మందుతాగితే మీ కార్జం చెడిపోతుంది జాగ్రత్త ... !
మొన్న ఒక రోజు నేనూ భోజనం చేస్తుండ గా మా ఫ్రెండ్ ఒకమ్మాయి కాల్ చేసింది ...
కాసేపు మాట్లాడాక ఏం కూర అని అడిగింది .. నేను లివర్ fry అని చెప్పాను ...
కాసేపు మాట్లాడాక ఇంతకీ లివర్ ని తెలుగు లో ఏమంటారు అని అడిగాను ఏం చెప్తుందో విందామని ..
" గుండె కాయ" అన్న సమాధానం తో నాకు షాక్ తగిలింది ...
కాసేపు నవ్వుకున్నాక .. ఇంకో అమ్మాయిని అడుగుదాం అని తనని కాన్ఫరెన్స్ లో తీసుకున్నాం ...
తను ఏం చెప్తుందా అన్న ఆత్రుతతో ఎదురు చూస్తున్న నాకు ఒక్క సారిగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది ..
అదేంటో తెలుసా " మూత్ర పిండాలు " ..
అయ్య బాబోయ్ వీళ్ళ తెలివి కి జోహార్లు చెప్పొంచానిపించింది ...
అందుకే ఇంకా ఎవ్వరని ఇలాంటి ప్రశ్నలు అడక్కుడదని గట్టి నిర్ణయానికి వచ్చాను ...
ఇది జరిగిన కొన్నాళ్ళకి కొంత మంది ఫ్రెండ్స్ రెస్టారెంట్
లో కలుసుకున్నాం ... అందులో వీళ్ళు కూడా వున్నారు ...
అప్పుడు ఇంకో అమ్మాయి వుంటే తనని అడిగాం "లివర్ " ని ఏమంటారు అని ...
తను చెప్పిన సమాధానానికి పిచ్ఛ నవ్వుకున్నాం ... ఇంతకీ ఏం చెప్పిన్దనుకుంటున్నారు ...
"కార్జం " అని ....
అప్పుడన్నాను ... అయితే లివర్ పాడయింది అనటానికి ...
కార్జం పాడయింది అంటారా అని ?
అది గుర్తొస్తే ఇప్పటికి నవ్వొస్తుంది ... మళ్లీ కలుద్దాం ...
11/26/2010 12:13:00 AM
|
Labels:
తాజా పూలు
|
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
hii.. Nice Post.
Thanks for sharing.
Best Regarding.
More Entertainment
Post a Comment