చీకటి వెలుగుల రంగేళి ......


నీలాపనిందలు మీరెప్పుడైనా పడ్డారా ????


బ్లాగ్ మిత్రులందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ........!!

ఇప్పుడు ఈ పోస్ట్ ఎందుకు రాస్తున్నానంటే ...... వినాయక చవితి నీలాపనిందలు మీరెప్పుడైనా పడ్డారా ....!!


నాకు వినాయక చవితి అంటే ముందు గుర్తొచ్చేవి అవే ....!!! ఎందుకంటె నా చిన్నప్పుడు ఓ వినాయక చవితికి ఏం జరిగిందంటే ..... !!!


" బాబు ఓ ఉల్లి దోస తీసుకురామ్మ .... "


ఆ ఏం చేస్ప్తున్నాను .... ఆ చిన్నప్పుడు ఏం జరిగిందంటే ....


" అలా అని మొత్తం ఉల్లి పాయలు వెయ్యొద్దు ... సగం ఉల్లి పాయలు సన్నగా తరిగి ... ఒక పచ్చి మిరప కాయ వేసి తీసుకురా ..."


ఆ ఇంతకీ ఏం జరిగిందంటే .... అవి నేను తొమ్మిదో తరగతి చదువుతున్న రోజులు ... (రీళ్ళు వెనక్కి తిప్పండి .... )


వినాయక చవితి సెలవలకి  ముందు మా క్లాసు టీచర్............ పోయిన ఇయర్ ది question పేపర్ ఇచ్చింది ... నా దగ్గర ఉంచమని ...


నేను ఆ సెలవుల సందడి లో ఆ పేపర్ ఎక్కడో పోగొట్టాను .... సరే ఒక నాలుగు రోజులకి మళ్లీ స్కూల్ తెరిచారు ...


అప్పుడు ఇంకేముంది మా టీచర్ అడగనే అడిగింది ...

నేను ఒక రెండు రోజులు ఇంట్లో పెట్టానని ... ఇంకో రెండు రోజులు

ఎవడో స్కూల్ కి రానోడికి ఇచ్చానని.....

యేవో కహానీలు చెప్పి కడుపు నిండా తిట్లు తిన్నాను ఆ నాలుగు రోజులు ....


ఇక ఐదో రోజు మా టీచర్ దగ్గరికి వెళ్లి అది పోయిందని నిజం చెప్పేసాను ...


అప్పుడు చూడాలి .... " వెధవ ...!! అందులో questions పిల్లలకి చదవమని చెప్పాలి ...నువ్వు అది పోగొట్టావ్ .... నువ్వేం లీడర్ వి ???" అని చెడామడా తిట్టింది .... ( అప్పట్లో మనం మా క్లాసు లీడర్ లే ...!!)


తిట్ల మధ్య లో "నాకు తెలీదు ఎవరో ఒకళ్ళని వేరే సెక్షన్ వాళ్ళని అడుగి తీసురా Half -yearly పేపర్ అంది... "


" అదేంటి మేడం మీరు నాకిచ్చింది Quarterly పేపర్ కదా అన్నాను .... "


" అదేంటి మరి Half -yearly పేపర్  ఎవరికిచ్చాను ...... వెళ్లి ఆ ప్రసాద్ ని అడుగు" అంది టీచర్ ....


వెళ్లి అడిగాను కదా వాడి దగ్గరుంది ఆ పేపర్  ... అబ్బ దీని కోసమా నేను వారం నుంచి తిట్టిచ్చుకుంది అనుకున్నా ...


ఇంతకీ విషయం ఏమిటంటే నాకు Quarterly పేపర్ ఇచ్చాక మా ఫ్రెండ్ ప్రసాద్ కి Half -yearly పేపర్ ఇచ్చారు ...

కాకపోతే ఆ పేపర్ నాకిచ్చారనుకుని నన్ను అడిగింది ఆమె ... నేను ఆ

సంగతి తెలీక రోజు తిట్టిన్చుకున్నాను ...

వాడు ఆ వారం స్కూల్ కి రాలేదు ...


ఇదంతా ఎందుకు జరిగిందంటే ఆ ఇయర్ మేము వినాయక చవితి చేస్కోకపోవడం  వల్ల అనుకుంటా .....

అది కాకపోయినా  ఆ రోజు చంద్రున్ని చూసా ... అప్పుడే అనుకున్నా ... ఏం జరుగుతుందో అని ...


అప్పట్నుంచి  వినాయక చవితి సాయంత్రం మాత్రం ఎత్తిన తల దించను  ... తల  ఎత్తి ఆకాశాన్ని చూడను  ...


అంత భయం నాకు ... మీకూ ఇలాంటిదేదన్న జరిగిందా ....  జరిగితే చెప్పండి చూద్దాం  ....


వుంటాను మరి .

" బాబు ఉల్లి దోస ఇంకా రాలేదు .... "

3 comments:

Anonymous said...

ఉల్లి దోస అంటే, అదో రకం దోసకాయో, లేక ఇంకోటో అనుకున్నాను, చివరకి వస్తే కానీ తెలియలేదు అది ఉల్లి దోశ అని..

Phani Yalamanchili said...

@తార
అయ్యో అవునా అండి ... అదేదో అనుకోకుండా దొర్లిన తప్పు .. అంతే నండి........ ఉల్లి దోశ అది .. :):):)

sreelatha said...

chala bagundi.

Post a Comment

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......