చీకటి వెలుగుల రంగేళి ......


బుడుగు ఫ్యామిలీ ఫోటో ...

"
బామ్మంటే నా వెనకాల కూచుంది అదన్నమాట. బామ్మ ముందర సీగాన పెసునాంబా , నేను.


ఈ చివ్వర ఓటి  లేదూ... అదే లావుపాటి పక్కింటి పిన్ని గారు .... చాలా లావు గదా ....అందుకే కుటో లో


లావుపాటి పిన్ని గారు అంతా లేదు ... కుంచెం వుంది .... ఇంకా చాలా బోల్డు పిన్ని గారు కుటో చివర అవతల
(మనకి కనబడదులే ...) ఉందన్నమాట ."

(బుడుగు పదాలు కొన్ని మన కంప్యూటర్ మీద  రాయటం కుదరలేదు ... అక్షర దోషాలుంటే క్షమించండి ....!!!)
**************

మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో వెతుకుతుంటే అకస్మాత్తుగా ... బుడుగు పుస్తకం కనపడింది ...చిన్నప్పటి నుంచి నేను బుడుగు అభిమానినేమో ... మళ్లీ ఒక సారి చదువుదాం అనిపించింది ...అలా కాసేపు తిరగేశాను ... బుడుగు నిజం ఎప్పుడూ చెప్పాలో తెలీక పడే కష్టాలు ...ఇంకా బాబాయి కబుర్లు , ప్రైవేటు మాస్టర్ ని  బుడుగు పెట్టె తిప్పలు ...రెండు జళ్ళ సీత గురించి ..... ఇంకా ముఖ్యం గా సీగాన పెసునంబ గురించి ...ఇలా చాలా బాగుంటుంది పుస్తకం ....ఇంకా కొంచం ముందుకి వెళ్ళాక వచ్చే ... రాచ్చాసుడు .. పద మూడో ఎక్కం ... నవ్వులపువ్వులు  పూయిస్తుంది ...అంతా చదివాక చివర్లో అందరి గురించి బుడుగు ఇచ్చే ఫ్యామిలీ ఫోటో అయితే  అరుపులు ...ఆ వాక్యాలే  మీకోసం ఒక సారి రాసాను ...ఎవరైనా చదవని వాళ్ళు వుంటే ఒకసారి చదవండి ...వేసవిలో మంచి టైం పాస్ ...నిజం గా చిన్నపిల్లల మాటలతో ముళ్ళపూడి గారు ఒక అద్భుతం చేసారనే చెప్పాలి ....


నేను చదువుకునే తప్పుడు బుడుగు ఒక హీరో ...బుడుగు పేరు చెప్తే పిల్లల మొహాల్లో నవ్వు ... కేరింతలు .....మా స్కూల్ లో అయితే వారానికి ఒకసారి చదివే రెండు పేజీల బుడుగు పుస్తకం కోసమైనా లైబ్రరీ క్లాసు కి వెళ్ళేవాళ్ళం ...ఇప్పుడు ఏమయ్యాడు బుడుగు ....మనలో ఎంత మందికి గుర్తున్నాడు ??మన పిల్లల్లో ఎంత మందికి బుడుగు కథ తెలుసు ??అలానే కాల గర్భం లో కలిసి పోతున్నాడు ....ఒక సారి ఆలోచిద్దాం ...ఇదిగో డౌన్లోడ్ లింక్ మీ కోసం  ........ బుడుగు ఈ-పుస్తకం

4 comments:

ధరణీరాయ్ చౌదరి said...

ఇడుగిడుగో బుడుగు.....అంటూ బుడుగు ఫేమిలీ మొత్తాన్ని పరిచయం చేసారు...సంతోషం!

nagarjuna చారి said...

భలే...బుడుగుని చూసిన బోల్డు బోల్డు రోజుల తరువాత మొత్తం ఇంట్లొ అందరు ఒక్కదగ్గర కనపడ్డారు (టింకూఘాడు ఏమయ్యాడో మరి..) చాలా ఎక్కువ సంతోశంగావుంది.

బుడుగుని మాకందరికి అందించిన ముళ్ళపూడి గారికి శతకోటి వందనాలు పెట్టేయొచ్చు...పోస్టు ద్వారా బుడుగు పాత్రలు మొత్తం చూపించినందుకు మీకు సీ గాన పెసునాంబ చేతిమితాయిులు (చేతిమితాయిలు అంటె ఏంటి అని అడగొద్దు నాకు తెలీదు

Phani Yalamanchili said...

@ చౌదరి
ధన్యవాదాలు

@ నాగ్
చాలా బావుంది. అమ్మా....!! సీగాన పెసునాంబా నీ చేతిమితాయిలుఅంటే ఏంటి ???

Bobby said...

క్షమించాలి.. ఆ link లో బుక్ మొత్తం లేదు... 2MB only.. Plz follow this link for full version..

http://downloads.ziddu.com/downloadfile/10986982/Budugu.pdf.html

Post a Comment

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......