చీకటి వెలుగుల రంగేళి ......


నేను చూసిన పెళ్లి .... :):):):)
నాకు ఉహ తెలిసాక ఇదే అనుకుంటా నేను చూసిన మొదటి పెళ్లి .... ఇప్పటి దాకా పెళ్ళంటే ... సినిమాల్లో తప్పితే మాములుగా చూడలేదు ... మొదటి సారి రియల్ గా చూసాను ....!!!!

చిన్నప్పుడు మా అక్క పెళ్ళికి వెళ్ళా గాని అప్పుడూ మరి చిన్న పిల్లోడినయ్యే ...!! అందుకే ఏం గుర్తు లేదు ...  


నేను పెళ్ళంటే సినిమాల్లో చూసినట్టు తాళి కట్టే టైం కి అందరూ లేచి అక్షింతలు వెయ్యటమేమో అనుకున్నా !!! కానీ కాదు ...


ఇంకా పెళ్లి ముహూర్తం అనగానే ఆ టైం కి తాళి కడతారేమో అనుకునే వాడిని ... కానీ అది తప్పే అని తెలుసు కున్న ...


ఆ టైం కి జీలకర్ర బెల్లం పెట్టిస్తారు ... నేను గమనించిందేంటంటే అదే పెద్ద తంతు అనుకుంటా ... అదయితే  దాదాపు పెళ్లి అయ్పోయినట్టే అనుకుంటా ....


కానీ చాలా బావుంది పెళ్ళంటే ...

పాము కొల్లేసుకుని పెళ్లి కొడుకు నడవటం ... 
తలంబ్రాలు ... బిందె లో ఉంగరం పట్టుకోవటం ...

ఇవన్నీ నిజం గా సూపర్ గా ... ఎంతైనా మన ఆచారాలు చాలా గొప్పవనిపించింది.....


నాకైతే పెళ్ళికొడుకు తాళి కట్టేటప్పుడు " పెళ్లి పుస్తకం " సినిమాలో రాజేంద్ర ప్రసాద్ తాళి కట్టే సీనే గుర్తొచ్చిందంటే నమ్మండి ...
ఇంకా బయట కనపడక పోయినా అరుంధతి నక్షత్రాన్ని వెతకటం ...


చుట్టాలందరూ కలిసి పేకాటలు .... మందు బాబుల చిందులు ....


ఇక అంతా అయ్యాక అప్పగింతలప్పుడు ఏడుపులు ....


నిజంగా పెళ్ళంటే అన్నీ.... ఆనందం, బాధ ..... అన్నీ కలిసిన పండగలా  అనిపించింది ....


పెళ్ళిగురించి ఆలోచిస్తుంటే "పెళ్లి పుస్తకం "  సినిమాలో కొన్ని మాటలు గుర్తొచ్చాయి ...

"
పెళ్ళికి పునాది నమ్మకం, గౌరవం...నమ్మకం ఉన్న చోట బూతు కూడా నారాయణ అని వినపడుతుంది...అదే నమ్మకం లేని చోట నారాయణ అన్నా కూడా బూతు లాగ వినపడుతుంది.... "

ఇక ఈ సినిమాలో పాట అయితే చెప్పనవసరం లేదు ......

తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా ...

తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా ...

సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా ...

మనసు మనసు కలపడమే మంత్రం పరమార్ధం ..... !!!! :):):):)

Once in a life .... మనిషి పెద్దయ్యాక తనకి తెలిసి జీవితం లో చేసుకునే పెద్ద పండగ ఇదే అనుకుంటా ....!!!

శుభాకాంక్షలు
 Marriage is the most adorable and pure event in the life of two persons which only comes once in life .


Marriage is the name of a great bond between two souls.


Wish U happy married life Mr. & Mrs. Rajesh .

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......