చీకటి వెలుగుల రంగేళి ......


మా స్నేహ గీతం .....


ఓఓఓఓ మై ఫ్రెండ్;
తడి కన్నులనే తుడిచిన నేస్తమా ;
..ఓఓఓఓ మై ఫ్రెండ్;
ఓడి దుడుకులలో నిలిచిన స్నేహమా;
 
అది నేను ఇంజనీరింగ్ చేరిన ఫస్ట్ రోజు ..... నేను , అమ్మ , నాన్న వచ్చాం కాలేజీ కి ...
 
అదే .. మొదటి సారి కాలేజీ ని చూడటం ..... ఎలా వుంటుంది..... ఎలా ఉంటుందని .... అని ఆత్రుత ...
 
నేను ఎదురు చూసిన క్షణాలు రానే వచ్చాయి ... పర్లేదు కాలేజీ బానే వుందనిపించింది ....
 
ఇంకా ముగ్గురం లోపలి వెళ్ళాం ... అలా అలా ఏదో ఫార్మాలిటీస్ అన్నీ ముగించుకున్నం ...
 
మద్యానం భోజనం ముగించుకుని మళ్లీ మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాం ...
 
అక్కడ దగ్గరలో ఏదో రూం వుంది అంటే.. ఇంకా అది చూడ గానే .... హుటా హుటినా అమ్మ , నాన్న నన్ను అందులో పడేసి ...
 
వెళ్లి పోయారు ... ఇంకా నిదానం గా రాత్రయింది ..... ఒంటరిగా రూం లో పడుకుని ఫ్యాన్ నిముషానికి ఎన్ని సార్లు తిరుగుతోందో
 
 లేక్కేస్తున్నా ... ఇంతలో ఏదో బాధనిపించింది ... నేను కూడా బాగా చదువుకుని వుంటే మంచి ర్యాంక్ వచ్చి ఇంటిదగ్గరే సీటు
 
దొరికేది కదా అనుకున్నా .... అదే ననుకుంట నా జీవితం లో నేను చదువు గురించి బాధ పడిన మొదటి సంఘటన ...
 
అప్రయత్నం గా కళ్ళలో నీలాలు ...
 
నిదానం గా కళ్ళు మూతలు పడ్డాయ్ ... మళ్లీ తెరిచేసరికి చుట్టూ వెలుతురు .. తెల్లారింది ...
 
ఇంకా కాలేజీ కి వెళ్ళాలి ... గబా గబా రెడీ అయ్యి ... తొమ్మిదికి కాలేజీ అయితే ..... నేను ఆత్రం కొద్దీ ఎడునర్రకే బయల్దేరా ...
 
కాలేజీ కి వెళ్ళే సరికి ఎనిమిదయింది ... ఊరు చూద్దామని నడుచుకుంటూ వెళ్లాలే ....
 
ఎవరూ లేరు .. అంతా కాళీ .... ఇంకా వెళ్లి ఒక చోట నుంచున్నా ...
 
ఒక ఇరవై నిముషాలకి ఒక డొక్కు బండి మీద ఇద్దరోచ్చారు ...
 
రావటం తోనే నే కోర్చున్న క్లాసు లోకి వచ్చారు ...
 
అమ్మో సీనియర్స్  ఏమో అనుకున్నా ........
 
కానీ వాడు నాదగ్గరి కొచ్చి "మీరూ ...!! ఈ క్లాస్సేనా ?? " అన్నాడు ...
 
అబ్బ అప్పుడు ఊపిరి పీల్చుకుని "అవునండి "అన్నాను ...
 
వాడూ మా క్లాస్సే కాకపోతే ... మేము డైరెక్ట్ గా సెకండ్ ఇయర్ లోకి ఎంట్రీ ....వాడూ ఫస్ట్ ఇయర్ ఇక్కడే చదివాడు ... ఎందుకటే
 
మాది డిప్లొమా ...దీన్నే లేటరల్ ఎంట్రీ అంటారు ... ఇంకా నాచిన్న చిన్న సందేహాలు వాడిని అడిగి తీర్చుకున్నా ....
 
అలా మొదలయింది మా పరిచయం ...
 
ఆ తర్వాత ఈ పద్ధతి , పిలుపు లు ఏమయ్యాయో తెలీదు ...
 
ఇక మొదలు " ఒరేయ్ , మావా, బాబాయ్ , నీ యబ్బ , నీ యయ్య ..........etc ..........."
 
తర్వాత ఎంతోమంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు ..... ఇంకా నా ఒంటరితనం హుష్ కాకి అని ఎగిరిపోయింది ...
 
కానీ ఎంత మంది పరిచయం అయినా .... హ్యాపీ డేస్ పాట వినగానే ... మొదట గుర్తు వచ్చేది మాత్రం వాడే ...
 
'మీరు','మీరు' నుంచి మన స్నేహ గీతం;

'ఏరా' , 'ఏరా' లోకి  మారే; 
 
అది ఈ రెండు లైన్ల వల్లేమో ... మొదట్లో మీరూ ......... మీరూ అనుకున్నా మేము .....తర్వాత ఎంతగా కలిసి తిరిగామో ..
 
ఎన్ని సినిమాలకి వెళ్ళామో ..... ఎన్ని సార్లో బీచ్  లో బీరులు కొట్టి బండేస్కుని తిరిగామో ...... 
 
అదేనేమో స్నేహం గొప్పతనం ... ఇప్పుడు ఆ రోజులూ లేవు వాడూ నా దగ్గర లేదు  ...
 
దగ్గర దగ్గర అన్నీ గడిచి పోయి రెండేళ్ళు అవుతున్నా .....
 
ఇంకా నాకు అన్నీ నిన్న జరిగినట్టే వున్నాయ్ ... ఆ జ్ఞాపకాలు ఇంకా తాజా గానే వున్నాయ్ ...
 
ఇంతకీ వాడి పేరు చెప్పలేదు కదూ .... మూడేళ్ళు  వాడిని I.P. అనే పిలిచేవాళ్ళం ......
 
వాడి అసలు పేరు Indurthi Pavan ...........:):):)

0 comments:

Post a Comment

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......