చీకటి వెలుగుల రంగేళి ......


భరణి గారు పూనారు ....!

మొన్నీ మధ్య ఎందుకో  పొద్దున్నే శ్రీ శ్రీ గుర్తొచ్చాడు ... ఆయన గురించి వెతుకు తుంటే మద్య లో తనికెళ్ళ భరణి తగిలారు ....

అంటే ఆయనా ఈయనా ఒకటేనా అని కాదు గాని ... అప్పటి దాక నేను భరణి గారు అంత గొప్ప కవి అని నాకు తెలీదు ....

ఆ రోజు శ్రీ శ్రీ గారి గురించి వెతుకు తుంటే .. శ్రీ శ్రీ గురించి భరణి గారు రాసిన ఒక కవిత వీడియో దొరికింది ...


శ్రీ శ్రీ అంటే రెండు మెరుస్తున్న కొడవళ్ళు ... శ్రీ శ్రీ అంటే రెండు చేమరుస్తున్న కళ్ళు ....

ఇలాంటి ఎన్నో పద విన్యాసాలు .... అందరికి అర్ధం అయ్యే బాషలో రాయటమే అనుకుంట భరణి గారి గొప్పతనం ...

ఇంకో వీడియో లో సబాషు రా శంకర ...! అంటూ తెలంగాణా యాస లో శివుడిని స్తుతిస్తారు ....


అప్పటి నుంచి నేను అయన అభిమానిని అయిపోయాను ...

మొన్నీ  మధ్య ఒక కవిత విన్నా ఆయన రాసిన " పరికిణీ " పుస్తకం  లోది.....

మా ఆవిడకి మంత్రాలొచ్చు  ....

ఏడ్చే పసి పిల్లోడికి పాల సీస అయిపోతుంది ....

మావ గారికి కాఫీ ప్లాస్క్ అయ్పోతుంది ...

అత్త గారికి నడ్డి కిందకి పీటయ్పోతుంది....

రాత్రి పడగ్గదిలో నాకు రగ్గయ్పోతుంది .....

పొద్దూన్నె మా వాకిట్లో ముగ్గయ్పోతుంది ....

మా ఆవిడకి మంత్రాలొచ్చు  ....

అప్పట్నుంచి ఆ పుస్తకం ఈ బుక్ దొరుకుతుందేమో అని తెగ వెతికేసాను ...

ఎవరిదగ్గరన్న వుంటే చెపి పుణ్యం కట్టు కొండి ...2 comments:

సుమ said...

కినిగె లో దొరుకుతున్నట్లుంది, ప్రయత్నించండి.

Anonymous said...

భరణి పరికిణీ చదవడం ఓ అందమైన, కళ్ళు చెమరించే అనుభవం.

Post a Comment

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......