చీకటి వెలుగుల రంగేళి ......


వదిలి వెల్లిపోయేటప్పుడు ఏమనుకోవాలి ....


ఇది ప్రస్తుతానికి ఇక్కడి విషయం ... అసలు ఇదెందుకు ఇప్పుడు వచ్చింది అంటే ...

నిన్న మా కాలేజీ లో Get To Gather ఫంక్షన్ జరిగింది ...

దానికి వెళ్ళాను.. బానే ఎంజాయ్ చేశాను .. కానీ వచ్చేటప్పుడు చిన్న అనుమానం ఇప్పుడు ఏమని ఆలోచించాలి ..

మళ్లీ కలుస్తాం అనా ?? లేక  .. ఇక కలవం అనా ??

నా వరకయితే నేను ఎవరిని కలిసినా మళ్లీ కలవననే అనుకుంటా ...!!

యే ప్రదేశానికి వెళ్ళినా మళ్లీ అక్కడికి రాననే అనుకుంటా ...!!

ఎందుకంటె నేను మళ్లీ కలుస్తాననే ఆశ వుంటే చెప్పాలనుకుంది సరిగ్గా చెప్పలేక పోవచ్చు ...

మళ్లీ ఈ ప్రదేశానికి వస్తాను అనుకుంటే ఇంకోసారి వచ్చినప్పుడు మిగతాది చుడోచ్చులే అనిపించొచ్చు ...

అందుకే మళ్లీ కలిస్తే మంచిదే .. కలవకపోతే ...

ఎందుకంటె నేను డిప్లొమా చేసేటప్పుడు అనుకున్నా అందరూ కలిసే వుంటాం ...

పెళ్ళిళ్ళకి వాటికి కలుస్తూ వుంటాం అని .. కానీ ఇప్పటి దాకా ఒక పది పెళ్ళిళ్ళు అయ్యుంటాయి కానీ నేను ఒక్కళ్ళని కలవలేదు ..

అందుకే అంత నమ్మకం ... నాకు మళ్లీ కలవం అని..

అందుకే ఈ రోజు వచ్చేటప్పుడు  మా ఫ్రెండ్ చేతిని నా చేతిలో కి తీసుకున్నా .. చివరి సారి గా .......

" ఈ మూడు ఏళ్ళల్లో నేను నిన్నెప్పుడయినా బాధ పెట్టుంటే ... ఏమి అనుకోకు అని ..."

" అదేంటి మళ్లీ మనం కలవమా ఏంటి ?" మా ఫ్రెండ్ ..

" కలవమనే అనుకో... ఎందుకంటే నేను ఒక సారి ఇలానే అనుకున్నాను .. కానీ కలవలేదు.......... ఎవ్వరిని కలవలేదు ...
మళ్లీ కలుస్తాం అంటే నీకు సారీ చెప్పేటప్పుడు నా ఇగో అడ్డు రావచ్చు .. అందుకే ...."

".................."

అంతే ...

అది నాలెక్క .. మా ఫ్రెండ్ లెక్క ప్రకారం " Globe is round we meet again ....!!"

ఈ రెంటిలో ఏది కరెక్ట్ అంటారు ...??

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......