చీకటి వెలుగుల రంగేళి ......


మొద్దోడు ..... ముద్దోడు

" రేయ్ ఈ ఊళ్ళో కాకులెన్నున్నాయో చెప్పరా ??"
" వుళ్లోయా ..!! పొలాల మీదవి  కూడానా ???"
" అన్ని చెప్పరా ....!!!"
 " ఆరువందల , ఏడువందల , పద్నాలుగు వందల  .... కొన్ని

ఎగురుతున్నాయ్ పంతులా  ....!! "
" అంత కంటే ఎక్కువుంటే ? "
" పక్కూరి కాకులు ఇక్కడికి వచ్చున్తాయ్ ... !!"
" అంత కంటే తక్కువుంటే ?"
"ఈ ఊరు కాకులు పక్కూరికి వెళ్లి వుంటాయ్ ? "
**********************************

ఇది ఎక్కడన్నా విన్నట్టున్నారా? అయితే  మీరు నా ట్రాక్ లో ఉన్నట్టే ..

ఇది " మొద్దబ్బాయి " అని నా చిన్నప్పుడు ఒక కామెడీ మిమిక్రీ క్యాసెట్ వుండేది ...

అందులోది ... మొన్న మా ఫ్రెండ్ ఒకతను తన దగ్గర వుంటే ఇచ్చాడు.......... పెన్ డ్రైవ్ లో ...

అప్పుడనిపించింది ఇంకా ఇది ఉందా ... cd లలోకి కూడా మారిందా ..? అని ..

నాకు తెలిసి మీలో చాలా మంది ఇది వినే వుంటారు .

కామెడీ చాలా బావుంటుంది  .. అప్పట్లో నేను ఇది చాలా సార్లు విన్నట్టు  గుర్తు ....

కొన్ని చోట్ల ద్వందార్ధాలు వున్నా .. అవి తెలుసు కునే లోపే సంభాషణ ముందుకి నడుస్తుంది ..

నాకు గుర్తున్న వాటిలో ఇది .. ఇంకా "అత్తరు సాయిబు" అనిఇంకోటి ఉండేది ..

ఇవి బాగుండేవి వినటానికి ... ఒక సారి మీకూ దొరికితే వినండి ...

ఇంతకీ ఇది అసలు రాసిందెవరు .. మిమిక్రీ చేసిందెవరు అని ఇది రాస్తూ సెర్చ్ చేసాను ...

కానీ లాభం లేకపోయింది ... మీకెవరికైనా తెలిస్తే చెప్పండి  .. నేనూ తెలుసు కుంటాను ..

ఇంకా ఈ ఆదివారం మామూలు గానే గడిచింది .. జస్ట్ టైం పాస్ .... అది రూం లోనే ..

విమానం లో వెళ్తున్న ఎవరిదో పెన్ను కక్కినట్టుంది .. ఆ రంగు ఆకాశం అంతా అంటుకుంది ...

మళ్లీ కలుస్తా ...

4 comments:

శ్రీనివాస్ said...

మిమిక్రి చేసింది మా ప్రఆకసం జిలా చీరాల వాళ్ళు ... పేర్లు కనుక్కుని చెబుతా :)

raveendranath said...

ee mimicry chesindi "Cheerala subbayya and party" ....
ive kakunda " moddabbai pelli and moddabbai vidakulu" kooda vachhai

Phani Yalamanchili said...

శ్రీనివాస్ గారు,
అవునా , మాది కూడా ఒంగోలు అంది .. నేను చదివిని అక్కడే ... ఆ ట్రంక్ రోడ్ , ఆ గుల్ల పల్లి దాబాలు అన్ని లైఫ్ లో మర్చిపోలేను ....

రవి గారు,
ధన్యవాదాలు .. నాకు తెలీని విషయం చెప్పారు .. మీదే ఒంగోలేనా ఏంటి ...... 

RAMESH said...

RAVI GARU PLEASE NAKU MAIL CHEYARA NA CHINNAPUDU ROJULU GURTUKUVACHAI NA MAIL ID ramesh.pokuri@gmail.com MAADI CHILKALURIPET NEAR ONGOLE

Post a Comment

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......