ఇప్పుడే వింటున్నాతొలిసారి నీ మాటల్లొ పులకింతలా పదనిసలు విన్న..

చాలు చాలె చెలియా చెలియ బతికుండగా నీ పిలుపులు నేను విన్న..

చాలు చాలె చెలియా చెలియ బతికుండగా నీ పిలుపులు నేను విన్న..

ఓహ్...బతికుండగ నీ పిలుపులు నేను విన్న..Super song from YMC....

ఆక్రోఫోబియ.......... పైనుంచి-------కిందకి :(:(:(
నాకు మొదట్నుంచే పెద్ద పెద్ద బిల్డింగ్ లు ఎక్కి పైనుంచు కిందకి చూడటమంటే  మా చెడ్డ భయం ...

అలానే ఏదో లా నెట్టుకుంటూ వచ్చాను ... ఎప్పుడూ  పెద్ద గా ఏం ఇబ్బంది  రాలేదు చిన్నప్పుడు ...
కానీ  టెలికాం లోకి వచ్చేసరికి మాత్రం .. పెద్ద పెద్ద టవర్స్  ...

దాదాపు వాటిని ఎక్కాల్సిన పరిస్థితి రాదు ... కానీ అప్పుడప్పుడు ఎక్కాల్సి రావచ్చు ...

ఇంకా చూస్కోండి ఎక్కాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చూడాలి నా పని ...

దాదాపు గా అన్నీ టవర్స్ 60 మీటర్లు లేదా 40 మీటర్లు ఉంటే ...

వాటిని ఎక్కాలంటే చుక్కలే నాకు మాత్రం ...

ఇప్పటికి నేను టెలికాం లో జాయిన్ అయ్యి దాదాపు రెండేళ్ళు గడుస్తున్న ఇప్పటికీ నాకు తెలిసి ఒక్క సారి కాబోలు ...

కష్ట పడి........ కష్ట పడి......... ఒక నలభై మీటర్ల టవర్ ఎక్కాను ... అదీ చచ్చేంత భయపడుతూ ....

నాకు తెలిసి అదే చివరి సారి ఇంకా మొదటి సారి కూడా ...

ఆ తరువాత ఎక్కుదాం అని చాలా సార్లు ప్రయత్నించాను గాని ఎప్పుడూ  సఫలం కాలేకపోయాను.

ఎందుకో ఇప్పడు అది గుర్తొచ్చి గూగుల్ లో కాసేపు సెర్చ్ చేసాను ...

దీన్ని ఆక్రోఫోబియా అని అంటారంట ...

ప్రపంచం మొత్తం మీద చాలా మందికి ఈ ఫోబియా ఉందంట.

ఒక సైట్ లో అయితే ఎక్కువమందికి వున్న ఫోబియా కూడా ఇదే అని ఇచ్చాడు ...

ఇక్కడి దాకా బానే వుంది కానీ ...

దీన్ని  ఎలా అధిగమించాలో మాత్రం ఎందులోనూ నాకు సరిగ్గా దొరకలేదు...

ఒక దాంట్లో మాత్రం గట్టి గా గాలి పీల్చాలి లాంటి విషయాలేవో చెప్పాడు కానీ ...

అవి ఎంత వరకు పని చేస్తాయో మాత్రం నాకు అర్ధం కాలేదు ..

చూద్దాం ఇంతకన్నా మంచి టెక్నిక్ ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం .......!!

మరీ అప్పడు దాక ఏం చేస్తారని అడగకండి ........ ఏదో మళ్లీ నాలుగు కథలు కహానీలు చెప్పి నడిపించాలి ....

తప్పదుగా మరి ........ :) :) :)

పైనుంచి-------కిందకి

ఐతే ..........!!!


వేకువనే మురిపించే ఆశలు ......

వెనువెంటనే అంతా నిట్టూర్పులు ......

లోకం లో లేవా యే  రంగులు .....

నలుపొకటే చూపాలా కన్నులు .....

ఇలాగేనా ప్రతి రోజు ......

ఎలాగైనా ఏదో రోజు ....... మనదై రాదా ...

ఒకటి = రెండు అవుతుందా ???టపా అసలు నిన్న వేద్దాం అనుకున్నా ... కానీ సమయానుభావం వల్ల ... వేరే పని వుండటం వల్ల పేరు మాత్రం పెట్టి  వదిలేసాను ...


ఇదిగో ఇప్పుడు ఖాళీ  దొర్కినట్టుంటే ఇప్పుడు రాస్తున్నాను ...


నిన్న సైట్ నుంచి వచ్చి  ఏదో టీవీ పెడితే అందులో ఒక ప్రశ్న అడిగాడు ....


అదేంటంటే " మొదటి ప్రేమ లో ఉన్నంత ఇంట్రెస్ట్ రెండోసారి ప్రేమ కలిగినప్పుడు కూడా ఉంటుందా ?? "


అంతే ప్రశ్న... నేను ప్రశ్న విన్నాను కానీ అందరూ ఏం చెప్తారో వినే లోపే మా ఫ్రెండ్ ఛానల్ మార్చేశాడు ...


వాడు చానల్  మార్చినా నేను మాత్రం అదే ఛానల్ దగ్గర ఆలోచిస్తూ వుండి పోయాను ..


ఇంతకీ మీరేమంటారు ??


మొదటి సారి ప్రేమ అనేది కలిగినప్పుడు  అదేదో కొత్తగా...... వింతగా ... ఉంటుందట కదా  ??


( ఎరా .....!! సచ్చినోడా నీకు తెల్డురా .......??)


ఆ భావనే ఏదో మనసులో ఆనందాన్ని నిమ్పుతుందటగా ......!!!!!!!


(అది గో మళ్లీ ..........)


సరే... సరే ... అసలు విషయానికి వస్తే ...


మొదటి సారి ప్రేమ అనే భావన కొంచెం కొత్తగానే వుంటుంది సరదాగా  మొదట్లో ...

ఏదో మనకోసం ఒక మనిషి స్పెషల్ గా వున్నట్టు ....

మన కబుర్లు చెప్పటానికి , తన విశేషాలు  తెలుసు కోవటానికి .......

మన అనుభూతుల్ని  , అనుభవాల్ని ఒక స్పెషల్ మనిషి తో ....

కొన్ని సార్లు కోపం గా, కొన్ని సార్లు ప్రేమ గా, కొన్ని సార్లు బాధ గా ఇలా ఇలా ఇలా ......

అలా అలా అలా వుంటుంది మొదటి లవ్ ...

అది ఒక వేళ కంచికి చేరితే మంచిదే ........ లేకపోతేనే మళ్లీ కథ మొదటికి ........

నిదానం గా అన్నీ మాములే అయ్పోతాయ్ ఒక్క మనసు తప్ప ..

అది మాముల్ అవటానికే కొంచం టైం పడుతుంది ...

సరే సెకండ్ లవ్ మళ్లీ .........

అప్పుడూ అలానే అనిపిస్తుందా ......... మళ్లీ అదే ఫీలింగ్ కలుగుతుందా  ...

 ఏదో సినిమాలో చూసినట్టు ఫస్ట్ ఎప్పుడూ అలా గుర్తు వుంటుంది అంతే ...

గుండెలో ముల్లల్లె అప్పుడప్పుడు తగుల్తూ వుంటుంది ...

ఒకవేళ మనకు ఫస్ట్ కంటే మంచి భాగస్వామి దొరికితే అప్పడు ఎలా వుంటుంది అబ్బ..........

ఏమో నా చిన్న బుర్ర కి ఏమీ తట్టి చావట్లేదు ......

ప్రేమ లో  తల పండిన వాళ్ళు ఎవరైనా సమాధానం చెప్పరూ.........!!!

అదిగో ఎవరో రెండు జళ్ళ సీత వెళ్తోంది .... కొంపతీసి అదే నా నా నా నా నా ......... సెకండ్ .......

కళ్ళు అప్రయత్నం గా  అటు కదుల్తున్నాయ్ ....!!

హె.......... హె.......... హె........... !! 

బుడుగు ఫ్యామిలీ ఫోటో ...

"
బామ్మంటే నా వెనకాల కూచుంది అదన్నమాట. బామ్మ ముందర సీగాన పెసునాంబా , నేను.


ఈ చివ్వర ఓటి  లేదూ... అదే లావుపాటి పక్కింటి పిన్ని గారు .... చాలా లావు గదా ....అందుకే కుటో లో


లావుపాటి పిన్ని గారు అంతా లేదు ... కుంచెం వుంది .... ఇంకా చాలా బోల్డు పిన్ని గారు కుటో చివర అవతల
(మనకి కనబడదులే ...) ఉందన్నమాట ."

(బుడుగు పదాలు కొన్ని మన కంప్యూటర్ మీద  రాయటం కుదరలేదు ... అక్షర దోషాలుంటే క్షమించండి ....!!!)
**************

మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో వెతుకుతుంటే అకస్మాత్తుగా ... బుడుగు పుస్తకం కనపడింది ...చిన్నప్పటి నుంచి నేను బుడుగు అభిమానినేమో ... మళ్లీ ఒక సారి చదువుదాం అనిపించింది ...అలా కాసేపు తిరగేశాను ... బుడుగు నిజం ఎప్పుడూ చెప్పాలో తెలీక పడే కష్టాలు ...ఇంకా బాబాయి కబుర్లు , ప్రైవేటు మాస్టర్ ని  బుడుగు పెట్టె తిప్పలు ...రెండు జళ్ళ సీత గురించి ..... ఇంకా ముఖ్యం గా సీగాన పెసునంబ గురించి ...ఇలా చాలా బాగుంటుంది పుస్తకం ....ఇంకా కొంచం ముందుకి వెళ్ళాక వచ్చే ... రాచ్చాసుడు .. పద మూడో ఎక్కం ... నవ్వులపువ్వులు  పూయిస్తుంది ...అంతా చదివాక చివర్లో అందరి గురించి బుడుగు ఇచ్చే ఫ్యామిలీ ఫోటో అయితే  అరుపులు ...ఆ వాక్యాలే  మీకోసం ఒక సారి రాసాను ...ఎవరైనా చదవని వాళ్ళు వుంటే ఒకసారి చదవండి ...వేసవిలో మంచి టైం పాస్ ...నిజం గా చిన్నపిల్లల మాటలతో ముళ్ళపూడి గారు ఒక అద్భుతం చేసారనే చెప్పాలి ....


నేను చదువుకునే తప్పుడు బుడుగు ఒక హీరో ...బుడుగు పేరు చెప్తే పిల్లల మొహాల్లో నవ్వు ... కేరింతలు .....మా స్కూల్ లో అయితే వారానికి ఒకసారి చదివే రెండు పేజీల బుడుగు పుస్తకం కోసమైనా లైబ్రరీ క్లాసు కి వెళ్ళేవాళ్ళం ...ఇప్పుడు ఏమయ్యాడు బుడుగు ....మనలో ఎంత మందికి గుర్తున్నాడు ??మన పిల్లల్లో ఎంత మందికి బుడుగు కథ తెలుసు ??అలానే కాల గర్భం లో కలిసి పోతున్నాడు ....ఒక సారి ఆలోచిద్దాం ...ఇదిగో డౌన్లోడ్ లింక్ మీ కోసం  ........ బుడుగు ఈ-పుస్తకం

మా స్నేహ గీతం .....


ఓఓఓఓ మై ఫ్రెండ్;
తడి కన్నులనే తుడిచిన నేస్తమా ;
..ఓఓఓఓ మై ఫ్రెండ్;
ఓడి దుడుకులలో నిలిచిన స్నేహమా;
 
అది నేను ఇంజనీరింగ్ చేరిన ఫస్ట్ రోజు ..... నేను , అమ్మ , నాన్న వచ్చాం కాలేజీ కి ...
 
అదే .. మొదటి సారి కాలేజీ ని చూడటం ..... ఎలా వుంటుంది..... ఎలా ఉంటుందని .... అని ఆత్రుత ...
 
నేను ఎదురు చూసిన క్షణాలు రానే వచ్చాయి ... పర్లేదు కాలేజీ బానే వుందనిపించింది ....
 
ఇంకా ముగ్గురం లోపలి వెళ్ళాం ... అలా అలా ఏదో ఫార్మాలిటీస్ అన్నీ ముగించుకున్నం ...
 
మద్యానం భోజనం ముగించుకుని మళ్లీ మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాం ...
 
అక్కడ దగ్గరలో ఏదో రూం వుంది అంటే.. ఇంకా అది చూడ గానే .... హుటా హుటినా అమ్మ , నాన్న నన్ను అందులో పడేసి ...
 
వెళ్లి పోయారు ... ఇంకా నిదానం గా రాత్రయింది ..... ఒంటరిగా రూం లో పడుకుని ఫ్యాన్ నిముషానికి ఎన్ని సార్లు తిరుగుతోందో
 
 లేక్కేస్తున్నా ... ఇంతలో ఏదో బాధనిపించింది ... నేను కూడా బాగా చదువుకుని వుంటే మంచి ర్యాంక్ వచ్చి ఇంటిదగ్గరే సీటు
 
దొరికేది కదా అనుకున్నా .... అదే ననుకుంట నా జీవితం లో నేను చదువు గురించి బాధ పడిన మొదటి సంఘటన ...
 
అప్రయత్నం గా కళ్ళలో నీలాలు ...
 
నిదానం గా కళ్ళు మూతలు పడ్డాయ్ ... మళ్లీ తెరిచేసరికి చుట్టూ వెలుతురు .. తెల్లారింది ...
 
ఇంకా కాలేజీ కి వెళ్ళాలి ... గబా గబా రెడీ అయ్యి ... తొమ్మిదికి కాలేజీ అయితే ..... నేను ఆత్రం కొద్దీ ఎడునర్రకే బయల్దేరా ...
 
కాలేజీ కి వెళ్ళే సరికి ఎనిమిదయింది ... ఊరు చూద్దామని నడుచుకుంటూ వెళ్లాలే ....
 
ఎవరూ లేరు .. అంతా కాళీ .... ఇంకా వెళ్లి ఒక చోట నుంచున్నా ...
 
ఒక ఇరవై నిముషాలకి ఒక డొక్కు బండి మీద ఇద్దరోచ్చారు ...
 
రావటం తోనే నే కోర్చున్న క్లాసు లోకి వచ్చారు ...
 
అమ్మో సీనియర్స్  ఏమో అనుకున్నా ........
 
కానీ వాడు నాదగ్గరి కొచ్చి "మీరూ ...!! ఈ క్లాస్సేనా ?? " అన్నాడు ...
 
అబ్బ అప్పుడు ఊపిరి పీల్చుకుని "అవునండి "అన్నాను ...
 
వాడూ మా క్లాస్సే కాకపోతే ... మేము డైరెక్ట్ గా సెకండ్ ఇయర్ లోకి ఎంట్రీ ....వాడూ ఫస్ట్ ఇయర్ ఇక్కడే చదివాడు ... ఎందుకటే
 
మాది డిప్లొమా ...దీన్నే లేటరల్ ఎంట్రీ అంటారు ... ఇంకా నాచిన్న చిన్న సందేహాలు వాడిని అడిగి తీర్చుకున్నా ....
 
అలా మొదలయింది మా పరిచయం ...
 
ఆ తర్వాత ఈ పద్ధతి , పిలుపు లు ఏమయ్యాయో తెలీదు ...
 
ఇక మొదలు " ఒరేయ్ , మావా, బాబాయ్ , నీ యబ్బ , నీ యయ్య ..........etc ..........."
 
తర్వాత ఎంతోమంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు ..... ఇంకా నా ఒంటరితనం హుష్ కాకి అని ఎగిరిపోయింది ...
 
కానీ ఎంత మంది పరిచయం అయినా .... హ్యాపీ డేస్ పాట వినగానే ... మొదట గుర్తు వచ్చేది మాత్రం వాడే ...
 
'మీరు','మీరు' నుంచి మన స్నేహ గీతం;

'ఏరా' , 'ఏరా' లోకి  మారే; 
 
అది ఈ రెండు లైన్ల వల్లేమో ... మొదట్లో మీరూ ......... మీరూ అనుకున్నా మేము .....తర్వాత ఎంతగా కలిసి తిరిగామో ..
 
ఎన్ని సినిమాలకి వెళ్ళామో ..... ఎన్ని సార్లో బీచ్  లో బీరులు కొట్టి బండేస్కుని తిరిగామో ...... 
 
అదేనేమో స్నేహం గొప్పతనం ... ఇప్పుడు ఆ రోజులూ లేవు వాడూ నా దగ్గర లేదు  ...
 
దగ్గర దగ్గర అన్నీ గడిచి పోయి రెండేళ్ళు అవుతున్నా .....
 
ఇంకా నాకు అన్నీ నిన్న జరిగినట్టే వున్నాయ్ ... ఆ జ్ఞాపకాలు ఇంకా తాజా గానే వున్నాయ్ ...
 
ఇంతకీ వాడి పేరు చెప్పలేదు కదూ .... మూడేళ్ళు  వాడిని I.P. అనే పిలిచేవాళ్ళం ......
 
వాడి అసలు పేరు Indurthi Pavan ...........:):):)

నా ఊరు ....అది నా కాలికి అడుగులు నేర్పిన నేల ....

అది నా శ్వాసకి వాయువు నందించిన గాలి ......

అది నా జీవితానికి అవసరమైన వాటిని  అందించిన ఊరు .....

కానీ ...

ఆ ఊరితో నాకు ఈ రోజు తో దాదాపు సంబంధం తెగిపోయినట్టుంది ........

అదే.............. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ........

ఇంతకుముందు ఇక్కడ అమ్మమ్మ ఆప్యాయపు పలకరింతలు .....

పొద్దున్నే కోకిల రాగాలు .... ఆరుబయట  సూర్యుడి సూది పోట్లు  ..... ఇలా ఎన్నో .....

పెద్ద మావయ్య తెచ్చే తాటి ముంజెలు ....... తాతయ్య తెచ్చే తేగలు.....

అన్నయ్యలతో, అక్కలతో ఆటలు ..... మరదళ్ళతో చిలిపి చేష్టలు ........

రాత్రి పూట అయ్యప్ప భజనలు ...... అమ్మమ్మ చెప్పే ముచ్చట్లు .......

తాతయ్య చెప్పే జాగ్రత్తలు ........

అబ్బ ఇలా ఒకటా రెండా .... ఇప్పుడు తలచుకుంటే నా జీవితం అక్కడే ఆగిపోతే బాగుండేదనిపిస్తుంది .......

ప్చ్ .. ఏం చేస్తాం ......

కానీ ఇప్పుడవన్నీ కాల గర్భం లో జ్ఞాపకాలై పోయాయి .......

కాలం పోతూ..... పోతూ...... తనతో పాటు కొన్నిటిని తీసుకు పోయింది ....

రెండేళ్ళ క్రితం దాదాపు నా జీవితాన్ని తీర్చిదిద్దిన అమ్మమ్మని .........

ఇప్పుడు తాతయ్యని .......

నేను ఇప్పుడు బస్సు దిగే సరికి....

పాల కేంద్రం బోసిగా వుంది జనాలు లేక  ...

ఎండుటాకులతో కళ్ళాపి చల్లింది పాత రావి చెట్టు ...... కొన ఊపిరితో నాకోసం ఎదురు చూస్తూ ...

బయట స్వాగతం చెప్పే ... కరివేపాకు చెట్టు ఊసే లేదు ....

ఇక ,,,,,,మొన్నటి దాక సావిట్లో కూర్చుని ఎదురు చూసిన తాతయ్య ....

తనతో పాటు మాక్కూడా ఊరితో సంబంధాలు తెంచేసి ... నవ్వుతూ ఫోటో లోకి వెళ్లి పోయాడు ...

అక్కడున్న రెండు రోజులూ చుట్టాలు  అందరూ మళ్లీ చాలా రోజుల తర్వాత రావడం తో  సరదాగా గడిపేసినా .....

ఎందుకో ఇప్పుడు మనసంతా భారం గా ...

కాలు ముందుకు కదలనంటోంది.... కానీ  వెళ్ళాలి తప్పదు ...

"
చివరి సారిగా .... ఓ గుక్కెడు  నీళ్ళు  గొంతులో ......

ఓ గుండెడు గాలి ఒంటిలో .... 

ఓ గంపెడు బాధ మనసులో ......

"

ప్చ్........ ప్చ్........ ప్చ్.......  

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......