చీకటి వెలుగుల రంగేళి ......


ఒకటి = రెండు అవుతుందా ???టపా అసలు నిన్న వేద్దాం అనుకున్నా ... కానీ సమయానుభావం వల్ల ... వేరే పని వుండటం వల్ల పేరు మాత్రం పెట్టి  వదిలేసాను ...


ఇదిగో ఇప్పుడు ఖాళీ  దొర్కినట్టుంటే ఇప్పుడు రాస్తున్నాను ...


నిన్న సైట్ నుంచి వచ్చి  ఏదో టీవీ పెడితే అందులో ఒక ప్రశ్న అడిగాడు ....


అదేంటంటే " మొదటి ప్రేమ లో ఉన్నంత ఇంట్రెస్ట్ రెండోసారి ప్రేమ కలిగినప్పుడు కూడా ఉంటుందా ?? "


అంతే ప్రశ్న... నేను ప్రశ్న విన్నాను కానీ అందరూ ఏం చెప్తారో వినే లోపే మా ఫ్రెండ్ ఛానల్ మార్చేశాడు ...


వాడు చానల్  మార్చినా నేను మాత్రం అదే ఛానల్ దగ్గర ఆలోచిస్తూ వుండి పోయాను ..


ఇంతకీ మీరేమంటారు ??


మొదటి సారి ప్రేమ అనేది కలిగినప్పుడు  అదేదో కొత్తగా...... వింతగా ... ఉంటుందట కదా  ??


( ఎరా .....!! సచ్చినోడా నీకు తెల్డురా .......??)


ఆ భావనే ఏదో మనసులో ఆనందాన్ని నిమ్పుతుందటగా ......!!!!!!!


(అది గో మళ్లీ ..........)


సరే... సరే ... అసలు విషయానికి వస్తే ...


మొదటి సారి ప్రేమ అనే భావన కొంచెం కొత్తగానే వుంటుంది సరదాగా  మొదట్లో ...

ఏదో మనకోసం ఒక మనిషి స్పెషల్ గా వున్నట్టు ....

మన కబుర్లు చెప్పటానికి , తన విశేషాలు  తెలుసు కోవటానికి .......

మన అనుభూతుల్ని  , అనుభవాల్ని ఒక స్పెషల్ మనిషి తో ....

కొన్ని సార్లు కోపం గా, కొన్ని సార్లు ప్రేమ గా, కొన్ని సార్లు బాధ గా ఇలా ఇలా ఇలా ......

అలా అలా అలా వుంటుంది మొదటి లవ్ ...

అది ఒక వేళ కంచికి చేరితే మంచిదే ........ లేకపోతేనే మళ్లీ కథ మొదటికి ........

నిదానం గా అన్నీ మాములే అయ్పోతాయ్ ఒక్క మనసు తప్ప ..

అది మాముల్ అవటానికే కొంచం టైం పడుతుంది ...

సరే సెకండ్ లవ్ మళ్లీ .........

అప్పుడూ అలానే అనిపిస్తుందా ......... మళ్లీ అదే ఫీలింగ్ కలుగుతుందా  ...

 ఏదో సినిమాలో చూసినట్టు ఫస్ట్ ఎప్పుడూ అలా గుర్తు వుంటుంది అంతే ...

గుండెలో ముల్లల్లె అప్పుడప్పుడు తగుల్తూ వుంటుంది ...

ఒకవేళ మనకు ఫస్ట్ కంటే మంచి భాగస్వామి దొరికితే అప్పడు ఎలా వుంటుంది అబ్బ..........

ఏమో నా చిన్న బుర్ర కి ఏమీ తట్టి చావట్లేదు ......

ప్రేమ లో  తల పండిన వాళ్ళు ఎవరైనా సమాధానం చెప్పరూ.........!!!

అదిగో ఎవరో రెండు జళ్ళ సీత వెళ్తోంది .... కొంపతీసి అదే నా నా నా నా నా ......... సెకండ్ .......

కళ్ళు అప్రయత్నం గా  అటు కదుల్తున్నాయ్ ....!!

హె.......... హె.......... హె........... !! 

1 comments:

nagarjuna చారి said...

మలిసారి ప్రేమ కలిగినప్పుడు అదే అనుభూతివుంటుందట, కాని ఒళ్లుమాత్రం అదుపులో ఉంటుందట. అంటే మునుపట్లా ఉన్నంట్టుండి గంతులేయడాలు,పబ్లిక్‌లో ఉన్నప్పుడు ముసిముసిగా నవ్వడాలు వాగైరా చేయరట...హ హ హ. నాకైతే పెద్దగా తెలీదు ఎందుకంటే నేనుకూడా ఒక్కసారికూడా కాదు రెండు,మూడుసార్లుకూడా పడిపోలేదు. నాలుగోసారిగురించి నన్నడగొద్దు.

Post a Comment

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......