చీకటి వెలుగుల రంగేళి ......


ఆక్రోఫోబియ.......... పైనుంచి-------కిందకి :(:(:(
నాకు మొదట్నుంచే పెద్ద పెద్ద బిల్డింగ్ లు ఎక్కి పైనుంచు కిందకి చూడటమంటే  మా చెడ్డ భయం ...

అలానే ఏదో లా నెట్టుకుంటూ వచ్చాను ... ఎప్పుడూ  పెద్ద గా ఏం ఇబ్బంది  రాలేదు చిన్నప్పుడు ...
కానీ  టెలికాం లోకి వచ్చేసరికి మాత్రం .. పెద్ద పెద్ద టవర్స్  ...

దాదాపు వాటిని ఎక్కాల్సిన పరిస్థితి రాదు ... కానీ అప్పుడప్పుడు ఎక్కాల్సి రావచ్చు ...

ఇంకా చూస్కోండి ఎక్కాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చూడాలి నా పని ...

దాదాపు గా అన్నీ టవర్స్ 60 మీటర్లు లేదా 40 మీటర్లు ఉంటే ...

వాటిని ఎక్కాలంటే చుక్కలే నాకు మాత్రం ...

ఇప్పటికి నేను టెలికాం లో జాయిన్ అయ్యి దాదాపు రెండేళ్ళు గడుస్తున్న ఇప్పటికీ నాకు తెలిసి ఒక్క సారి కాబోలు ...

కష్ట పడి........ కష్ట పడి......... ఒక నలభై మీటర్ల టవర్ ఎక్కాను ... అదీ చచ్చేంత భయపడుతూ ....

నాకు తెలిసి అదే చివరి సారి ఇంకా మొదటి సారి కూడా ...

ఆ తరువాత ఎక్కుదాం అని చాలా సార్లు ప్రయత్నించాను గాని ఎప్పుడూ  సఫలం కాలేకపోయాను.

ఎందుకో ఇప్పడు అది గుర్తొచ్చి గూగుల్ లో కాసేపు సెర్చ్ చేసాను ...

దీన్ని ఆక్రోఫోబియా అని అంటారంట ...

ప్రపంచం మొత్తం మీద చాలా మందికి ఈ ఫోబియా ఉందంట.

ఒక సైట్ లో అయితే ఎక్కువమందికి వున్న ఫోబియా కూడా ఇదే అని ఇచ్చాడు ...

ఇక్కడి దాకా బానే వుంది కానీ ...

దీన్ని  ఎలా అధిగమించాలో మాత్రం ఎందులోనూ నాకు సరిగ్గా దొరకలేదు...

ఒక దాంట్లో మాత్రం గట్టి గా గాలి పీల్చాలి లాంటి విషయాలేవో చెప్పాడు కానీ ...

అవి ఎంత వరకు పని చేస్తాయో మాత్రం నాకు అర్ధం కాలేదు ..

చూద్దాం ఇంతకన్నా మంచి టెక్నిక్ ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం .......!!

మరీ అప్పడు దాక ఏం చేస్తారని అడగకండి ........ ఏదో మళ్లీ నాలుగు కథలు కహానీలు చెప్పి నడిపించాలి ....

తప్పదుగా మరి ........ :) :) :)

పైనుంచి-------కిందకి

0 comments:

Post a Comment

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......