చీకటి వెలుగుల రంగేళి ......


నాన్న కళ్ళల్లో ఆనందం చూసాను ..... ! 

మళ్ళి చానాళ్ళకి ఇటు వైపు గాలి మళ్ళింది  ..... 
అవును......  నాన్న ... చిన్న పదం వినటానికి ..... కాని           

ఆయన తోడు లేని జీవితం ఊహించలేం .... ఆయన లేనిదే మనం లేం  ....!

మనకోసం ఎన్ని కష్టాలు, బాధలను దిగమింగుతూ ...... కుటుంబ బరువుని భుజానికెత్తుకుని ...... 

మన కోసం కష్టపడుతూ ........ మనమే ప్రపంచం గా బ్రతికే నాన్నకి మనమేం ఇవ్వగలం .....  ?

ఇదంతా ఎందుకు చెప్తున్నంటే .. మొదటి సారి నాన్న గుండె పొరల్లోకి వెళ్లి చూసాను ..... 

పాతికేళ్ళ జీవితం .... కష్టాలని టీవీ లో చూస్తునట్టు బ్రతికాను తప్ప ఏనాడు అవి నన్ను చేరలేకపోయాయి .... 

 దానికి కారణం నాన్నే .....  తను కరిగిపోతు వెలుగు నిచ్చేవారే తల్లితంద్రులంటే ...... 

మొన్నీ మధ్యన నాకు ఉద్యోగం వచ్చింది కొత్తగా .... ఇంతకు ముందు ఉద్యోగం హైదరాబాద్ లో ..... 

ఇప్పుడు బెంగళూరు .... అది కాకపోయినా ఇప్పుడు పెర్మనెంట్ .... ఇంతకు ముందు టెంపరరి ...... 

నాన్న ఆనందానికి అవధులు లేవు ..... ఎంత మందిని అడిగాడు నా ఉద్యోగం కోసం ..... ప్చ్ .... !

వద్దని చెప్పిన వినేవారు కాదు ..... చివరికి నా సొంతగానే మంచి జాబు తెచ్చుకున్నాను .... 

అది చెప్పిన రోజు ..... ఇంకా గుర్తుంది నాకు ..... ఆ రోజు నాన్న అందరికి ఫోన్ లు చేసి మరి చెప్పారంట .... 

అమ్మ వైపు చుట్టాలకి కూడా నాన్నే ఫోన్ చేసారట ..... అమ్మ చెప్తుంటే ఈ మాటలు ఏదో గర్వం నాలో  ..... 

తండ్రి కొడుకుల సంభాషణలు కూడా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో హీరో ల సంభాషణ లా ఉంటాయ్ .... :)

పెద్ద గా మాటలు ఉండవ్ అన్ని పొడి పొడి మాటలే .... :)

ఇక  బెంగళూరు అయితే  నేనూ వస్తాను అన్నారు  ..... అయన కూడా వచ్చి నన్ను దిగబెట్టారు ..... 

నాతో పాటు మా ఆఫీసు దగ్గరకి వచ్చారు .... 2 రోజుల్లో మళ్ళి బయల్దేరారు ..... అంత వరకే తెలుసు నాకు ..... 

కాని ఫోన్ లో మా ఆఫీసు ఫోటో లు  తీసుకుని వెళ్లారంట  ..... అవి అందరికి చూపించారట అక్కడ .... 

నన్ను ఒక్కడిని ఇక్కడ వదిలి వెళ్తుంటే ఏడుపు వచ్చిందంట అయానకి .... అమ్మ చెప్పింది ఇవన్ని .... 

ఇంకేం చెప్పగలను .... ఇంతకు మించి ... ఏదో సాధించానన్న ఆనందం .... 

ఇది చాలదా జీవితానికి .... 

3 comments:

..nagarjuna.. said...

welcome back and congratulations.

శిశిర said...

నిజంగానే చాలా సాధించారు. Congratulations.

Phani Yalamanchili said...

@ నాగార్జున గారు ధన్యవాదాలు

@ శిశిర గారు ధన్యవాదాలు

పాత స్నేహితుల్ని చూస్తుంటే ఏదో తెలీని సంతోషం గా వుందండి .... :)

Post a Comment

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......