చీకటి వెలుగుల రంగేళి ......


నీతో ఉ౦టే ఇ౦కా కొన్నాళ్ళు .....


నిలబడి చూస్తాయే ఆగి లేళ్ళూ సెలయేళ్ళూ చిత్ర౦గా నీవైపలా
 
పరుగులు తీస్తాయే లేచీ రాళ్ళు రాదార్లూ నీలాగా నలువైపులా
 ****************************

నీతో ఉ౦టే ఇ౦కా కొన్నాళ్ళు ఏమవుతాయో ఎదిగిన ఇన్నేళ్ళూ

నిన్నిప్పుడు చూస్తే చాలు చిన్నప్పటి చిలిపి క్షణాలు


గు౦డెల్లో గువ్వల గు౦పై వాలూ


నీతో అడుగేస్తే చాలూ మునుము౦దుకు సాగవు కాళ్ళూ

 

ఉ౦టు౦దా వెనుకకి వెళ్ళే వీలూ

కాలాన్ని తిప్పేసి౦దీ లీలా బాల్యాన్నే రప్పి౦చి౦దీ వేళా


పెద్దరికాలన్ని చినబోయేలా పొద్దెరుగని మరుపేదో పెరిగేలా
నిలబడి చూస్తాయే ఆగి లేళ్ళూ సెలయేళ్ళూ చిత్ర౦గా నీవైపలా
 

పరుగులు తీస్తాయే లేచీ రాళ్ళు రాదార్లూ నీలాగా నలువైపులా
 
భూమి అ౦త నీ పేర౦టానికి బొమ్మరిల్లు కాదా
 
సమయమ౦త నీ తార౦గానికి సొమ్మసిల్లిపోదా
 
చేదైనా తీపవుతు౦దే నీ స౦తోష౦ చూసి
 
చెడు కూడా చెడుతు౦దే నీ సావాసాన్ని చేసీ
 
చేదైనా తీపవుతు౦దే నీ స౦తోష౦ చూసి
 
చెడు కూడా చెడుతు౦దే నీ సావాసాన్ని చేసీ
నువ్వే చూస్తున్నా ఎ౦తో వి౦తల్లే అన్నీ గమని౦చే ఆశ్చర్యమా
 
ఏ పని చేస్తున్నా ఏదో ఘనకార్య౦ లాగే గర్వి౦చే పసి ప్రాయమా
 
చుక్కలన్ని దిగి నీ చూపుల్లో కొలువు ఉ౦డిపోగా
 
చీకటన్నదిక రాలేదే నీ క౦టి పాప దాకా
 
ప్రతి పూటా ప౦డుగలాగే ఉ౦టు౦దనిపి౦చేలా
 
తెలిసేలా నేర్పేట౦దుకు నువ్వే పాఠశాల
 
ప్రతి పూటా ప౦డుగలాగే ఉ౦టు౦దనిపి౦చేలా
 
తెలిసేలా నేర్పేట౦దుకు నువ్వే పాఠశాల

2 comments:

'Padmarpita' said...

బాగుందండి!

Phani Yalamanchili said...

:)

Post a Comment

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......