చీకటి వెలుగుల రంగేళి ......


నా ఊరు ....అది నా కాలికి అడుగులు నేర్పిన నేల ....

అది నా శ్వాసకి వాయువు నందించిన గాలి ......

అది నా జీవితానికి అవసరమైన వాటిని  అందించిన ఊరు .....

కానీ ...

ఆ ఊరితో నాకు ఈ రోజు తో దాదాపు సంబంధం తెగిపోయినట్టుంది ........

అదే.............. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ........

ఇంతకుముందు ఇక్కడ అమ్మమ్మ ఆప్యాయపు పలకరింతలు .....

పొద్దున్నే కోకిల రాగాలు .... ఆరుబయట  సూర్యుడి సూది పోట్లు  ..... ఇలా ఎన్నో .....

పెద్ద మావయ్య తెచ్చే తాటి ముంజెలు ....... తాతయ్య తెచ్చే తేగలు.....

అన్నయ్యలతో, అక్కలతో ఆటలు ..... మరదళ్ళతో చిలిపి చేష్టలు ........

రాత్రి పూట అయ్యప్ప భజనలు ...... అమ్మమ్మ చెప్పే ముచ్చట్లు .......

తాతయ్య చెప్పే జాగ్రత్తలు ........

అబ్బ ఇలా ఒకటా రెండా .... ఇప్పుడు తలచుకుంటే నా జీవితం అక్కడే ఆగిపోతే బాగుండేదనిపిస్తుంది .......

ప్చ్ .. ఏం చేస్తాం ......

కానీ ఇప్పుడవన్నీ కాల గర్భం లో జ్ఞాపకాలై పోయాయి .......

కాలం పోతూ..... పోతూ...... తనతో పాటు కొన్నిటిని తీసుకు పోయింది ....

రెండేళ్ళ క్రితం దాదాపు నా జీవితాన్ని తీర్చిదిద్దిన అమ్మమ్మని .........

ఇప్పుడు తాతయ్యని .......

నేను ఇప్పుడు బస్సు దిగే సరికి....

పాల కేంద్రం బోసిగా వుంది జనాలు లేక  ...

ఎండుటాకులతో కళ్ళాపి చల్లింది పాత రావి చెట్టు ...... కొన ఊపిరితో నాకోసం ఎదురు చూస్తూ ...

బయట స్వాగతం చెప్పే ... కరివేపాకు చెట్టు ఊసే లేదు ....

ఇక ,,,,,,మొన్నటి దాక సావిట్లో కూర్చుని ఎదురు చూసిన తాతయ్య ....

తనతో పాటు మాక్కూడా ఊరితో సంబంధాలు తెంచేసి ... నవ్వుతూ ఫోటో లోకి వెళ్లి పోయాడు ...

అక్కడున్న రెండు రోజులూ చుట్టాలు  అందరూ మళ్లీ చాలా రోజుల తర్వాత రావడం తో  సరదాగా గడిపేసినా .....

ఎందుకో ఇప్పుడు మనసంతా భారం గా ...

కాలు ముందుకు కదలనంటోంది.... కానీ  వెళ్ళాలి తప్పదు ...

"
చివరి సారిగా .... ఓ గుక్కెడు  నీళ్ళు  గొంతులో ......

ఓ గుండెడు గాలి ఒంటిలో .... 

ఓ గంపెడు బాధ మనసులో ......

"

ప్చ్........ ప్చ్........ ప్చ్.......  

5 comments:

రాధిక said...

హుమ్మ్మ్.....మనం వున్నంతవరకన్నా ఆ ఊరితో ఏదోక రకంగా టచ్ లో వుండాలి. మన చిన్నతనం తిరిగి రాకపోవచ్చు కానీ ఆ చిన్నతనం తాలూకూ గుర్తుల్ని,జ్ఞాపకాలని తిరిగి అందించేది ఊరొక్కటే. అక్కడ వున్న ఇంటినో,భూమినో అమ్మకుండా వుంచండి.అప్పుడప్పుడు వెళ్ళి రావడానికి ఒక కారణం లా వుంటుంది.అక్కడ ఇంకేమీ మిగలకపోతే మళ్ళా ఎప్పటికీ వెళ్ళలేము

Sai Praveen said...

చాలా బావుందండి. చిన్నప్పుడు నేను తిరిగిన మా అమ్మమ్మ , నానమ్మ వాళ్ళ ఊర్లు వెళ్ళడానికి నాకు అసలు కుదరదు. వెళ్ళడానికి కారణం లేదు. కారణం వెతుక్కుందాం అన్న సమయం లేదు. ఎం చేస్తాం :(

శివ చెరువు said...

very nice...నాక్కూడా దగ్గర దగ్గర ఇలాంటి అనుభవాలు ఉన్నాయి...

Anonymous said...

maa vvru gurtuchesaru

Phani Yalamanchili said...

@ రాధిక
అవునండి మీరు చెప్పింది నిజమే ... ఇక అలానే చెయ్యాలి .... కాకా పోతే అమ్మ వాళ్ళు ఒప్పుకొవాలిగా ..!!!
@ ప్రవీణ్
ధన్యవాదాలు ..... ఇక నుండి నాది కూడా అదే పరిస్తితేమో......!!!
@ శివ
అందరికి చిన్నప్పటి జ్ఞాపకాలు దాదాపు ఒకటే లెండి ... ఆ వయసులో చేసినవే ఎప్పటికి గుర్తువుంటై ......... కదా ....!!
@ కృష్ణా తీరం
అవునా అండి ... అయితే నా టపాకి సార్ధకత లభించినట్టే .....ధన్యవాదాలు ....

Post a Comment

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......