చీకటి వెలుగుల రంగేళి ......


కనుక్కోండి చూద్దాం ...!!!
ఇందాక ఏదో పాట చూస్తుంటే sub-titles కింద పడుతున్నాయ్ ...

అవి చదువుతూ వుంటే ఈ ఆలోచన వచ్చింది ..

ఇక్కడ ఒక పాట లిరిక్స్ ఇంగ్లీష లో ఇచ్చాను .... sub-titles లోవున్నట్టు ..

అది మీరు గుర్తు పట్టగాలరేమో చుడండి

ఆ రెడ్ కలర్ లో వున్నవి అమ్మాయ్ లిరిక్స్ ...

గ్రీన్ లో వున్నవి అబ్బాయి లిరిక్స్ ..

clues లాంటివి ఇవ్వబడవు ....!!!I’m mad about you …
You pierced into my heart...
I am caught in your magic of love …
And I gave myself to you in love …
Do u understand my love?
Tell me your love …
You are killing me to fall in love with you …
Won’t you leave me …?
If you cross your limits,
Won’t we commit a sin?
Don’t spark fire in me …
You don’t trust me...
But still you are my soul …
You fill my eyes & heart...

సర్లే బాగా కష్టపడుతున్నట్టునారు గా అయితే హింట్ ఈ సినిమా మన పూరి జగన్నాధ్ ది ...  

నీతో ఉ౦టే ఇ౦కా కొన్నాళ్ళు .....


నిలబడి చూస్తాయే ఆగి లేళ్ళూ సెలయేళ్ళూ చిత్ర౦గా నీవైపలా
 
పరుగులు తీస్తాయే లేచీ రాళ్ళు రాదార్లూ నీలాగా నలువైపులా
 ****************************

నీతో ఉ౦టే ఇ౦కా కొన్నాళ్ళు ఏమవుతాయో ఎదిగిన ఇన్నేళ్ళూ

నిన్నిప్పుడు చూస్తే చాలు చిన్నప్పటి చిలిపి క్షణాలు


గు౦డెల్లో గువ్వల గు౦పై వాలూ


నీతో అడుగేస్తే చాలూ మునుము౦దుకు సాగవు కాళ్ళూ

 

ఉ౦టు౦దా వెనుకకి వెళ్ళే వీలూ

కాలాన్ని తిప్పేసి౦దీ లీలా బాల్యాన్నే రప్పి౦చి౦దీ వేళా


పెద్దరికాలన్ని చినబోయేలా పొద్దెరుగని మరుపేదో పెరిగేలా
నిలబడి చూస్తాయే ఆగి లేళ్ళూ సెలయేళ్ళూ చిత్ర౦గా నీవైపలా
 

పరుగులు తీస్తాయే లేచీ రాళ్ళు రాదార్లూ నీలాగా నలువైపులా
 
భూమి అ౦త నీ పేర౦టానికి బొమ్మరిల్లు కాదా
 
సమయమ౦త నీ తార౦గానికి సొమ్మసిల్లిపోదా
 
చేదైనా తీపవుతు౦దే నీ స౦తోష౦ చూసి
 
చెడు కూడా చెడుతు౦దే నీ సావాసాన్ని చేసీ
 
చేదైనా తీపవుతు౦దే నీ స౦తోష౦ చూసి
 
చెడు కూడా చెడుతు౦దే నీ సావాసాన్ని చేసీ
నువ్వే చూస్తున్నా ఎ౦తో వి౦తల్లే అన్నీ గమని౦చే ఆశ్చర్యమా
 
ఏ పని చేస్తున్నా ఏదో ఘనకార్య౦ లాగే గర్వి౦చే పసి ప్రాయమా
 
చుక్కలన్ని దిగి నీ చూపుల్లో కొలువు ఉ౦డిపోగా
 
చీకటన్నదిక రాలేదే నీ క౦టి పాప దాకా
 
ప్రతి పూటా ప౦డుగలాగే ఉ౦టు౦దనిపి౦చేలా
 
తెలిసేలా నేర్పేట౦దుకు నువ్వే పాఠశాల
 
ప్రతి పూటా ప౦డుగలాగే ఉ౦టు౦దనిపి౦చేలా
 
తెలిసేలా నేర్పేట౦దుకు నువ్వే పాఠశాల

మొద్దోడు ..... ముద్దోడు

" రేయ్ ఈ ఊళ్ళో కాకులెన్నున్నాయో చెప్పరా ??"
" వుళ్లోయా ..!! పొలాల మీదవి  కూడానా ???"
" అన్ని చెప్పరా ....!!!"
 " ఆరువందల , ఏడువందల , పద్నాలుగు వందల  .... కొన్ని

ఎగురుతున్నాయ్ పంతులా  ....!! "
" అంత కంటే ఎక్కువుంటే ? "
" పక్కూరి కాకులు ఇక్కడికి వచ్చున్తాయ్ ... !!"
" అంత కంటే తక్కువుంటే ?"
"ఈ ఊరు కాకులు పక్కూరికి వెళ్లి వుంటాయ్ ? "
**********************************

ఇది ఎక్కడన్నా విన్నట్టున్నారా? అయితే  మీరు నా ట్రాక్ లో ఉన్నట్టే ..

ఇది " మొద్దబ్బాయి " అని నా చిన్నప్పుడు ఒక కామెడీ మిమిక్రీ క్యాసెట్ వుండేది ...

అందులోది ... మొన్న మా ఫ్రెండ్ ఒకతను తన దగ్గర వుంటే ఇచ్చాడు.......... పెన్ డ్రైవ్ లో ...

అప్పుడనిపించింది ఇంకా ఇది ఉందా ... cd లలోకి కూడా మారిందా ..? అని ..

నాకు తెలిసి మీలో చాలా మంది ఇది వినే వుంటారు .

కామెడీ చాలా బావుంటుంది  .. అప్పట్లో నేను ఇది చాలా సార్లు విన్నట్టు  గుర్తు ....

కొన్ని చోట్ల ద్వందార్ధాలు వున్నా .. అవి తెలుసు కునే లోపే సంభాషణ ముందుకి నడుస్తుంది ..

నాకు గుర్తున్న వాటిలో ఇది .. ఇంకా "అత్తరు సాయిబు" అనిఇంకోటి ఉండేది ..

ఇవి బాగుండేవి వినటానికి ... ఒక సారి మీకూ దొరికితే వినండి ...

ఇంతకీ ఇది అసలు రాసిందెవరు .. మిమిక్రీ చేసిందెవరు అని ఇది రాస్తూ సెర్చ్ చేసాను ...

కానీ లాభం లేకపోయింది ... మీకెవరికైనా తెలిస్తే చెప్పండి  .. నేనూ తెలుసు కుంటాను ..

ఇంకా ఈ ఆదివారం మామూలు గానే గడిచింది .. జస్ట్ టైం పాస్ .... అది రూం లోనే ..

విమానం లో వెళ్తున్న ఎవరిదో పెన్ను కక్కినట్టుంది .. ఆ రంగు ఆకాశం అంతా అంటుకుంది ...

మళ్లీ కలుస్తా ...

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......