చీకటి వెలుగుల రంగేళి ......


Arranged Marriage బెస్టా..... ?? love marriage ఆ .....??నగనగా ఒక పిల్లోడికి ఒక అనుమానం వచ్చిందంటా ....!! Arranged మ్యారేజ్ బెస్టా ? లేక లవ్ మ్యారేజ్ బెస్టా అని ? 


వెంటనే ఎడిసన్ లాగా దాని మీద పరిశోధనలు చెయ్యడం 


మొదలెట్టాడు .... ఇంతకీ పెళ్లి అంటేనే పెద్ద ___ 


లాంటివి పక్కన పెడితే .... నేను ఆలోచించిన దాన్ని బట్టి 


Arranged యే కరెక్ట్ అనిపించింది  .... !!!


ఎందుకంటె లవ్ మ్యారేజ్ లో అబ్బాయ్ కి అమ్మాయ్  , 


అమ్మాయ్ కి అబ్బాయ్   ముందే తెలుసు .... ఇంకా 


పెళ్ళయ్యాక కొత్తగా తెలుసు కోవడానికి ఏం వుంటాయ్  


చెప్పండి ....


అదే Arrnanged మ్యారేజ్ అయితే  అబ్బాయ్ కి అమ్మాయ్ కొత్త .. అమ్మాయ్ కి అబ్బాయ్ కొత్త ... లైఫ్ లో 


కొంత పార్ట్ వరుకైనా ఒకరి గురించి ఒకళ్ళకి 


తెలుసుకోవాలనే అభిప్రాయం వుంటుంది .... 


"అబ్బాయ్ మంచోడేనా ... బాగా చూసుకుంటాడ నన్ను 


...!!!!!!"  "అమ్మాయ్ ఎలాంటిది .. ఆమె అబిప్రాయాలు 


ఏంటి ...." ఇలా అన్నీ తెలుసుకోవాలని  వుంటుంది ...


లవ్ మ్యారేజ్ లో ఇవన్నీ ముందే తెలుసు కాబట్టి ఇక 


ఏముంటుంది .... 


ఇంకోటి నేను ఆలోచించింది ఏంటంటే ... లవ్ మ్యారేజ్ 


చేసుకున్నాక ఒక వేళ ఏమన్నా ప్రాబ్లం వచ్చినా 


ఎవరితోనూ ఓపెన్ గా చెప్పలేం ...


ఎందుకంటె అందరూ నువ్ ఇష్టపడి చేసుకున్న ... 


అబ్బాయేగా ... అంటారేమో అని భయం ....


అదే Arranged  మ్యారేజ్ లో అయితే " అమ్మ ... వాడు తిట్టాడే .... !!"


"అమ్మ .. దీనికి కూర వండటం కూడా రాదే  .... !!!" ( 


సరదాగా అన్నాను .. మరి  ఇంత  చిన్నవి  కాదు  లే  ... )


ఏదన్నా ప్రాబ్లం వచ్చినా త్వరగా పెద్దలతో చెప్పి దాన్ని 


సరిదిద్దుకోవచ్చు  ... 


అదే లవ్ మ్యారేజ్ లో అయితే మనమే మింగ లేక ... 


కక్కలేక చావాలి ...  ఇన్నీ  కారణాల  దృష్ట్యా  Arranged 


మ్యారేజ్ బెస్ట్ అని బ్లాగా ముఖం గా నా అభిప్రాయాన్ని 


తెలియ చేస్తున్నాను ....


అందుకే Arranged  మ్యారేజ్ చేసుకున్నోళ్ళు మీరేం 


కంగారు పడకండి .... U r Ultimate ...


చివరిగా ఎక్కడో విన్న మాటల్ని ఇక్కడ అన్వయిస్తూ ....


" లవ్ మ్యారేజ్ పార్క్ లాంటిది ... వారం రోజులు చూసాక 


ఇంకా అందులో చూడటానికి కొత్తగా ఏం వుండదు ....


అదే Arranged మ్యారేజ్ అయితే అడవి ...... ఏదో ఒక కొత్త 


విషయం కనపడుతూనే వుంటుంది ....


చచ్చేదాకా ....... !!!"


మళ్లీ కలుద్దాం .... :):):):)

నీలాపనిందలు మీరెప్పుడైనా పడ్డారా ????


బ్లాగ్ మిత్రులందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ........!!

ఇప్పుడు ఈ పోస్ట్ ఎందుకు రాస్తున్నానంటే ...... వినాయక చవితి నీలాపనిందలు మీరెప్పుడైనా పడ్డారా ....!!


నాకు వినాయక చవితి అంటే ముందు గుర్తొచ్చేవి అవే ....!!! ఎందుకంటె నా చిన్నప్పుడు ఓ వినాయక చవితికి ఏం జరిగిందంటే ..... !!!


" బాబు ఓ ఉల్లి దోస తీసుకురామ్మ .... "


ఆ ఏం చేస్ప్తున్నాను .... ఆ చిన్నప్పుడు ఏం జరిగిందంటే ....


" అలా అని మొత్తం ఉల్లి పాయలు వెయ్యొద్దు ... సగం ఉల్లి పాయలు సన్నగా తరిగి ... ఒక పచ్చి మిరప కాయ వేసి తీసుకురా ..."


ఆ ఇంతకీ ఏం జరిగిందంటే .... అవి నేను తొమ్మిదో తరగతి చదువుతున్న రోజులు ... (రీళ్ళు వెనక్కి తిప్పండి .... )


వినాయక చవితి సెలవలకి  ముందు మా క్లాసు టీచర్............ పోయిన ఇయర్ ది question పేపర్ ఇచ్చింది ... నా దగ్గర ఉంచమని ...


నేను ఆ సెలవుల సందడి లో ఆ పేపర్ ఎక్కడో పోగొట్టాను .... సరే ఒక నాలుగు రోజులకి మళ్లీ స్కూల్ తెరిచారు ...


అప్పుడు ఇంకేముంది మా టీచర్ అడగనే అడిగింది ...

నేను ఒక రెండు రోజులు ఇంట్లో పెట్టానని ... ఇంకో రెండు రోజులు

ఎవడో స్కూల్ కి రానోడికి ఇచ్చానని.....

యేవో కహానీలు చెప్పి కడుపు నిండా తిట్లు తిన్నాను ఆ నాలుగు రోజులు ....


ఇక ఐదో రోజు మా టీచర్ దగ్గరికి వెళ్లి అది పోయిందని నిజం చెప్పేసాను ...


అప్పుడు చూడాలి .... " వెధవ ...!! అందులో questions పిల్లలకి చదవమని చెప్పాలి ...నువ్వు అది పోగొట్టావ్ .... నువ్వేం లీడర్ వి ???" అని చెడామడా తిట్టింది .... ( అప్పట్లో మనం మా క్లాసు లీడర్ లే ...!!)


తిట్ల మధ్య లో "నాకు తెలీదు ఎవరో ఒకళ్ళని వేరే సెక్షన్ వాళ్ళని అడుగి తీసురా Half -yearly పేపర్ అంది... "


" అదేంటి మేడం మీరు నాకిచ్చింది Quarterly పేపర్ కదా అన్నాను .... "


" అదేంటి మరి Half -yearly పేపర్  ఎవరికిచ్చాను ...... వెళ్లి ఆ ప్రసాద్ ని అడుగు" అంది టీచర్ ....


వెళ్లి అడిగాను కదా వాడి దగ్గరుంది ఆ పేపర్  ... అబ్బ దీని కోసమా నేను వారం నుంచి తిట్టిచ్చుకుంది అనుకున్నా ...


ఇంతకీ విషయం ఏమిటంటే నాకు Quarterly పేపర్ ఇచ్చాక మా ఫ్రెండ్ ప్రసాద్ కి Half -yearly పేపర్ ఇచ్చారు ...

కాకపోతే ఆ పేపర్ నాకిచ్చారనుకుని నన్ను అడిగింది ఆమె ... నేను ఆ

సంగతి తెలీక రోజు తిట్టిన్చుకున్నాను ...

వాడు ఆ వారం స్కూల్ కి రాలేదు ...


ఇదంతా ఎందుకు జరిగిందంటే ఆ ఇయర్ మేము వినాయక చవితి చేస్కోకపోవడం  వల్ల అనుకుంటా .....

అది కాకపోయినా  ఆ రోజు చంద్రున్ని చూసా ... అప్పుడే అనుకున్నా ... ఏం జరుగుతుందో అని ...


అప్పట్నుంచి  వినాయక చవితి సాయంత్రం మాత్రం ఎత్తిన తల దించను  ... తల  ఎత్తి ఆకాశాన్ని చూడను  ...


అంత భయం నాకు ... మీకూ ఇలాంటిదేదన్న జరిగిందా ....  జరిగితే చెప్పండి చూద్దాం  ....


వుంటాను మరి .

" బాబు ఉల్లి దోస ఇంకా రాలేదు .... "

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......